శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కుటుంబ సమేతంగా బుధవారం అమ్మవారిని దర్శించుకున్న మంత్రి దంపతులకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి పనుల పురోగతిపై ఆలయ అధికారులతో మంత్రి చర్చించారు. నవరాత్రి ఉత్సవాలు బుధవారం 5 వ రోజు మూల నక్షత్రం కావడంతో ఆలయాన్ని అధికారులు విద్యుత్ దీపాలతో అలంకరించారు అమ్మవారు 5 వ రోజు స్కంద దేవి రూపంలో దర్శనమిచ్చారు. అనంతరం ఆలయ ఈవో వినోద్ రెడ్డి శాలువ తో సన్మానించి అమ్మవారి వారికి తీర్థ ప్రసాదాలతో బాటు అమ్మవారి ఆశీస్సులను అందించారు.మంత్రి వెంట ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ శ్రీనివాస రావు, ఈవో వినోద్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment