హైదరాబాద్: పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఈసందర్భంగా జీహెచ్‌ఎంసిలో అడిషనల్ కమిషనర్‌గా పనిచేస్తున్న రాహుల్‌రాజ్‌ను బదిలీచేసి కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్‌గా నియమించారు. అక్కడ కలెక్టర్‌గా ఉన్న సందీప్‌కుమార్‌ను బదిలీచేశారు. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లాకలెక్టర్ మహ్మద్ అబ్ధుల్ అజీమ్ బదిలీ అయ్యారు. ఆయనస్థానంలో ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్యకు పూర్తి అదనపు బాధ్యతలతో కలెక్టర్ బాధ్యతలు అప్పగించారు.
No comments:
Post a Comment