ఖమ్మం : గాంధీచౌక్ వరప్రదాత షిర్డిసాయి మందిరంలో గురుపౌర్ణమి వేడుకల మహోత్సవంలో రెండోవ రోజు సందర్భంగా సోమవారం ఉదయం నుండి గణపతి పూజ , మంటప ఆరాధన , శ్రీ సాయినాధునికి "చందనం (గంధం)" తో అభిషేకం మరియు “రుద్ర హోమం" సాయి హారతులు , నీరాజన మంత్రపుష్పము , చతుర్వేదస్వస్తి , పవళింపుసేవ వంటి కార్యక్రమాలను నిర్వహించారు . ఈ కార్యక్రమంలో ఆలయం కమిటీ చైర్మన్ వేములపల్లి వెంకటేశ్వరరావు దంపతులు , కార్యదర్శి అర్వపల్లి నిరంజన్ , కోశాధికారి కురువెళ్ల జగన్మోహన్ రావు , సుమారుగా సాయినాథుని మాలధారణ ధరించిన 3వందల మంది భక్తులు తదితరులు పాల్గొన్నారు .
No comments:
Post a Comment