Wednesday, 28 October 2020

ఖైదీలకు బేడీలు వేసి అతి ఉత్సాహం ప్రదర్శించిన పోలీసులపై చర్యలు తీసుకున్న రూరల్ ఎస్పీ విశాల్ గున్ని*

గుంటూరుజిల్లా

నరసరావుపేట ప్రత్యేక మొబైల్ కోర్టు ఉత్తర్వుల మేరకు నరసరావుపేట సబ్ జైలు నుండి జిల్లా జైలు గుంటూరుకు వివిధ కేసులలో రిమాండ్ ఖైదీలుగా ఉన్న 43 మందిని తరలించే క్రమంలో,ఖైదీల చేతులకు బేడీలు వేసి అతి ఉత్సాహం ప్రదర్శించిన ఘటనలో బాధ్యులైన పోలీసులపై  శాఖా పరమైన చర్యలు తీసుకున్న గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గున్ని

ఈ ఘటనకు సంబంధించి ఆరుగురు హెడ్ కానిస్టబుళ్ళను సస్పెండ్ చేశారు, ఆర్ఎస్ఐ,ఆర్ఐ లకు ఛార్జ్ మెమోలు జారీ చేశారు

ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు నిమిత్తం అదనపు ఎస్పీ స్థాయి పోలీస్ అధికారిని నియమించారు

Monday, 26 October 2020

నేటి నుంచి శ్రీ వారి తిరుకల్యాణోత్సవాలు


 ద్వారకాతిరుమల శ్రీవారి నిజ ఆశ్వయుజ మాస తిరుకల్యాణోత్సవాలు నేటి నుంచి నవంబరు 2 వరకు ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. సోమవారం ఉదయం 9 గంటలకు స్వామి వారిని పెండ్లి కుమారునిగా, పద్మావతి, ఆండాళ్ అమ్మవార్లను పెండ్లికుమార్తెలుగా చేయడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఈవో భ్రమరాంబ తెలిపారు.

Saturday, 24 October 2020

చక్ర స్నానం.. చక్రీస్నానం లోకహితం @ నవరాత్రి బ్రహ్మోత్సవాలు,తిరుమల.

తొమ్మిదిరోజుల ఉత్సవాలలో జరిగిన అన్ని సేవలూ సఫలమై లోకం క్షేమంగా ఉండడానికీ, భక్తులు సుఖశాంతుల‌తో ఉండడానికీ చక్రస్నానం నిర్వహించారు. ఉత్సవాలు ఒక యజ్ఞమే కనుక యజ్ఞాంతంలో అవభృథస్నానం చేస్తారు.
యజ్ఞనిర్వహణంలో జరిగిన చిన్నచిన్న లోపాలవల్ల ఏర్పడే దుష్పరిణామాలు తొలగి, ఉత్సవాలు చేసినవారికి, చేయించినవారికి, ఇందుకు సహకరించినవారికీ, దర్శించిన వారికీ - అందరికీ ఈ ఉత్సవ యజ్ఞఫలం లభిస్తుంది.

Friday, 23 October 2020

కలౌ వెంకటనాయకః... కల్కి అవతారంలో గుర్రం నెక్కి దర్శనం ఇచ్చిన మలయప్ప @ నవరాత్రి బ్రహ్మోత్సవాలు, తిరుమల..

తిరుమల శ్రీవారి న‌వ‌రాత్రి‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన శుక్ర‌వారం రాత్రి 7 గంట‌ల‌కు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో శ్రీమలయప్పస్వామి వారు క‌ల్కి అలంకారంలో అశ్వ వాహ‌నంపై దర్శనమిచ్చారు.
ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వవాహనాదిరూఢుడై కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండాలని నామ సంకీర్తనాదులను ఆశ్రయించి తరించాలని భక్తులకు స్వామి ప్రబోధిస్తున్నాడు.

సర్వభూపాల వాహ‌నంపై శ్రీదేవి భూదేవి స‌మేత శ్రీ‌మలయప్ప..


శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా  శుక్రవారం ఉదయం శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణ మండ‌పంలో శ్రీమలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి సర్వభూపాల వాహ‌నంపై దర్శనమిచ్చారు.
#సర్వభూపాలవాహ‌నం  #య‌శోప్రాప్త సర్వభూపాల అంటే అందరు రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు.
వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనసేవ నుంచి గ్రహించవచ్చు...🌷🙏

Thursday, 22 October 2020

చంద్రప్రభ వాహనంపై వెన్న‌ముద్ద కృష్ణుడి అలంకారంలో శ్రీ మ‌ల‌య‌ప్ప‌ స్వామి వారు

*శ్రీవారి నవరాత్రి‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు గురువారం రాత్రి 7.00 గంట‌లకు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో శ్రీ మలయప్పస్వామివారు వెన్నముద్ద కృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు.* 
*చంద్ర‌ప్రభ వాహనం - సకలతాపహరం*
*చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడశ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం.చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది.భక్తుల కళ్లు వికసిస్తాయి. భక్తుల హృదయాల నుండి అనందరసం స్రవిస్తుంది.ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది.*🌻🌲🌷🙏

నాయిని అంత్యక్రియలు పూర్తి.. నివాళులు అర్పించిన కేటీఆర్

బుధవారం అర్ధరాత్రి కన్నుమూసిన టీఆర్ఎస్‌ సీనియర్ నేత, మాజీ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు ముగిశాయి... అంత్యక్రియల్లో భాగంగా నాయిని పాడెను మోశారు మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్.. తదితర ప్రజాప్రతినిధులు.. ఇక, నాయినిని కడసారి చూసేందుకు జనం, టీఆర్ఎస్‌ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.. మినిస్టర్స్ క్వార్టర్స్ నుంచి జూబ్లీహిల్స్ మహాప్రస్థానం వరకు అంతమియాత్ర కొనసాగింది.. మహాప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు.. అంత్యక్రియల్లో కేటీఆర్ సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ శ్రేణులు, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.  86 సంవత్సరాల నాయిని నర్సింహారెడ్డి బుధవారం అర్ధరాత్రి 12.25 గంటలకు మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. గత నెల 28వ తేదీన కరోనా బారినపడిన ఆయన బంజారాహిల్స్‌లోని సిటీన్యూరో సెంటర్‌ దవాఖానలో 16 రోజులపాటు చికిత్స పొందారు. వారంరోజుల క్రితం నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగెటివ్‌ వచ్చినప్పటికీ.. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ సోకడంతో కుటుంబసభ్యులు అపోలో ఆస్పత్రికి తరలించారు.. అప్పటినుంచి వెంటిలేటర్‌పై చికిత్స పొందారు. కేటీఆర్, హరీష్‌రావు ఆయనను పరామర్శించగా.. బుధవారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్‌ కూడా అపోలో ఆస్ప్రతిలో నాయినిని పరామర్శించారు. కానీ, రాత్రి నాయిని ఆరోగ్యం క్షీణించిండంతో కన్నుమూశారు.. 1934 మే 12న నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం నేరడుగొమ్ము గ్రామంలో జన్మించిచారు.. హెచ్‌ఎస్‌సీ వరకు విద్య నభ్యసించిన నాయిని.. 1969 తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 1969లో జయప్రకాశ్‌నారాయణ శిష్యుడిగా జనతాపార్టీ నుంచి రాజకీయజీవితాన్ని ప్రారంభించారు. 1978, 1985లో జనతాపార్టీ తరఫున ముషీరాబాద్‌ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లో టీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది.. నాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 2014 జూన్‌ 2న ఏర్పడిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర మొదటి హోంశాఖ మంత్రిగా పనిచేశారు. గవర్నర్‌ కోటాలో శాసనమండలికి ఎంపికైన ఆయన పదవీకాలం 2020 ఏప్రిల్‌తో ముగిసింది. నాయిని నర్సింహారెడ్డి టీఆర్‌ఎస్‌ పార్టీని స్థాపించిన నాటినుంచి తుదిశ్వాస విడిచేవరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంటే నడిచారు. ఆయనకు భార్య అహల్యారెడ్డి, కుమారుడు దేవేందర్‌రెడ్డి, కూతురు సమంతరెడ్డి ఉన్నారు.99టీవీ

మహాబూబాబాద్ బాలుడి కధ దుఃఖాంతం... కాసుల కొసం కాదు.. కపట మానసిక ఉన్మాదంతోనే..


నవమాసాలు కడుపులో కాచి రక్షించిన తల్లి కంట కన్నీరు మున్నీరైంది...కొడుకు కంటే డబ్బులు ఏం నాకు ఎక్కువ కాదు నా పొలం ఇస్తా..డబ్బులు.. బంగారం ఇస్తా నా కొడుకును ఇవ్వండి అంటి భోరుమంది. అయినా ఆ కరుడుగట్టిన కసాయి మనసులు కరగలేదు..45 లక్షల రూపాయలను లెక్క బెడుతూ వీడియో పంపండి నీ బిడ్డను ఒప్ప చెబుతాం అంటూ నమ్మ బలికారు..డబ్బుల లెక్క చెబుతు ఆ తల్లి అన్న నా బిడ్డను వదలేయండి అంటూ  వేడుకుంది. అయినా ఆమెకు బిడ్డ దక్కలేదు. 
నవ వసంతం అడుగిడిన బిడ్డడిని కాసాయిలు అపహరించిన నాడే ఊపిరి తీసి..ఆ తల్లి ఉసురు పోసుకున్నారు..
 పట్టణానికి చెందిన కుసుమ దీక్షిత్‌రెడ్డి(9) కిడ్నాప్‌ కథ విషాదాంతమైంది. కేసముద్రం మండలం అన్నారం శివారులోని గుట్టపై బాలుడి మృత దేహాన్ని గురువారం ఉదయం పోలీసులు గుర్తించారు. బాలుడి మృతి వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కిడ్నాపర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. ఉదయం 11 గంటలకు  జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మీడియా సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.
అసలేం జరిగింది....
మహబూబాబాద్‌లోని కృష్ణ కాలనీలో నివాసం ఉంటున్న రంజిత్‌, వసంతల పెద్ద కుమారుడు దీక్షిత్‌రెడ్డి(9) ఇంటి ముందు ఆడుకుంటుండగా ఆదివారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి ద్విచక్ర వాహనంపై వచ్చి అపహరించుకుపోయాడు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో పరిసర ప్రాంతాలలో వెతుకగా ఓ వ్యక్తి ద్విచక్రవాహనంపై తీసుకెళ్లారని తోటి మిత్రులు తల్లిదండ్రులకు చెప్పారు. రాత్రి 9 గంటల 45 నిమిషాలకు కిడ్నాపర్లు తల్లి వసంతకు ఫోన్ చేసి రూ.45 లక్షలు ఇస్తే విడిచిపెడతామని, ఈ విషయాన్ని మీరు ఎక్కడా చెప్పవద్దు, పోలీసులకు కంప్లైంట్ చేయవద్దు, మీ ఇంటి పరిసర ప్రాంతాలలో మా వ్యక్తులు ఉన్నారంటూ బెదిరించారు.  మీరు ఏం చేసినా తమకు తెలుస్తుందని, మీ బాబుకు జ్వరం గా ఉంది మాత్రలు కూడా వేశాం అని చెప్పి ఫోన్ పెట్టేశారు.
మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో మరోసారి ఫోన్ చేసి.. డబ్బులు సిద్ధం చేయండి.. బుధవారం ఫోన్‌ చేస్తానని చెప్పినట్లుగానే అగంతకుడు బుధవారం ఉదయం 11 గంటలకు ఫోన్‌ చేశాడు. డబ్బు సిద్ధం చేసుకుని జిల్లా కేంద్రంలోని మూడు కొట్ల ప్రాంతానికి రావాలని సూచించాడు. కిడ్నాపర్‌ డిమాండ్‌ చేసిన సొమ్ములో తమకు వీలు చిక్కినంత డబ్బు అతడికి ఇచ్చేందుకు బాలుడి తల్లిదండ్రులు సిద్ధమయ్యారు. తెలిసిన వారి దగ్గరి నుంచి కొంత సొమ్ము సమీకరించారు. మధ్యాహ్నం 1 గంటకు కిడ్నాపర్‌ చెప్పినట్లుగా బాలుడి తండ్రి రంజిత్‌ ఆ డబ్బుతో కూడిన బ్యాగ్‌ను తీసుకుని మూడు కొట్ల ప్రాంతానికి వెళ్లాడు. అగంతకుడు సూచించిన నిర్దిష్ట ప్రాంతంలో అతని కోసం బుధవారం రాత్రి వరకూ వేచి చూశారు. ఆ ప్రాంతంలో మాటువేసిన పోలీసులు అర్ధరాత్రి సమయంలో కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

సూర్యప్రభలో..కోటి సూర్యకాంతులతో భక్తులను కటాక్షించిన తిరు వెంకటాదీశుడు @ తిరుమల బ్రహ్మోత్సవాలు

శ్రీవారి న‌వ‌రాత్రి‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు గురు‌‌‌వారం ఉదయం 9 గంట‌ల‌కు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో శ్రీ మలయప్పస్వామివారు త్రివిక్ర‌మ అలంకారంలో దర్శనమిచ్చారు.
సూర్యప్రభ వాహనం - ఆయురారోగ్య‌ప్రాప్తబ్రహ్మోత్సవాలలో ఏడవ రోజు ఉదయం సూర్యనారాయణుడు సూర్యప్రభామధ్యస్తుడై దివ్యకిరణ కాంతుల్లో ప్రకాశిస్తూ సూర్యప్రభ వాహనంలో దర్శనమిచ్చారు. సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ, సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. ఇంతటి మహాతేజఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.

        రాత్రి 7 గంటలకు చంద్ర‌ప్ర‌భ ‌వాహనంపై శ్రీ‌మ‌ల‌య‌ప్ప‌స్వామివారు అనుగ్ర‌హిస్తారు.

Wednesday, 21 October 2020

బాసర సరస్వతి అమ్మవారి సన్నిధిలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి


శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి  ఇంద్రకరణ్ రెడ్డి బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కుటుంబ సమేతంగా బుధవారం అమ్మవారిని దర్శించుకున్న  మంత్రి దంపతులకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.  ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి పనుల పురోగతిపై ఆలయ అధికారులతో మంత్రి చర్చించారు. నవరాత్రి ఉత్సవాలు బుధవారం 5 వ రోజు మూల నక్షత్రం కావడంతో ఆలయాన్ని అధికారులు విద్యుత్ దీపాలతో అలంకరించారు అమ్మవారు 5 వ రోజు స్కంద దేవి రూపంలో దర్శనమిచ్చారు. అనంతరం ఆలయ ఈవో వినోద్ రెడ్డి శాలువ తో సన్మానించి అమ్మవారి వారికి తీర్థ ప్రసాదాలతో బాటు అమ్మవారి ఆశీస్సులను అందించారు.మంత్రి వెంట ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ శ్రీనివాస రావు, ఈవో వినోద్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

పుష్ప‌క విమానంలో గోవర్ధన కృష్ణుడైన గోవిందుడు @ బ్రహ్మోత్సవాలు తిరుమల


 శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజైన బుధ‌‌వారం మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు  శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో రుక్మిణి స‌త్య‌భామ స‌మేత గోవర్ధనగిరి దారుడైన శ్రీకృష్ణుని అలంకారంలో శ్రీ మ‌ల‌య‌ప్పస్వామివారు  ‌పుష్ప‌క విమానంలో అభ‌య‌మిచ్చారు.  పుష్ప‌క విమానం మూడు సంవత్సరాలకు ఒకసారి వచ్చే అధిక మాసం సంద‌ర్భంగా నిర్వ‌హించే నవరాత్రి బ్రహ్మోత్సవాలలో నిర్వ‌హిస్తారు. వాహనసేవల్లో అలసిపోయే స్వామి, అమ్మ‌వార్లు సేద తీరడానికి పుష్ప‌క విమానంలో వేంచేపు చేస్తారు. 

           ఈ ప్రత్యేకమైన విమానం కొబ్బరి చెట్ల ఆకులతో తయారు చేశారు. ఇది 15 అడుగుల ఎత్తు, 14 అడుగుల వెడల్పు 750 కేజిల బ‌రువు ఉంటుంది. ఇందులో 150 కేజిల మల్లి,  క‌న‌కాంబ‌రం, మొల్ల‌లు, వృక్షి, చామంతి, లిల్లి, తామరపూలు, రోజాలు తదితర 9 రకాల సాంప్రదాయ పుష్పలు ఉప‌యోగించారు. 

           శ్రీ‌వారి పుష్ప‌క విమానాన్ని మూడు ద‌శ‌ల‌లో ఏర్పాటు చేశారు. విమానంకు ఇరువైపులా శ్రీ ఆంజ‌నేయ‌స్వామి, శ్రీ గ‌రుడ‌ళ్వార్‌ న‌మ‌స్క‌రిస్తున్నట్లుగా, మొద‌టి ద‌శ‌లో అష్టలక్ష్ములు, రెండ‌వ ద‌శ‌లో ఏనుగులు, చిల‌క‌లు, మూడ‌వ ద‌శ‌లో నాగ ప‌డ‌గ‌ల ప్ర‌తిమ‌ల‌తో రూపొందించారు.  తమిళనాడులోని సేలంకు చెందిన 20 మంది, టిటిడి గార్డెన్ విభాగంకు చెందిన 10 మంది వారం రోజుల ‌పాటు శ్ర‌మించి ఈ అద్భుతమైన విమానంను సిద్ధం చేశార‌ని టిటిడి గార్డెన్ విభాగం డెప్యూటీ డైరెక్ట‌ర్‌ శ్రీ శ్రీ‌నివాసులు తెలిపారు. తమిళనాడు చెన్నైకు చెందిన దాత శ్రీ రాంప్ర‌సాద్ బ‌ట్టు‌ శ్రీవారి పుష్ప‌క విమానాన్ని ఆకర్షణీయంగా రూపొందించేందుకు సహాకారాన్ని అందించారు.

Tuesday, 20 October 2020

గరుడ గమనుడైన నారాయణుడు @ తిరుమల బ్రహ్మోత్సవాలు

 నవరాత్రి బ్రహ్మోత్సవాలలలో ‌మ‌ల‌య‌ప్ప‌స్వామివారు గరుడునిపై దర్శనమిచ్చారు....
గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. 
గ‌రుడ వాహ‌నం - స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్ పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. 
జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.

మోహినీ రూపంలో మలయప్ప @ తిరుమల బ్రహ్మోత్సవాలు

శ్రీవారి న‌వ‌రాత్రి‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు మంగ‌ళ‌‌‌వారం ఉదయం 9 గంట‌లకు  శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో శ్రీ మలయప్పస్వామివారు మోహినీ రూపంలో శృంగార  రసాధి దేవతగా సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చారు. పక్కనే మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై అభయమిచ్చారు.ఈ అవతారం ద్వారా జగత్తు అంతా మాయామోహానికి లొంగివుందని, అదంతా తన లీలా విలాసమేనని, తన భక్తులు కానివారు ఈ జగన్మాయలోలులు కాక తప్పదని స్వామివారు ఈ రూపంలో చాటి చెబుతున్నారు.

Sunday, 18 October 2020

ముత్యపు పందిరి వాహనంపై గోవిందుడు - బ్రహ్మచారిణిగా మహాలక్ష్మి @ నవరాత్రి బ్రహ్మోత్సవాలు

తెలుగు రాష్ట్రాల్లో ఓ వైపు నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. మరోవైపు శరన్నవరాత్రి దేవి పూజలు కన్నులకు కడుతున్నాయి..
* నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో..ఆదివారం ఉదయం తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం సింహ‌ వాహనంపై యోగ‌న‌ర‌సింహుడి అవతారంలో శ్రీవారు దర్శనమిచ్చారు. ఆల‌య మాడా వీధుల్లో స్వామి వారు విహరించి భక్తులను కటాక్షించారు. దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం స్వామి వారు సింహ వాహ‌నాన్ని అధిష్టించా రని పండితులు పేర్కొన్నారు. కాగా, సింహ వాహనం దర్శించిన భక్తులకు విజ‌యం వరిస్తుందని నమ్మకం. ఉదయం గోవింద మాల ధరించిన ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి దంపతులు వాహన సేవలో పాల్గొని వాహనాన్ని మోశారు. 
ముత్యపు పందిరి వాహనంపై..
రాత్రి ముత్యపు పందిరి వాహనం పై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించారు. ముక్తి సాధనకు ముత్యంలాంటి స్వచ్ఛమైన మనసు అవసరమని లోకానికి ఈ వాహనం ద్వారా స్వామి వారు చాటి చెప్పారు. కరోనా నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. ఉదయం జరిగిన సింహ వాహన సేవ లో, రాత్రి జరిగిన ముత్యపుపందిరి వాహన సేవలో పాల్గొన్న భక్తులు కర్పూర హారతులు పట్టారు. వాహన మోత సేవకునిగా మారిన చెవిరెడ్డి స్వామి వారిని సేవించారు. కంకణ దారి చెవిరెడ్డి సోదరుడు రఘునాథ్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. 
కన్నుల పండువగా ఉంజల్ సేవ..
ఆదివారం రాత్రి తుమ్మల గుంట ఆలయం వెలుపల కొలువు మండపంలో ఉంజల్ సేవ నేత్రపర్వంగా సాగింది. స్వామివారు వేణుగోపాలుని రూపంలో ఊయల ఊగుతూ భక్తులను కనువిందు చేశారు. అనంతరం జరిగిన ముత్యపు పందిరి వాహన సేవలో భక్తులు కరోనా నిబంధనలు పాటిస్తూ పాల్గొన్నారు. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో సంగీత కచేరీ అలరించింది.
ముత్యాల పందిరి కింద శ్రీదేవి భూదేవి లతో తిరుమల మలయప్ప...
మహారాష్ట్ర కొల్హపూర్ శక్తి పీఠం లో బ్రహ్మ చారిణిగా దర్శనం ఇస్తున్న మహాలక్ష్మి అమ్మ.

సింగమలైగా భక్తులకు అభయం ఇచ్ఛిన తిరుమల వాసుడు @ బ్రహ్మోత్సవాలు 3వరోజు,తిరుమల - తిరుపతి

తిరుమల శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన ఆది‌వారం ఉదయం 9 గంట‌లకు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో శ్రీ మలయప్పస్వామివారు సింహ‌ వాహనంపై అభ‌య ఆహ్వాన‌ న‌ర‌సింహ‌స్వామి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు... శ్రీవారు మూడో రోజు ఉదయం దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహ వాహ‌నాన్ని అధిరోహించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో 'సింహదర్శనం' అతి ముఖ్యమయింది. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంత‌మ‌వుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజ‌య‌స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు భక్తులకు తెలియ చేస్తున్నారు.
        రాత్రి 7 నుంచి 8 గంటల వరకు ముత్య‌పుపందిరి వాహనంపై స్వామివారు అభ‌య‌మిస్తారు.

Saturday, 17 October 2020

హంస వాహనంపై వీణ ధ‌రించి చదవులస‌ర‌స్వ‌తి దేవి అలంకారంలో గోవిందుడు @ నవరాత్రి బ్రహ్మోత్సవాలు

శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శ‌నివారం రాత్రి 7.00 గంట‌లకు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణ మండ‌పంలో శ్రీ మలయప్పస్వామివారు హంస వాహనంపై వీణ ధ‌రించి స‌ర‌స్వ‌తి దేవి  అలంకారంలో భక్తజనులకు దర్శనమిచ్చారు.  హంస వాహనసేవలో శ్రీ మలయప్పస్వామివారు జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు. ఐతిహ్యానుసారం బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక. పాలను, నీళ్లను వేరుచేసే విచక్షణ దీని స్వభావం. ఇది ఆత్మానాత్మ వివేకానికి సూచకం. అందుకే ఉపనిషత్తులు పరమాత్మతో సంయోగం చెందిన మహనీయులను పరమహంసగా అభివర్ణిస్తున్నాయి. శ్రీవారు భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్ర‌హ్మ‌ప‌ద ప్రాప్తి కలిగించేందుకే హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు ద్వారా తెలుస్తున్నాయి.

శిఖీపించంతో గోవిందుడు.. బ్రహ్మొత్సవాలలో 2వరోజు చిన్న శేషునిపై మలయప్ప...

శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు శ‌నివారం ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌రకు శ్రీ‌వారి ప్రధాన ఆల‌యంలోని క‌ల్యాణ మండ‌పంలో శ్రీ మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై నెమ‌లి పింఛం, గ‌ద‌తో దామోద‌ర కృష్ణుడి అలంకరణలో దర్శనమిచ్చారు. 
పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకి(నాగ‌లోకానికి రాజు)గా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుందని భక్తుల విశ్వాశం. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే కుటుంబ శ్రేయ‌స్సుతోపాటు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం.  రాత్రి 7 నుంచి 8 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు.

Friday, 16 October 2020

పెద్దశేషునిపై శ్రీనివాసుడు..మొదలైన నవరాత్రి బ్రహ్మోత్సవ వాహన సేవలు...

పెద్దశేష వాహనంపై శ్రీనివాసుడి వైభవం : 

బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజు  పెద్దశేష వాహనంపై స్వామివారు కొలువు తీరారు. కొవిడ్-19 నిబంధనల కారణంగా .శ్రీవారి కళ్యాణ మండపంలో ఏకాంతంగా శ్రీవారిని పెద్ద శేషవాహనంపై ఆశీనులుగా జేశారు..
నిత్యసేవకుడైన  శేషుణ్ణీపై స్వామిని దర్శిస్తే భక్తులకు సత్పలితాలు , సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.
కాగా ఉదయం యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. అనంత‌రం బంగారు తిరుచ్చిపై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారిని ఆల‌య విమాన ప్రాకారం చుట్టూ ఊరేగింపు చేప‌ట్టారు ఆ త‌రువాత ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో ఆస్థానం జ‌రిగింది*
...............................
ఓం నమో వేంకటేశాయ

ప్రారంభమైన బెజవాడ కనకదుర్గ ఫ్లైఓవర్‌


 నగరవాసుల ట్రాఫిక్‌ కష్టాలు తీర్చేందుకు రూపుదిద్దుకున్న కనకదుర్గ ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిలు శుక్రవారం వర్చువల్‌ కార్యక్రమం ద్వారా ఫ్లైఓవర్‌ను ప్రారంభించారు. అనంతరం రూ.7584 కోట్ల రూపాయల విలువైన మరో 16 ప్రాజెక్టులకు వారు భూమిపూజ చేశారు. మొత్తం రూ.15,592 కోట్ల రూపాయల పనులకు భూమిపూజ, ప్రారంభోత్సవాలు చేశారు. ఇప్పటికే రూ.8,007 కోట్ల రూపాయలతో పూర్తైన 10 ప్రాజెక్టులను కేంద్రమంత్రి గడ్కరీ, సీఎం వైఎస్ జగన్‌లు జాతికి అంకితం ఇచ్చారు. కాగా, రూ.502 కోట్లతో ఆరు వరుసలతో 2.6 కి.మీ మేర దుర్గ గుడి వంతెన నిర్మించబడింది. 900 పని దినాలలో ఫ్లైఓవర్‌ పూర్తయింది.

Thursday, 15 October 2020

బ్రహ్మండనాయకుని బ్రహ్మోత్సవ ఆంకురార్పణ...

తిరుమల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు ఏకాంతంగా జరుగనున్న శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలకు గురు‌వారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జ‌రిగింది. సంపంగి ప్రాకారంలో వైఖాన‌స ఆగ‌మోక్తంగా అంకురార్ప‌ణ ఘ‌ట్టం నిర్వ‌హించిన అనంత‌రం రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలోకి సేనాధిప‌తి వారిని వేంచేపు చేసి ఆస్థానం నిర్వ‌హించారు.

విశిష్టత..

         వైఖానస ఆగమంలో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యముంది. న‌వ ధాన్యాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు. ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామివారి ఆశీస్సులు పొందడమే ఈ ఘట్టం ఉద్దేశం. ప్రధాన ఉత్సవానికి 7, 5, 3 రోజుల ముందు అంకురార్పణ నిర్వహిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి.

సూర్యాస్తమయం తరువాతే..

        మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సూర్యుడు అస్తమించిన తరువాతే అంకురార్పణ నిర్వహిస్తారు. జ్యోతిష శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం చంద్రుడిని 'సస్యకారక' అంటారు. ఈ కారణంగా పగటివేళ అంకురాలను ఆరోపింపచేయడం తగదు. సాయంత్రం వేళ మంచి ముహూర్తంలో అంకురార్పణ నిర్వహిస్తారు. అంకురార్పణంలో 9 రకాల వివిధ ధాన్యాలను నాటడం తెలిసిందే. అంకురార్పణంలో నాటే విత్తనాలు బాగా మొలకెత్తుతాయి. విత్తనాలు బాగా మొలకెత్తడం వల్ల ఉత్సవాలు కూడా గొప్పగా నిర్వహించబడతాయి.

అంకురార్పణ క్రమం..

       విత్తనాలు నాటేందుకు పాలికలు అనే మట్టి కుండలను వినియోగిస్తారు. యాగశాలలో ఈ మొత్తం కార్యక్రమం నిర్వహిస్తారు. అత్రి అనే మహర్షి తన 'సముర్తార్చన అధికరణ' అనే గ్రంథంలో అంకురార్పణ క్రమాన్ని రచించారు.

         అంకురార్పణ జరిగే రోజు మధ్యాహ్నం వేళ విత్తనాలను కొత్త పాత్రలో నీటిలో నానబెడతారు. అంకురార్పణ నిర్వహించే ప్రదేశాన్ని ఆవు పేడతో అలంకరిస్తారు. ఇక్కడ బ్రహ్మపీఠాన్ని ఏర్పాటుచేస్తారు. ఆ తరువాత మంట ద్వారా బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, శంత, ఇంద్ర, ఇసాన, జయ అనే దేవతలను ఆహ్వానిస్తారు.
        ఆ తరువాత భూమాతను ప్రార్థిస్తూ పాలికలను మట్టితో నింపుతారు. చంద్రుడిని ప్రార్థిస్తూ అందులో విత్తనాలు చల్లి నీరు పోస్తారు. ఈ పాలికలకు నూతన వస్త్రాన్ని అలంకరించి పుణ్యాహవచనం నిర్వహిస్తారు. అనంతరం సోమరాజ మంత్రం, వరుణ మంత్రం, విష్ణుసూక్తం పఠిస్తారు. ప్రతిరోజూ ఈ పాలికల్లో కొద్దిగా నీరు పోస్తారు. ఈ మొత్తం కార్యక్రమం వేదమంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల నడుమ సాగింది.

Wednesday, 14 October 2020

హైదరాబాద్‌- బెంగళూరు జాతీయ రహదారి కోత...30 మంది గల్లంతు...


 వరద ఉద్ధృతికి గగన్‌పహాడ్‌ వద్ద హైదరాబాద్‌- బెంగళూరు జాతీయ రహదారి కోతకు గురైంది. సమీపంలో ఉన్న అప్పాచెరువు కట్టతెగి జాతీయ రహదారిపైకి వరదనీరు చేరడంతో రహదారి కొట్టుకుపోయింది. ఈ ఘటనలో రహదారిపై వెళ్తున్న కార్లు కొట్టుకుపోయి దాదాపు 30 మంది గల్లంతయ్యారు. ఇప్పటి వరకు మూడు మృత దేహాలను వెలికితీశారు. బస్సలు, కార్లు, లారీలు వరద నీటిలో కొట్టుకుపోయి దెబ్బతిన్నాయి.
రోడ్డు కోతకు గురైన ప్రాంతాన్ని బుధవారం ఉదయం రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌, రంగారెడ్డి కలెక్టర్ అమోయ్‌ కుమార్‌, సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ పరిశీలించి సహాయక చర్యలు చేపట్టారు. జాతీయ రహదారిని మూసివేసి ట్రాఫిక్‌ను ఔటర్‌ రింగ్‌రోడ్డుకు మళ్లించినట్ట్టు రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ తెలిపారు.

ప్రఖ్యాత కూచిపూడి నృత్య కళాకారిణి శోభానాయుడు జీవిత విశేషాలు.

శోభానాయుడు కూచిపూడి నాట్య కళాకారిణి. ఆమె వెంకట నాయుడు, సరోజినీ దేవి దంపతులకు విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో 1956లో జన్మించారు.శోభానాయుడు వెంపటి చిన సత్యం శిష్యురాలు. వెంపటి నృత్యరూపాలలో ఈమె అన్ని ప్రధాన పాత్రలనూ పోషించింది. చిన్నతనంలోనే ఆమె నృత్య నాటకాల్లో పాత్రలు పోషించడం మొదలుపెట్టింది. సత్యభామ, పద్మావతి, చండాలిక పాత్రల్లో ఆమె రాణించింది. స్వచ్ఛమైన నృత్యరీతి, అంకితభావం ఉన్న నాట్య గురువు. నాట్యం వృత్తిగా తీసుకున్న ప్రతిభాశాలి శోభానాయుడు. ఆంధ్రప్రదేశ్‍కు చెందిన శోభానాయుడు తన బహుముఖ ప్రతిభకు నిదర్శనంగా పద్మశ్రీపురస్కారం అందుకున్నది.
హైదరాబాదు లోని కూచిపూడి ఆర్ట్ అకాడమీ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తూ తద్వారా పిల్లలకు శిక్షణ నిస్తోంది. శోభానాయుడు శిష్యులు పలువురు రాష్ట్ర, జాతీయ పురస్కారాను అందుకున్నారు. 2001 - పద్మశ్రీ పురస్కారం

1982 - మద్రాసు లోని కృష్ణ గానసభ వారి నుండి నృత్య చూడామణి

1998- ఎన్టీయార్ పురస్కారం

1990 - సంగీత నాటక అకాడమీ పురస్కారం

2011 - తంగిరాల కృష్ణప్రసాద్ స్మారక అవార్డు

Tuesday, 13 October 2020

పెళ్ళిళ్ళు చేసుకునేందుకు అనుమతి

్ధ్ర ప్రదేశ్ : తూర్పు గోదావరి జిల్లా అన్నవరం దేవస్థానం  లో వివాహాలు చేసుకునేందుకు  రాష్ట్ర దేవాదాయ శాఖ అనుమతి ఇచ్చింది. త్వరలో ముహూర్త లు  పార్రంభం కానున్న నేపథ్యంలో కరోనా  కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ  కళ్యాణ మండపం, డార్మితారి  స్థలాలు( పెళ్లి వేడుకలకు) 4_5 రోజులు ముందు బుక్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది  . వాటి విస్తీర్ణాన్ని  బట్టి 50_ 200 మంది మాత్రమే వేడుకలు అనుమతిస్తారు

ప్రకృతి ఆగ్రహిస్తే..ఓడలు ఒడ్డున పడాల్సిందే...

విశాఖ తెన్నేటి పార్క్ వద్ద ఒడ్డుకు ఓ భారీ నౌక కొట్టుకురావడంతో దాన్ని చూడడానికి స్థానికులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. ఆ భారీ నౌక బంగ్లాదేశ్‌కు చెందినదని సమాచారం.  గత రాత్రి గాలుల తాకిడి అధికంగా ఉండడంతో అది ఇలా అదుపుకోల్పోయి తీరానికి కొట్టుకు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు
అలల తాకిడికి ఔటర్ హార్బర్‌లో యాంకర్ తెగి ఒడ్డుకు వచ్చిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అది తీరానికి సమీపంలో ఇసుకలో కూరుకుపోయింది. అందులో దాదాపు 15మంది సిబ్బంది కూడా ఉన్నారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే మెరైన్ పోలీసులు, పోర్టు సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Monday, 12 October 2020

జయలలిత సినిమాలో కరోనా ఛాయలు

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ హైదరాబాద్ వాతావరణాన్ని బాగా ఆస్వాదిస్తోంది. కంగనా ఇటీవలే షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చారు. ఆమె నటిస్తున్న జయలలిత బయోపిక్ తలైవి షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. ప్రత్యేకంగా వేసిన అసెంబ్లీ సెట్ లో కంగనాపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అయితే జయలలిత జీవిత కాలంలో కరోనా లేదు ప్రస్తుతం కరోనా కారణంగా జయలలిత పాత్రలో కంగనా అసెంబ్లీ సన్నివేశంలో మాస్క్గా ధరించి కనిపింంచింది, కాగా హైదరాబాద్ వాతావరణంపై కంగనా ప్రత్యేకంగా స్పందించారు.హైదరాబాద్ ఎంతో ఆహ్లాదకరంగా ఉందని పేర్కొన్నారు. హిమాలయాల్లో కరిగిన శరద్ ఋతువు ఇక్కడ శీతాకాలం చలి..ఉషా కిరణాల వేడమిని ఫిల్మ్ సిటీలో ఆస్వాదిస్తూన్నట్లు ట్వీట్ర చేసింది. .

13 వేల మందికే దుర్గమ్మ దర్శనం..

విజయవాడ

బెజవాడ దుర్గమ్మ సన్నిదిలో దసరా ఉత్సవాలకు పరిమిత సంఖ్యలో భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు.. ఉత్సవాల ఏర్పాట్లపై క్రిష్ణా జిల్లా కలేక్టర్  ఇంతియాజ్ స్పందించారు. ఈ నెల 17 నుంచి 25 వరకు ఇంద్రకీలాద్రి పై దసరా ఉత్సవాలు 
కోవిడ్ ద్రుష్ట్యా ఇంద్రకీలాద్రి పై పకడ్భందీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులను రోజుకు పది వేల మందిని మాత్రమే అనుమతిస్తాం 
మూలానక్షత్రం రోజున 13 వేల మందికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు.
భక్తులు మాస్క్ ధరిస్తేనే క్యూలైన్ లోకి అనుమతి వుంటుందని స్పష్టం చేశారు.
తొలి రోజు మినహ  మిగిలిన అన్ని రోజులు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే అమ్మవారి దర్శనం 
మూలానక్షత్రం రోజున తెల్లవారుజామున 
3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అమ్మవారి దర్శనం వుంటుందని, అన్ని క్యూలైన్ల లో ఎప్పటికప్పుడు శానిటైజ్ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు.
కరోనా ద్రుష్ట్యా అంతరాలయ దర్శనం వుండథని.. ముఖ మండప దర్శనం మాత్రమే కల్పిస్తున్నాట్లు కలేక్టర్ చెప్పారు.
కరోనా ద్రుష్ట్యా అన్ని స్నాన ఘాట్లను మూసివేస్తున్నట్లు చెప్పారు. తలనీలాలు సమర్పించేందుకు అనుమతి లేదని,
ఈ ఏడాది సాంస్ర్కుతిక కార్యక్రమాలను సైతం రద్దు చేశామన్నారు. దసరా లో భవానీ దీక్ష తీసుకున్న భక్తులు వాళ్ళకు సమీపంలోని దేవాలయాల్లోనే మాల విరమణ చేయాలని     కలేక్టర్ విజ్జప్తి చేశారు.
దసరా చివర రోజు తెప్పోత్సవానికి ఘాట్లలోకి భక్తులను అనుమతిలేదని..
భక్తుల రద్దీ అధికంగా‌ ఉంటే స్లాట్ పెంచడంపై మరో సారి చర్చిస్తామని చెప్పారు..

Friday, 9 October 2020

పద్మనాభ స్వామి ఆలయం మూసివేత


ప్రసిద్ధి చెందిన కేరళలోని పద్మనాభ స్వామి ఆలయం ప్రధాన పూజారి, సంయుక్త ప్రధాన పూజారి సహా మొత్తం పదిమంది ఆలయ పూజారులు ప్రాణాంతక కరోనా వైరస్‌ బారిన పడడంతో ఆలయాన్ని అక్టోబర్‌ 15వ తేదీ వరకు తాత్కాలిక ప్రాతిపదికపై మూసివేశారు.

ఇప్పటి వరకు ప్రత్యేక పూజలు మాత్రమే నిర్వహిస్తూ వచ్చిన  తంత్రి ఇక రోజువారి పూజలు నిర్వహిస్తారని,  రోజు వారి పూజలకు భక్తులను అనుమతించరని ఆలయ ఎగ్జిక్యూటివ్‌ అధికారి రథీసన్‌ తెలియజేశారు. 

తిరుమల వెంకన్న సన్నిధిలో గాయత్రి రవి


టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వద్దిరాజు రవిచంద్ర కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి సేవలో పాల్గొన్నారు.

మహబూబాబాద్ ఎమ్మెల్యే బాణోత్ శంకర్ నాయక్, వరంగల్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు, వద్దిరాజు వెంకన్న దంపతులతో కలిసి గాయత్రి రవి దంపతులు స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు స్వామివారికి తలనీలాలు సమర్పించారు.

Thursday, 8 October 2020

శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు - 2020 వాహ‌న‌సేవ‌లు



          శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబ‌రు 16 నుంచి 24వ తేదీ వరకు జరుగనున్నాయి. కోవిడ్‌-19 వ్యాధి వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ప‌రిమిత సంఖ్య గ‌ల‌ భ‌క్తుల‌తో ఈ బ్ర‌హ్మోత్స‌వాల వాహ‌న‌‌సేవ‌ల ఊరేగింపు నిర్వ‌హించాల‌ని టిటిడి నిర్ణ‌యించింది. వాహ‌న‌సేవ‌ల వివ‌రాలు ఇలా ఉన్నాయి.
15.10.2020 - గురువారం - అంకురార్ప‌ణ - రాత్రి 7 నుండి 8 గంటల వ‌ర‌కు.

16.10.2020 - శుక్ర‌వారం - బంగారు తిరుచ్చి ఉత్స‌వం -  ఉద‌యం 9 నుండి 11 గంట‌ల వ‌ర‌కు.

పెద్ద‌శేష వాహ‌నం - రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు.

17.10.2020 - శ‌ని‌వారం - చిన్న‌శేష వాహ‌నం - ఉద‌యం 8 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు.

హంస వాహ‌నం - రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు.

18.10.2020 - ఆది‌‌వారం - సింహ వాహ‌నం - ఉద‌యం 8 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు.

ముత్య‌పుపందిరి వాహ‌నం - రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు.

19.10.2020 - సోమ‌‌‌వారం - క‌ల్ప‌వృక్ష వాహ‌నం - ఉద‌యం 8 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు.

స‌ర్వ‌భూపాల‌ వాహ‌నం - రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు.

20.10.2020 - మంగ‌ళ‌‌‌వారం - మోహినీ అవ‌తారం - ఉద‌యం 8 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు.

గ‌రుడ‌సేవ‌ - రాత్రి 7 నుండి 12 గంట‌ల వ‌ర‌కు.

21.10.2020 - బుధ‌‌వారం - హ‌నుమంత వాహ‌నం - ఉద‌యం 8 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు.

పుష్ప‌క‌విమానం- సాయంత్రం 3 నుండి 5 గంట‌ల వ‌ర‌కు.

గ‌జ వాహ‌నం - రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు.

22.10.2020 - గురువారం - సూర్య‌ప్ర‌భ వాహ‌నం - ఉద‌యం 8 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు.

చంద్ర‌ప్ర‌భ వాహ‌నం - రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు.

23.10.2020 - శుక్ర‌‌‌వారం - స్వ‌ర్ణ ర‌థోత్స‌వం- ఉద‌యం 8 గంట‌ల‌కు.

అశ్వ వాహ‌నం - రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు.
24.10.2020 - శ‌ని‌‌వారం - ప‌ల్ల‌కీ ఉత్స‌వం మ‌రియు తిరుచ్చి ఉత్స‌వం - ఉద‌యం 3 నుండి 5 గంట‌ల వ‌ర‌కు.
స్న‌ప‌న‌తిరుమంజ‌నం మ‌రియు చ‌క్ర‌స్నానం - ఉద‌యం 6 నుండి 9 గంట‌ల వ‌ర‌కు.
బంగారు తిరుచ్చి ఉత్స‌వం - రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు జరుగనుంది

Wednesday, 7 October 2020

జగనన్న విద్యాకానుక - విద్యార్థుల జీవితాల్లో కొత్త వెలుగు - శైలజా చరణ్ రెడ్డి


జగనన్న విద్యాకానుక పథకాన్ని ఈ నెల 8న సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌ కృష్ణా జిల్లా పునాదిపాడు జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రారంభించనున్నారని జగనన్న విద్యా కానుక అనే పథకం ద్వారా విద్యార్థుల జీవితాల్లో కొత్త వెలుగు ప్రారంభం కాబోతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మరియు రీజనల్ కోఆర్డినేటర్,  పూతలపట్టు నియోజకవర్గ ఇన్చార్జి శైలజా చరణ్ రెడ్డి ఆనందాన్ని వ్యక్తం చేశారు
రాష్ట్రవ్యాప్తంగా 42,34,322 మంది విద్యార్ధులకు దాదాపు రూ.650 కోట్ల ఖర్చుతో ‘స్టూడెంట్‌ కిట్లు’ అందచేస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 10వ తరగతి విద్యార్థులందరికీ స్టూడెంట్‌  కిట్లు పంపిణీ చేస్తారు. బాలురకు స్కై బ్లూ రంగు, బాలికలకు నేవీ బ్లూ రంగు బ్యాగులు అందిస్తారు. కోవిడ్‌ నేపథ్యంలో ఒక్కో విద్యార్థికి మూడు మాస్కులు కూడా పంపిణీ చేస్తారు అని ఆమె తెలియజేశారు.
ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన దౌర్భాగ్యుడు చంద్రబాబు అని ఆమె విమర్శించారు.
CM జగన్ మోహన్ రెడ్డి గారు పేద విద్యార్థుల కోసం మంచి చేయాలని ప్రయత్నం చేస్తుంటే ప్రపంచంతో పోటీ పడే విధంగా పేద విద్యార్థులను ఇంగ్లీష్ మీడియంలో చదివించాలని భావిస్తుంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్ ను ప్రారంభించకుండా అడ్డుపడుతున్న రాక్షసుడు చంద్రబాబు అని ఆమె విమర్శించారు.

Tuesday, 6 October 2020

శ్రీ‌వారి ద‌య‌తో క‌రోనాపై విజ‌యం సాధించాలి టిటిడి క్యాలెండర్ ఆవిష్కర‌ణ‌లో చైర్మన్ . వైవి.సుబ్బారెడ్డి

క‌రోనాపై చేస్తున్న పోరాటంలో వెంక‌టేశ్వ‌ర‌స్వామివారి ద‌యతో ప్ర‌పంచ ప్ర‌జ‌లంద‌రూ విజ‌యం సాధించాల‌ని టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వై.వి.సుబ్బారెడ్డి ఆకాంక్షించారు. తిరుమల తిరుపతి దేవస్థానములు ముద్రించిన 2021 సంవత్సర క్యాలెండర్ల‌ను మంగళవారం ఆయ‌న హైదరాబాద్‌లో ఆవిష్కరించారు.
ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ మాట్లాడుతూ ప్ర‌తి ఏడాది బ్ర‌హ్మోత్స‌వాల స‌మ‌యంలో టిటిడి నూత‌న క్యాలెండ‌ర్లు, డైరీలు విడుద‌ల చేయ‌డం సంప్ర‌దాయంగా వ‌స్తోంద‌న్నారు. ఇందులో భాగంగానే ఈ సారి కూడా ముఖ్య‌మంత్రి వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేతుల మీదుగా డైరీలు, క్యాలెండ‌ర్లు విడుద‌ల చేసిన‌ట్లు ఆయ‌న చెప్పారు. క‌రోనా వ్యాప్తి నివార‌ణ‌లో భాగంగా శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు ఏకాంతంగా ఘ‌నంగా నిర్వ‌హించామ‌న్నారు. తెలంగాణ ప్ర‌జ‌ల కోసం హిమాయత్ నగర్ టిటిడి కల్యాణ మండపంలో ఈ క్యాలెండర్లను అందుబాటులో ఉంచుతార‌ని తెలిపారు. టిటిడి బోర్డు సభ్యుడు, స్థానిక స‌ల‌హా మండ‌లి అధ్యక్షులు శ్రీ గోవింద హరి, ఇతర సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Sunday, 4 October 2020

శ్రీశైలం ఘంటామఠ పునర్నిర్మాణ పనులలో నాణెములు బయట పడ్డాయి.

సుప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలంలో బంగారు నాణేలు బయటపడ్డాయి. ప్రస్తుతం శ్రీశైలం క్షేత్రంలో ఘంటామఠం పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా జరిపిన తవ్వకాల్లో  ఓ పెట్టె బయటపడింది. ఆ పెట్టెలో బంగారు, వెండి నాణేలు ఉన్నాయి. 15 బంగారు నాణేలు, ఒక బంగారు ఉంగరం మాత్రమే కాకుండా 17 వెండి నాణేలను కూడా గుర్తించారు.
శ్రీశైలంలో బంగారు నాణేల కలకలం రేగడంతో ఆలయ ఈవో కేఎస్ రామారావు, తహసీల్దార్ రాజేంద్ర సింగ్, సీఐ రవీంద్ర ఘంటామఠం వద్దకు చేరుకుని అక్కడి పరిస్థితిని సమీక్షించారు. ఆ నాణేలను అధికారులను స్వాధీనం చేసుకున్నారు.
శ్రీశైలంలో నిధులు బయల్పడడం ఇదే మొదటిసారి కాదు. 2017లోనూ సరిగ్గా ఘంటామఠం వద్దే బంగారు, వెండి వస్తువులు లభించాయి. 18 బంగారు నాణేలు, 3 బంగారు కడియాలు, 3 ఉంగరాలు, చిన్నపాటి బంగారు వస్తువులు, 147 వెండి నాణేలు, ఒక వెండి బేసిన్, 2 వెండి గిన్నెలు లభ్యమయ్యాయి.

Friday, 2 October 2020

గులాబీ రంగంటే ఇష్టం : నటుడు దిలీప్ కుమార్

గులాబీ రంగు తనకు ఇష్టమైన రంగని ప్రఖ్యాత హిందీ నటుడు దిలీప్ కుమార్ అంటున్నారు..పలు చరిత్రక సినిమాలు.దేశభక్తి.. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్లలో నటించిన హిందీ నటుడు యూసుఫ్ ఖాన్ @ దిలీప్ కుమార్..98 వయసులో భార్య సైరాభానుతో కలసి గులాబీ రంగు దుస్తుులను ధరించి వున్న   ఫోటో ఓ మిత్రుడు ద్వారా   పోష్టు  చేశారు.  తనకు గులాబీ రంగు అంటే ఇష్టం అంటు ట్యాగ్ చేశారు. ముంబాయి/బాంద్రాలోని పాలి హిల్ రెసార్టులో వుంటున్నారు.  పాకిస్థాన్ లోని పెషావర్ లో  దిలీప్ కుమార్ జన్మించారు. అనంతరం ఆయన కుటుంబం భాారత్ వలస వచ్ఛఛ ఇంటి ఫోటో పాకిస్థాన్ విలేకరి సోషల్ మీడియాలో పోష్టు చేయగా మరిన్ని ఫోటోలు పంపగలరా అని కామెంట్స్ రాయడంలో అక్కడి వారు భారీగా స్పందించారు.. తను పుట్టిన ఇల్లు చూడటం ఆనందంగా వుందని తన తాతలను..తండ్రిని గుర్తు చెసిందంటూ పేర్కొన్నారు. 1955 నుండి పలు బ్లాక్ బస్టర్ హిందీ చిత్రాలలో నటించిన దిలీప్ కుమార్.. ఈ తరం నటులు. షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ లతో కలసి నటించారు.