*వైఎస్ జగన్ పాదయాత్రకు నేటికి సరిగ్గా మూడేళ్లు*
*కోట్లాది మంది ప్రజల గుండె చప్పుడు విన్న అరుదైన నేత*
*రాష్ట్ర చరిత్రను మలుపు తిప్పిన మరపు రాని యాత్ర.*
*14 నెలల పాటు ప్రజలతో మమేకం.*
*జనం కష్టనష్టాలు చూసి.. విని నేనున్నానంటూ భరోసా.*
*అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా మేనిఫెస్టో.*
*అదే స్ఫూర్తితో 17 నెలలుగా సంక్షేమ పాలన.*
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రజా సంకల్ప పాదయాత్ర ఒక మహాయజ్ఞం అని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మరియు రీజనల్ కోఆర్డినేటర్, పూతలపట్టు నియోజకవర్గ ఇన్చార్జి శైలజ చరణ్ రెడ్డి కొనియాడారు.
ఆయన సంకల్ప బలమే ఆయన్ను 3,648 కిలోమీటర్లు నడిపించింది. ప్రపంచంలోనే చిరస్థాయిగా నిలిచి పోయిన యాత్ర ఆద్యంతం జగన్ గారిలో ఏ మాత్రం అలసట అనేది కనిపించలేదు. మధ్యలో హత్యాయత్నం జరిగినా ఆయన ఏమాత్రం జంకలేదు.
*ప్రజా సంకల్పమే నిత్య స్ఫూర్తి*
దేశ రాజకీయాల్లోనే ఓ సంచలనంగా, చరిత్రాత్మకంగా నిలిచి పోయిన ప్రజా సంకల్ప పాదయాత్రను వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గారు ప్రారంభించి నేటికి సరిగ్గా మూడేళ్లు పూర్తయింది. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో తన తండ్రి, దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాధి వద్ద నుంచి ఆయన ఆశీర్వాద బలంతో 2017 నవంబర్ 6వ తేదీన జగన్ గారు ప్రజా సంకల్పానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర చరిత్రనే మలుపు తిప్పిన ఈ పాదయాత్రను జగన్ గారు ఎండనక, వాననక 14 నెలల పాటు 13 జిల్లాల్లో సుదీర్ఘంగా కొనసాగించారు. 2019 జనవరి 9వ తేదీన ఇచ్ఛాపురంలో ముగిసిన ఈ యాత్రలో13 జిల్లాలు, 134 నియోజకవర్గాలు, 231 మండలాల పరిధిలోని 2,516 గ్రామాలు, 62 నగరాలు, పట్టణాల్లో జగన్ పర్యటించారు. 124 భారీ బహిరంగ సభలు, 55 ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు. తొలి నుంచీ జనంతో మమేకం అవుతూ.. తాడిత, పీడిత, బడుగు, బలహీన వర్గాల ప్రజల కష్ట నష్టాలను తెలుసుకుంటూ ముందుకు సాగిన ఆయన పట్టుదలతో తన రాజకీయ ప్రస్థానాన్ని చేరుకున్నారు అని ఆమె తెలియజేశారు
ప్రజా సంకల్ప యాత్ర ముగిశాక కూడా ప్రజల మధ్యనే ఉంటూ ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించారు. అద్వితీయమైన రీతిలో 151 శాసనసభ, 22 లోక్‌సభా స్థానాల్లో విజయం సాధించి మే 30వ తేదీన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా తీర్చిదిద్దుతున్నారు. పాదయాత్ర స్ఫూర్తితో 17 నెలలుగా కనీవినీ ఎరుగని రీతిలో సంక్షేమ పాలనను అందిస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలన్నదే నా కసి.. ‘చంద్రబాబు మాదిరిగా నాకు కాసులంటే కక్కుర్తి లేదు.. ఆయన మాదిరిగా నేను కేసులకు భయపడే ప్రసక్తే లేదు.. నాకున్నది ఒక్కటే కసి.. నేను చనిపోయిన తర్వాత కూడా ప్రతి పేదవాడి గుండెల్లో బతకాలన్న కసి.. కుటుంబాల్లో ఆప్యాయతలు పెంచాలన్నదే నా కసి’ అని జగన్ గారు ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభ సభలో జగన్ గారు ప్రజలకు మాట ఇచ్చారు అని శైలజ చరణ్ రెడ్డి గుర్తు చేశారు
.
No comments:
Post a Comment