Sunday, 17 July 2022

ఉజ్జయిని మహంకాళికి ఆషాఢ బోనాలు.. బోనం సమర్పించిన మంత్రి తలసాని..


ప్రతి ఏటా ఆషాఢ మాసంలో జరిగే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతర బోనాల జాతర. శివ సత్తులతో, పోతారాజుల నృత్యాలతో, బోనం ఎత్తిన మహిళలతో అంగరంగ వైభవంగా మొదలైంది దాదాపుగా #202  సంవత్సరల చరిత్ర కలిగిన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఆదివారం ఉదయం తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తొలి బోనం సమర్పించారు..  ఆలయం నిర్మాణంకు ప్రేరణ ఒక ఆర్మీ జవాన్.. సికింద్రాబాద్ నివాసి అయిన #సురటిఅప్పయ్య 1813 ప్రాంతాల్లో ఆర్మీలో డోలి బేరర్ గా పని చేసేవాడు. అతను బదిలీపై మధ్యప్రదేశ్ ఉజ్జయిని ప్రాంతానికి వెళ్ళాడు. ఆ సమయంలో కలరా వ్యాధి ప్రబలి వేలాది మంది చనిపోయారు అప్పుడు అప్పయ్య ఉజ్జయిని లోని మహంకాళి అమ్మవారిని  దర్శించుకున్నారు. ఆ ప్రాంతం నుంచి కలరా వ్యాధి ప్రారదొలితే సికింద్రాబాద్ లో అమ్మవారి విగ్రహం ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తాను అని మొక్కుకున్నాడు.  ఆయన కోరిక నెరవేరడం తో 1815లో ఇప్పుడు అమ్మవారు ఉన్న చోటునే అమ్మవారిని ఏర్పాటు  చేశారు. ఉజ్జయిని మహంకాళి గా నామకరణం చేశారు. ఆ ప్రాంతం అంత అప్పటి కాలంలో అడవి లాగా ఉండేది. ప్రక్కనే ఉన్న బావి మరమ్మతూ చేస్తుంటే అందులో శ్రీ మాణిక్యాలమ్మ విగ్రహం లభ్యమైంది. ఈ విగ్రహాన్ని అమ్మవారి కుడివైపున ప్రతిష్ట చేశారు.  అప్పటి నుంచి #సురటిఅప్పయ్య  కుటుంబ సభ్యులు ఆలయ ధర్మకర్తలుగా  వ్యవహరిస్తున్నారు.  1953లో దేవాదాయ ధర్మాదాయ శాఖా ఆలయాన్ని ఆధీనంలోకి తీసుకొని అభివృద్ధి కార్యక్రమాన్ని చేపడుతూ వస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటీ అంటే ఈ ఆలయం లో అమ్మవారి విగ్రహాన్ని #కట్టేవిగ్రహం. కట్టేతొ విగ్రహాన్ని నిర్మించారు. 
ఆలయ దర్శన వేళలు : 
ప్రతి రోజు 6am to 12pm
12pm నుంచి 4pm వరకు బ్రేక్
తిరిగి 4pm to 9pm

ప్రత్యేక రోజు మరియు బోనాల పండుగ రోజు ఉదయం 4.00 గంటలకు దర్శనం ప్రారంభము అవుతుంది.

#ఆలయచిరునామా : శ్రీ మహంకాళి ఆలయం, జనరల్ బజార్ , సికింద్రాబాద్ - 500003

#చేరుకునేమార్గాలు : 
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కేవలం 1.5 Kms దూరంలో మాత్రమే ఆలయం ఉంది.  ప్రతి 1 గంటకు ఫలక్ నామా స్టేషన్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు Mmts ట్రైన్ లు కలవు టికెట్ ధర 10/-

#బస్ రూట్ :
రాష్టంలో ఏ ప్రాంతం నుంచి అయిన MGBS బస్ స్టాండ్ కి చేరుకొని అక్కడి నుంచి ఈ ఆలయంకి కూడా చేరుకోవచ్చు. MGBS నుంచి 3 number bus వెళుతుంది. 
మెహిందీపట్నం నుంచి కూడా ఈ ఆలయం కు చేరుకోవచ్చు.  మెహిందీపట్నం నుంచి 5K, 5M , 49M బస్ లు బయలుదేరుతాయి. 
(From internet Desk)

No comments:

Post a Comment