Sunday, 17 July 2022

గోదావరి పరివహకంలో క్లౌడ్ బరెస్టు.. విదేశీ కుట్రల అవకాశం లేకపోలేదు.. గోదావరి వరదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమానం..


గోదావరి పరివహకంలో క్లౌడ్ బరెస్టు..         విదేశీ కుట్రల అవకాశం లేకపోలేదు..     గోదావరి వరదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమానం వ్యక్తం చేశారు.. గతంలో ఉత్తరాఖండ్ లడ్డాక్ లలో జరిగిన సంఘటనలను ఆయన గుర్తచేశారు
గోదావరి వరద ముంపు ప్రాంతాల పర్యటనలో భాగంగా భద్రాచలం వచ్ఛిన ముఖ్యమంత్రి కేసీఆర్  గోదావరి బ్రిడ్జీపై నుండి గంగమ్మ తల్లికి పూజలు చేశారు అనంతరం, కరకట్టను పరిశీలించారు. 
అక్కడినుండి భద్రాచలం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి చేరుకున్న సీఎం  కేసీఆర్ ముంపు బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితులు, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అందుతున్న నిత్యావసరాలు, వైద్యం, ఇతర సౌకర్యాల గురించి సీఎం ఆరా తీశారు.  
బాధితులను పేరుపేరునా పలకరించారు. తమకు అన్నిరకాలుగా సహాయ, సహకారాలు అందుతున్నాయని, స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ అధికారులు తమను కంటికి రెప్పలా కాపాడుతున్నారని సీఎంకు బాధితులు వివరించారు. 
భారీ వర్షాలు, వరదలను లెక్కచేయకుండా తమను పరామర్శించడానికి వచ్చిన సీఎం  కేసీఆర్ ను కలసి వరద బాదితులు తమ బాదలు తెలిపారు.ప్ర‌మాదం ఇంకా త‌ప్పిపోలేదని, మ‌రో మూడు నెల‌లు వ‌ర్షాలు వ‌చ్చే అవ‌కాశం ఉందని, అంద‌రం కూడా అప్ర‌మ‌త్తంగా ఉండాలన్నారు.
వరదలు వచ్చిన ప్రతిసారీ భద్రాచలం ముంపునకు గురికావడం బాధాకరమని సీఎం అన్నారు. తరచుగా వరదల్లో మునిగిపోతున్న భద్రాచలం పట్టణ వాసుల కన్నీళ్లను తుడిచేందుకు శాశ్వత ప్రాతిపదికన కాలనీలు నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకోసం 1000కోట్ల రూపాయలు వెచ్ఛిస్తొమని పేర్కొన్నారు.వరద చేరని, అనువైన ఎత్తైన ప్రదేశాలను గుర్తించి, బాధితులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించి, కాలనీల నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ ను సీఎం శ్రీ కేసీఆర్ ఆదేశించారు. ముంపునుంది తమకు శాశ్వత ఉపశమనం దొరకుతుండటంతో వరద బాధితులు హర్షం వ్యక్తం చేశారు.మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి అధ్వర్యంలో కొత్త‌గూడెం, ఖ‌మ్మం క‌లెక్ట‌ర్లు గొప్ప‌గా ప‌ని చేసి ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకున్నందుకు వారిని ప్ర‌త్యేకంగా అభినందిస్తున్నాన‌ని కేసీఆర్ అన్నారు.

No comments:

Post a Comment