ఖమ్మం : స్థానిక గాంధీ చౌక్ వరప్రదాత శ్రీ షిరిడి సాయి మందిర్ లో ఆదివారం గురు పౌర్ణమి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మందిరాన్ని శోభాయమానంగా వివిధ రకాల పూలదండలతో అలంకరించిన భక్తులు షిరిడి సాయి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలి రోజు నగరానికి చెందిన 500 మందికి పైగా భక్తులు షిరిడి సాయి మాలాధారణ దీక్షను స్వీకరించారు. ఆలయ చైర్మన్ వేములపల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మాల ధారణ భక్తులకు పూజా ద్రవ్యాలను అందజేశారు. మందిరంలో ఉదయం నుంచి మంగళ తోరణ ధారణ,శ్రీ సాయినాధుని సుప్రభాతం, యాగ సంకల్పం, ఆలయ ప్రదక్షిణ, గోపూజ ,గణపతి పూజ ,పుణ్యాహవాచనం, పంచగవ్యారాధన, ఆఖండ దీపారాధన, ప్రధాన కలశ స్థాపన, యోగిని, వాస్తు క్షేత్రపాలక నవగ్రహ, నక్షత్ర సర్వతోభద్ర మంటప ఆరాధన, ముత్సంగ్రహణం, అగ్ని మదనము, అగ్ని ప్రతిష్టాపన, అంకురారోపణ, ధ్వజారోహణ, సర్వ దేవత ఆహ్వానము బలిహరణ ధుని పూజ, స్వామివారికి పాలాభిషేకం తదితర పూజా కార్యక్రమాలు సాంప్రదాయ సిద్ధంగా నిర్వహించారు. అనంతరం శ్రీ లక్ష్మీ గణపతి హోమాన్ని రుత్వికులు వేదమంత్రోచ్ఛారణలతో విశేష రీతిలో నిర్వహించారు.
No comments:
Post a Comment