భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ను ఆ మహిళ దుర్వినియోగానికి పాల్పడింది.
ఒక వ్యక్తికి అమ్మిని భూమిని రెండోసారి తన కూతురి పేర రిజిస్ట్రేషన్ చేయించుకుని రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులకు అడ్డంగా దొరికిపోయింది. బాధితుడి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు మహిళపై చీటింగ్ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన నల్లగొండ జిల్లాలో వెలుగుచూసింది.ధరణి పోర్టల్ ను దుర్వినియోగం చేస్తూ తప్పుడు పద్దతిలో విజయలక్ష్మి మోసపూరితంగా రిజిస్ట్రేషన్ చేసినట్లుగా నల్లగొండ జిల్లా పోలీసులు గుర్తించారు. దీంతో విజయలక్ష్మిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లుగా ఎస్పీ రంగనాధ్ వెల్లడించారు.
🔹ఇంకా ఎక్కడైనా ఇలాంటి తప్పుడు పద్ధతులు అవలభించాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విక్రయించిన భూమి ఏదైనా కారణంగా మ్యూటేషన్ కాకుండా ధరణి పోర్టల్ లో వివరాలు ఉన్నంత మాత్రాన ఇంకొకరికి రిజిస్ట్రేషన్ చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని ఎస్పీ హెచ్చరించారు.
No comments:
Post a Comment