Tuesday, 31 March 2020

నిబంధనలాసడలించారు సరే... రాజుగారని కరోనా గౌరవించేనా....



జర్మనీలోని ఆల్పైన్ రిసార్ట్ పట్టణంలోని ఒక హోటల్‌లో 64 సంవత్సరాల థాయ్‌లాండ్‌ రాజుకు ఆయన పరివారానికి విడిదిగా మారింది.. మహా వజీరాలోంగ్‌కార్న్ తనను తాను కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా ఐసోలేషన్కి ఆ హోటల్ ను ఎంచుకున్నాడు..అంతవరకు బాగానే వున్నా ఆయన  20 మంది మహిళలతో పాటు నౌకర్లు..చాకర్లతో  అక్కడ బసచేయడం విమర్శలకు తావిస్తోంది..

లాక్డౌన్ నిబంధనలు ఉన్నప్పటికీ బవేరియాలోని మొత్తం నాలుగు నక్షత్రాల గ్రాండ్ హోటల్ సోన్నెన్‌బిచ్ల్‌ను బుక్ చేసుకోవడానికి కింగ్ రామా ఎక్స్ అని పిలువబడే మహా వజీరాలాంగ్‌కార్న్‌కు అక్కడి ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇవ్వడం గమనార్హం..

రాయల్ పార్టీని ‘కూర్పులో మార్పు లేని సజాతీయ సమూహం’ గా భావించారు, అంటే హోటల్‌ను బస చేసిన కాలానికి నివాస గృహంగా సౌత్ జర్మనీ ప్రభుత్వం భావిస్తుందని వెల్లడించగా ప్రజలకేనా నిబంధనలు.. రాజులకు ఆవసరం లేదా అంటూ నెటిజన్లు రకరకాలుగా విమర్శలు నూరుతున్నారు..

No comments:

Post a Comment