అమర్నాథ్ యాత్ర తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. రాజమహేంద్రవరం నుంచి అమర్నాథ్ యాత్రకు వెళ్లిన 37మందిలో ఇద్దరు మహిళలు గల్లంతయ్యారు. మిగతా 35మంది సురక్షితంగా ఉన్నట్టు అధికారులు ప్రకటించారు. కొవ్వూరు ఆర్డీవో మల్లిబాబు కథనం ప్రకారం రాజమహేంద్రవరం నుం చి 20 మంది, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన బంధువులతో కలుపుకొని మొత్తం 37 మంది ఈ నెల 1న అమర్నాథ్ యాత్రకు వెళ్లారు. అమర్‌నా థ్ ఆలయ సమీపంలో శుక్రవారం సంభవించిన వరదలో కొత్త పార్వతి, గునిశెట్టి సుధ గల్లంతయ్యారు. పార్వతి భర్త మార్కండేయులు, సుధ భర్త కిరణ్ మాత్రం క్షేమంగా బయటపడ్డారు. దీంతో ఈ ఇద్దరూ గల్లంతైన వారి ఆచూకి కోసం ఎదురు చూస్తూ అక్కడే ఉండిపోయారు. కా గా.. ఆదివారం సాయంత్రం వరకూ మిస్సింగ్ లిస్ట్‌లో ఉన్న కొత్త శ్రీనివాసరావు, కొత్త విశ్వనాఽథ్, కొత్త వర్ధన్ సురక్షితంగా ఉన్నారు. ఆదివారం సాయంత్రం వారు పెవల్‌గామ్ అనే గ్రామం నుంచి జమ్మూకు బయలుదేరినట్టు ఆర్డీవో తెలిపారు. ఈ మేరకు గోకవరంలో ఉన్న వారి బం దువు ఒకరికిఒకరికి వారి నుంచి సమాచారం వచ్చినట్టు ఆయన తెలిపారు.
పశ్చిమ వాసుల నుంచి సమాచారంపశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఇటీవల అమర్నాథ్ యాత్రకు వెళ్లిన యాత్రికులు క్షేమంగా ఉన్నట్టు ఆదివారం సమాచారం అందింది. భీమవరం నుంచి వెళ్లిన 32 మంది అమర్నాథ్ యాత్ర ముగించుకునికశ్మీర్‌లోని గుల్మార్గ్ ప్రాంతానికి చేరినట్టు వారు ఫోన్‌లో తెలిపారు. ఈ మేరకు వారు తాము క్షేమంగా ఉన్నామంటూ బంధువులకు ఫొటోలు కూడా పంపించారు. అలాగే తాడేపల్లిగూడెం నుంచి వెళ్లిన 70 మంది యాత్రికులు క్షేమంగా ఉన్నట్టు అధికారికంగా సమాచారం అందింది
No comments:
Post a Comment