Wednesday, 27 July 2022

భారత్‌ ఎంత గొప్పదో చెప్పడానికి భగవద్గీత ఒక్కటి చాలు. :సి.జె.ఐ..ఎన్.వి.రమణ

*న్యూఢిల్లీ*

_*కాలాలకు అతీతం భగవద్గీత..*_

*భగవద్గీత పఠనం అంటే అన్ని గ్రంథాలనూ చదవడంతో సమానమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పేర్కొన్నారు.* 

★ దీన్నుంచి ఏ తరం వారైనా సమాధానాలు పొందొచ్చని అభిప్రాయపడ్డారు. 

★ భగవద్గీతను మహాత్మాగాంధీ అమ్మగా భావించారంటే దానికున్న శక్తిని గుర్తించవచ్చని అన్నారు. 

★ ‘రాజస్థాన్‌ పత్రిక’ ప్రధాన సంపాదకులు గులాబ్‌చంద్‌ కొఠారీ రాసిన ‘ది గీత విజ్ఞాన ఉపనిషత్‌’ పుస్తకాన్ని సీజేఐ మంగళవారం సాయంత్రం దిల్లీలో లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాతో కలిసి ఆవిష్కరించారు. 

★ ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ స్వతంత్ర జర్నలిజం ప్రజాస్వామ్యానికి వెన్నెముక అని, పాత్రికేయులే ప్రజల కళ్లు, చెవులని అభివర్ణించారు. 

★ వాస్తవాలను బయటపెట్టడం మీడియా సంస్థల బాధ్యత అని పేర్కొన్నారు.

★ భారతీయ సామాజిక పరిస్థితుల్లో పత్రికల్లో ప్రచురితమైనదంతా నిజమేనని నమ్ముతారు కాబట్టి మీడియా నిజాయతీగా పాత్రికేయ వృత్తికే కట్టుబడి ఉండాలని అన్నారు. 

★ భారత్‌ పురాణాలకు నిలయం. ఈ ఆధునిక యుగంలోనూ మన దేశం ఆధ్యాత్మిక కేంద్రంగా కొనసాగుతోంది. 

★ భారత్‌ ఎంత గొప్పదో చెప్పడానికి భగవద్గీత ఒక్కటి చాలు. 

★ _*‘అనుమానాలు వెంటాడినప్పుడు, నిరుత్సాహం అలుముకున్నప్పుడు, విశ్వాసంలో ఒక్క వెలుగురేఖ కూడా కనిపించనప్పుడు నేను భగవద్గీతలో నాకు సౌకర్యవంతమైన శ్లోకాన్ని చదివేవాడ్ని. మనసులో వెంటనే ఆనందం వికసించేది..’*_ అని మహాత్మాగాంధీయే చెప్పారు. 

★ గీత వెనుక ఉన్న సిద్ధాంతం కాలాలకు అతీతం. 

★ ధర్మ, కర్మమే గీతా సారాంశం. 

★ గీతా బోధన మతాలు, సమయం, వయసుకు అతీతం.

★ నిజమైన మతానికి పునాది కరుణ, ధర్మమే. 

★ ఆధునిక ప్రపంచంలో మొత్తం సమాచారం మన ముందు ఉంటోంది. 

★ అయితే దాన్ని నైతిక విలువలతో ఉపయోగించుకోవాలి.

★ ఆ విలువలే మనల్ని పరిస్థితులతో సంబంధం లేకుండా సరైన దారిలో నడిచేలా నిర్దేశం చేస్తాయి. 

★ అలాంటి విలువలను గీత నేర్పుతుంది. 

★ దాన్ని సూక్ష్మంగా అధ్యయనం చేసేవారు తప్పకుండా వర్తమాన అర్థాలను గ్రహిస్తారు.

★ అందుకే ఎన్నో ఉద్యమాలకు, నాయకులకు భగవద్గీత స్ఫూర్తి. 

★ గీతలో చెప్పిన సేవా సిద్ధాంతం ద్వారానే మహాత్మాగాంధీ స్ఫూర్తి పొందారు.

ఇది మానవజాతికి అందుబాటులో ఉన్న శాశ్వతజ్ఞానం.

రాజస్థాన్‌ పత్రిక ప్రాంతీయ భాషలకే పరిమితం కావడాన్ని అభినందిస్తున్నా.  భారతీయ భాషలను ప్రోత్సహించడం నా మనసుకు నచ్చిన అంశం. వాటికి తగిన గౌరవం ఇవ్వాలి. అలాగే యువతను మాతృభాషల్లోనే ఆలోచించి నేర్చుకొనేలా ప్రోత్సహించాలి. అప్పుడే వారు అత్యున్నత స్థానానికి చేరడానికి వీలవుతుంది’’*_ అని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పేర్కొన్నారు. 
భగవద్గీత మనకు స్ఫూర్తినిచ్చి సరైన మార్గంలో నడిపిస్తుందని లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా అన్నారు. 
మన పనితో ఎవరికీ ఇబ్బంది కలిగించకూడదన్నదే ప్రతి ధర్మం సిద్ధాంతమని, రాజ్యాంగ నిర్మాతలు ధర్మం ఆధారంగానే రాజ్యాంగాన్ని రచించారని చెప్పారు. 
ఈ కార్యక్రమంలో గులాబ్‌చంద్‌ కొఠారీ, కేంద్ర మంత్రులు గజేంద్రసింగ్‌ షెకావత్‌, మీనాక్షి లేఖి, ఎంపీ రఘురామకృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు.*

Monday, 25 July 2022

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికార యంత్రాంగం సమన్వయంతో పటిష్టమైన చర్యలు : జిల్లా కలెక్టర్లతో మంత్రి తన్నీరు హరీష్ రావు.


ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికార యంత్రాంగం సమన్వయంతో పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సోమవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులతో సీజనల్ వ్యాధుల నియంత్రణ, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి వర్యులు మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాలలో పారిశుద్ధ్య నిర్వహణలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, రహదారులు, మురుగు కాలువలు, నివాస ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి విషజ్వరాలు ప్రబలకుండా పురపాలక, పంచాయతీరాజ్, సంబంధిత శాఖల సమన్వయంతో అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ కార్యక్రమం చేపట్టి ప్రజలను భాగస్వామ్యులను చేయడమే కాకుండా కార్యక్రమ అవశ్యతను వివరించాలని, ప్రతి శుక్రవారం గ్రామాలలో, ఆదివారం పట్టణాలలో డ్రై డే పాటించే విధంగా కార్యచరణ రూపొందించాలని, దోమల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, డెంగ్యూ, మలేరియా కేసులను ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స చేయడానికి అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నామని, మందులు ఆసుపత్రులలో అందుబాటులో ఉన్నాయని, ప్రభుత్వ ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకునే విధంగా విస్తృత ప్రచారం చేయాలని తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బూస్టర్ డోసు అందరికీ అందే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. రెసిడెన్షియల్ పాఠశాలలు, గురుకులాలు, కస్తూరిభా విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలలలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందే విధంగా కలెక్టర్లు, ఉన్నతాధికారులు పర్యవేక్షించాలని, పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యం కల్పించాలని, ఆగస్టు మాసం నాటికి ప్రతి విద్యా సంస్థలో ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ శిబిరాలు ఏర్పాటు చేసి 12-17 వయస్సు గల విద్యార్థులకు వంద శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు. మురికి కాలువలను పరిశుభ్రం చేయాలని, మిషన్ భగీరథ ట్యాంకులను శుభ్రం చేయాలని, పైప్ లైన్ లీకేజీలను అరికట్టాలని, వసతి గృహాలు, పాఠశాలలకు మిషన్ భగీరథ త్రాగునీటిని అందించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కాచిన చలార్చి వడపోసిన నీటిని త్రాగే విధంగా ప్రచారం చేయాలని, అధికారులు తరచూ వసతి గృహాలను ఆకస్మిక తనిఖీ నిర్వహించాలని, ప్రభుత్వ వసతి గృహాలలో ఉన్న పాత బియ్యం నిల్వల స్థానంలో నూతన బియ్యం సరఫరా చేస్తున్నామని, వాటిని వినియోగించు కోవాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టామని, వైద్య, ఆరోగ్య శాఖ, పంచాయతీ రాజ్, పురపాలక శాఖల అధికారులు సమన్వయంతో సీజనల్ వ్యాధులు, విషజ్వరాలు అధికంగా నమోదయ్యే ప్రాంతాలను గుర్తించి నియంత్రణ దిశగా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమైన మందులను అందించడం జరుగుతుందని, విషజ్వరాల అనుమానితులకు పరీక్షలు నిర్వహించి తగు చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.

అప్పు ఇప్పుడు దేశానికి గోప్ప...

**రాష్ట్రాల వారీగా అప్పులు**

అప్పుచేసి పప్పుకూడు తినరా ఓ నరుడా 

గోప్పనీతి వాక్యమిదే వినరా పామరుడా

అని అరవై ఏళ్ళ క్రితం పింగళి ఒక పాట రాశారు. ఆపాట మన అధినేతలు తెగ ఫాలో ఐపోతున్నారు...రాష్ట్రాల అప్పులు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది...

తమిళనాడు :  6,59,868 కోట్లు
ఉత్తరప్రదేశ్ :   6,53,307 కోట్లు
మహారాష్ట్ర   :   6,08,999 కోట్లు
పశ్చిమ బెంగాల్  :   5,62,697 కోట్లు
రాజస్థాన్  :    4,77,177 కోట్లు
కర్ణాటక  :    4,62,832 కోట్లు
గుజరాత్  :    4,02,785 కోట్లు
ఆంధ్రప్రదేశ్  :    3,98,903 కోట్లు
కేరళ  :    3,35,989  కోట్లు
మధ్యప్రదేశ్  :    3,17,736 కోట్లు
తెలంగాణా  :    3,12,191 కోట్లు
హర్యానా  :    2,79,022 కోట్లు
పంజాబ్  :    2,82,864 కోట్లు
బీహార్  :    2,46,413 కోట్లు
ఒడిషా  :   1,67,205 కోట్లు
జార్ఖండ్ :    1,17,789 కోట్లు
ఛత్తీస్ గఢ్  :   1,14,200 కోట్లు
అస్సాం  :    1,07,719 కోట్లు
ఉత్తరాఖండ్  :    84,288 కోట్లు
హిమాచల్ ప్రదేశ్  :    74,686 కోట్లు
గోవా  :    28,509 కోట్లు
త్రిపుర :  23,624  కోట్లు
మేఘాలయ : 15,125 కోట్లు
నాగాలాండ్ :  15,125 కోట్లు
అరుణాచల్ ప్రదేశ్ :  15, 122 కోట్లు
మణిపూర్:  13,510 కోట్లు
మిజోరాం:  11,830 కోట్లు
సిక్కిం:  11,285 కోట్లు

Wednesday, 20 July 2022

ఆ ఇంట్లో అందరికీ పసిడి పతాకాలే..

విఖ్యాత జ్యోతిష పండితులు ,శృంగేరీ శారదా పీఠం ఆస్థాన పండితులు శ్రీ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి కుటుంబం  అంతా బంగారు పతకాలతో నిండిపోయింది..
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2003-2005 బ్యాచ్ లో శ్రీ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారికి
జ్యోతిషం అష్టకవర్గం షబ్బలాలు సెకండ్ ఇయర్ థర్డ్ పేపర్ లో అత్యధిక మార్కులు సాధించినందుకు గోల్డ్ మెడల్ వచ్చింది.
2006-20011 పీహెచ్డీ బ్యాచ్
2011 పిహెచ్డీలో రెండవ గోల్డ్ మెడలు వచ్చింది
శంకరమంచి సావిత్రి (శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారి భార్య) 2010-2012 బ్యాచ్
ఎం.ఏ జ్యోతిషం ఆల్ పేపర్స్ లో టాపర్ గోల్డ్ మెడల్
2014లో సాధించారు.
శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారి కుమారుడు శంకరమంచి శివ 2012-2014 బ్యాచ్
2017లో  ఎం.ఏ జ్యోతిషం ఆల్ పేపర్స్ లో టాపర్ గోల్డ్ మెడల్ సాధించారు.
శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారి కూతురు శంకరమంచి లక్ష్మి శ్రీ 2015-2017 బ్యాచ్
2022 లో  ఎం.ఏ జ్యోతిషం ఆల్ పేపర్స్ లో టాపర్ గోల్డ్ మెడల్ సాధించారు.

ఉత్తమ గురువు దొరికితే... ఉన్నత లక్ష్యం నల్లేరుపై నడకే.... శ్రీజాసాధినేని.

*హైదరాబాద్*

_*సరైన గురువుల శిక్షణ వల్లే స్వర్ణ పతకం సాధించగలిగాను*_

*- సినీ టీవీ నటి, రచయిత్రి డా.శ్రీజ సాదినేని*

సరైన గురువులు దొరికితే స్వర్ణ పతకం మాత్రమే కాదు ఏదైనా సాధించ వచ్చు అన్నారు సినీ టీవీ నటి, రచయిత్రి డా శ్రీజ సాదినేని.పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన 15వ స్నాతకోత్సవంలో 2017-19 సం.కి గానూ రంగస్థల కళల శాఖలో గోల్డ్ మెడల్ అందుకున్న సందర్భంగా డా శ్రీజ మీడియాతో ముచ్చటించారు.ద్రోణాచార్యుడి వంటి గురువు వల్లనే అర్జునుడు గొప్ప విలుకాడుగా పేరు గాంచాడు. ఇది కేవలం ఒక్క ఉదాహరణ మాత్రమే. మంచి గురువు దొరికితే విద్య నేర్చుకోవాలి అనుకునే ప్రతి విద్యార్థీ అత్యున్నత శిఖరాలను అందుకుంటాడు.
అలాగే తెలుగు విశ్వవిద్యాలయంలో డా.పద్మప్రియ, డా.కోట్ల హనుమంతరావు, శ్రీమతి కళ్యాణి,శ్రీ మల్లాది గోపాలకృష్ణ, శ్రీ రాయల హరిశ్చంద్ర, శ్రీ ఆంటోనీ రాజ్.. ఇలా మంచి మంచి గురువులు ఉండబట్టే  థియరీ, ప్రాక్టికల్స్ అన్నిట్లోనూ ఉత్తీర్ణత సాధించి స్వర్ణ పతకం పొందగలిగానని తన గురువులకు పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను అని తన గురుభక్తిని చాటుకున్నారు.
యాక్టింగ్, యాంకరింగ్, న్యూస్ రీడింగ్, డబ్బింగ్,స్క్రిప్ట్ రైటింగ్, డైరెక్షన్ వంటి కోర్సులలో తాను కూడా వెయ్యిమందికి పైగా శిష్యులకు  శిక్షణ ఇచ్చినా తమ గురువులను మాత్రం ఎప్పటికీ మర్చిపోనని తమ శిష్యుల అభ్యున్నతిని కోరుకునే గురువులు దొరికితే ఎవరూ వదులుకో వద్దని తెలిపారు. 
నాటకరంగం నుండి సినీ రంగంలో రచయితగా పూర్తిస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నానని, అతిత్వరలో మంచి ప్రాజెక్టుతో వెండి తెరపైకి వెళ్లనున్నట్లు తన భవిష్యత్ ప్రణాళికను గురించి డా.శ్రీజ తెలియజేశారు. 
ఈ సందర్భంగా తనను అభినందించిన ప్రముఖులకు అందరికీ ధన్యవాదములు తెలిపారు.

Tuesday, 19 July 2022

గోదావరి వరద బాధితులలో ధైర్యం నింపిన ఖమ్మం కలేక్టర్, సి.పి.లు.... ప్రభుత్త్వ సాయం పై భరోసా...


భద్రాచలం : వరద ప్రభావిత ప్రాంతాలు, పునరావాస కేంద్రాలను ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, ఖమ్మం పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్ తో కలిసి పరిశీలించి, బాధితులకు ధైర్యం తో పాటు, ప్రభుత్వ సహాయం పై భరోసా కల్పించారు. బూర్గంపహడ్ మండలం, లక్ష్మీపురం గ్రామ మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాన్ని కలెక్టర్, పోలీస్ కమీషనర్ లు పరిశీలించారు. 230 కుటుంబాలు ఆశ్రయం పొందుతున్నట్లు, వారికి భోజనం, వసతి కల్పన చేసినట్లు వారు తెలిపారు. నిత్యావసర వస్తువులు పప్పు, ఉల్లిపాయలు, కారం, పసుపు, నూనె తదితరాలు అందజేస్తున్నట్లు వారు అన్నారు. కుటుంబానికి 25 కిలోల బియ్యం ఇస్తున్నట్లు , ప్రతి బాధిత కుటుంబానికి తక్షణ సహాయం క్రింద రూ. 10 వేలు ఇవ్వనున్నట్లు వారు తెలిపారు. ముంపు బాధితులు ఈ సందర్భంగా తమ ఇళ్ల వద్ద కరంట్, త్రాగునీరు లేదని, పారిశుద్ధ్యం చేయాలని కోరగా, కరంట్ ఉంది కాని భద్రత దృష్ట్యా ఇవ్వడం లేదని, తడి ఆరి ఇబ్బంది లేదన్నాక కరంట్ సరఫరా పునరుద్ధరణ చేస్తామని, పైపులు పాడై, బురద చేరడంతో త్రాగునీటి సరఫరా కు అంతరాయం కలుగుతుందని, మురికినీరు వస్తున్నట్లు, ట్యాoకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నట్లు, నీటిని వేడిచేసి చల్లార్చి త్రాగాలని అన్నారు. పారిశుద్ధ్య చర్యలు ముమ్మరంగా చేపడుతున్నట్లు, ఒకటి రెండ్రోజుల్లో అంతా శుభ్రం కానున్నట్లు వారు తెలిపారు. అధికారులు అనుమతి ఇచ్చేవరకు పునరావాస కేంద్రాల్లోనే ఉండాలని వారు బాధితులను కోరారు.అనంతరం ఖమ్మం కలెక్టర్ నాగినేనిప్రోలు గ్రామానికి వెళ్లి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబాల ఖాతా సంఖ్య, వివరాలు నమోదు చేయాలని, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సహాయం అందుతుందని, ఎవరూ ఆందోళన చెందవద్దని కలెక్టర్ అన్నారు. గ్రామంలో ఆయన పర్యటించి, ముంపు ఇళ్లను పరిశీలించారు. వరదతో నష్ట పోయిన ప్రతి ఇంటికి సహాయం చేస్తామన్నారు. వరద ఎంతమేర వచ్చింది, ఏ ఏ ప్రదేశాలు చాలా ప్రభావితం అయ్యాయి అడిగి తెలుసుకుని, కలెక్టర్ అంతా స్వయంగా కాలినడకన తిరుగుతూ పరిశీలించారు. మిషన్ భగీరథ నల్లా నీటిని పరిశీలించారు. నీరు తప్పకుండా వేడిచేసి, చల్లార్చిన తర్వాత త్రాగాలన్నారు. అనంతరం మోరాంచపల్లి బంజార గ్రామం స్టెల్లా మేరీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించి, వివరాల నమోదు గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతి బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుండి సహాయం అందుతుందని ఈ సందర్భంగా వారికి భరోసా ఇచ్చారు. అనంతరం మోతేపట్టినగర్ గ్రామానికి వెళుతూ, మార్గ మధ్యలో అశ్వాపురం మండలం గరిఒడ్డు గ్రామం వద్ద కల్వర్టు దగ్గర వరద పరిస్థితిని పరిశీలించారు. రోడ్డుపై బురద మేట వేయడంతో వాహనాలు జారుతున్నట్లు, ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉండడంతో, వెంటనే ట్యాoకర్ల ద్వారా రోడ్డుపై ఉన్న బురద మేట ను తొలగించి, శుభ్రం చేయించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ బూర్గంపహాడ్ మండలం మోతెపట్టినగర్ గ్రామంలో పర్యటించి ముంపు ఇళ్లను పరిశీలించారు. అధైర్య పడవద్దని, ప్రభుత్వం ద్వారా అన్ని విధాల సహాయం అందిస్తామన్నారు. ప్రతి సంవత్సరం ముంపు భయం లేకుండా, లోతట్టు ప్రాంతాల వారికి శాశ్వత ప్రాతిపదికన ఇబ్బందులు లేకుండా ప్రణాళిక చేస్తామన్నారు. అనంతరం తాళ్లగొమ్మూరు పంచాయతీ లోని శ్రీ సత్యనారాయణ స్వామి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని ఖమ్మం కలెక్టర్ తనిఖీ చేశారు. బాధితులకు అందుతున్న సహాయం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతి కుటుంబానికి బియ్యం, నిత్యావసర సరుకులు అందజేయాలన్నారు. ముంపు ప్రాంతాల్లో పరిస్థితులు చక్కబడే వరకు పునరావాస కేంద్రాల్లో భోజన, వసతులు కల్పించాలని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
     
     కలెక్టర్ పర్యటన సందర్భంగా ఖమ్మం ఆర్డీవో రవీంద్రనాథ్, జెడ్పి సిఇఓ అప్పారావు, డిపివో హరిప్రసాద్, కొత్తగూడెం డిఇఓ సోమశేఖర శర్మ, బూర్గంపహాడ్ ఎంపిడివో వివేక్ రామ్, తహసీల్దార్ భగవాన్, జెడ్పిటిసి శ్రీలత, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు.

Sunday, 17 July 2022

శ్రీవారిఆలయంలోశాస్త్రోక్తంగాఆణివారఆస్థానంవార్షిక లెక్కలు ప్రారంభం...


తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం నాడు సాలకట్ల ఆణివార ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. పెద్దజీయర్‌స్వామి,  చిన్నజీయ‌ర్‌స్వామి, టిటిడి ఈవో ఎ.వి.ధ‌ర్మారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఈవో ఎవి.ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ సాధారణంగా ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతినాడు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తార‌ని చెప్పారు. అయితే సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో ఆణివార ఆస్థానం అని పేరు వ‌చ్చింద‌న్నారు. పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు అయిన ఈ ఆణివార ఆస్థానం పర్వదినంనాటి నుండి టిటిడి వారి ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవ‌ని తెలిపారు. టిటిడి ధర్మకర్తల మండలి ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్‌ను మార్చి - ఏప్రిల్‌ నెలలకు మార్చిన‌ట్టు వివ‌రించారు. సాయంత్రం 6 గంటలకు పుష్ప‌ప‌ల్ల‌కీపై స్వామి, అమ్మ‌వారు నాలుగు మాడ వీధుల్లో భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తార‌ని తెలిపారు. ముందుగా ఉదయం  బంగారువాకిలి ముందు గల ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయదేవేరులతో కూడిన శ్రీ మలయప్పస్వామివారు గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేంచేపు చేశారు. మరో పీఠంపై స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడైన శ్రీ విష్వక్సేనులవారు దక్షిణాభిముఖంగా వేంచేపు చేశారు. అనంతరం ఆనందనిలయంలోని మూలవిరాట్టుకు, బంగారువాకిలి వద్ద ఆస్థానంలో వేంచేపు చేసిన ఉత్సవమూర్తులకు ప్రత్యేకపూజలు, ప్రసాదాలు నివేదించారు. అనంతరం  పెద్దజీయర్‌స్వామి పెద్ద వెండితట్టలో ఆరు పెద్ద పట్టువస్త్రాలను తలపై పెట్టుకొని మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా విచ్చేశారు. శ
 చిన్నజీయ‌ర్‌స్వామి, ఈవో ఇతర ఉన్నతాధికారులు వెంట వచ్చారు. నాలుగు పట్టు వస్త్రాలను మూలవిరాట్టుకు అలంకరించారు. మిగిలిన రెండు వస్త్రాలలో ఒకటి మలయప్పస్వామివారికి, మరొకటి విష్వక్సేనులవారికి అలంకరించారు.  తదనంతరం శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు తమ తలకు శ్రీవారి పాదవస్త్రంతో ''పరివట్టం''(చిన్న పట్టుగుడ్డ) కట్టుకొని స్వామివారి ద్వారా బియ్యపు దక్షిణ స్వీకరించి  'నిత్యైశ్వర్యోభవ' అని స్వామివారిని ఆశీర్వదించారు. ఆ తరువాత అర్చకులు శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగారికి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయంగారికి, టిటిడి తరఫున కార్యనిర్వహణాధికారి శ్రీ ఎవి.ధర్మారెడ్డి గారికి 'లచ్చన' అను తాళపు చెవి గుత్తిని వరుస క్రమంలో కుడిచేతికి తగిలించారు. హారతి, చందనం, తాంబూలం, తీర్థం, శఠారి మర్యాదలు చేసిన అనంతరం ఆ తాళపు చెవి గుత్తిని శ్రీవారి పాదాలచెంత ఉంచ‌డంతో ఆణివార ఆస్థానం ముగిసింది.
శ్రీరంగం నుండి తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పణ చేశారు. ఆణివార ఆస్థానం పర్వదినం సందర్భంగా తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీరంగం శ్రీ రంగ‌నాథ‌స్వామివారి ఆల‌య అధికారులు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

        ఉదయం శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం పక్కన గల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి మఠంలో శ్రీవారి సారెకు ప్రత్యేక పూజలు నిర్వహించి, మఠం నుండి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయంలోకి తీసుకెళ్లారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

గోదావరి పరివహకంలో క్లౌడ్ బరెస్టు.. విదేశీ కుట్రల అవకాశం లేకపోలేదు.. గోదావరి వరదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమానం..


గోదావరి పరివహకంలో క్లౌడ్ బరెస్టు..         విదేశీ కుట్రల అవకాశం లేకపోలేదు..     గోదావరి వరదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమానం వ్యక్తం చేశారు.. గతంలో ఉత్తరాఖండ్ లడ్డాక్ లలో జరిగిన సంఘటనలను ఆయన గుర్తచేశారు
గోదావరి వరద ముంపు ప్రాంతాల పర్యటనలో భాగంగా భద్రాచలం వచ్ఛిన ముఖ్యమంత్రి కేసీఆర్  గోదావరి బ్రిడ్జీపై నుండి గంగమ్మ తల్లికి పూజలు చేశారు అనంతరం, కరకట్టను పరిశీలించారు. 
అక్కడినుండి భద్రాచలం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి చేరుకున్న సీఎం  కేసీఆర్ ముంపు బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితులు, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అందుతున్న నిత్యావసరాలు, వైద్యం, ఇతర సౌకర్యాల గురించి సీఎం ఆరా తీశారు.  
బాధితులను పేరుపేరునా పలకరించారు. తమకు అన్నిరకాలుగా సహాయ, సహకారాలు అందుతున్నాయని, స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ అధికారులు తమను కంటికి రెప్పలా కాపాడుతున్నారని సీఎంకు బాధితులు వివరించారు. 
భారీ వర్షాలు, వరదలను లెక్కచేయకుండా తమను పరామర్శించడానికి వచ్చిన సీఎం  కేసీఆర్ ను కలసి వరద బాదితులు తమ బాదలు తెలిపారు.ప్ర‌మాదం ఇంకా త‌ప్పిపోలేదని, మ‌రో మూడు నెల‌లు వ‌ర్షాలు వ‌చ్చే అవ‌కాశం ఉందని, అంద‌రం కూడా అప్ర‌మ‌త్తంగా ఉండాలన్నారు.
వరదలు వచ్చిన ప్రతిసారీ భద్రాచలం ముంపునకు గురికావడం బాధాకరమని సీఎం అన్నారు. తరచుగా వరదల్లో మునిగిపోతున్న భద్రాచలం పట్టణ వాసుల కన్నీళ్లను తుడిచేందుకు శాశ్వత ప్రాతిపదికన కాలనీలు నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకోసం 1000కోట్ల రూపాయలు వెచ్ఛిస్తొమని పేర్కొన్నారు.వరద చేరని, అనువైన ఎత్తైన ప్రదేశాలను గుర్తించి, బాధితులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించి, కాలనీల నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ ను సీఎం శ్రీ కేసీఆర్ ఆదేశించారు. ముంపునుంది తమకు శాశ్వత ఉపశమనం దొరకుతుండటంతో వరద బాధితులు హర్షం వ్యక్తం చేశారు.మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి అధ్వర్యంలో కొత్త‌గూడెం, ఖ‌మ్మం క‌లెక్ట‌ర్లు గొప్ప‌గా ప‌ని చేసి ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకున్నందుకు వారిని ప్ర‌త్యేకంగా అభినందిస్తున్నాన‌ని కేసీఆర్ అన్నారు.

ఉజ్జయిని మహంకాళికి ఆషాఢ బోనాలు.. బోనం సమర్పించిన మంత్రి తలసాని..


ప్రతి ఏటా ఆషాఢ మాసంలో జరిగే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతర బోనాల జాతర. శివ సత్తులతో, పోతారాజుల నృత్యాలతో, బోనం ఎత్తిన మహిళలతో అంగరంగ వైభవంగా మొదలైంది దాదాపుగా #202  సంవత్సరల చరిత్ర కలిగిన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఆదివారం ఉదయం తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తొలి బోనం సమర్పించారు..  ఆలయం నిర్మాణంకు ప్రేరణ ఒక ఆర్మీ జవాన్.. సికింద్రాబాద్ నివాసి అయిన #సురటిఅప్పయ్య 1813 ప్రాంతాల్లో ఆర్మీలో డోలి బేరర్ గా పని చేసేవాడు. అతను బదిలీపై మధ్యప్రదేశ్ ఉజ్జయిని ప్రాంతానికి వెళ్ళాడు. ఆ సమయంలో కలరా వ్యాధి ప్రబలి వేలాది మంది చనిపోయారు అప్పుడు అప్పయ్య ఉజ్జయిని లోని మహంకాళి అమ్మవారిని  దర్శించుకున్నారు. ఆ ప్రాంతం నుంచి కలరా వ్యాధి ప్రారదొలితే సికింద్రాబాద్ లో అమ్మవారి విగ్రహం ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తాను అని మొక్కుకున్నాడు.  ఆయన కోరిక నెరవేరడం తో 1815లో ఇప్పుడు అమ్మవారు ఉన్న చోటునే అమ్మవారిని ఏర్పాటు  చేశారు. ఉజ్జయిని మహంకాళి గా నామకరణం చేశారు. ఆ ప్రాంతం అంత అప్పటి కాలంలో అడవి లాగా ఉండేది. ప్రక్కనే ఉన్న బావి మరమ్మతూ చేస్తుంటే అందులో శ్రీ మాణిక్యాలమ్మ విగ్రహం లభ్యమైంది. ఈ విగ్రహాన్ని అమ్మవారి కుడివైపున ప్రతిష్ట చేశారు.  అప్పటి నుంచి #సురటిఅప్పయ్య  కుటుంబ సభ్యులు ఆలయ ధర్మకర్తలుగా  వ్యవహరిస్తున్నారు.  1953లో దేవాదాయ ధర్మాదాయ శాఖా ఆలయాన్ని ఆధీనంలోకి తీసుకొని అభివృద్ధి కార్యక్రమాన్ని చేపడుతూ వస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటీ అంటే ఈ ఆలయం లో అమ్మవారి విగ్రహాన్ని #కట్టేవిగ్రహం. కట్టేతొ విగ్రహాన్ని నిర్మించారు. 
ఆలయ దర్శన వేళలు : 
ప్రతి రోజు 6am to 12pm
12pm నుంచి 4pm వరకు బ్రేక్
తిరిగి 4pm to 9pm

ప్రత్యేక రోజు మరియు బోనాల పండుగ రోజు ఉదయం 4.00 గంటలకు దర్శనం ప్రారంభము అవుతుంది.

#ఆలయచిరునామా : శ్రీ మహంకాళి ఆలయం, జనరల్ బజార్ , సికింద్రాబాద్ - 500003

#చేరుకునేమార్గాలు : 
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కేవలం 1.5 Kms దూరంలో మాత్రమే ఆలయం ఉంది.  ప్రతి 1 గంటకు ఫలక్ నామా స్టేషన్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు Mmts ట్రైన్ లు కలవు టికెట్ ధర 10/-

#బస్ రూట్ :
రాష్టంలో ఏ ప్రాంతం నుంచి అయిన MGBS బస్ స్టాండ్ కి చేరుకొని అక్కడి నుంచి ఈ ఆలయంకి కూడా చేరుకోవచ్చు. MGBS నుంచి 3 number bus వెళుతుంది. 
మెహిందీపట్నం నుంచి కూడా ఈ ఆలయం కు చేరుకోవచ్చు.  మెహిందీపట్నం నుంచి 5K, 5M , 49M బస్ లు బయలుదేరుతాయి. 
(From internet Desk)

Friday, 15 July 2022

ఉప్పోంగిన గోదావరి - తల్లడిల్లిన భద్రాద్రి


భద్రాచలంలో కొనసాగుతున్న గోదావరి వరద ఉదృతితో భద్రాద్రి పరివహకం తల్లడిల్లుతోంది. 48 గంటలవరకు బయటకు రావద్దని అధికారుల హెచ్ఛరికలతో ప్రజలు బిక్కుబిక్కుమంటూన్నారు.. వరద ముంపు ప్రాంతాల్లో అనివార్యంగా విద్యుత్ సరఫరా ఆపివేయడంతో కంటిమీద కునుకు లేని స్థితి. వరదల విషయం ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్న కెసిఆర్ భద్రాచలానికి రెస్యూటీం హెలికాప్టర్ లను పంపాలని తెలంగాణ సి.ఎస్.సోమేష్ కుమార్ ను ఆదేశించడంతో పాటు భద్రాచలం లో పరిస్థితులను మంత్రి పువ్వాడను అడిగి తెలుసుకుంన్నారు..
కాగా వరద ప్రారంభం నుండి భద్రాచలం లో బస చెసిన . రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పలు ప్రాంతాల్లో  స్వయంగా పరిశీలిస్తూ ముమ్మర సహాయక చర్యలను సమీక్షస్తున్నారు..ఈరోజు
మహబుబాబాద్ ఎంపీ మాళోత్ కవిత  పువ్వాడ ను కలిసి గోదావరి వరదల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.వరద ముప్పు నుండి బయటపడేందుకు మరో రెండు రోజులు పట్టే అవకాశం వున్నట్లు అధికారులు అంచనావేస్తున్నారు..
మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాలలో సహాయ పునరావాస చర్యలలో రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం చేసేందుకు భారత సైన్యానికి చెందిన 101 మందితో కూడిన బృందం పాల్గొంటున్నదని సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు వరద ప్రాంతాల్లో సహకరించాల్సిందిగా భారత సైన్యాన్నికోరామని సీఎస్ తెలిపారు. 

దీనికి స్పందనగా 68 మంది సభ్యుల పదాతిదళం, 10 మంది సభ్యుల వైద్య బృందం, 23 మంది సభ్యుల ఇంజనీరింగ్ బృందం సహాయచర్యల్లో పాల్గొనేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెళ్తున్నాయని వర్షాలు, వరదలు, పునరావాస, సహాయక చర్యలపై జరిపిన సమీక్ష సమావేశంలో సీఎస్ తెలిపారు.

సహాయ, పునరావాస చర్యల్లో పాల్గొనేందుకు పర్యాటక శాఖకు చెందిన ప్రత్యేక పడవలను సిబ్బందితో సహా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు పంపామని, అగ్నిమాపక విభాగానికి చెందిన 7 పడవలు సిద్ధంగా ఉన్నాయని, లైఫ్ జాకెట్లు కలిగిన 210 మంది ఈతగాళ్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నారని  సీఎస్ పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సహాయ, పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించడానికి సీనియర్ ఐఏఎస్, సింగరేణి కాలరీస్ ఎండి ఎం. శ్రీధర్ ను ప్రత్యేక అధికారిగా నియమించామని సీఎస్ అన్నారు. సింగరేణి సంస్థకు చెందిన యంత్రాంగాన్ని ఈ సహాయ, పునరావాస చర్యలకు ఉపయోగించాలని సీఎస్ ఆదేశించారు.
భద్రాద్రి జిల్లాతో పాటు ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో వరద పరిస్థితులపై సంబంధిత అధికారులు, ఆయా జిల్లాల కలెక్టర్లతో సీఎస్ నిరంతరం సమీక్షిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణనష్టం కలుగకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని సీఎస్ అధికారులను ఆదేశించారు.

Thursday, 14 July 2022

గోదావరి ప్రాభావిత 4 జిల్లాల కలెక్టర్లతో మంత్రి పువ్వాడ, సి.ఎస్. సోమేశ్ కుమార్ టెలీకాన్ఫరెన్స్..*

భద్రాచలం ; భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ గారు, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు గురువారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 
ఆయా జిల్లాల్లో పరిస్థితిని సమీక్షించారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో భద్రాద్రి కొత్తగూడెం నుండి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు, డీజీపీ మహేందర్ రెడ్డి గారు, సంబంధిత సీనియర్ అధికారులు పాల్గొన్నారు. 
ఈ టెలికాన్ఫరెన్స్‌ లో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ గారు మాట్లాడుతూ, గోదావరిలో నీరు ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నందున అన్ని ప్రభుత్వ విభాగాలు మరింత అప్రమత్తంగా ఉండి యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు ముమ్మరం చేసేలా అదనపు కంటింజెంట్‌ ప్లాన్‌ రూపొందించాలన్నారు.
వేగంగా విస్తరిస్తున్న గోదావరి నీటి ప్రవాహ ప్రమాద తీవ్రత వల్ల ఎదురయ్యే ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని, ఆయా జిల్లాల్లో కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు.
ప్రస్తుతం నీటి మట్టం 62 అడుగులకు చేరిందని రానున్న 24 గంటల్లో 75 నుండి 80 అడుగులకు వచ్చే అవకాశం ఉందని, అందుకు తగ్గట్టు భద్రాచలంలో 5వెల ఇసుక బస్తాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు.
ప్రస్తుతం ఎగువ నుండి 30లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకి వస్తుందని, రాగల 24 గంటల్లో అది మరింత పెరిగే ప్రమాదం లేకపోలేదని అన్నారు. 
అన్ని వైపుల, అన్ని రంగాల సహాయక చర్యలు చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం సిద్దంగా ఉందని, ఇప్పటికే లోతట్టు ప్రాంతాలను ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగిందన్నారు.
ప్రమాద తీవ్రత ఎర్పడనున్న ఇళ్ల ప్రజలను సైతం పునరావాస కేంద్రాలకు తరలించాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని, అవసరం అయితే మరిన్ని కేంద్రాలు పెంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు పంపిస్తామని వివరించారు.
గోదావరి పరివాహక ప్రాంతం జిల్లాల కలెక్టర్ లు అప్రమత్తంగా ఉండాలని, ప్రస్తుత వరద తీవ్రత వల్ల సద్యమైనంత మేరకు అస్థి నష్టం, ప్రాణ నష్టం జరుగకుండా చర్యలు చేపట్టాలని సూచించరు.
ముంపు ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకావాలని, భోజనం, వసతి సదుపాయాల కోసం నిధుల కొరత లేదని, పది వేల మందికైనా సరే ప్రభుత్వపరంగా ఆశ్రయం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గారు మాట్లాడుతూ... ముఖ్యమంత్రి  కే.చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు మానవ ప్రాణనష్టాన్ని అరికట్టేందుకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని ఆయా జిల్లా కలెక్టర్లకు సూచించారు. 
రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేయడంతో పాటు గోదావరి నది ఉధృతంగా ప్రవహించడంతో భద్రాచలం వద్ద రేపటికి నీటి మట్టం 70 అడుగులకు చేరే అవకాశం ఉందని అన్నారు. 
ఈ నేపథ్యంలో ముంపుకు గురయ్యే అన్ని లోతట్టు ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను ప్రత్యేక శిబిరాలకు తరలించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. 
ఇప్పటి వరకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రాణనష్టాన్ని అరికట్టడం పట్ల ఆయన అభినందనలు తెలిపారు 
జేసీబీలు, జనరేటర్లు, ఇసుక బస్తాలు, ఇతర సామాగ్రిని అదనపు పరిమాణంలో కొనుగోలు చేసి, వాటిని వ్యూహాత్మక పాయింట్లలో ఉంచాలని కలెక్టర్లను ఆదేశించారు. 
రాష్ట్ర ప్రధాన కార్యాలయం నుంచి వరద బాధిత జిల్లాలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు సహాయ, పునరావాసం కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.
ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీలుగా అదనపు బలగాలతో పాటు పడవలు, లైఫ్ జాకెట్లు తదితర పరికరాలను జిల్లాలకు పంపుతున్నట్లు డీజీపీ మహేందర్ రెడ్డిగారు తెలిపారు.
ఈ టెలికాన్ఫరెన్స్‌లో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ గారు, అదనపు డీజీలు జితేందర్‌ గారు, సంజయ్‌ జైన్‌ గారు, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా గారు, పీఆర్‌ అండ్‌ ఆర్‌డీ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా గారు, విధ్యుత్, రోడ్లు భవనాలు, ఇరిగేషన్‌ ఈఎన్‌సీలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Monday, 11 July 2022

వర్షాలు - వరదలపై ముఖ్యమంత్రి కెసిఆర్ సమీక్ష...గోదావరి వరద ఉదృతిపై నిరంతరం ఆరా...మంత్రులు - అధికారులు అప్రమత్తంగా వుండాలని ఆదేశాలు

రాష్ట్రంలో వానలు, వరదల పరిస్థితిపై ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఈ రోజు ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులతో ఫోన్లో మాట్లాడుతూ రక్షణ చర్యలపై సీఎం అదేశాలిస్తున్నారు.
అన్ని జిల్లాల అధికారులతో మాట్లాడుతూ సీఎం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
తక్షణ చర్యలపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. గోదావరి, గోదావరి ఉప నదుల్లో వరద పరిస్థితిని, ప్రవాహాన్ని గురించి ఆరా తీస్తున్నారు. ఎటువంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని సిఎం కేసిఆర్ మరోమారు స్పష్టం చేశారు.
ఈ సమీక్షా సమావేశంలో శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు శ్రీ దామోదర్ రావు, ఎమ్మెల్సీ శ్రీ కడియం శ్రీహరి, ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు శ్రీ రాజీవ్ శర్మ, ఎమ్మెల్యేలు శ్రీ దానం నాగేందర్, శ్రీ పైళ్ల శేఖర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్, డిజిపి శ్రీ మహేందర్ రెడ్డి, సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ ఎస్.నర్సింగ రావు, సీఎంఓ కార్యదర్శులు శ్రీ రాజశేఖర్ రెడ్డి, శ్రీమతి స్మితా సబర్వాల్, శ్రీ భూపాల్ రెడ్డి, సీఎం ఓఎస్డి శ్రీమతి ప్రియాంక వర్ఘీస్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణారావు, ఇరిగేషన్ శాఖ ఇఎన్సీ శ్రీ మురళీధర్, రాచకొండ పోలీస్ కమిషనర్ శ్రీ మహేశ్ భగవత్, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డిజి శ్రీ జితేందర్ తదితరులు పాల్గొన్నారు.

బ్లాస్ట్ ప్రూఫ్ ఇండేన్ గ్యాస్ సిలెండర్ ను ఆవిష్కరించిన మేయర్...


  వరంగల్ : బ్లాస్ట్ ప్రూఫ్ ఇండేన్ గ్యాస్ సిలెండర్ (10 కి.గ్రా) ను  నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి సోమవారం ప్రధాన కార్యాలయం లో ఆవిష్కరించారు.
  ఈ సందర్భంగా సంస్ధ ప్రతినిధులు మాట్లాడుతూ  ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్( ఐ.ఓ.సి)ఇటీవల నూతనం గా తయారు చేసిన బ్లాస్ట్ ప్రూఫ్, ట్రాస్పరెన్సు,తక్కువ బరువుతో అధునాతన వంట గది కి అనుగుణం గా ఉండేవిధంగా సిలెండర్ ను రూపొందించడం జరిగిందని మేయర్ కు వివరించారు.
  ఈ కార్యక్రమంలో వరంగల్ ఇండేన్ డిస్ట్రిబ్యూటర్స్ సభ్యులు వామన్ రావు,జగదీశ్వర్,లక్ష్మణ్,వెంకట్,రమాదేవి,మంగతాయారు తదితరులు పాల్గొన్నారు

కిసాన్ పరివార్ ప్రైవేట్ లిమిటెడ్ మొట్టమొదటి బ్రాంచి ప్రారంభం .


ఖమ్మం : వైరారోడ్డు సురభి హాస్పిటల్ కాంప్లెక్స్ లో మూడో ఫ్లోర్ నందు కిసాన్ పరివార్ మొట్టమొదటి నూతన బ్రాంచిని చైర్మన్ ఎన్.బి నాయక్ ప్రారంభించారు . ఈ సందర్బంగా మాట్లాడుతూ కిసాన్ పరివార్ సేవాదల్ సామాజిక సంస్థ ఆధ్వర్యంలో సహజ సిద్ధ వ్యవసాయం వైపు మళ్లించి రైతును రాజుగా చూడాలనే ఆశయంతో మా సంస్థను నెలకొల్పామన్నారు . సేంద్రియ సాగుతో మనిషికి ఆరోగ్యాన్ని , ఆయుష్షునీ ఇవ్వాలనే ఉద్దేశంతో రైతులు సేంద్రియ వ్యవసాయం పట్ల మక్కువ పెంచుకోవలన్నారు . 2016లో స్థాపించారని తెలంగాణ మొత్తం మీద మూడు బ్రాంచిలు ఉన్నాయని , వారి సంస్థలు పన్నెండు దేశాల్లో ఉన్నాయని పండిన పంటను నిల్వ ఉంచడానికి గోధములు ఏర్పాటు చేసి ప్రాసెసింగ్ పద్ధతి ద్వారా డైరెక్టర్ కస్టమర్ దగ్గరకు తీసుకెళ్తానని తెలిపారు . రైతులకు మంచి ధర రావాలని ఎక్స్పోర్ట్స్ , ఇంపోర్ట్ కూడా చేస్తున్నారని ధర ఎక్కువ యక్కడ  ఉంటుందో అక్కడికి పంటను పంపించడానికి కొన్ని  కంట్రీలతో మాట్లాడి పంపిస్తున్నారని . ముందు ముందు ఆన్లైన్ యాప్ ద్వారా కూడా డీలర్లకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు . హైదరాబాద్ , బెంగుళూర్ , కలకత్తా , పుణె , నాగపూర్ , హర్యానా , ముంబై , ఢిల్లీ ప్రాంతంలో ఉన్నాయన్నారు . తల్లిదండ్రులు  డాక్టర్ కొడుకు డాక్టర్ కావాలని కోరుకుంటారు , అలాగే ఇంజనీరింగ్ కొడుకు ఇంజినీరింగ్ కావాలని కోరుకుంటారు , పొలిటీషన్ కొడుకు పొలిటీషన్ కావాలని కోరుకుంటారు కానీ రైతు కొడుకు రైతు కావాలని ఎందుకు కోరుకోరు . వారు పడే కష్టాలు , అవస్థలు , నష్టాలు ఉంటాయి కాబట్టి రైతు కోరుకోరు వాటికి పరిష్కారమే ఈ కిసాన్ పరివార్ సంస్థను స్థాపించారని పేర్కొన్నారు . ఒక రైతు కుటుంబం నుండి ఉద్భవించింది . సామాన్యమైన రైతును అసామాన్యుడుగా చెయ్యాలని దిని యొక్క ఉద్దేశమని అన్నారు . తన ఒక స్టాండింగ్ కెరియల్ పెట్రోల్ బాయ్ నుంచి ఫోక్స్ మ్యాగజైన్ లో నాలుగు పేజీలు వరకు తనకంటూ ఉందన్నారు . ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ రాము కుమార్ , రూలర్ డెవలప్మెంట్ సీ.ఈ.ఓ. అచ్యుతరావు , మేనేజర్ సురేష్ , గంగాధర్ తదితరులు పాల్గొన్నారు .

అమర్ నాథ్ యాత్ర లో ఇద్దరు ఏపి వాసులు గల్లంతు...



అమర్‌నాథ్‌ యాత్ర తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. రాజమహేంద్రవరం నుంచి అమర్నాథ్‌ యాత్రకు వెళ్లిన 37మందిలో ఇద్దరు మహిళలు గల్లంతయ్యారు. మిగతా 35మంది సురక్షితంగా ఉన్నట్టు అధికారులు ప్రకటించారు. కొవ్వూరు ఆర్డీవో మల్లిబాబు కథనం ప్రకారం రాజమహేంద్రవరం నుం చి 20 మంది, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన బంధువులతో కలుపుకొని మొత్తం 37 మంది ఈ నెల 1న అమర్నాథ్‌ యాత్రకు వెళ్లారు. అమర్‌నా థ్‌ ఆలయ సమీపంలో శుక్రవారం సంభవించిన వరదలో కొత్త పార్వతి, గునిశెట్టి సుధ గల్లంతయ్యారు. పార్వతి భర్త మార్కండేయులు, సుధ భర్త కిరణ్‌ మాత్రం క్షేమంగా బయటపడ్డారు. దీంతో ఈ ఇద్దరూ గల్లంతైన వారి ఆచూకి కోసం ఎదురు చూస్తూ అక్కడే ఉండిపోయారు. కా గా.. ఆదివారం సాయంత్రం వరకూ మిస్సింగ్‌ లిస్ట్‌లో ఉన్న కొత్త శ్రీనివాసరావు, కొత్త విశ్వనాఽథ్‌, కొత్త వర్ధన్‌ సురక్షితంగా ఉన్నారు. ఆదివారం సాయంత్రం వారు పెవల్‌గామ్‌ అనే గ్రామం నుంచి జమ్మూకు బయలుదేరినట్టు ఆర్డీవో తెలిపారు. ఈ మేరకు గోకవరంలో ఉన్న వారి బం దువు ఒకరికిఒకరికి వారి నుంచి సమాచారం వచ్చినట్టు ఆయన తెలిపారు.  
పశ్చిమ వాసుల నుంచి సమాచారంపశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఇటీవల అమర్నాథ్‌ యాత్రకు వెళ్లిన యాత్రికులు క్షేమంగా ఉన్నట్టు ఆదివారం సమాచారం అందింది. భీమవరం నుంచి వెళ్లిన 32 మంది అమర్నాథ్‌ యాత్ర ముగించుకునికశ్మీర్‌లోని గుల్మార్గ్‌ ప్రాంతానికి చేరినట్టు వారు ఫోన్‌లో తెలిపారు. ఈ మేరకు వారు తాము క్షేమంగా ఉన్నామంటూ బంధువులకు ఫొటోలు కూడా పంపించారు. అలాగే తాడేపల్లిగూడెం నుంచి వెళ్లిన 70 మంది యాత్రికులు క్షేమంగా ఉన్నట్టు అధికారికంగా సమాచారం అందింది

Friday, 8 July 2022

కలేక్టర్లలకు సోమేశ్ కుమార్ అభినంధనలు... రెవెన్యూ సదస్సుల నిర్వహణకు సిద్దంగా ఉండాలని ఆదేశం...



జూలై 8, హైదరాబాద్ : :జిల్లాల పరిధిలో రెవెన్యూ సదస్సుల నిర్వహణకు అధికారులను సన్నద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో రెవెన్యూ సదస్సుల నిర్వహణ, ధరణి మాడ్యూల్స్పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్రంలో భూ రికార్డులను సమర్థవంతంగా నిర్వహిస్తున్న కలెక్టర్లు, రెవెన్యూ అధికారులను అభినందించారు. భూ సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ కార్యక్రమం ద్వారా 95 శాతం భూ రికార్డులు పకడ్బంధీగా ఉన్నాయని, మిగిలిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. ధరణి వెబ్సైట్లో ఏర్పాటు చేసిన 33 మాడ్యుల్స్లో భూ యజమాని పేరు, భూ విస్తీర్ణం, భూమి రకం మార్పులకు దరఖాస్తు అవకాశం కల్పించామని, సదరు దరఖాస్తులలో ఆధారాలను పరిశీలించి, అందుబాటులో ఉన్న రికార్డులను తనిఖీ చేసిన అనంతరం నిర్ణయం తీసుకోవాలని సూచించారు. 33 మాడ్యూల్స్ను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అధికారులకు వివరించారు. జూలై 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని, రెవెన్యూ సదస్సుల నిర్వహణపై చర్చించేందుకు ఈ నెల 11న హైదరాబాదులోని ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సమీక్ష నాటికి జి.ఓ. 58 క్రింద వచ్చిన దరఖాస్తుల ప్రాథమిక విచారణ ప్రక్రియ 100 శాతం పూర్తి చేసి ఆ సమాచారంతో హాజరు కావాలని కలెక్టర్లకు సూచించారు. రెవెన్యూ సదస్సుల నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా 100 బృందాలను రెవెన్యూ ఉన్నతాధికారుల అధ్యక్షతన ఏర్పాటు చేయాలని తెలిపారు. జిల్లాలోని ప్రతి 5 మండలాలకు ఒక బృందం ఏర్పాటు చేయాలని, ప్రతి మండల కేంద్రంలో 3 రోజులకు మించకుండా రెవెన్యూ సదస్సులను మండల కేంద్రాలలో నిర్వహించాలని, రెవెన్యూ సదస్సులను విస్తీర్ణం కలిగిన వేదికల్లో నిర్వహించాలని, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు, అవసరమైన కంప్యూటర్లు, ప్రింటర్, జిరాక్స్ మెషిన్, కౌంటర్లు, మొబైల్ మీ-సేవ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మండల కేంద్రంలో నిర్వహించే రెవెన్యూ సదస్సులో స్థానిక శాసనసభ్యులు పాల్గొనాలని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని రెవెన్యూ సదస్సులో ప్రణాళిక సరిహద్దు జిల్లాల అధికారులు, స్థానిక శాసనసభ్యులతో సమన్వయం చేసుకొని ఖరారు చేయాలని, మండలాల్లోని గ్రామాలను విభజించి, గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులకు హాజరయ్యే తేదీల కార్యచరణ రూపొందించి. గ్రామాలలో టాం-టాం ద్వారా ప్రచారం చేయాలని, సామాజిక మాధ్యమాల్లో, ప్రింట్ మీడియాలో కార్యచరణ ప్రచురితమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రెవెన్యూ సదస్సుల నిర్వహణ కోసం జిల్లా ప్రణాళికతో హాజరు కావాలని, ఆ ప్రణాళికలో జిల్లాలో ఏర్పాటు చేసే బృందాల వివరాలు, మండల కేంద్రాలలో వేదికలు, కార్యచరణ వంటి లాజిస్టిక్స్ వివరాలు సిద్ధం చేయాలని తెలిపారు. రెవెన్యూ సదస్సుల సమయంలో వచ్చిన దరఖాస్తులను 100 శాతం అర్హత మేరకు పరిష్కరించాలని, కోర్టు కేసులు, కుటుంబ తగాదాలు, సరైన ధృవపత్రాలు సమర్పించని కేసుల వివరాలతో కూడిన సమాధానం వారికి అందజేయాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న సంక్షేమ గురుకుల పాఠశాలలు మంజూరు చేసిన ప్రాంతాల్లో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రతి జిల్లాలో ఆగస్టు 15వ తేదీ నాటికి బి.సి. ఎస్.సి. స్టడీ సర్కిల్ల ఏర్పాటుకు సంబంధించి అవసరమైన స్థలాలు, భవనాలను ఎంపిక చేయాలని, జిల్లాలో చేపడుతున్న హరితహారం కార్యక్రమం, గ్రామీణ క్రీడ ప్రాంగణాల పురోగతి వివరాలు సైతం తయారు చేయాలని తెలిపారు.

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్ లో జిల్లా రెవెన్యూ అధికారులు, తహశిల్దార్లతో జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో 18 మండలాలు ఉ న్నాయని, రెవెన్యూ సదస్సుల నిర్వహణ కొరకు బృందాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. దరఖాస్తుల కొరకు 4 మొబైల్ మీ-సేవ సెంటర్లు ఏర్పాటు చేయాలని, అభ్యర్థులు దరఖాస్తు సమయంలో వారి సమస్యను తెలుసుకొని, అర్థం చేసుకొని సంబంధిత మాడ్యూల్లో నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, మంచిర్యాల, బెల్లంపల్లి రాజస్వ మండల అధికారులు వేణు, శ్యామలాదేవి, మండలాల తహశిల్దార్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Thursday, 7 July 2022

వరప్రదాతకు మహా పుష్పాభిషేకం... పుష్ష్ప వనంగా మారిన సాయి సన్నిది ...



ఖమ్మం కల్చరల్, జూలై 7 : స్థానిక వరప్రదాత శ్రీ శిరిడి సాయి మందిరంలో గురువారం మహా పుష్పాభిషేకం నేత్రపర్వంగా జరిగింది. షిరిడి సాయినాధునికి వివిధ రకాల పుష్పాలతో అభిషేకం నిర్వహించారు.రంగు రంగుల పుష్పాలతో మందిరం పుష్పవనంలా మారింది.మందిరం చైర్మన్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో స్వామివారికి గులాబీ ,మల్లె, చేమంతి, సంపెంగ, జాజి, బంతి, విరజాజి, లిల్లీ, కనకాంబరం, ముద్దబంతి తదితర 500 కేజీల పుష్పాలతో స్వామివారి అభిషేక మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు, సాయి దీక్షాపరులు అత్యధిక సంఖ్యలో హాజరై స్వామివారి ఉత్సవంలో భాగస్వాములయ్యారు. 
తొలుత పుష్పాలు నిండిన గంపలతో భక్తులు నగరంలో ఊరేగింపు నిర్వహించారు. స్థానిక ఆంజనేయ స్వామి విగ్రహం నుంచి ప్రారంభమైన  ఈ ఊరేగింపు పొట్టి శ్రీరాములు రోడ్ , ట్రంక్ రోడ్, ఎమ్మార్వో ఆఫీస్ రోడ్, ఉమెన్స్ కాలేజ్ రోడ్డు మీదుగా వరప్రదాత శ్రీ షిరిడి సాయి ఆలయానికి చేరుకుంది. ఆలయంలో మేధా దక్షిణామూర్తి హోమం సాంప్రదాయ సిద్ధంగా ఋత్వికులు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో ఆలయ కమిటీ చైర్మన్ వేములపల్లి వెంకటేశ్వరరావు,  భద్రాద్రి బ్యాంక్ చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తి, ఆలయ కార్యదర్శి అర్వపల్లి నిరంజన్, ఆలయ కమిటీ సభ్యులు నూనె శ్రీనివాసరావు, తీర్ధాల శ్రీనివాసరావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అల్పాహారం, ఫలహారాలను అందించారు.

Wednesday, 6 July 2022

సాయి మందిరంలో వైభవంగా సుదర్శన హోమం

 
ఖమ్మం గాంధీచౌక్ లోని వరప్రదాత శిరిడి సాయి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలలో భాగంగా బుధవారం సుదర్శన హోమం నిర్వహించారు సుదర్శన హోమంలో ఆలయ చైర్మన్ వేములపల్లి వెంకటేశ్వరరావు దంపతులు చేత అర్చకులు విశేష రీతిలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణతో సాంప్రదాయ సిద్ధంగా హోమాన్ని నిర్వహించారు షిరిడి సాయి కి ప్రత్యేక పూజలు అన్నాభిషేకం జరిపారు.ఈ విశేష కార్యక్రమంలో మందిరం చైర్మన్ వేములపల్లి వెంకటేశ్వరరావు కార్యదర్శి అర్వపల్లి నిరంజన్ ఆలయ కమిటీ సభ్యులు తీర్థాల శ్రీనివాసరావు నూనె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు

Tuesday, 5 July 2022

షిర్డీసాయికి తమలపాకుల సమర్పణ....

 
ఖమ్మం : నగరంలోని గాంధీచౌక్ శ్రీషిర్డీసాయి మందిరంలో నిర్వహిస్తున్న గురు పౌర్ణమి ఉత్సవాలు మూడవ రోజు సందర్భంగా మంగళవారం ఉదయం నుండి గణపతి పూజ , మంటప ఆరాధన , శ్రీ సాయినాధునికి 41 వేల తమలపాకులతో అర్చన , అలంకరణ మరియు “చండీ హోమం" సాయి హారతులు , నీరాజన మంత్రపుష్పము , చతుర్వేదస్వస్తి , పవళింపుసేవ కార్యక్రమాలు జరిగాయి . ముఖ్య అతిథులుగా జె.ఎస్.ఆర్.ఇన్ఫోటెక్ అధినేత జూలకంటి శ్రీనివాస్ రావు దంపతులు , శ్రీ సిటీ అధినేత మరియు  ప్రముఖ రియల్టర్ వ్యాపారస్థులు గరికపాటి ఆంజనేయ ప్రసాద్ దంపతులు బాబా వారిని దర్శించుకోని ప్రత్యేక పూజలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు . ఈ సందర్భంగా వచ్చిన అతిథులను ఆౠలయం కమిటి చైర్మన్ వేములపల్లి వెంకటేశ్వరరావు దంపతులు , కార్యదర్శి అర్వపల్లి నిరంజన్ , ప్రసాద్ లు శాలువాతో ఘనంగా సత్కరించి బాబా వారి ఫోటో ప్రేమను అందించారు .

Monday, 4 July 2022

సాయినాధునికి "చందనగంధం"తో అభిషేకం... రెండవరోజు భక్తి శ్రద్దలతో హోమాలు పూజలు..


ఖమ్మం : గాంధీచౌక్ వరప్రదాత షిర్డిసాయి మందిరంలో గురుపౌర్ణమి వేడుకల మహోత్సవంలో రెండోవ రోజు సందర్భంగా సోమవారం ఉదయం నుండి గణపతి పూజ , మంటప ఆరాధన , శ్రీ సాయినాధునికి "చందనం (గంధం)" తో అభిషేకం మరియు “రుద్ర హోమం" సాయి హారతులు , నీరాజన మంత్రపుష్పము , చతుర్వేదస్వస్తి , పవళింపుసేవ వంటి కార్యక్రమాలను నిర్వహించారు . ఈ కార్యక్రమంలో ఆలయం కమిటీ చైర్మన్ వేములపల్లి వెంకటేశ్వరరావు దంపతులు , కార్యదర్శి అర్వపల్లి నిరంజన్ , కోశాధికారి కురువెళ్ల జగన్మోహన్ రావు , సుమారుగా  సాయినాథుని మాలధారణ ధరించిన 3వందల మంది భక్తులు తదితరులు పాల్గొన్నారు .

నాటి పోరాటాలు నేటి యువతకు స్ఫూర్తి.. దొడ్డి కొమరయ్య విగ్రహావిష్కరణ సభలో పువ్వాడ...


ఖమ్మం : కొమరయ్య గారి విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి పువ్వాడ, CPI జాతీయ నాయకులు పువ్వాడ నాగేశ్వర రావు .తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు, తొలి అమరుడు, పేదలను చైతన్యపర్చడంతో పాటు వెట్టిచాకిరికి వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో దొడ్డి కొమురయ్య చూపిన సాహసం నేటి తరానికి స్ఫూర్తిగా తీసుకోవాలి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు.
 దొడ్డి కొమరయ్య గారి వర్ధంతి సందర్భంగా సోమవారం ఖమ్మం లాకరం ట్యాంకు బండ్ నందు ఎర్పాటు చేసిన కొమరయ్య గారి విగ్రహాన్ని, CPI జాతీయ నాయకులు, మాజి శాసనసభ్యులు పువ్వాడ నాగేశ్వర రావు గారితో కలిసి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లడుతూ..
భుమి, భుక్తి కోసం నాడు పోరాడిన దొడ్డి కొమురయ్య గారు అమరత్వం పొంది నేటికీ 76 ఏళ్లయిందని, నాడు విస్నూరు రామచంద్రారెడ్డి పెత్తందారీతనానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో వేలాది మందితో దండుకట్టి తెలంగాణ కొసం పోరాడిన వీరుడని కొనియాడారు.
కొందరి చేతిలోనే కేంద్రీకృతమైన వేలాది ఎకరాల భూమిని వారి కబంధ హస్తాల నుంచి విముక్తి చేసి పేదలకు పంచిన చరిత్ర ఈ ఉద్యమానికి ఉందన్నారు.
వెట్టి చాకిరీ నుంచి సామాన్యులకు విముక్తి కలిగించిన పోరాటమని, ప్రపంచ పోరాటాల చరిత్రతో పోలిస్తే తెలంగాణ రైతాంగ సాయుధ పోరుకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. 
భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో దొడ్డి కొమురయ్య గారు తుపాకి తూటాలకు ఎదురొడ్డి వీర మరణం పొందారని పేర్కొన్నారు.
కొమురయ్య పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
వారి చేపట్టిన పోరాట స్ఫూర్తితోనే ఉద్యమ నాయకుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఅర్ గారు పూర్తి చేశారని అన్నారు. 
వారు చూపిన మార్గంలోనే తెలంగాణ పోరాటం చేపట్టి సుధీర్ఘ కాలం అయిన తరువాత తెలంగాణను సాదించుకుని స్వయం పాలన చేసుకుంటున్నామని వివరించారు.
తెలంగాణ వైతాళికుల ఔన్నత్యాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ట్యాంక్ బండ్ పై తెలంగాణ వైతాళికుల విగ్రహాలను నెలకొల్పుతామని వివరించారు.
నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఅర్ గారు రాష్ట్రంలోని అన్ని కుల వృత్తులను ఆదుకుని వారి అభ్యున్నతికి పెద్ద పీట వేశారని, ప్రత్యేక నిధులు ఇస్తు వారి వృత్తులను ప్రోత్సహిస్తున్నారని అన్నారు.

కులమతాలకు అతీతంగా బడుగు బలహీనర్గాలకు తెలంగాణ ప్రభుత్వం నేడు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అన్ని రంగాల సంక్షేమం, అభివృద్ధిని కొనసాగిస్తు వారి ఆశయ సాధనాలను సాధించారని వివరించారు.
*ప్రజలలో నుండి పుట్టినవాడే దొడ్డి కొమరయ్య.. పువ్వాడ నాగేశ్వర రావు 
తెలంగాణ తొలి ఉద్యమంలో ముందుండి పోరాటం చేసి తెలంగాణ కోసం నేలకొరిగిన తోలి కమ్యునిస్టు వీరుడు అని కొనియాడారు.
తూటాలకు ఎదురొడ్డి పోరాడిన ఘనుడు, లక్షల మందికి స్ఫూర్తినిచ్చిన వీరుడని అన్నారు.
సామాజిక స్పృహతో రజాకర్లతో పోరాడారు అని, ఎందరినో చైతన్య పరచి ముందుండి నడిపించారు అన్నారు.
తెలంగాణ సాయుధ పోరాటానికి స్ఫూర్తిగా నిలిచిన కోమరయ్య గారి విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం కలిగినందుకు అదృష్టంగా భావిస్తున్నానన్నారు.
నేడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని అనుభవిస్తున్నాం అంటే అది కేవలం నాటి కొమరయ్య పొరట భీజమే అన్నారు.
కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం గారు, మేయర్ పునుకొల్లు నీరజ గారు, మాజి ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ గారు, జిల్లా నాయకులు RJC కృష్ణ గారు, TRS నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు గారు, మేకల మల్లిబాబు యాదవ్ గారు, మేకల సుగుణ రావు గారు, మాజి ఎమ్మేల్యే చంద్రావతి గారు, CPI జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ గారు, బాగం హేమంతరావు గారు, అల్లిక వేంకటేశ్వర్లు గారు, చిన్నం మల్లేశం గారు, రాజేష్, వెంకటనారాయణ,  గోపాల్, ఉపేందర్, సింహాద్రి యాదవ్, పోదిల చిన్న పాపారావు, లింగయ్య తదితరులు ఉన్నారు.

Sunday, 3 July 2022

మంచులింగంగా త్రయంభకేశ్వరుడు... .60ఏళ్ల తరువాత అధ్భుతం..

👉మహారాష్ట్రలోని నాసిక్ త్రయంబకేశ్వరాయంలో అద్బుత ఘటన జరిగింది. శివలింగం చుట్టు మంచు వ్యాపించింది. విషయం తెలియడంతో ఆలాయానికి భక్తులు పోటెత్తారు.. ప్రతిరోజు పూజలో భాగంగా పూజారులు పూజ చేయటానికి ఆలయంలో వెళ్లారు. లింగం చుట్టు తెల్లగా ఉండటాన్ని గమని తాకి చూడటంతో. శివలింగం మీద గట్టిగా మంచు ఏర్పడి చల్లగా ఉంది.
గర్భగుడిలోని ఆలయంలో లింగం చుట్టు మంచు వ్యాపించింది. ఈ విషయం తెలిసిన వెంటనే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సంఘటనను పూజారులు అద్భుతంగా అభివర్ణిస్తున్నారు. పూజారీ శివలింగం చుట్టు పువ్వులు పెట్టి అలంకరించారు. పూజారులు.. శివలింగం పక్కన కూర్చుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భారత్, చైనా యుధ్దం తర్వాత.. అనగా..1962లో ఇలాగే నాసిక్ లో.. శివలింగం చుట్టు మంచు వ్యాపించిందని కథలుగా చెప్పుకుంటారు. ప్రస్తుతం మరోసారి లింగం మొత్తం మంచుతో కప్పబడింది. అయితే, వాతావరణం లో మార్పులు వల్ల ఇప్పుడు మరోసారి శివలింగం చుట్టు మంచు వ్యాపించినట్లు భావిస్తున్నారు. .
త్రయంబకేశ్వరాలయం, నాసిక్
త్రయంబకేశ్వరాలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ క్షేత్రం నాసిక్ పట్టణానికి 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. త్రయంబకం లేదా త్రయంబకేశ్వర్ అని పిలిచే ఈ క్షేత్రాన్ని గోదావరి జన్మస్థానంగా పిలుస్తారు. అయితే ఈ క్షేత్రానికి గోదావరి జన్మ స్థానం కొన్ని వందల అడుగుల ఎత్తులో ఉంటుంది.
త్రయంబకేశ్వరాలయం
పురాణ ఇతిహాసం, చరిత్ర సవరించు
త్రయంబకేశ్వరుడు అనగా పరమశివుడు. 'అంబక 'మంటే 'నేత్ర' మని అర్థం. మూడు నేత్రాలు గల దేవుడు త్రయంబకుడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని - అనే మూడు తేజస్సులు మూడు నేత్రలుగా వెలసిన దేవుడు. పాలభాగంలోని మూడవ నేత్రమే అగ్నినేత్రం. మన్మథుణ్ణి ఈ నేత్రాగ్నితోనే శివుడు భస్మం చేశాడు. స్వర్గం, ఆకాశం, భూమి - అనే మూడు స్థానాలకు సంరక్షకుడైన తండ్రి శివుడు అని కూడా త్రయంబక శబ్దాన్ని వివరిస్తారు. 'త్రయంబకం యజామహే - సుగంధిం పుష్టి వర్ధనమ్' మృత్యుంజయ మహామంత్రంతో మృత్యువు అనగా మరణం నుండి విడుదల చేయమని భక్తులు శివుణ్ణి ప్రార్థిస్తారు.
ఆలయ విశేషాలు సవరించు
పూర్వపు ఆలయ విశేషాలు ఎక్కువగా లేకపోయినా ఇప్పటీ ఆలయాన్ని మాత్రం 1730 లో చత్రపతి శివాజీ సైన్యాధిపతి అయిన బాజీరావు పీష్వా నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. ఎక్కువభాగం దేవాల నిర్మాణానికి నల్ల శాణపు రాయిని ఉపయోగించారు. ఈ ఆలయం హేమంత్‌పంతీ శైలికి చెందిన నిర్మాణం. ఆలయం చుట్టూ నిర్మాణం లోపలివైపు చతుర్స్రాకారంగానూ బయటి వైపుకు నక్షత్రాకారంగానూ ఉంటుంది.
కుశావర్తనం, గోదావరి పుట్టుక సవరించు
గర్భగుడికి బైటవైపుగా నాలుగు ద్వారాలతో మండపం ఉంటుంది. గర్భగుడిలో కల శివలింగం భూమికి కొంత దిగువలో ఉంటుంది. దాని నుండి నిరంతరం నీటి ఊట ఊరుతూ ఉంటుంది. అది దేవాలయ్ం ప్రక్కన కుశావర్తనం అనే సరోవరంలో కలుస్తూ ఉంటుంది. కుశ అంటే ధర్భ, వర్తం అంతే తీర్ధం అని అర్ధం. దీనిలో స్నానం చేయదం వలన సర్వపాపాలు రోగాలు పోతాయని భక్తుల విశ్వాసం. గౌతముడు శివుని మెప్పించి గంగను తీసుకువచ్చు ప్రారంభంలో తన చేతినున్న ధర్భతో గౌతమి చుట్టూ తిప్పాడు. అలా తిప్పిన, ఆవర్తనమైన చొట బ్రహ్మగిరి నుండి గంగ నేలకు దిగి గోదావరిగా ప్రవహించడం మొదలిడింది.
నాసిక్ నుండి దేవాలయానికి 28 కిలోమీటర్లు. ఇక్కడి నుండి బస్సులు ఉంటాయి. అలాగే రైల్వే స్టేషను నుండి దేవాలయం నలభై కిలోమీటర్లు. ఇక్కడి నుండి ప్రవేట్ వ్యాన్లు బస్సులు ఉంటాయి.

గురు పౌర్ణమి ఉత్సవాలు ప్రారంభం. సాయి మాలాలు ధరించి దీక్షను స్వీకరించిన భక్తులు


ఖమ్మం : స్థానిక గాంధీ చౌక్ వరప్రదాత శ్రీ షిరిడి సాయి మందిర్ లో ఆదివారం గురు పౌర్ణమి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మందిరాన్ని శోభాయమానంగా వివిధ రకాల పూలదండలతో అలంకరించిన భక్తులు షిరిడి సాయి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలి రోజు నగరానికి చెందిన 500 మందికి పైగా భక్తులు షిరిడి సాయి మాలాధారణ దీక్షను  స్వీకరించారు. ఆలయ చైర్మన్ వేములపల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మాల ధారణ భక్తులకు పూజా ద్రవ్యాలను అందజేశారు. మందిరంలో ఉదయం నుంచి మంగళ తోరణ ధారణ,శ్రీ సాయినాధుని సుప్రభాతం, యాగ సంకల్పం, ఆలయ ప్రదక్షిణ, గోపూజ ,గణపతి పూజ ,పుణ్యాహవాచనం, పంచగవ్యారాధన, ఆఖండ దీపారాధన, ప్రధాన కలశ స్థాపన, యోగిని, వాస్తు క్షేత్రపాలక నవగ్రహ, నక్షత్ర సర్వతోభద్ర మంటప ఆరాధన, ముత్సంగ్రహణం, అగ్ని మదనము, అగ్ని ప్రతిష్టాపన, అంకురారోపణ, ధ్వజారోహణ, సర్వ దేవత ఆహ్వానము బలిహరణ ధుని పూజ, స్వామివారికి పాలాభిషేకం తదితర పూజా కార్యక్రమాలు సాంప్రదాయ సిద్ధంగా నిర్వహించారు. అనంతరం శ్రీ లక్ష్మీ గణపతి హోమాన్ని రుత్వికులు వేదమంత్రోచ్ఛారణలతో విశేష రీతిలో నిర్వహించారు.

Saturday, 2 July 2022

జిల్లా ఎస్పీగా వినిత్ జీ


*కొత్తగూడెం:* జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌ను డీజీపీ కార్యాలయానికి అటాచ్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆయన స్థానంలో ప్రస్తుతం కొత్తగూడెం ఓఎస్‌డీగా పనిచేస్తున్న డా.వినిత్‌ జీకి బాధ్యతలు అప్పగించారు. ఎస్పీగా సునీల్‌దత్‌ సుదీర్ఘకాలం విధులు నిర్వర్తించారు. 2018, సెప్టెంబరు 11న బాధ్యతలు చేపట్టారు. ప్రధానంగా మావోయిస్టు కార్యకలాపాల నియంత్రణపై పట్టు సాధించారు.

సరిహద్దు రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌ నుంచి మావోయిస్టుల చొరబాట్లకు తావులేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఈ విషయంలో ఇతర పోలీసు అధికారులతో సమష్టిగా పనిచేశారు. ఆయన హయాంలో జరిగిన ఘటనల్లో దాదాపు 8 మంది మావోయిస్టులు, కీలక నేతలు మరణించారు. 117 మందిని అరెస్టు చేశారు. 324 మంది మిలీషియా సభ్యులు, సానుభూతిపరులు లొంగిపోయారు. ఇదే క్రమంలో మారుమూల ఆదివాసీ గూడేల్లో సోలార్‌ విద్యుద్దీపాల ఏర్పాటు, తాగునీటి పరికరాలు, దోమ తెరలు, క్రీడా సామిగ్రి పంపిణీ వంటి చర్యలు చేపట్టారు. జిల్లా కేంద్రంలో పోలీసు భవనాల నిర్మాణాలతో పాటు సిబ్బంది సంక్షేమానికి తగిన చొరవ చూపారు. హేమచంద్రాపురం పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో ఫైరింగ్‌ రేంజ్‌ని అందుబాటులోకి తీసుకొచ్చారు. కొత్తగా రానున్న డా.వినిత్‌ జీ 2017 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. తొలి పోస్టింగ్‌ భద్రాచలం ఏఎస్పీగా పొందారు. అక్కడ ఏడాది పాటు పనిచేశారు. అనంతరం 2020లో నిజామాబాద్‌ ఏఎస్పీగా బదిలీపై వెళ్లారు. అక్కడి నుంచి కొద్ది నెలల క్రితం మళ్లీ కొత్తగూడెం ఓఎస్‌డీగా తిరిగొచ్చారు. ప్రస్తుతం పూర్తిస్థాయి ఎస్పీగా నియమితులయ్యారు. ఏఎస్పీగా మావోయిస్టు కార్యకలాపాలను నిలువరించడంలో గతంలో సునీల్‌దత్‌కు వినిత్‌ జీ తనవంతు సహకారం అందించడంతో పాటు మన్యం ప్రాంత విధుల్లో కీలక పాత్ర పోషించారు.

*భద్రాచలం ఏఎస్పీగా రోహిత్‌రాజ్‌*

ఏఎస్పీగా నేడు రోహిత్‌ బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు సీఎస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ పనిచేసిన అధికారి శిక్షణకు సెలవుపై వెళ్లారు. దీంతో పాల్వంచ(గ్రేహండ్స్‌)కు చెందిన రోహిత్‌ను ఇన్‌ఛార్జ్‌గా నియమించారు.