*న్యూఢిల్లీ*
_*కాలాలకు అతీతం భగవద్గీత..*_
*భగవద్గీత పఠనం అంటే అన్ని గ్రంథాలనూ చదవడంతో సమానమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు.*
★ దీన్నుంచి ఏ తరం వారైనా సమాధానాలు పొందొచ్చని అభిప్రాయపడ్డారు.
★ భగవద్గీతను మహాత్మాగాంధీ అమ్మగా భావించారంటే దానికున్న శక్తిని గుర్తించవచ్చని అన్నారు.
★ ‘రాజస్థాన్ పత్రిక’ ప్రధాన సంపాదకులు గులాబ్‌చంద్ కొఠారీ రాసిన ‘ది గీత విజ్ఞాన ఉపనిషత్’ పుస్తకాన్ని సీజేఐ మంగళవారం సాయంత్రం దిల్లీలో లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాతో కలిసి ఆవిష్కరించారు.
★ ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ స్వతంత్ర జర్నలిజం ప్రజాస్వామ్యానికి వెన్నెముక అని, పాత్రికేయులే ప్రజల కళ్లు, చెవులని అభివర్ణించారు.
★ వాస్తవాలను బయటపెట్టడం మీడియా సంస్థల బాధ్యత అని పేర్కొన్నారు.
★ భారతీయ సామాజిక పరిస్థితుల్లో పత్రికల్లో ప్రచురితమైనదంతా నిజమేనని నమ్ముతారు కాబట్టి మీడియా నిజాయతీగా పాత్రికేయ వృత్తికే కట్టుబడి ఉండాలని అన్నారు.
★ భారత్ పురాణాలకు నిలయం. ఈ ఆధునిక యుగంలోనూ మన దేశం ఆధ్యాత్మిక కేంద్రంగా కొనసాగుతోంది.
★ భారత్ ఎంత గొప్పదో చెప్పడానికి భగవద్గీత ఒక్కటి చాలు.
★ _*‘అనుమానాలు వెంటాడినప్పుడు, నిరుత్సాహం అలుముకున్నప్పుడు, విశ్వాసంలో ఒక్క వెలుగురేఖ కూడా కనిపించనప్పుడు నేను భగవద్గీతలో నాకు సౌకర్యవంతమైన శ్లోకాన్ని చదివేవాడ్ని. మనసులో వెంటనే ఆనందం వికసించేది..’*_ అని మహాత్మాగాంధీయే చెప్పారు.
★ గీత వెనుక ఉన్న సిద్ధాంతం కాలాలకు అతీతం.
★ ధర్మ, కర్మమే గీతా సారాంశం.
★ గీతా బోధన మతాలు, సమయం, వయసుకు అతీతం.
★ నిజమైన మతానికి పునాది కరుణ, ధర్మమే.
★ ఆధునిక ప్రపంచంలో మొత్తం సమాచారం మన ముందు ఉంటోంది.
★ అయితే దాన్ని నైతిక విలువలతో ఉపయోగించుకోవాలి.
★ ఆ విలువలే మనల్ని పరిస్థితులతో సంబంధం లేకుండా సరైన దారిలో నడిచేలా నిర్దేశం చేస్తాయి.
★ అలాంటి విలువలను గీత నేర్పుతుంది.
★ దాన్ని సూక్ష్మంగా అధ్యయనం చేసేవారు తప్పకుండా వర్తమాన అర్థాలను గ్రహిస్తారు.
★ అందుకే ఎన్నో ఉద్యమాలకు, నాయకులకు భగవద్గీత స్ఫూర్తి.
★ గీతలో చెప్పిన సేవా సిద్ధాంతం ద్వారానే మహాత్మాగాంధీ స్ఫూర్తి పొందారు.
ఇది మానవజాతికి అందుబాటులో ఉన్న శాశ్వతజ్ఞానం.
రాజస్థాన్ పత్రిక ప్రాంతీయ భాషలకే పరిమితం కావడాన్ని అభినందిస్తున్నా. భారతీయ భాషలను ప్రోత్సహించడం నా మనసుకు నచ్చిన అంశం. వాటికి తగిన గౌరవం ఇవ్వాలి. అలాగే యువతను మాతృభాషల్లోనే ఆలోచించి నేర్చుకొనేలా ప్రోత్సహించాలి. అప్పుడే వారు అత్యున్నత స్థానానికి చేరడానికి వీలవుతుంది’’*_ అని జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు.
మన పనితో ఎవరికీ ఇబ్బంది కలిగించకూడదన్నదే ప్రతి ధర్మం సిద్ధాంతమని, రాజ్యాంగ నిర్మాతలు ధర్మం ఆధారంగానే రాజ్యాంగాన్ని రచించారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో గులాబ్‌చంద్ కొఠారీ, కేంద్ర మంత్రులు గజేంద్రసింగ్ షెకావత్, మీనాక్షి లేఖి, ఎంపీ రఘురామకృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు.*
No comments:
Post a Comment