Monday, 4 July 2022

నాటి పోరాటాలు నేటి యువతకు స్ఫూర్తి.. దొడ్డి కొమరయ్య విగ్రహావిష్కరణ సభలో పువ్వాడ...


ఖమ్మం : కొమరయ్య గారి విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి పువ్వాడ, CPI జాతీయ నాయకులు పువ్వాడ నాగేశ్వర రావు .తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు, తొలి అమరుడు, పేదలను చైతన్యపర్చడంతో పాటు వెట్టిచాకిరికి వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో దొడ్డి కొమురయ్య చూపిన సాహసం నేటి తరానికి స్ఫూర్తిగా తీసుకోవాలి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు.
 దొడ్డి కొమరయ్య గారి వర్ధంతి సందర్భంగా సోమవారం ఖమ్మం లాకరం ట్యాంకు బండ్ నందు ఎర్పాటు చేసిన కొమరయ్య గారి విగ్రహాన్ని, CPI జాతీయ నాయకులు, మాజి శాసనసభ్యులు పువ్వాడ నాగేశ్వర రావు గారితో కలిసి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లడుతూ..
భుమి, భుక్తి కోసం నాడు పోరాడిన దొడ్డి కొమురయ్య గారు అమరత్వం పొంది నేటికీ 76 ఏళ్లయిందని, నాడు విస్నూరు రామచంద్రారెడ్డి పెత్తందారీతనానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో వేలాది మందితో దండుకట్టి తెలంగాణ కొసం పోరాడిన వీరుడని కొనియాడారు.
కొందరి చేతిలోనే కేంద్రీకృతమైన వేలాది ఎకరాల భూమిని వారి కబంధ హస్తాల నుంచి విముక్తి చేసి పేదలకు పంచిన చరిత్ర ఈ ఉద్యమానికి ఉందన్నారు.
వెట్టి చాకిరీ నుంచి సామాన్యులకు విముక్తి కలిగించిన పోరాటమని, ప్రపంచ పోరాటాల చరిత్రతో పోలిస్తే తెలంగాణ రైతాంగ సాయుధ పోరుకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. 
భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో దొడ్డి కొమురయ్య గారు తుపాకి తూటాలకు ఎదురొడ్డి వీర మరణం పొందారని పేర్కొన్నారు.
కొమురయ్య పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
వారి చేపట్టిన పోరాట స్ఫూర్తితోనే ఉద్యమ నాయకుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఅర్ గారు పూర్తి చేశారని అన్నారు. 
వారు చూపిన మార్గంలోనే తెలంగాణ పోరాటం చేపట్టి సుధీర్ఘ కాలం అయిన తరువాత తెలంగాణను సాదించుకుని స్వయం పాలన చేసుకుంటున్నామని వివరించారు.
తెలంగాణ వైతాళికుల ఔన్నత్యాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ట్యాంక్ బండ్ పై తెలంగాణ వైతాళికుల విగ్రహాలను నెలకొల్పుతామని వివరించారు.
నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఅర్ గారు రాష్ట్రంలోని అన్ని కుల వృత్తులను ఆదుకుని వారి అభ్యున్నతికి పెద్ద పీట వేశారని, ప్రత్యేక నిధులు ఇస్తు వారి వృత్తులను ప్రోత్సహిస్తున్నారని అన్నారు.

కులమతాలకు అతీతంగా బడుగు బలహీనర్గాలకు తెలంగాణ ప్రభుత్వం నేడు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అన్ని రంగాల సంక్షేమం, అభివృద్ధిని కొనసాగిస్తు వారి ఆశయ సాధనాలను సాధించారని వివరించారు.
*ప్రజలలో నుండి పుట్టినవాడే దొడ్డి కొమరయ్య.. పువ్వాడ నాగేశ్వర రావు 
తెలంగాణ తొలి ఉద్యమంలో ముందుండి పోరాటం చేసి తెలంగాణ కోసం నేలకొరిగిన తోలి కమ్యునిస్టు వీరుడు అని కొనియాడారు.
తూటాలకు ఎదురొడ్డి పోరాడిన ఘనుడు, లక్షల మందికి స్ఫూర్తినిచ్చిన వీరుడని అన్నారు.
సామాజిక స్పృహతో రజాకర్లతో పోరాడారు అని, ఎందరినో చైతన్య పరచి ముందుండి నడిపించారు అన్నారు.
తెలంగాణ సాయుధ పోరాటానికి స్ఫూర్తిగా నిలిచిన కోమరయ్య గారి విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం కలిగినందుకు అదృష్టంగా భావిస్తున్నానన్నారు.
నేడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని అనుభవిస్తున్నాం అంటే అది కేవలం నాటి కొమరయ్య పొరట భీజమే అన్నారు.
కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం గారు, మేయర్ పునుకొల్లు నీరజ గారు, మాజి ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ గారు, జిల్లా నాయకులు RJC కృష్ణ గారు, TRS నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు గారు, మేకల మల్లిబాబు యాదవ్ గారు, మేకల సుగుణ రావు గారు, మాజి ఎమ్మేల్యే చంద్రావతి గారు, CPI జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ గారు, బాగం హేమంతరావు గారు, అల్లిక వేంకటేశ్వర్లు గారు, చిన్నం మల్లేశం గారు, రాజేష్, వెంకటనారాయణ,  గోపాల్, ఉపేందర్, సింహాద్రి యాదవ్, పోదిల చిన్న పాపారావు, లింగయ్య తదితరులు ఉన్నారు.

No comments:

Post a Comment