Wednesday, 29 December 2021

హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ కు సురుచి బాహుబలి కాజా బహుకరణ*

గోదావరి జిల్లాకు ప్రముఖులు ఎవరు వచ్చినా వారిని గౌరవించే సురుచి సాంప్రదాయంలో భాగంగా ఈరోజు కాకినాడ విచ్చేసిన అఖండ మూవీ హీరోయిన్  ప్రగ్య జైస్వాల్ ను సురుచి మర్యాదపూర్వకంగా కలిసి సురుచి గురించి వివరించి బాహుబలి కాజాను అందజేసి శాలువాతో సత్కరించారు
  జైస్వాల్ మాట్లాడుతూ తాపేశ్వరం కాజా గురించి విన్నాను అది ఇప్పడు చూస్తున్నాను అని అన్నారు.  ఇంత పెద్ద బాహుబలి కాజాను చూడడం ఇదే మొదటిసారి అన్నారు

Wednesday, 15 December 2021

తిరుమ‌ల‌లో ఘనంగా చక్రతీర్థ ముక్కోటి


తిరుమలలో చక్రతీర్థ ముక్కోటి బుధ‌వారం ఘనంగా జరిగింది. ప్రతి ఏడాదీ   చక్రతీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
       శ్రీవారి ఆలయ అర్చకులు, పరిచారకులు, భక్తులు ఉదయం మంగళవాయిద్యాల నడుమ ఆలయం నుండి ఊరేగింపుగా చక్రతీర్థానికి  చేరుకున్నారు. అక్కడ శ్రీ చక్రత్తాళ్వారుకు, నరసింహస్వామివారికి, ఆంజనేయస్వామివారికి అభిషేకం, పుష్పాలంకారం మరియు హార‌తి చేపట్టారు. హారతి అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
స్కంద పురాణం ప్ర‌కారం పద్మనాభ మహర్షి అనే యోగి చక్రతీర్థంలో 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. అందుకు సంతసించి శంఖు, చక్ర, గధా భూషితుడైన శ్రీ మ‌హావిష్ణువు ఆతనికి ప్రత్యక్షమై కల్పాంతం వరకు తనకు పూజలు చేయాలని చెప్పి అంతర్థానమయ్యాడు. పద్మనాభ మహర్షి స్వామి ఆజ్ఞానుసారం చక్రతీర్థంలో తపస్సు చేశాడు. అయితే ఒకనాడు ఓ రాక్షసుడు అతనిని భక్షించడానికి రాగా మహర్షి తిరిగి స్వామివారిని ప్రార్థించాడు. అప్పుడు స్వామి తన చక్రాయుధాన్ని పంపించి ఆ రాక్షసుని సంహరించాడు. అటు తరువాత ఆ మహర్షి  శ్రీ సుదర్శన చక్రాన్ని ఆ ప్రాంతంలోనే ఉండి భక్తులకు రక్షణ కల్పించాల్సిందిగా స్వామివారిని కోరాడు. భక్తవల్లభుడైన స్వామివారు తన సుదర్శన చక్రాన్ని ఆ ప్రాంతంలోనే ఉండేలా ఆజ్ఞాపించడంతో ఈ తీర్థం చక్రతీర్థంగా ప్రసిద్ధిగాంచింది.

వరాహ పూరాణ నేపథ్యంలో తిరుమలలోని శేషగిరులలో వెలసివున్న 66 కోట్ల తీర్థాలలో అత్యంత ముఖ్యమైనవిగా చెప్పబడే సప్త తీర్థాలలో చక్ర తీర్థం  ప్ర‌ముఖ తీర్థంగా చెప్పబడింది.

Monday, 13 December 2021

దేశానికి నా సేవలన్నీ నీకు చేసే పూజలే శంకరా ప్రధాని ట్వీట్... ఆధునికరణ శ్రమికులతో సహపంక్తి భోజనం


కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రారంభోత్సవం తర్వాత అర్చన, అభిషేకం కార్యక్రమాల్లో పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోది ఆ భావోద్వేగంలో 'యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్...' (నేను చేస్తున్న కర్మలన్నీ, ఓ శంభో, నీ ఆరాధనలే!) అనిపిస్తోందని ఆయన ట్వీట్ చేశారు.
మోడీ స్మరించిన పాదం-  ఆదిశంకరుల వారి శివమానసపూజ లో 'ఆత్మా త్వం గిరిజా మతిః' శ్లోకానిది. 
ఆత్మా త్వం, గిరిజా మతిః, పరిజనాః ప్రాణాః, శరీరం గృహం
పూజతే విషయోపభోగరచనా, నిద్రా సమాధిస్థితిః
సంచారః పదయోః ప్రదక్షిణ విధిస్తోత్రాణి సర్వాగిరః
యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో! తవారాధనమ్
ఓ ఈశ్వరా నాలోని జీవుడివి నీవే, నా బుద్ధి నీ అర్థాంగి పార్వతీదేవి, నా ప్రాణాలే నీ  సేవకులు, నా శరీరమే నీ గృహము(కైలాసము). నా పంచేద్రియ అనుభూతియే నీ పూజ. నిద్రయే నాకు సమాధ్యవస్థ. నా పాదసంచారమే నీ ప్రదక్షిణ విధానం. నా మాటలన్నీ నీ స్తోత్రాలే. నేను ఏ పనిచేసినా అది నీ ఆరాధనే పరమ శివా- అని దాని భావం.
తాను దేశసేవలో భాగంగా ఏ పని చేస్తున్నా, ఆ మహాదేవుడికి నేను చేస్తున్న కైమోడ్పే అని మోడీ ట్వీట్ లో పేర్కొన్నారు.ఈ సందర్భంగా విశ్వశ్వేర ఆలయం ఆధునికీకరణలో  శ్రమించి భాగస్వామ్యం వహించిన వారితో ప్రధాని సహపంక్తి భోజనం చేశారు...

అన్నం సేవా ఫౌండేషన్ లో ప్రముఖ సామాజిక వేత్త Dr. కడవెండి వేణుగోపాల్ - అరుణకుమారిల పెళ్లి రోజు వేడుకలు .


ఖమ్మం : నగరంలోని అన్నం సేవా ఫౌండేషన్ లో ప్రముఖ సామాజిక వేత్త Dr. కడవెండి వేణుగోపాల్ అరుణకుమారి ల పెళ్లి రోజు సందర్భంగా హరే రామ , హరే కృష్ణ 24 గంటల రామనామ సంకీర్తన , శ్రీ శ్రీ శ్రీ అవధూతేంద్ర భక్తమండలి , సమాజం గొట్టిపర్తి శివాజీ భక్త బృందంచే ఈ రోజు ఉదయం నుండి రేపు ఉదయం వరకు భక్తి శ్రద్ధలతో 350 మంది అనాధల , అభాగ్యుల , సమక్షంలో జరుగుతున్నది , ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్వర్గీయ ప్రముఖ ఫ్రీడమ్ ఫైటర్ , మాజీ సుజాతనగర్ శాసనసభ్యులు శ్రీ బొగ్గవరపు సీతారామయ్య సతీమణి రుక్మిణిమ్మ 85 సంవత్సరముల వయస్సు వృద్ధురాలు నడవలేని స్థితిలో ఉండి కూడా  పాల్గొని అన్నప్రసాదాన్ని వడ్డించి మానవ సేవే మాధవ సేవ ప్రతి ఒక్కరూ సమాజంలో చేయాలని వారు సూచించారు . భవిష్యత్తులో అన్నం ఫౌండేషన్ కి అండగా ఉంటాము అని భరోసా ఇచ్చారు . అన్నం సేవలను కొనియాడుతూ అండగా ఉంటామని బొగ్గవరపు రుక్మిణమ్మ తెలిపారు . అనంతరం వారిని  ఘనంగా శాలువాతో సత్కరించారు . ఈ కార్యక్రమంలో అన్నం ఫౌండేషన్ చైర్మన్ అన్నం శ్రీనివాసరావుతో పాటు ఫౌండేషన్ బాధ్యులు  కడవెండి వేణుగోపాల్ కే శ్రీనివాస్ , అన్నం వెంకటేశ్వర రావు , తదితర సేవా సభ్యులు పాల్గొనడం జరిగినది .

Sunday, 12 December 2021

వనదేవతలను దర్శనం చేసుకోవాలంటే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాల్సిందే


ములుగు: మేడారం సమ్మక్క సారలమ్మల దర్శనం కోసం వచ్చే భక్తులు ఎవరైనా ఇక తప్పని సరి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునే అమ్మవార్లను దర్శించుకోవాల్సి వుంటుంది. వనదేవతల దర్శనం కోసం రోజూ పెద్ద సంఖ్యల భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్ర, చత్తీస్ గడ్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవార్ల దర్శనానికి వస్తుంటారు. కోవిడ్ వ్యాప్తి నేపధ్యంలో వనదేవతలను దర్శించుకునే వారికి ప్రత్యేకంగా జిల్లా వైద్యాధికారులు కోవిడ్ టెస్ట్ లు చేస్తున్నారు. అలాగే టీకా తీసుకోనికి వారి టీకా వేయడం, ఫస్ట్ డోస్ తీసుకున్న వారికి సెకండ్ డోస్ ఇవ్వడం, రెండు డోసులు తీసుకున్నవారు సర్టిఫికెట్ చూపిస్తేనే దర్శనానికి అనుమతించాలని అధికారులు నిర్ణయించారు.
కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటారు.జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క, సారలమ్మల గద్దెల వద్ద వైద్యాధికారులు కరోనా వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ వేసుకున్నట్లు ఆధారాలు చూపిస్తేనే అధికారులు అమ్మవార్ల దర్శనం కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ అళ్లెం అప్పయ్య మాట్లాడుతూ..జిల్లాలో మేడారంతో పాటు పర్యాటక ప్రాంతాలైన రామప్ప, బొగత జలపాతం వద్ద ప్రతి ఆది, బుధవారాల్లో వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నామన్నారు

Wednesday, 8 December 2021

హెలికాప్టర్‌ ప్రమాద మృతుల్లో ఏపీ వాసి సాయి తేజ్


భారత తొలి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌ తమిళనాడు లోని కున్నూరు సమీపంలో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో చనిపోయినట్టు ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ అధికారికంగా ప్రకటించింది. బిపిన్‌ రావత్‌ ఆయన భార్య మధులికతో పాటు మరో 11 మంది ఈ ప్రమాదంలో చనిపోయినట్టు వెల్లడిచింది. అయితే ఈ ప్రమాదంలో ఏపీ వాసి సాయితేజ్ కూడా మృతి చెందాడు. ఇతడి స్వస్థలం చిత్తూరు జిల్లా కురబాలకోట మండలం ఎగువరేగడ గ్రామం. 

సాయితేజ్ రక్షణ శాఖలో లాన్స్ నాయక్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. సీడీఎస్ బిపిన్‌ రావత్‌‌కు వ్యక్తిగత భద్రతా అధికారిగా సాయితేజ్ విధులు నిర్విహిస్తున్నారు. 2013లో ఆర్మీలో జాయిన్ అయ్యాడు సాయితేజ్. సాయితేజ్ మరణంతో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. సాయితేజ్‌కు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. చివరిసారిగా వినాయక చవితికి సాయితేజ్ స్వగ్రామానికి వచ్చినట్లు బంధువులు తెలిపారు.

A helicopter carrying India's Chief of Defence Staff (CDS) General Bipin Rawat crashed...

General Bipin Laxman Singh Rawat, 
PVSM UYSM AVSM YSM SM VSM ADC 
(born 16 March 1958) is a four star general of the Indian Army. He is the first and current Chief of Defence Staff (CDS) of India. On 30 December 2019, he was appointed as the first CDS of India and assumed office from 1 January 2020. Prior to taking over as the CDS, he served as 57th and last Chairman of the Chiefs of Staff Committee as well as 26th Chief of Army Staff of the Indian Army.
A helicopter carrying India's Chief of Defence Staff (CDS) General Bipin Rawat crashed in the southern state of Tamil Nadu..Nilagiri District, between Coimbatore & Sullur..on Wednesday, the air force said.
“An IAF Mi-17V5 helicopter, with CDS Gen Bipin Rawat on board, met with an accident today near Coonoor, Tamil Nadu,” 
The report quoted sources as saying that there were higher officials in army on board, including Gen Rawat, his wife, defence assistant, security commandos and an IAF pilot.

.

Wednesday, 1 December 2021

తిరుమల ధ్వంసమైనఘాట్రోడ్డుప్రాంతాలనుపరిశీలించిన టీటీడీచైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి.. యుద్ధప్రాతిపదికనఘాట్రోడ్డుమరమ్మతులు... నేటిసాయంత్రానికిఢిల్లీఐఐటినిపుణులరాక-.. డౌన్ ఘట్ రోడ్ ద్వారా రాకపోకలు...


     తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళే అప్ ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడి ఘాట్ రోడ్డు భారీగా ధ్వంసమైందని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి తెలిపారు.
 బుధవారం తెల్లవారుజామున 5 - 40 గంటల సమయంలో భారీ ఎత్తున కొండచరియలు విరిగిపడి రక్షణ గోడలు, రోడ్లు ధ్వంసమయ్యాయి. టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ఈ ప్రాంతాలను పరిశీలించారు. నాలుగు చోట్ల భారీ ప్రమాదం జరిగిందని, శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దయవల్ల ఎవరూ గాయపడలేదని అధికారులు వివరించారు.నడక భక్తులకు ఇబ్బందులు లేవని..వాహనాలపై వచ్ఛే వారు 15 రోజుల వరకు తిరుమల ప్రయాణం వాయిదా వేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.. అనంతరం చైర్మన్ అధికారులకు పలు సూచనలు చేశారు.
       ఈ సందర్భంగా శ్రీ వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. గత 30 సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో ఇటీవల కురిసిన వర్షాలకు తిరుమల ఘాట్ రోడ్ల లో కొండ చరియలు విరిగిపడుతున్నాయని తెలిపారు. ఉదయం 5 - 45 గంటల సమయంలో ఆర్టీసీ బస్సు తిరుమలకు వెళుతుండగా భారీ శబ్దం, పొగ రావడంతో డ్రైవర్ బస్సు  నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చైర్మన్ చెప్పారు. అప్ ఘాట్ రోడ్డులో మరో ఐదారు చోట్ల కొండ చరియలు విరిగిపడే ప్రమాదం గుర్తించామన్నారు. వీలైనంత త్వరలో రోడ్డు మరమ్మతులు చేసి, గట్టి రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని చైర్మన్ చెప్పారు. ఢిల్లీ ఐ ఐ టి నుంచి నిపుణుల బృందం బుధవారం సాయంత్రానికి తిరుపతి కి చేరుకుంటుందన్నారు. టీటీడీ ఇంజినీరింగ్, విజిలెన్స్  అధికారులతో కలిసి వారు ఘాట్ రోడ్ల పరిశీలన చేస్తారన్నారు. కొండ చరియలు విరిగిపడకుండా ఎలాంటి జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలనే విషయం పై వారు పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి రెండు, మూడు రోజుల్లో నివేదిక సమర్పిస్తారని ఆయన వివరించారు. ఆ తరువాత భవిష్యత్ లో కూడా ఇలాంటి సంఘటనలు జరక్కుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఘాట్ రోడ్డు మరమ్మతులు పూర్తి అయ్యే వరకు డౌన్ ఘాట్ రోడ్డులోనే వాహనాల రాకపోకలు అనుమతిస్తామని అన్నారు.
     ఆన్లైన్లో దర్శనం టికెట్లు బుక్ చేసుకుని వాహనాల ద్వారా తిరుమలకు వచ్చే భక్తులు  భారీ వర్షాల దృష్యా   తమ ప్రయాణం వాయిదా వేసుకుంటే ఆరు నెలల్లోగా  దర్శనం తేదీ మార్పు చేసుకునే అవకాశం ఉందని శ్రీ సుబ్బారెడ్డి   చెప్పారు. నడకదారిలో తిరుమలకు వెళ్ళే భక్తులకు మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదని ఆయన తెలిపారు.

   PC:#ttd

Thursday, 25 November 2021

కొండకోనల్లో మోగిన పెళ్లి బాజాలు.... వనం పూలన్ని తలంబ్రాలుగా 140 జంటలు ఒక్కటయ్యాయి..

నల్లమల్లకు పెళ్లి కళ వచ్ఛింది.. కొనంత సందడి నెలకొంది..అడవి బిడ్డల పెళ్లి సంబురం నల్లమల్ల సీమలో అంబరాన్ని అంటింది... వనవాసి కళ్యాణ పరిషత్  ఆధ్వర్యంలో  శ్రీశైలం నల్లమల అడవుల్లో నివసించు అతి ప్రాచీన పురాతన తెగ అయిన చెంచులు. (అంటే శ్రీ శ్రీ శ్రీ చెంచులక్ష్మి నరసింహ స్వామి శ్రీ శ్రీ మల్లికార్జున స్వామి చెంచుల అల్లుళ్లు గా భావిస్తారు). వీరు ఎక్కువ శాతం అడవులలో  నివసించడం వలన పేదరికం వల్ల పెళ్లిళ్లు కావడం కష్టం.  కావున సహజీవనం చేస్తారు, పిల్లలు కూడా ఉంటారు.  అందుకని మన హిందూ పద్ధతిలో ఈ చెంచులకు సామూహిక వివాహాలు చేయాలనే నిర్ణయించడం జరిగింది.
 సుమారు రెండు జిల్లాలు ఆరు మండలాలు 31 చెంచుగూడెం లు నుండి 140 కుటుంబాలు ఎంపిక చేసారు.  దీనికోసం ఒక్కో జంట కూ పెళ్లి కోసం తాళి బొట్టు,మెట్టెలు పెండ్లి బట్టలు ఇద్దరికీ కలిపి,15.000రూపాయలు ఖర్చు అని అంచనా వేసి  దాతల వద్ద నుండి ధన, వస్తు రూపేనా నిధులు సేకరించారు.
 కన్నుల పండుగగా ఈ 140 ఆదివాసీ (చెంచులు) జంటల సామూహిక కళ్యాణ మహోత్సవం గత నెల అక్టోబర్ 31 వ తేదీన నల్గొండ మరియు మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా లో గల అచ్చంపేట పట్టణంలో జరిగింది.
వధూ వరులకు, వారి బంధువులకు, స్నేహితులకు ఘనంగా సామూహిక విందు భోజనాలు ఏర్పాటు చేశారు. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచకులు శ్రీ గరికపాటి నరసింహారావు గారు ఈ కార్యక్రమానికి వచ్చి వధూవరులను ఆశీర్వదించారు.

Wednesday, 17 November 2021

ఇహ రైల్వేలో పాత విధానం.. "ప్రత్యేక"తొలగింపు...


ఢిల్లీ : ప్రత్యేక రైళ్లను ఇక కొవిడ్‌కు ముందు మాదిరిగానే నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ప్రకటించింది. ‘ప్రత్యేక’ నంబర్లను తొలగించి పాత నంబర్లను కేటాయించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. ‘రైల్వే కాలపట్టిక- 2021’లో సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్‌ అప్‌లోడ్‌ చేసింది. ఇప్పటికే టికెట్లు రిజర్వు చేసుకున్న ప్రయాణికులకు మారిన రైలు నంబర్ల వివరాల్ని ఎస్‌ఎంఎస్‌ల రూపంలో పంపించింది. 76 రైళ్లకు ప్రత్యేక నంబర్లకు ముగింపు పలికి రెగ్యులర్‌ రైళ్లుగా మార్చింది. ఈ మేరకు ఆయా రైళ్ల జాబితాను విడుదల చేసింది.*

Tuesday, 9 November 2021

వన మాలినికి పురస్కారం... మోదీ నమస్కారం...

తులసి చెట్టు 24గంటలు ప్రాణవాయువు పంచే మొక్క..
ఆ పేరు పెట్టడం వల్లనేమో..ఆమే  ఆ ప్రాణవాయువు అందజేసేందుకు అవసరం అయిన మొక్కలు నాటి అవి మానులై ఏదిగేవరకు సంరక్షణ చేసి వనానికే ఆమే కన్నతల్లిగా మారారు..అందుకే ఆమెను అత్యున్నత దేశ సేవల పురస్కారంతో గౌరవించారు.
రాష్ట్రపతి భవన్‌లోని పద్మ అవార్డుల ప్రదానోత్సవం సమయంలో తులసి గౌడ అని పేరు పిలవగానే.. సంప్రదాయ దుస్తుల్లో, కాళ్లకు చెప్పులు కూడా లేని ఓ 76ఏళ్ల మహిళ నడుచుకుంటూ వస్తుంటే.. దర్బార్‌ హాల్‌లోని కళ్లన్నీ ఆమెవైపు ఆశ్చర్యంగా, ఆనందంగా చూశాయి.
 అడవి తల్లికి ఆడబిడ్డ ఉంటే ఇలాగే ఉంటుందేమో అనిపించింది. ఏ క్షణాన ఆమెకు 'తులసి' అని పేరుపెట్టారో గానీ, ఆ పేరుకు తగ్గట్లుగా ఆమె జీవితం కూడా ప్రకృతితో మమేకమైంది.  40 వేల వృక్షాలతో వనసామ్రాజ్యాన్నే సృష్టించింది. గత ఆరు దశాబ్దాలుగా పర్యావరణానికి ఆమె చేసిన ఈ సేవే.. పద్మశ్రీ అవార్డును తెచ్చిపెట్టింది. ఎంతో మంది ప్రముఖుల మధ్య  ఆమె దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్నారు. 
ఆ పెద్దావిడను చూడగానే మోదీ కూడా ఎంతో గౌరవంగా ప్రతినమస్కారం చేయడం అక్కడున్న అందర్నీ ఆకర్షించింది. కర్ణాటకలోని అంకోలా తాలూకా హొన్నాలి గ్రామానికి చెందిన తులసి గౌడ.. హలక్కీ గిరిజన కుటుంబంలో జన్మించారు. ఆమెకు రెండేళ్ల వయసులోనే తండ్రి మరణించారు. దీంతో పూట గడవడానికి రోజూ తల్లితో కలిసి కూలీకి వెళ్లేది. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చదువుకు దూరమవడంతో తులసికి చదవడం, రాయడం రాదు. 10-12 ఏళ్ల వయసులోనే గోవింద గౌడ అనే వ్యక్తితో ఆమెకు పెళ్లి చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆమె భర్త మరణించాడు. తన జీవితంలో చీకట్లు కమ్మినందుకు ఆమె ఎప్పుడూ కుంగిపోయేది. దీని నుంచి బయటపడటానికి నిత్యం దగ్గర్లోని అడవిలో గడిపేది. అక్కడి చెట్లే ఆమెకు ఓదార్పునిచ్చేవి. ఆనందాన్నిచ్చేవి. అలా ఆమెకు అడవితో బంధం ఏర్పడింది. చిన్నతనం నుంచే తులసికి మొక్కలంటే ప్రాణం. ఎన్నో రకాల మొక్కలు నాటేది. రాను రాను అదే తన జీవితం అయిపోయింది. ఆమె మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం చూసి అటవీ శాఖ అధికారులు ఆమెను తాత్కాలిక ఉద్యోగిగా నియమించుకున్నారు. 
ఆమె అంకితభావం చూసి కొన్నాళ్లకు ఆమెను శాశ్వత ఉద్యోగిగా నియమించారు. ఇలా పద్నాలుగేళ్ల పాటు అటవీశాఖలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. 
అయితే మొక్కల పెంపకాన్ని మాత్రం ఆపలేదు. అరవై ఏళ్లలో తులసి నలభై వేలకు పైగా మొక్కలు నాటి వాటిని పెంచారు.తులసి చదువుకోలేదు గానీ ఆమెకు చెట్ల గురించి ఎన్నో విషయాలు తెలుసు. ఎప్పుడు నాటాలి, ఎన్ని నీళ్లు పోయాలి, దాని జీవితకాలం.. ఔషధ గుణాలు.. ఏది అడిగినా చటుక్కున చెప్పేస్తారు. శాస్త్రవేత్తలు కూడా అబ్బురపడేంత వృక్ష విజ్ఞానం ఆమె సొంతం. 
అందుకే పర్యావరణవేత్తలు ఆమెను 'ఎన్‌సైక్లోపిడియా ఆఫ్‌ ఫారెస్ట్‌' అని పిలుస్తారు. కానీ ఆమె ఊరి వాళ్లు మాత్రం ఆమెను వనదేవతగా కొలుస్తారు. ఆమెను చూడటానికే చాలా మంది దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. అరుదైన వృక్షాల జాతుల గురించి తెలుసుకొని పోతుంటారు.76ఏళ్ల వయసులోనూ తులసి ఏ మాత్రం అలసట చెందకుండా మొక్కలు నాటుతారు. నీళ్లు పోసి కన్నబిడ్డలా వాటిని పెంచుతారు. తనకొచ్చే పింఛను డబ్బులన్నింటినీ దీనికే ఖర్చు చేస్తున్నారు. 
టేకు మొక్కల పెంపకంతో మొదలైన ఆమె ప్రస్థానం పనస, నంది, ఇంకా పెద్ద వృక్షాలు పెంచే వరకూ వెళ్లింది. మొక్క నాటితేనే సంతృప్తి రాదు.. అది మానుగా మారితేనే ఆనందం అని చెప్పే తులసి జీవితం.. నేటి తరానికి ఆదర్శప్రాయం..!

Sunday, 31 October 2021

తెలంగాణలోని పలు జిల్లాలో భూ ప్రకంపనలు.. ఇండ్ల నుండి జనం పరుగులు... ఇంద్రవెల్లిలో ఉద్రిక్తత...

:తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భూమి స్వల్పంగా కంపించింది. మంచిర్యాల, కొమురం భీం, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భూమి కంపించింది. భూ ప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసారు. జగిత్యాల జిల్లాలోని జగిత్యాల పట్టణంలో గల రహమత్‌పురాలో ప్రకంపనలు వచ్చాయి. ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూరు, సలుగుపల్లి గ్రామాల్లో భూమి కంపించింది. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా స్వల్పంగా భూమి కంపించింది. ఒక సెకను పాటు కంపించిన భూమి కంపించింది. సాయంత్రం 6.48 గంటల సమయంలో భూప్రకంపనలు వచ్చాయి. బెల్లంపల్లి, వేమనపల్లి, మందమర్రి మండలాల్లో భూమి కంపించింది. లక్సెట్టిపేటలో స్వల్ప భూప్రకంపనలు ఏర్పడ్డాయి. ఈ రోజు సాయంత్రం సమయం 6-48 నిమిషాలకు లక్షెటిపేట‌తో పాటు సమీప ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది.  ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అలాగే పెద్దపల్లి జిల్లా రామగుండం, ముత్తారం మండలాల్లో స్వల్పంగా భూ ప్రకంపనలు వచ్చాయి.
##################################

*కాగజ్‌నగర్‌లో పెద్దపులి చర్మం పట్టివేత*

కుమురం భీం: జిల్లాలోని కాగజ్‌నగర్‌లో పెద్దపులి చర్మాన్ని పోలీసులు పట్టుకున్నారు. 10 మంది నిందితులను అరెస్టు చేసారు.  పెద్దపులి చర్మాన్ని మహారాష్ట్రకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండంలోని  హీరాపూర్ అటవీ ప్రాంతంలో కొన్నాళ్ల క్రితం పులిని చంపినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులతో కలిసి అటవీ ప్రాంతాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.

ఇంద్రవెల్లిలో ఉద్రిక్తత
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
 పులి చర్మం కేసులో అరెస్టులపై ఆదివాసీల ఆగ్రహించారు. అటవీశాఖ అధికారులపై దాడికి యత్నించారు. అధికారుల వాహనాల్లో గాలి తీసి నిరసన వ్యక్తం చేశారు. దండారి పర్వదినాల్లో బూట్లు వేసుకుని ఇళ్లల్లో తనిఖీలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీశాఖ అధికారులపై అట్రాసిటీ కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు

Friday, 8 October 2021

దేవుడా ఓ మంచి దేవుడా....

October 8, 2021 : అక్రమ వ్యాపారానికి ఫోటోలను వాడుకున్నారు కొందరు కేటుగాళ్లు. దేవుళ్ల ఫొటోల ఫ్రేముల్లో గంజాయి ప్యాక్‌ చేసి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించి చివరకు అడ్డంగా బుక్కయ్యారు. ఈ ముఠాలో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేయగా, మరొకడు పరారయ్యాడు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో గురువారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.

పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం… బూరుగుపూడిలో జాతీయరహదారిపై తనిఖీలు చేస్తుండగా ఓ ఆటోలో వెళుతున్న ఇద్దరు వ్యక్తుల వద్ద ఫొటో ఫ్రేముల తరహాలో ఉన్న 5 బాక్సులను పోలీసులు గుర్తించారు. వాటిని తెరిచి చూడగా మొత్తంగా 122 కిలోల గంజాయి బయటపడింది. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.30వేల నగదు, మొబైల్‌ఫోను స్వాధీనం చేసుకొని ఆటోను సీజ్‌ చేశారు.

Thursday, 7 October 2021

SACRED FLAG HOISTED ON TEMPLE PILLAR MARKING THE BEGINNING OF ANNUAL BRAHMOTSAVAMS AT TIRUMALA _ ధ్వజారోహణంతో శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు ప్రారంభం.

Tirumala/తిరుమల :
The nine-day annual Brahmotsavams off to a colourful and spiritual start with Dwajarohanam ceremony held in the auspicious Meena Lagnam between 5:10pm and 5:30pm on Thursday in Tirumala temple.
Earlier, the Dhwajapatam with the image of Garudalwar was rendered special pujas in temple. This was followed by procession of processional deities accompanied by Parivara deities within the temple complex circumambulating Vimana Prakaram.
Later in the evening, the Garuda Dhwajapatham was hoisted on the Dwajasthambham-the temple pillar, amidst chanting of Vedic hymns by Vedic scholars.
The significance behind this ceremony is that Garuda, the ardent disciple of Sri Maha Vishnu (Sri Venkateswara Swamy) goes to all Lokas to invite all the three crore deities mentioned in ancient Hindu scriptures, Saptharshis and representatives of different worlds to take part in the Navahnika Brahmotsavam of His Master and make it a grand success.
శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు గురువారం సాయంత్రం 5.10 నుండి 5.30 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో ప్రారంభమయ్యాయి.
శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి సమక్షంలో వేద‌మంత్రోచ్ఛార‌ణ‌ మధ్య మంగళవాయిద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడ ధ్వజాన్ని ఎగురవేశారు. శ్రీ వాసుదేవ బ‌ట్టాచార్యులు కంక‌ణ‌భ‌ట్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. సకల దేవతలను, అష్టదిక్పాలకులను, స‌ప్త‌మ‌రుత్తులను (దేవ‌తాపురుషులు), రుషిగ‌ణాన్ని, స‌క‌ల ప్రాణికోటిని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ గ‌రుడాళ్వార్ ధ్వ‌జ‌స్తంభాన్ని అధిరోహిస్తార‌ని ప్రాశస్త్యం.
విశ్వ‌మంతా గ‌రుడుడు వ్యాపించి ఉంటారు. ఆయ‌న్ను శ్రీ‌నివాసుడు వాహ‌నంగా చేసుకోవ‌డంతో స‌ర్వాంత‌ర్యామిగా స్వామివారు కీర్తించ‌బ‌డుతున్నారు. 
కాగా, ధ్వ‌జ‌ప‌టంపై గ‌రుడునితోపాటు సూర్య‌చంద్రులకు కూడా స్థానం క‌ల్పించ‌డం సంప్ర‌దాయం. ఈ సంద‌ర్భంగా పెస‌ర‌ప‌ప్పు అన్నం (పొంగ‌లి) ప్ర‌సాద వినియోగం జ‌రిగింది. ఈ ప్ర‌సాదం స్వీక‌రించిన వారికి సంతాన ప్రాప్తి, దీర్ఘాయుష్షు, సిరిసంప‌ద‌లు స‌మ‌కూరుతాయ‌ని విశ్వాసం. అదేవిధంగా, ధ్వ‌జ‌స్తంభానికి క‌ట్టిన ద‌ర్భ అమృత‌త్వానికి ప్ర‌తీక‌. పంచ‌భూతాలు, స‌ప్త‌మ‌రుత్తులు క‌లిపి 12 మంది దీనికి అధిష్టాన దేవ‌త‌లు. ఇది స‌క‌లదోషాల‌ను హ‌రిస్తుంది. ద‌ర్భ‌ను కోసేట‌ప్పుడు, కైంకర్యాల్లో వినియోగించేట‌పుడు ధ‌న్వంత‌రి మంత్ర పారాయ‌ణం చేస్తారు. ధ్వ‌జారోహ‌ణం అనంత‌రం తిరుమ‌ల‌రాయ మండ‌పంలో ఆస్థానం చేప‌ట్టారు.
ధ్వ‌జారోహ‌ణ ఘ‌ట్టానికి ముందు సాయంత్రం 3 నుండి 4.30 గంట‌ల వ‌ర‌కు బంగారు తిరుచ్చిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని, పరివార దేవతలైన శ్రీ అనంత, గరుడ, చక్రత్తాళ్వార్‌, సేనాధిపతి వారిని, ధ్వజపటాన్ని ఆలయ విమాన ప్రాకారం చుట్టూ ఊరేగించారు.

Friday, 1 October 2021

నాది అల్లు రామలింగయ్యది గురు శిష్యుల సంబంధం: రాజమండ్రిలో మెగస్టార్ చిరంజీవి వెల్లడి...


రాజమహేంద్రవరం 
అక్టోబర్ 01 : నటుడిగా నేను జన్మించినది రాజమండ్రిలోనే  అని, రాజమండ్రి- తో నాకు విడదీయరాని బంధం వుంది
 కేంద్ర మంత్రి, ప్రముఖ సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య శతజయంతి ఉత్సవాలు సందర్భంగా శుక్రవారం  రాజమహేంద్రవరం వై-జంక్షన్ లోని అల్లు రామలింగయ్య హోమియో పతి కళాశాల, వైద్య శాల వ్యవస్థాపకులు అల్లు రామలింగయ్య విగ్రహాన్ని ప్రముఖ సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి, మెగాస్టార్ కొణిదెల చిరంజీవి, ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ ఆవిష్కరించారు.


ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో అల్లు రామలింగయ్య కళాశాల ఆవరణలో రూ.2 కోట్ల రాజ్యసభ నిధులతో నిర్మాణం చేసిన కళాశాల నూతన భవనాన్ని ఆయన  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నటుడిగా నేను జన్మించింది రాజమండ్రిలోనేనని అన్నారు.నా మొదటి మూడు సినిమాలు  పునాది రాళ్ళు, ప్రాణం ఖరీదు, మన ఊరి పాండవులు ఈ ప్రాంతంలో చిత్రీకరణ జరిగాయన్నారు. నాది అల్లు రామలింగయ్యది గురు - - శిష్యుల సంబంధం వంటి దన్నారు. బిజీగా  ఘాటింగ్ లో ఉండడం వలన  సమయానికి భోజనం చేయకపోవడం వల్ల కడుపులో మంట వచ్చేదని, ఎన్ని యాంటాసిడ్లు వాడినా కడుపులో మంట తగ్గలేదని అన్నారు.అల్లు రామలింగయ్య ఒకసారి ఇచ్చిన హెూమియో మందుతో నొప్పి తీసినట్లు పోయిందని గుర్తుచేసుకున్నారు. ఇవాల్టికీ మా ఫ్యామిలీ హెూమియోపతి మందులే వాడతామని, హెూమియోపతిలో తగ్గని జబ్బు లేదన్నారు. రాజ్యసభ ఎం.పి.గా ఉండటం వల్లే అన్ని ప్రాంతాల్లో అభివృద్ధికి నిధులు ఇవ్వగలిగానని, అన్నారు. సంజీవని లాంటి హెూమియోపతి వైద్యమని కొనియాడారు.  హెూమియోపతి సైడ్ ఎఫెక్ట్స్ లేని వైద్యమని, హెూమియోపతి వైద్యానికి మరింత ప్రాచుర్యం రావాలని చిరంజీవి ఆకాంక్షించారు. అల్లు రామలింగయ్య స్పూర్తి ప్రదాత అని అన్నారు.  తన చిన్న తనం లో హోమియో పతి ని ఉమాపతిగా పలికేవాడ్ని చిన్న నాటి సంఘటన లు గుర్తు చేసుకున్నారు. మనఊరి పాండవులు చిత్రం ఘాటింగ్ సందర్భంగా తిరిగి రైల్లో వెళ్తున్న సమయంలోనే నాకు అల్లు రామలింగయ్యతో పరిచయం ఏర్పడిందని అన్నారు. అప్పుడే నన్ను వలలో (అల్లుడుగా ) వేసుకున్నారనిపిస్తుందని అన్నారు. వానాకాల చదువులు చదివిన రామలింగయ్య గారు బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. ఆయన అనుకుంటే ఏదైనా,సాధించేవారని వివరించారు. నిత్యవిద్యార్ధిగా అల్లు గారు వుండేవారని తెలిపారు. హోమియో పతి వైద్యం అల్లుగారితోనే కాదు మా అమ్మగారితోనే నాకు అలవాటు ఉందన్నారు. గ్యాంగ్రెన్ వ్యాధులను కూడా రామలింగయ్యగారు నయం చేసేవారని అన్నారు. హొమియోపతి వైద్యం లో ఏ రోగానికి అయినా మందు వుంటుందని తెలిపారు.
కాలేజీ భవనానికి నిధులు కేటాయించినది నా డబ్బులు కాదు అని అన్నారు. నా రాజ్యసభ నిధుల నుంచి కాలేజీకి 2 కోట్లు ఇచ్చానంతే వివరించారు. మెగా స్టార్ చిరంజీవి గా రాజమహేంద్రవరం (మధురపూడి) ఎయిర్పోర్టులో దిగిన చిరంజీవికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో చిరంజీవితో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్, అల్లు అరవింద్, ఆయన  బావ  డాక్టర్ వెంకట్రావు, కళాశాల ప్రిన్సిపాల్ టి.సూర్యభగవాన్ తదితరులు పాల్గొన్నారు.

ఇక TS ఆర్టీసీలో ఒకటో తేదీనే జీతాలు..


*హైదరాబాద్‌:* ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త. మూడేళ్ల తర్వాత ఒకటో తేదీన టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులంతా జీతాలు అందుకోనున్నారు. ఇకపైనా ప్రతి నెలా ఒకటిన జీతాలు చెల్లించాలని సంస్థ ఎండీ సజ్జనార్‌ ఉన్నతాధికారులకు సూచించినట్లు సమాచారం. తీవ్ర నష్టాలతో ప్రతి నెలా 7 నుంచి 14 లోపు విడతలు, జోన్ల వారీగా జీతాలు చెల్లించడానికి అవస్థలు పడుతున్న సంస్థ.. దసరా పండగ వేళ అక్టోబరు 1న అందరికీ జీతాలు చెల్లించాలని నిర్ణయించింది. ఇటీవల ఆర్టీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన బాజిరెడ్డి గోవర్ధన్‌.. ప్రతి నెలా 1న జీతాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఆర్టీసీ యాజమాన్యం ఏర్పాట్లు చేసింది. దాదాపు 48 వేల మంది ఉద్యోగులు, పింఛనుదారులు ఒకటో తేదీన వేతనాలు అందుకోనున్నారు.

*దీర్ఘకాలిక సెలవులిస్తాం.. దరఖాస్తు చేసుకోండి*

టీఎస్‌ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్లకు దీర్ఘకాలిక సెలవులు ఇచ్చేందుకు సంస్థ ముందుకు వచ్చింది. ఇప్పటివరకు ఈ సెలవులపై అప్రకటిత ఆంక్షలున్నాయి. తాజాగా వాటిని సడలిస్తూ దరఖాస్తు చేసుకుంటే ఏడాది *సెలవులు ఇస్తామంటూ ఉత్తర్వులు జారీచేసింది.*

Tuesday, 31 August 2021

Haricane hits 18% of oil supply in U.S. Almost 600 Louisiana sites with toxic chemicals lie in Hurricane Ida's path


About two thirds of Louisiana industrial sites with toxic chemicals lie in the path of Hurricane Ida, a storm with the potential to batter or flood refineries, storage tanks and other infrastructure that can release oil and other harmful liquids and gases into communities and the environment.
Thousands of rescuers using boats, helicopters and trucks set about bringing hundreds of people to safety from flooded areas of Louisiana, USA, after storm surge and heavy rainfall from Hurricane Ida.
Hundreds of people evacuated their homes to avoid the storm. As of 30 August, over 2,200 evacuees were staying in 41 shelters, a number expected to rise as people were rescued or escaped flooded homes.
Hurricane Ida was blamed for 2 fatalities in Louisiana — a motorist who drowned after he attempted to drive through floodwater near the I-10 in New Orleans, and a person hit by a falling tree near Baton Rouge.
Wide areas of Louisiana and some coastal areas of Mississippi were flooded after storm surge and heavy rainfall of up to 15 inches (381 mm). In Louisiana, flooding was reported in areas of Grand Isle, Golden Meadow, LaPlace, Mandeville, Ponchatoula, Hammond, Algiers, Alliance, Slidell, Cocodrie, New Sarpy and Lafitte, among others. In Mississippi, the more significant flooding was reported in Gulfport, Biloxi and Bay St. Louis.
Governor Edwards suggested the flooding could have been much worse in Louisiana and many areas that saw catastrophic floods during Hurricane Katrina in 2005 were spared this time around due to the improved levee system.
“While this was an extremely catastrophic storm, if there is a silver lining our levee systems performed extremely well, particularly the hurricane risk reduction system in metro New Orleans. We don’t believe single levee was breached/failed,” the governor said...Heavy rain will continue through Friday from the Tennessee Valley into southern New England as Ida curves northeast. Considerable flash flood impacts are possible (especially in northern WV, western MD , & southern PA) as Ida brings widespread 2-6 to the region.

Tuesday, 24 August 2021

శ్రీశైల దేవస్థానానికి ఐఎస్‌వో గుర్తింపు....


శ్రీశైలం : భక్తులకు వైద్య ఆరోగ్య పరంగా కల్పిస్తున్న సౌకర్యాలు, చేపడుతున్న రక్షణ చర్యలకుగాను శ్రీశైల దేవస్థానానికి ఐఎస్‌వో (ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్) ఆక్యుపేషనల్‌ హెల్త్‌ అండ్‌ సేఫ్టీ మెజర్స్‌ ధ్రువీకరణ (ఐఎస్‌వో–45001) లభించింది.

అలాగే క్షేత్రపరిధిలో పారిశుధ్య నిర్వహణ, కోవిడ్‌ నిబంధనల అమలు తదితర చర్యలకుగాను జీహెచ్‌పీ (గుడ్‌ హైజెనిక్‌ ప్రాక్ట్రీసెస్‌) ధ్రువీకరణ కూడా లభించింది. ఈ మేరకు  ఐఎస్‌వో ప్రతినిధి ఎ.శివయ్య ధ్రువీకరణ పత్రాలను దేవస్థాన కార్యనిర్వహణాధికారి కేఎస్‌ రామారావుకు అందజేశారు. రాష్ట్రంలో జీహెచ్‌పీ ధ్రువీకరణ పొందిన తొలి ఆలయం శ్రీశైలం కావడం విశేషం..

The Srisailam temple has been awarded an ISO certificate..

Sri Bhramaramba Mallikarjuna Swamy Varla Devasthanam in Srisailam has acquired an ISO certification for taking sufficient safeguards to ensure the safety of pilgrims during the Covid-19 pandemic.

On Sunday, Alapati Sivaiah, a representative of HYM International Certifications Private Limited, handed over a copy of the Good Hygiene Practice certificate and the ISO 45001 certificate to KS Rama Rao, the general manager of the Srisailam temple. During the pandemic, the ISO team inspected the temple and assessed its implementation of the Covid-19 regimen.


Thursday, 19 August 2021

కలియుగ ప్రత్యక్ష భూలోక వైకుంఠం తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్రాల సమర్పణ


        తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాల సందర్భంగా గురువారం శాస్త్రోక్తంగా ప‌విత్ర సమర్పణ జరిగింది.
        ఈ సంద‌ర్భంగా టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియకుండా జ‌రిగిన‌ దోషాల నివార‌ణ‌కు ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్న‌ట్టు తెలిపారు. ప‌విత్రోత్స‌వాల్లో భాగంగా రెండో రోజు ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ చేప‌ట్టామ‌న్నారు. శుక్ర‌వారం పూర్ణాహుతితో ప‌విత్రోత్స‌వాలు ముగియ‌నున్న‌ట్టు చెప్పారు.
           కాగా, ప‌విత్రోత్స‌వాల్లో రెండో రోజు ఉదయం యాగశాలలో హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం వేద ఘోష, మంగళవాయిద్యాల నడుమ శ్రీవారి మూలవర్లకు, ఉత్సవ మూర్తులకు, జ‌య‌విజ‌యుల‌కు, గ‌రుడాళ్వారుకు, వ‌ర‌ద‌రాజ‌స్వామివారికి, వ‌కుళామాత అమ్మ‌వారికి, ఆనంద నిల‌యం, యాగ‌శాల, విష్వ‌క్సేనులవారికి, యోగ‌న‌ర‌సింహ‌స్వామివారికి, భాష్య‌కార్ల‌కు, పోటు తాయారుకు, ధ్వజస్తంభం, బ‌లిపీఠం, శ్రీభూవరాహస్వామివారికి, శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి పవిత్రమాలలు సమర్పించారు.
అనంతరం సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తారు. రాత్రి 8 నుంచి 11 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి.
         ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద‌జీయ‌ర్ స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్నజీయర్‌స్వామి, ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్‌జెట్టి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్‌బాబు, విజివో శ్రీ బాలిరెడ్డి, పేష్కార్ శ్రీ శ్రీ‌హ‌రి ఇతర అధికారులు పాల్గొన్నారు.

Sunday, 25 July 2021

రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా..కాకతీయుల కాలం నాటి రుద్రేశ్వర ఆలయానికి దక్కిన గౌరవం....తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం ..

వరంగల్...  
శిల్పకళాఖండాలకు నిలయమైన రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా దక్కింది. వారసత్వ కట్టడాల ప్రత్యేకతలను పరిశీలించేందుకు... చైనా, ప్యారిస్​లు వేదికగా సమావేశమైన ప్రపంచ హెరిటేజ్ కమిటీ ప్రతినిధులంతా... రామప్ప ను  ప్రపంచ పర్యాటకులు చూడదగ్గ ప్రదేశంగా భావించడంతో ప్రపంచ పర్యాటక జాబితాలో చోటు దక్కించుకుంది. 21 దేశాలు రామప్ప/రుద్రేశ్వార ఆలయానికి వారసత్వ గుర్తింపు లభించింది. 2020, 21 సంవత్సరాలకు గాను.. ప్రపంచ వ్యాప్తంగా 42 వారసత్వ కట్టడాలు... యూనెస్కో పరిశీలనకు ఎంపికవగా... మన దేశం నుంచి 2020 సంవత్సరానికి రామప్పకు మాత్రమే ఈ ఖ్యాతి దక్కింది.రోజుల తరబడి చూసినా తనివితీరని దృశ్యకావ్యం..
ములుగు జిల్లాలో వెంకటాపురం మండలం పాలం పేట  గ్రామంలో పచ్చని పంట పొలాల నడుమ... కొలువైన రామప్ప ఆలయం శిల్పకళా సంపదకు కేంద్రం. కాకతీయ చక్రవర్తి  రేచర్ల రుద్రుడు హయంలో 1213లో నిర్మితమై.. మహా శిల్పి రామప్ప కళా నైపుణ్యంతో అద్భుతంగా, అపురూపంగా చరిత్రలో నిలిచిపోయింది. మహోత్కృష్టమైన శిల్ప ఖండాలు ఈ ఆలయంలో కోకొల్లలు. గంటలు కాదు... రోజుల తరబడి చూసినా తనివితీరని అపురూప ఆకృతులకు ఈ ఆలయం పెట్టింది పేరు. ఆలయన్ని అనుకుని ఉన్న రామప్ప చెరువు అందాలు పర్యాటకులను కట్టిపడేస్తాయి. బోటింగ్ సదుపాయం కూడా ఉండటంతో.. పర్యాటకులకు ఈ ప్రాంతం స్వర్గ ధామమే. శతాబ్దాల నుంచి లక్షల సంఖ్యలో పర్యాటకుల మనస్సులో చెరగని ముద్ర వేసుకున్న ఈ ఆలయ విశిష్టత గురించి ఎంత సేపు చెప్పుకున్నా తనివి తీరదు. అలాంటి ఈ అద్భుత ఆలయానికి నేడు అపురూప గుర్తింపు లభించించడం పట్ల తెలంగాణ వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేశారు.
(India gets its 39th World Heritage Site
Rudreswara Temple (Ramappa Temple) at Palampet, Warangal, Telangana inscribed on UNESCO's World Heritage List)
ముఖ్యమంత్రి కెసిఆర్ హర్షం..
ములుగు జిల్లా పాలంపేటలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా (వరల్డ్ హెరిటేజ్ సైట్ ) యునెస్కో గుర్తించడం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. కాకతీయ రాజులు అత్యంత సృజనాత్మకంగా, శిల్ప కళా నైపుణ్యంతో తెలంగాణలో సృష్టించిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంపద దేశంలోనే ప్రత్యేకమైనదన్నారు. స్వయం పాలనలో కూడా తెలంగాణ చారిత్రక వైభవానికి, ఆధ్యాత్మిక సంస్కృతికి పూర్వ వైభవం తేవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని సీఎం అన్నారు. కాకతీయ రేచర్ల రుద్రుడు నిర్మించిన రామప్పను, ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు కోసం మద్దతు తెలిపిన యునెస్కో సభ్యత్వ దేశాలకు, సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి సీఎం ధన్యవాదాలు తెలిపారు. కృషి చేసిన తెలంగాణ ప్రజా ప్రతినిధులను, ప్రభుత్వాధికారులను సీఎం అభినందించారు.

Thursday, 22 July 2021

భద్రాచలంలో పోటేత్తిన గోదావరి...


భద్రాచలం  ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలతో భద్రాద్రి దుమ్ముగూడెం వద్ద గోదావరినది  ఉగ్రరూపం దాల్చింది. ఎస్సారెస్సీ ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి ఉప్పొంగుతోంది. గురువారం ఉదయం నుంచి భద్రాద్రి వద్ద భారీగా నీటిమట్టం పెరుగుతోంది. ఈ క్రమంలో, పర్ణశాలలో స్వామివారి  నారచీరలు ప్రాంతం పూర్తిగా నీట మునిగింది. అటు, సీతమ్మ వారి విగ్రహం, స్వామివారి సింహాసనం కూడా మునిగిపోయాయి

. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రంలో మరో 48 గంటలపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. దాంతో, గోదావరి నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. ఇన్

ఇంద్రకీలాద్రిపై శాకాంబరీ ఉత్సవాలు.. పండ్లు..పూలు.. కూరగాయల ఆలంకరణ ... పచ్ఛని తల్లిగా దర్శనం ఇస్తున్న బెజవాడ దుర్గమ్మ...

#ఇంద్ర‌కీలాద్రిపై #శాకాంబరి #ఉత్స‌వాలు #ప్రారంభమైనాయి. వివిధ ర‌కాల పండ్లు, కాయ‌గూర‌ల‌తో స‌ర్వాంగ సుంద‌రంగా ముస్తాభైన బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యం. భ‌క్తుల‌కు శాకాంబ‌రీ దేవిగా ద‌ర్శ‌న‌మిస్తున్నారు.పచ్ఛ పచ్ఛని పసిడి కాంతులతో ఆలయం శోభయమానంగా కనిపిస్తోంది... ‌*🌺🌸💐🌹🍌🍇🍓🥭🍑🍅🍆🥒🌽🥕🫒🧅🥔🍏🍎🍐🍋🍓🌺🌹🍑🍅🍎🍐🌺🌸🌺🌸🍇🍓
{{కృతయుగంలో" పూర్తిగా కరువు, కాటకాలు వోచినప్పుడు "దేవతలు" అందరు "అమ్మవారిని" ప్రార్దించగా "అమ్మవారు" ప్రత్యక్షమై తన "శరీరం" నుండి "శాకాలను" ప్రసరింప చేసింది. అప్పుడు "దేవతలు" అమ్మవారిని "శాకాంబరి" దేవిగా కొనియాడారు. " "శ్రీశైలం, విజయవాడ, బాసర, పెద్దమ్మతల్లి," ఇలా చాల దేవాలయాల్లో "శాకాంబరి" ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇ "శాకాంబరిదేవిని" దర్శిస్తే సకల "సంపదలు కలుగుతాయని" అలాగే ఇహమందు "సకల సుఖాలు" పొందుతారని "దేవి భాగవతం" చెపుతుంది. ((( మీకు వీలయితే అమ్మవారిని తప్పకుండా దర్శించండి. )))
                             
             

Sunday, 18 July 2021

బెజవాడ కనకదుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం

విజయవాడ..
ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలను పురస్కరించుకుని భాగ్యనగర్ శ్రీ మహాంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి ఆధ్వర్యంలో బెజవాడ కనకదుర్గమ్మకు బంగారు బోనం  అత్యంత వైభవంగా కన్నుల పండువగా జ‌రిగింది.ఈ సందర్భంగా  దుర్గమ్మ కు బంగారు బోనంతో పాటు పట్టువస్త్రాలను  భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ సభ్యులు సమర్పించారు.
  బంగారు బోనం     సిరస్సుపై ధరించి దారి పొడవునా న్రుత్యాలు చేస్తూ దుర్గమ్మ నామస్మరణతో  ఇంద్రకీలాద్రి ప్రాంతం మార్మోగింంది.
జమ్మిదొడ్డి వద్ద ప్రత్యేక  పూజా కార్యక్రమాలు నిర్వహించిన  భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ
కమిటీ సభ్యులకు తొలుత స్వాగతం పలికిన దుర్గగుడి ఈవో భ్రమరాంబ, చైర్మన్ పైలా సోమినాయుడు
అనంతరం జమ్మిదొడ్డి నుంచి ఊరేగింపుగా ఘాట్ రోడ్డుమీదుగా డప్పు వాయిధ్యాలు, వివిధ కళాకారులతో జాతరగా  సాగిన దుర్గమ్మ కు బోనం సమర్పణ చేశారు.

కేరళలో రామయాణ మాసం...విష్ణు సహస్రం..రామయాణ పరాయణలతో ఆలయాలు..





కేరళలో  మలయాళ మాసం కర్కాటక (జూలై - ఆగస్టు) లో పాటిస్తారు. దీనినే రామాయణ మాసంగా హిందువులు పాటిస్తారు  ఈ సందర్భంగా కేరళలోని నాలుగు హిందూ దేవాలయాల సమితి సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంది.. మలయాళంలో నలు అంటే "నాలుగు", అంబలం అంటే "ఆలయం" అని అర్ధం. కేరళలో
 రాముడి ఆలయాలు చాలా వున్నప్పటికి ...  అత్యంత ప్రసిద్ధమైనవి త్రిశూర్ మరియు ఎర్నాకుళం జిల్లాల్లో ఉన్న నాలుగు ఆలయాలు, అవి త్రిప్రయార్ శ్రీ రామ ఆలయం, కూడల్మానికం భరత ఆలయం, మూజిక్కులం లక్ష్మణ ఆలయం,  పాయమ్మల్ ఆలయం. నలంబలం యాత్ర త్రిప్రయార్ లోని రామ ఆలయం నుండి ప్రారంభమై పాయమ్మల్ లోని శత్రుఘ్న ఆలయంలో ముగుస్తుంది. నాలుగు ఆలయాలను వరుసగా రాముడు, భరత, లక్ష్మణ మరియు శత్రుఘ్నాలను సందర్శించడం ఆచారం. పవిత్రమైన కార్కిడకం (జూలై-ఆగస్టు) సమయంలో కేరళీయులు  ఒకే రోజున ఈ దేవాలయాలకు తీర్థయాత్రలు చేస్తారు. ఈ యాత్ర త్రిప్రయార్ నుండి ప్రారంభించి, పాయమెల్‌లో ముగుస్తుంది, కూడల్మానిక్యం మరియు మూజికులం ద్వారా ..... 
 నెలలోని అన్ని రోజులలో, హిందూ గృహాలలో, హిందూ సంస్థలు మరియు విష్ణువుకు అంకితం చేసిన దేవాలయాలలో పురాణ రామాయణం చదవబడుతుంది. కేరళీయుల క్యాలెండర్ ప్రకారం.. 2021 లో, రామాయణ మసం జూలై 17 న ప్రారంభమై ఆగస్టు 16 తో ముగుస్తుంది. జై శ్రీ రామ్. 🙏🙏

Saturday, 17 July 2021

దొంగ డీఎస్పీ అరెస్టు... ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని 5 జిల్లాల్లో 20 మంది నిరుద్యోగులకు టోకరా....


కామారెడ్డి, జూలై 16 : డీఎస్పీగా చెప్పుకొంటూ ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగుల నుంచి రూ.కోటి వసూలు చేసిన మోసగాడిని హైదరాబాద్‌ బేగంబజార్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం తుజాల్‌పూర్‌ గ్రామానికి చెందిన నెల్లూరు స్వామిగా గుర్తించారు. 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న ప్రభుత్వ ప్రకటన నేపథ్యంలో నిరుద్యోగులను మోసం చేయడానికి నెల్లూరు స్వామి డీఎస్పీ ముసుగులో కొత్త దందాకు తెరలేపాడు. తనతో పాటు మరికొందరిని కలుపుకొని ముఠాగా ఏర్పడ్డాడు. ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న వారి జాబితాను సేకరించాడు.


టీఎ్‌సపీఎస్సీలో అంతాతమ వారే ఉన్నారని నిరుద్యోగులను నమ్మించాడు. మొదట కామారెడ్డిలో పలువురి నుంచి రూ.లక్షలు వసూలు చేశాడు.  కరీంనగర్‌, సిరిసిల్ల, సిద్దిపేట, నిజామాబాద్‌, మెదక్‌ జిల్లాల్లో 20 మంది నిరుద్యోగుల నుంచి తలా రూ.5 లక్షలు నుంచి రూ.10 లక్షల చొప్పున సుమారు రూ.కోటి వరకు వసూలు చేశాడు. స్వామి వ్యవహార శైలిపై అనుమానం వచ్చిన కొంతమంది యువకులు ఆ విషయాన్ని టీఎ్‌సపీఎస్సీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అధికారులు స్వామిపై నిఘా పెట్టి కూపీ లాగి బేగంబజార్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బేగంబజార్‌, స్పెషల్‌ పార్టీ పోలీసులు 3 రోజులు బీబీపేట మండలం తుజాల్‌పూర్‌లో మకాం వేశారు. కామారెడ్డి పోలీసుల సహకారంతో  14న రాత్రి స్వామిని తుజాల్‌పూర్‌లోని అతని ఇంటి వద్ద అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు.

*డీఎస్పీ యూనిఫాంతో సెటిల్‌మెంట్లు కూడా*

బీబీపేట మండలంలో అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి భార్య అక్క కొడుకు నెల్లూరు స్వామి. ఆ ప్రజాప్రతినిధి అండతోనే అతను మోసాలు చేసినట్లు తెలిసింది. డీఎస్పీ యూనిఫాంలో.. బీబీపేట మండలంతో పాటు దోమకోండ, కామారెడ్డిలో బహిరంగంగా తిరుగుతున్నా స్థానిక పోలీసులు పట్టించుకోకపోవడం గమనార్హం. రాత్రి అయిందంటే చాలు.. వాహనంతో బీబీపేట, తుజాల్‌పూర్‌ బస్టాండ్‌ వద్ద పోలీసు అధికారిలా విధులు నిర్వహిస్తూ వాహనదారుల నుంచి వసూళ్లకు పాల్పడేవాడని స్వామిపై ఆరోపణలున్నాయి. అలా వచ్చిన డబ్బులో స్థానిక పోలీసులకు వాటా ఇచ్చాడని సమాచారం.

Tuesday, 13 July 2021

మహాభారతం లో కొన్ని ముఖ్య సంఘటనలు జరిగిన తిథులు :


🌸🌲🌸🌲🌸🌲🌸🌲🌸🌲🌸
వింటే భారతం వినాలి తింటే గారెలే తినాలి అని ఎందుకు అంటారో తెలుస్తుంది.
మహాభారతం గురించి ఎంత చదివినా ఎంత విన్నా కొత్త గానే అద్భుతం గానే వుంటుంది. అందుకే ఈ మధ్య తెలుసుకున్న కొన్ని మహాభారత విశేషాలు మీ కోసం.

సులభం గా టైపు చేయడానికి సంవత్సరాలను సం గాను , నెలలను నె గాను , రోజులను రో గాను చేయడం జరిగింది.
తారీఖు లను రోజులు-నెలలు-సంవత్సరాలు గా dd-mm-yy గా భావించవలెను.
కర్ణుని జననం : మాఘ శుద్ధ పాడ్యమి.
ఇతను ధర్మరాజు కంటే 16 సం పెద్దవాడు.

యుధిష్టరుని జననం :
ప్రజోత్పత్తి నామ సంవత్సర జ్యేష్ఠ నక్షత్ర శుక్ల పంచమి మిట్టమధ్యాహ్నం అభిజిత్ ముహూర్తం లో Sagittarius (ధనుర్రాశి) లో.
సుమారు క్రీ పూ 15-8-3229.

భీముని జననం :
మఖ నక్షత్ర అంగీరస బహుళ నవమి .
ధర్మరాజు కన్నా 1సం 19రో చిన్నవాడు.

అర్జునుని జననం:
శ్రీముఖి నామ సం ఫాల్గుణ మాస ఉత్తరా నక్షత్ర శుక్ల పౌర్ణమి.
భీమునికన్నా 1సం 4నె 21రో చిన్నవాడు.

నకుల & సహదేవుల జననం :
భవ నామ సం ఫాల్గుణ మాస అశ్విని నక్షత్ర పౌర్ణమి మిట్ట మధ్యాహ్నం.
అర్జునుని కన్నా 1సం 15రో చిన్నవాళ్ళు.

శ్రీ కృష్ణ జననం :
శ్రీముఖ నామ సం శ్రవణ నక్షత్ర బహుళ అష్టమి .
అర్ధరాత్రి అనంతరం tarus (వృషభ)లగ్నం.

దుర్యోధనుడి జననం :
భీముని మరుసటి దినం.
హిడింబాసురుడు, బకాసురుడు,కీచకుడు వీరుకూడా ఇదే సమయాలో మఘ & స్వాతి నక్షత్రాల మధ్య జన్మిస్తారు.
అక్కడి నుండి రోజుకొకరు చొప్పున మిగిలిన 99 కౌరవులు వారి చెల్లి #దుశ్శల (సైంధవుని భార్య).

పాండురాజు మరణం:
సర్వ ధారి నామ సం ఉత్తర నక్షత్ర శుక్ల ద్వాదశి.
అప్పటికి ధర్మరాజు వయసు 16సం 6నె 7రో.

పాండవుల హస్తినపుర ప్రవేశం:
సర్వధారి సం చైత్ర మాస బహుళ త్రయోదశి.
పాండురాజు మరణాంతర 16 రో కు.

యుధిష్టరుని పట్టాభిషేకం:
శుభకృత్ నామ సం ఆస్వీయుజ శుక్ల దశమి.
అతని వయసు 31సం 5రో.
అక్కడినుండి 5సం 4నె 20రో హస్తినాపురం లో ఉంటారు.

వారణావ్రత ప్రవేశం :
ప్లవ నామ సం ఫాల్గుణ మాస శుక్ల అష్టమి.

లాక్ష గృహ దహనం:
కీలక ఫల్గుణ 13/14 వ రాత్రి 3 వ ఝాము.

ఘటోత్కచ జననం:
సౌమ్య నామ సం అశ్వినీ శుక్ల విదియ.

పాండవులు ఏక చక్రపురం లో సాధారణ నామ సం చైత్ర శుక్ల విదియ నుండి ఆస్వీయూజ శుక్ల విదియ వరకు అనగా 6నెలలు ఉంటారు.

బకాసుర వధ :
సాధారణ నామ సం శుక్ల దశమి.

పాండవులు ఏకచక్రపురం లో సాధారణ మార్గశిర బహుళ పంచమి వరకు అనగా ఇంకనూ 1నె10రో ఉన్న తర్వాత పాంచాల రాజ్యం కు బయలుదేరుతారు.

ద్రౌపది స్వయంవరం:
సాధారణ నామ సం పుష్య మాస శుక్లపక్ష దశమి.

విరోధి నామ సం పుష్య పౌర్ణమి వరకు 1సం 15రో పాటు పాంచాల రాజ్యం లో వుంటారు.

హస్తినాపురం రాజధాని గా 5సం 6నె పాటు అనగా విరోధి కృత నామ సం మాఘ శుక్ల విదియ నుండి పింగల శ్రావణ శుక్ల విదియ వరకు.
ఈ కాలం లొనే ఇంద్రప్రస్థం నిర్మాణం జరుగుతుంది.
అప్పటికి ధర్మజుని వయసు 45సం 9నె 27రో.

ధర్మరాజు పట్టాభిషేకం :
పింగళ ఆశ్వీయుజ శుక్ల దశమి.
యధిష్టురుని వయసు 46 సం.

అర్జునుని తీర్థయాత్రలు:
కాలయుక్తి నుండి ప్రమోదూత వరకు.

సుభద్ర తో పరిణయం:
ప్రమోదూత వైశాఖ శుక్ల దశమి.

ఖాండవవన దహనం :
ప్రమోదూత శ్రావణ శుక్ల విదియ.
మయసభ 1సం 2నె లో నిర్మితమవుతుంది.

మయసభ ప్రవేశం :
ప్రజోత్పత్తి ఆస్వీయుజ శుక్ల దశమి
ధర్మజుని వయసు 60 సం 5 రో.

ఇంద్రప్రస్థం రాజధాని గా సర్వజిత్ ఆస్వీయుజ శుక్ల దశమి వరకు అనగా 16 సం పాలిస్తారు.

జరాసంధ వధ :
సర్వజిత్ కార్తీక శుక్ల విదియ నుండి 14 వ రోజు వరకు పోరాడి సాయంత్రం న.

రాజసూయ యాగం :
సర్వధారి చైత్ర పౌర్ణమి.
యధిష్టురుని వయసు 76సం 6నె 15రో.

మాయాజూదం
సర్వధారి శ్రావణ తదియ & సప్తమి నాడు.
ధర్మజుని వయసు 76సం 10నె 2రో.
కనుక మొత్తం 36 సం 6నె 20రో అనగా విరోధి కృతు మాఘ శుక్ల విదియ నుండి సర్వధారి శ్రావణ బహుళ సప్తమి.

అరణ్యవాసం :
సర్వధారి శ్రావణ బహుళ అష్టమి నాడు ప్రారంభమౌతుంది.
అప్పటికి యధిష్టురుని వయసు 76సం 10నె 18రో.
12సం అరణ్యవాసం శార్వరి శ్రావణ బహుళ సప్తమి తో పూర్తి అవుతుంది.

1సం అజ్ఞాతవాసం ప్లవ శ్రావణ బహుళ సప్తమి తో పూర్తి అవుతుంది.

కీచక వధ :
ప్లవ ఆషాఢ బహుళ అష్టమి.
అతని సోదరురులు మరుసటి దినం మరణిస్తారు.

ఇవన్నీ చాంద్రమానం ప్రకారం సం. వీటిలో
ప్రతి 5 సం కు 2 అధిక మాసాలు మరియు 13 సం లలో 5 అధిక మాసాలు ,12 రోజులు అధికంగా ఉంటాయి.
వీటి లెక్క తిథులలో సహా ధర్మజునికి & భీష్మునికి తెలుసు కాబట్టే ఉత్తర గోగ్రహణం నందు పాండవులు బయటకు తెలుస్తారు.
కానీ దుర్యోధనుడు సూర్యమానం ప్రకారం ఇంకా అజ్ఞాతవాసం పూర్తి అవలేదని భ్రమ పడతాడు.

అందుకే ఉత్తర గోగ్రహణం నందు బయటపడడానికి ముందు రోజే మొత్తం 13 సం కాలం పూర్తి అగుతుంది.
ఇదంతా అర్జునుడు ఉత్తర కుమారునికి వివరిస్తూ తాను గాండీవం ను 30 సం ధరించానని ఇంకనూ 35 సం దరిస్తానని చెప్తాడు.
బహుళ నవమి రోజు అర్జునుడు అజ్ఞాతవాసం నుండి బయటకు వస్తాడు.
అప్పటికి ధర్మజుని వయసు 89సం 10నె 9రో.

పాండవులు ఉపప్లవ్యం లో 1సం 2నె 17రో ఉంటారు. ఈ కాలం లొనే ఉత్తర&అభిమన్యుల వివాహం శుభకృత్ జ్యేష్ఠ మాసం లో జరుగుతుంది.
ఆస్వీయుజ మాసం లో ఏర్పడిన సూర్య చంద్ర గ్రహణాలు రాబోయే కాలం లో జరగబోయే వినాశానికి హేతువులు గా చెప్తారు.

శ్రీ కృష్ణ రాయబారం :
కృష్ణుడు శుభకృత్ కార్తీక శుక్ల విదియ రేవతి నక్షత్రం నాడు ప్రారంభమై త్రయోదశి నాడు హస్తినపురం కు చేరతాడు.అక్కడి నుండి బహుళ అష్టమి వరకు శాంతి కాముకం గా రాయబారం నడుపుతాడు.
అష్టమి రోజే విశ్వరూప సందర్శనం జరుగుతుంది. రాయబారం విఫలమైన తర్వాత అదే రోజు పుష్యమి నక్షత్రం నాడు తిరుగు ప్రయాణం అవుతూ కర్ణుడి తో ఈ విధం గా అంటాడు. వారం రోజులలో అనగా జ్యేష్ఠ నక్షత్రం పాడ్యమి నాడు కురుక్షేత్ర సంగ్రామం జరగపోతుంది. సిద్ధంగా ఉండండి అని ఉపప్లవ్యం కు బయలు దేరతాడు.

మార్గశిర శుక్ల విదియ నుండి ద్వాదశి వరకు సైన్యాల మోహరింపు, యుద్ధ సరంజామా , సామర్ధ్య పరీక్షలు నిర్వహించ బడతాయి.

యుద్ధ ప్రారంభం :
శుభకృత్ నామ సంవత్సరం మార్గశిర మాసం శుక్ల త్రయోదశి / చతుర్దశి భరణి నక్షత్రం మంగళవారం నాడు ప్రారంభమౌతుంది.
అప్పటికి ధర్మరాజు వయసు 91సం 2నె 9రో .
దీనికి ముందు రోజే అర్జునునికి భగవద్గీత ను బోధిస్తాడు.

మార్గశిర బహుళ సప్తమి నాడు భీష్ముడు అంపశయ్య పై చేరతాడు.

అభిమన్యుని మరణం :
మార్గశిర బహుళ దశమి తన 17 వ ఏట. అప్పటికి అతని వివాహం జరిగి 6నెలలు మాత్రమే. ఉత్తర 6నెలల గర్భిణీ.

సైంధవ మరణం :
మార్గశిర బహుళ ఏకాదశి.

ద్రోణుడు ద్వాదశి నాడు
కర్ణుడు చతుర్దశి నాడు
శల్యుడు శుక్ల పాడ్యమి సాయంత్రం మరణిస్తారు.

దుర్యోధనుడి మరణం :
పుష్య మాస శుక్ల పాడ్యమ

ఉపపాండవుల మరణం :
పుష్య శుక్ల పాడ్యమి నాటి రాత్రి వేళ.

ధర్మరాజు పట్టాభిషేకం :
శుభకృత్ పుష్య పౌర్ణమి.
అప్పటికి ఆయన వయసు 91సం 3నె 10 రో.

పుష్య బహుళ విదియ నుండి అష్టమి వరకు భీష్ముని చే అనేక విషయాలు పాండవుల కు చెప్పబడతాయి.హస్తిన కు వెళ్లిన 15 రోజుల తర్వాత మళ్ళీ మాఘ శుక్ల అష్టమి నాడు మళ్ళీ కలుసుకుంటారు.
అష్టమి నుండి పంచ ప్రాణాలలో రోజుకు ఒక్కొకటి చొప్పున భీష్ముడు విడిచారు అని దీనిని భీష్మ పంచకం అని అంటారు.
భీష్ముడు మార్గశిర సప్తమి నుండి మాఘ ఏకాదశి వరకు 48 రోజులపాటు అంపశయ్య మీద ఉన్నట్లు చెప్తారు.

అశ్వమేధ యాగం :
శుభకృత్ మాఘ శుక్ల ద్వాదశి.
15సం అనంతరం ధృతరాష్ట్రుడు వన వాసానికి కార్తీక మాసంలో వెళతాడు.
3సం తర్వాత పాండవులు పెద్ద వారు మరణించారని తెలుసుకుని వారిని చూడడానికి అడవులకు వెళ్తారు.
ఒక నెల తర్వాత గాంధారి , ధృతరాష్ట్రుడు, కుంతి మొదలగు వారు అడవులలో అగ్నికి ఆహుతి అవుతారు.

యుద్ధానంతరం 36 సం కు ద్వారక లో ముసలం పుట్టి యాదవులు వినాశనం జరుగుతుంది.
ధర్మరాజు పాలన : శుభకృత్ పుష్య పౌర్ణమి నుండి బహుదారణ్య పుష్య పౌర్ణమి వరకు ధర్మరాజు 36సం 2నె 15రో పాటు పరిపాలిస్తాడు.

కలియుగ ప్రారంభం :
ప్రమాధి శుక్ల పాడ్యమి నాడు శ్రీ కృష్ణ నిర్యాణం తో కలియుగం ఆరంభం అవుతుంది.
అది క్రీ పూ,...20 - 2 - 3102. 2:27:30 AM.

7 రోజుల అనంతరం ద్వారక సముద్రం లో మునిగి పోతుంది.
యుధిష్టర శకం ఆయన పట్టాభిషేకం రోజునుండి మొదలవుతుంది.

పాండవుల రాజ్య నిర్గమన
ద్వారక నిమ్మజ్జన అనంతరం 6నె 11రో అనగా ధర్మజుని వయసు 127సం 6రో ఉన్నపుడు 36 సం పరీక్షిత్తు నికి రాజ్యాభిషేకం చేస్తారు.

స్వర్గారోహణ గురించి పూర్తి వివరణ తెలియదు కాని అది 26 సం తర్వాత జరిగింది గా చెప్తారు.

వ్యాసుడు గణపతి కి స్వర్గారోహణ తర్వాతే మహాభారతం చెప్తాడు అని అంటారు.

పరీక్షిత్తు 60 సం రాజ్యపాలన అనంతరం మరణిస్తాడు. 25 సం జనమేజయుడు రాజు అవుతాడు.

మహాభారత రచన అనంతరమే వేద వ్యాసుడు కలియుగం ప్రారంభమైన 60 సం కు భాగవత రచన చేశాడని చెప్పారు.

వారి కోసం మరియు నా కోసం కూడా ఈ వ్యాసాన్ని తెలుగు లో టైపు చేసాను. ఇది మన వారి విజ్ఞానాన్ని తెలుసుకునే ఒక ప్రయత్నం మాత్రమే.
ఇందులో తప్పులు ఏమైనా వున్ననూ సరిదిద్దుకోగలరు.

EVENT_DATE

Going to forest 4th Sept. 5574 BC

Kimeera Killed 7th Sept. 5574 BC

Going underground 19th May 5562 BC

Keechak killed 1st April 5561 BC

Anukeechak-Massacre 2nd April 5561 BC

End of secret life 9th April 5561 BC

Cows stolen 15th April 5561 BC

Arjuna exposed 16th April 5561 BC

All pandavas exposed 19th April 5561 BC

Marriage of Uttara 4th May.
& Abhimanyu.

Krishna set out for a treaty. 27th Sept.

Stay at Upaplavya 27th Sept.

Stay at Vrukshthala 28th Sept.

Dinner to Brahmins 29th Sept.

Entry into Hastinapur 30th Sept.

Krishna meets Kunti etc. 1st Oct.

Invited for meeting 2nd Oct.

First meeting 3rd Oct.

Second meeting and an attempt 4th Oct.
to arrest Krishna.

Third meeting Vishvaroopa 7th Oct.

Stay at Kunti 8th Oct.

Krishna meets Karna. War 9th Oct.
fixed.

Krishna returns 9th Oct.

Pandavas preparation 11th Oct.
Balaram's visit.

Mahabharat war started 16th Oct.

Abhimanyu killed 28th Oct. 5561 BC.

End of War 2nd November 5561 B.C.

Yudhishthira crowned 16th Nov. 5551 BC.

Bhishma expired 22nd Dec. 5561 BC

Pandava campaign 15th Jan. 5560 BC
for wealth

Parikshita born 28th Jan. 5560 BC

Pandavas return 25th Feb. 5560 BC

Ashvamedh Deeksha. 1st March 5560 BC

Return of Arjuna Horse 15th Jan. 5560 BC

Ashvamedh yajna 22nd Feb. 5559 BC

Dhrutarashtra went to forest 18th Aug. 5545 BC

Pandavas visited Kunti 18th Aug. 5543 BC
Vidura expired

Death of Kunti, Dhrutarashtra, and Gandhari Sept./Oct. 5541 BC

Yadava Massacre 5525 B.C.

Parikshit Dead 5499 B

కురుక్షేత్ర యుధ్ధ సమయానికి ఎవరి వయసు

bheeshma - 141 years
krishna - 90 years
karna - 107 ears
Yudhishthir - 91 years;
Bheem - 90 years;
Arjun - 89 years;
Nakul & Sahdev - 88 years.
Duryodhan - 90 years
Abhimanyu - 17 years
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
###Source...బాషా భారతి..సోషల్ మీడియా, గ్రూపు..###
అమూల్యమైన సమాచారం పంపిన మిత్రులకు ధన్యవాదాలు
🙏🙏

Saturday, 10 July 2021

పూరిలో జగన్నాధుని రధయాత్ర....


ఆషాఢ మాసంలో ఒరిస్సాలోని పూరీ జగన్నాధుని రధాయత్ర చాల విశేషమైంది.జగత్తుకే నాధుడైన ఆ జగన్నాధుడు తానే కదలి వచ్చే ఈ అద్భుత యాత్ర -9రోజులు గుండీచ మందిరంలో జనుల పూజలందుకుని తిరుగు ప్రయాణమయే ఉత్సవం శోభాయమానంగా జరుగుతుంది -ఈ యాత్రని బహుదా యాత్ర అంటారు. విదేశీయులు ఎవరికీ  గుడి ప్రవేశ అర్హత లేదీ ఆలయంలో.ఇందిరాగాంధీ  పార్శీని పెళ్లి చేసుకున్నందుకు ఆమెనీ గుడిలోకి అనుమతించలేదని అంటారు. తన దగ్గరకు రాలేని భక్తులకి దర్శనమివ్వటానికి భగవంతుడే స్వయంగా బయటకు వస్తాడు. కులమత భేదాలు లేకుండా అందరూ ఇందులో పాల్గొనడం విశేషం - ఈ 9 రోజులలో బయటి కొచ్చిన దేముణ్ణి చూడడానికి దేశ,విదేశీభక్తులు  వేలాదిగా,లక్షలాదిగా వస్తారు.
ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో శుధ్ధ విదియనాడు ప్రారంభమయ్యే ఈ యాత్ర జగన్నాధుని ఆలయానికి 3 కి.మీ. ల దూరంలో వున్న గుండిచా మందిరందాకా సాగుతుంది. భారీ రధాలలో బలరాముడు, సుభద్ర, జగన్నాధుని విగ్రహాలను ఊరేగిస్తూ తీసుకు వెళ్తారు. భక్తులు ఈ రధం తాళ్ళని లాగటానికి పోటీ పడతారు. ఆ సమయంలో పూరీ వీధులలో ఇసక వేస్తే రాలనంత జనం వుంటారు. ఈ రధ యాత్ర కోసమే ఆలయం ముందు వీధి అతి విశాలంగా వుంచారు. - 
ఈ రధాలలో ముందుగా బలభద్రుని రధం, తర్వాత సుభద్రది, చివరికి జగన్నాధుని రధాలు సాగుతాయి. ఈ రధాలు వరుసగా 45 అడుగులు, 44 అడుగులు, 43 అడుగులు ఎత్తు వుంటాయి. అలాగే రధాలకు 16, 14, 12 చక్రాలుంటాయి. రధయాత్రసాగే ముందు రాజు బంగారు చీపురుతో రధాలను శుభ్రం చేసి, ఆ దేవతలని యాత్రకి బయలుదేరమని ప్రార్ధించటం ఆనవాయితీ. భగవంతుని ముందు రాజు, పేద తేడాలేదని నిరూపిస్తుంది ఈ ఆచారం. మహారాజు రధయాత్రకు ముందు బంగారు చీపురుతో తుడిచాక రధాయత్ర ప్రారంభం అవుతుంది,పూరీ రధయాత్ర విశేషాలు చాలా ఉన్నాయి.
ఒరిస్సా రాజ వంశీకులు ఈ సేవను అత్యంత గౌరవప్రదమైనదిగా భావిస్తారు.రధాలు ఈ మూడు కిలోమీటర్ల దూరం దాటి గొండిచా ఆలయం చేరేసరికి సాయంకాలం అవుతుంది. లక్షలాది మంది భక్తులు  లాగుతుంటే, మధ్య మధ్యలో రధ చక్రాలు కదలనని మొరాయిస్తాయి. అపుడు వేలకొద్ది కొబ్బరి కాయలు కొడతారు. భక్తులంతా ఏక కంఠంతో చేసే భగవన్నామంతో భూమి దద్దరిల్లి పోతుందేమో అని అనిపిస్తుంది విగ్రహాలని ఏడు రోజులు గొండిచా ఆలయంలో వుంచి పూజలు, ఉత్సవాలు చేశాక ఏడవ రోజు తిరిగి జగన్నాధ ఆలయం చేరుకుంటారు. - 
ఏ అలయంలోనూ లేని విధంగా -అన్న,చెల్లెళ్ళ ప్రత్యెకత.జగన్నాధుడు,బలభద్రుడు,సుభద్రల  ఆలయం ఇది.అధిక ఆషాఢమాసం వచ్
వేప చెట్టుని వెదికి,వాటిని చెక్కించి పెట్టడం చాలా పెద్ద ప్రహసనం.ఆ చెట్లు ఎక్కడ దొరుకుతాయో -- -.ఆ వెళ్ళే బృందం నియమ నిష్టలతో ఎడ్ల బండి పై వెళ్ళాలి,మంగళాదేవి గుడిలో నిద్రించి నప్పుడు కలలో కనబడి మంగళాదేవి అనే దేవత చెబుతుంది అట,వీరికి తెల్లని పాము తోవ చూపుతుందిట.
ప్రతీ విగ్రహానికి ఒక్కో రకం పోలికలు ఉండాలి.వేప చెట్టు కాండం నల్ల రంగులో ఉండేది జగన్నాధునికి -దీనిపై శంఖు,చక్రాలు,నామం ఉండాలి.దగ్గరలో పాము పుట్ట ఉండాలి.చెరువుగానీ,సముద్రంగానీ ఉండాలి.గుడి ఉండాలి.)
బలభద్రుని విగ్రహానికి తెల్లని కఱ్ఱ కావాలి. దానిపై శంఖ చిహ్నం కనిపిస్తుంది. ఆ చెట్టుకు ఐదు శాఖలుంటాయి. జగన్నాధుని విగ్రహం తయారు చేసే కఱ్ఱమీద చక్రం చిహ్నం వుంటుంది. ఆ చెట్టుకు 7 శాఖలుంటాయి.పాము పుట్ట,గుడి,నీరు దగ్గరలో ఉండాలి.
ఇలా 4 రకాల చెట్లను వెదుకుతారు,జగన్నాధుడు,బలభద్రుడు,సుభద్ర ,సుదర్శనం ఇలా 4 విగ్రహాలు ..ఆయా చిహ్నాలు ఉండేవి చూసి పూజాదికాలు నిర్వహిస్తారు.
ప్రసాదాలు:జగన్నాదుడికి 54 రకాల నైవేద్యాలు తయారు చేస్తారు. ప్రసాదంగా అన్నాదులను కుండలో మాత్రమే వండు.

Friday, 9 July 2021

రాత్రివేళల్లో పూజలందుకునే**వారాహి దేవత*

*వారాహిమాత*
*మన పురాణాల ప్రకారం* శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్తమాతృకాలు.
 వీరే *బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి.* కొన్ని నమ్మకాల ప్రకారం ఎనిమిదో మాతృకగా నారసింహినీ మరికొన్ని సంప్రదాయాలలో తొమ్మిదవ మాతృకగా వినాయకిని ఆరాధించడం జరుగుతోంది.
దుష్టశిక్షణ కోసమూ, భక్తులకు కాచేందుకు
 *ఈ సప్తమాతృకలు సిద్ధంగా ఉంటారు.*

 *వీరిలో ఒకరైన వారాహి విశేషాలు...*

వరాహుని స్త్రీతత్వం;
పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుని సంహరించి, భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి.
 *ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు.*
దేవీ భాగవతం, మార్కండేయ పురాణం, వరాహ పురాణం వంటి పురాణాలలో ఈమె ప్రసక్తి కనిపిస్తుంది. 
ఆయా పురాణాలలో అంధకాసురుడు, రక్తబీజుడు, శుంభనిశుంభులు వంటి *రాక్షసులను సంహరించడంలో ఆమె పాత్ర సుస్పష్టంగా కనిపిస్తుంది.*

*రూపం*

*వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది.*
 ఈమె శరీరఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు. 
*సాధారణంగా ఈ తల్లి వరాహ ముఖంతో, ఎనిమిది చేతులతో కనిపిస్తుంది.* అభయవరద హస్తాలతో... శంఖము, పాశము, హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది. 
*గుర్రము, సింహము, పాము, దున్నపోతు వంటి* *వివిధ వాహనాల మీద*
 *ఈ తల్లి సంచరిస్తుంది.*

*ఆరాధన*

*తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహిమాత.* అందుకే ఈమెను రాత్రివేళల్లో పూజించడం కద్దు.
*వారాహిమాత ముఖ్య దేవతగా ప్రతిష్టించిన కొన్ని ఆలయాలలో దర్శనం సైతం రాత్రివేళల్లోనో, తెల్లవారుజామునో మాత్రమే ఉంటుంది.*
 దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి (ఒడిశా), వారణాసి, మైలాపుర్లలో ఉన్న ఈమె ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువ.

*సైన్యాధ్యక్షురాలు*

*లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు.* అందుకే ఈమె ప్రస్తావన లలితాసహస్రనామంలో కూడా కనిపిస్తుంది.
ఆ లలితాదేవి తరఫున పోరాడేందుకే కాదు, *భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తుంది వారాహి.* *ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయనీ, శత్రుభయం ఉండదనీ, జ్ఞానం సిద్ధిస్తుందనీ, కుండలినీ శక్తి జాగృతమవుతుందనీ... తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం.*
 
వారాహిదేవి పేర ఉన్న మూలమంత్రాలను, 
*అష్టోత్తరాలనూ పఠిస్తే సకలజయాలూ సిద్ధిస్తాయన్నది భక్తులకు అనుభవమయ్యే విషయం.*

Wednesday, 30 June 2021

శ్రీ సుందరరాజస్వామివారి అవతార మహోవాలూ..శాస్త్రోక్తంగా అభిషేకం...


                     
*తిరుపతి,2021జూన్ 30

తిరుచానూరు  శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందర రాజస్వామివారి అవతార మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు బుధవారం  స్వామి, అమ్మ‌వార్ల‌కు అభిషేకం నిర్వ‌హించారు. కోవిడ్ - 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా ఈ ఉత్స‌వాన్ని నిర్వ‌హించారు. 

ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 2.30 నుండి 4 గంట‌ల వ‌ర‌కు
శ్రీ కృష్ణస్వామి ముఖమండపంలో
శ్రీ సుందరరాజస్వామివారి ఉత్స‌వ‌ర్ల‌కు తిరుమంజనం నిర్వహించారు. ఉత్సవర్లకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు.  సాయంత్రం శ్రీ సుంద‌ర‌రాజ‌స్వామివారికి ఊంజల్‌ సేవ నిర్వ‌హించ‌నున్నారు.

        ఈ కార్య‌క్ర‌మంలో డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి క‌స్తూరి బాయి, ఏఈవో శ్రీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, సూప‌రింటెండెంట్ శ్రీమ‌తి మ‌ల్లిశ్వ‌రి, ఆల‌య అర్చ‌కులు శ్రీ బాబుస్వామి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ రాజేష్‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.
----------------------------------------------------------------

అవినీతి సిబ్బంది పై ఎస్.పి.సింధుశర్మ కన్నేర్ర.. ముగ్గురు ఎస్.ఐ.లపై వేటు...

జగత్యాల ఎస్పీ సింధుశర్మ అవినీతి సిబ్బందిపై గురి పెట్టారు. వరుస దాడులతో జగిత్యాల ఎస్పీ సింధూ శర్మ క్షేత్ర స్థాయి సిబ్బందిపై క్రమ శిక్షణా చర్యలు తీసుకోవడం ఆరంభించారు. ఇటీవల కాలంలో జగిత్యాల టౌన్ ఎస్ఐ శివకృష్ణ, కథలాపూర్ ఎస్ఐ పృథ్వీథర్ గౌడ్, కానిస్టేబుల్ రమేష్‌లు లంచం తీసుకుంటూ పోలీసులు ఏసీబీకి చిక్కారు. దీంతో, అవినీతికి పాల్పడుతున్న పోలీసుల గురించి ఆరా తీయించిన ఎస్పీ.. వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం ప్రారంభించారు.

మంగళవారం రాత్రి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పని చేస్తున్న 8 మంది కానిస్టేబుళ్లను ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్డ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయగా, బుధవారం ముగ్గురు ఎస్‌ఐలను అటాచ్డ్ చేశారు. అయితే, జిల్లా పోలీసు యంత్రాంగంలో అవినీతి తీవ్రంగా పెరిగిపోయిందన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలోనే ఏసీబీ వరుస దాడులు అధికారులను అలర్ట్ చేశాయి. దీంతో, ఎస్పీ సింధూ శర్మ అవినీతికి పాల్పడుతున్న పోలీసుల డాటా సేకరించేందుకు స్పెషల్ టీంలను రంగంలోకి దింపారు.ఆమె లక్ష్యం నేరువేరుతుందా లేక ఆమె ముక్కుసూటి తనానికి బదిలీ బహుమతి దొరుకుతుందో వేచి చూడాలి..


Thursday, 24 June 2021

సీపీఐ రామకృష్ణగారు నిజమైన కమ్యూనిస్టులా ఆలోచించండి - శైలజా చరణ్ రెడ్డి



ఉద్యోగాలు ఇవ్వమని అడిగితే అరెస్ట్‌లు చేస్తారా..? సీఎం వైఎస్‌ జగన్‌కు సీపీఐ రామకృష్ణ లేఖ పై స్పందిస్తూ వైఎస్ఆర్ సీపీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మరియు రీజనల్ కోఆర్డినేటర్ పూతలపట్టు నియోజకవర్గ ఇంచార్జ్ శైలజ రెడ్డి సీపీఐ రామకృష్ణగారు నిజమైన  కమ్యూనిస్టులా ఆలోచించండి అని హితవు పలికారు
విద్యార్ధులు, నిరుద్యోగుల పట్ల మీకున్న చిత్తశుద్దికి ధన్యవాదాలు.

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు..
విద్యార్ధులు, నిరుద్యోగులపై మీకెందుకు ప్రేమ లేదని ప్రశ్నించారు

వారి భవిష్యత్తు గురించి మీరెందుకు ఆందోళన చెందలేదు..?

2014 -19 మధ్య 9 నోటిఫికేషన్లే ఇచ్చి..
216 పోస్టులే ఉన్నాయని చెబితే..
చంద్రబాబును నిలదీయాలని మీకెందుకు అనిపించలేదు..?
రామకృష్ణ గారు ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐవైఎఫ్‌ వాళ్లని ..
రోడ్డు మీదకు తీసుకొచ్చి నినాదాలు చేయించడం కాదు సార్‌..!!
సీఎం జగన్‌ గారు ఎంత చిత్తశుద్దితో పని చేస్తున్నారో చూడండి.
వచ్చిన రెండేళ్లలో ఆరు లక్షల ఉద్యోగాలు ఇవ్వడమే కాదు..
జాబ్ క్యాలండర్ ద్వారా 10, 143 ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్దమయ్యారు..?
14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు..
జాబ్ క్యాలండర్  అనే ఆలోచన ఎందుకు చేయలేకపోయారు..?
ఎవరి హయాంలో ప్రజలకు మేలు జరుగుతుందో...నిజమైన  కమ్యూనిస్టులా ఆలోచించండి అని శైలజా చరణ్ రెడ్డి సూచించారు