తిరుమల: దుబ్బాక ఉపఎన్నికలో విజేతగా నిలిచిన బీజేపీ నేత ఎం. రఘునందన్ రావు శ్రీవారి మొక్కు తీర్చుకున్నారు. వేంకటేశునికి తలనీలాలు సమర్పించిన ఆయన.. స్వామి వారిని దర్శించుకున్నారు. నాటి నరేంద్రుని స్ఫూర్తిని, నేటి నరేంద్ర మోదీ కొనసాగిస్తున్నారని అన్నారు. దుబ్బాక విజయం తెలుగు రాష్ర్టాలతో పాటు దక్షిణభారతం అంతా ఉంటుందన్నారు. ఇది దుబ్బాక ప్రజలు విజయమని, వారి కోసం ప్రాణం పోయేవరకు కష్టపడతానన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో పార్టి ఎలా ఆదేశిస్తే అలా సేవలు అందిస్తానన్నారు.
దుబ్బాక ఉప ఎన్నికలో విజయానంతరం ఆయన నేరుగా శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేశారు. ముందుగా స్వామివారికి తలనీలాలు సమర్పించి అనంతరం సుపథం ఎంట్రీ ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు.
అనంతరం ఆలయం బయట మీడియాతో మాట్లాడుతూ.. విద్య నేర్పిన గురువుతో పోటీపడితే బాగుంటుందని, తాను గురువుగా భావించే కేసీఆర్ నుంచి ఆశీస్సులు లభిస్తాయని భావిస్తున్నాని అన్నారు. దుబ్బాకలో బీజేపీ విజయం దక్షణాది రాష్ట్రాల ఎన్నికలపై ప్రభావం చూపుతుందని తెలిపారు. తన విజయం పార్టీ సమిష్టి కృషికి నిదర్శనంగా పేర్కొన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే అగ్రగామిగా దుబ్బాక నియోజక వర్గాన్ని నిలిపేందుకు శక్తిని ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థించానని తెలియజేశారు.
No comments:
Post a Comment