జగనన్న విద్యాకానుక పథకాన్ని ఈ నెల 8న సీఎం వైయస్ జగన్‌మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా పునాదిపాడు జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రారంభించనున్నారని జగనన్న విద్యా కానుక అనే పథకం ద్వారా విద్యార్థుల జీవితాల్లో కొత్త వెలుగు ప్రారంభం కాబోతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మరియు రీజనల్ కోఆర్డినేటర్, పూతలపట్టు నియోజకవర్గ ఇన్చార్జి శైలజా చరణ్ రెడ్డి ఆనందాన్ని వ్యక్తం చేశారు
రాష్ట్రవ్యాప్తంగా 42,34,322 మంది విద్యార్ధులకు దాదాపు రూ.650 కోట్ల ఖర్చుతో ‘స్టూడెంట్ కిట్లు’ అందచేస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 10వ తరగతి విద్యార్థులందరికీ స్టూడెంట్ కిట్లు పంపిణీ చేస్తారు. బాలురకు స్కై బ్లూ రంగు, బాలికలకు నేవీ బ్లూ రంగు బ్యాగులు అందిస్తారు. కోవిడ్ నేపథ్యంలో ఒక్కో విద్యార్థికి మూడు మాస్కులు కూడా పంపిణీ చేస్తారు అని ఆమె తెలియజేశారు.
ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన దౌర్భాగ్యుడు చంద్రబాబు అని ఆమె విమర్శించారు.
CM జగన్ మోహన్ రెడ్డి గారు పేద విద్యార్థుల కోసం మంచి చేయాలని ప్రయత్నం చేస్తుంటే ప్రపంచంతో పోటీ పడే విధంగా పేద విద్యార్థులను ఇంగ్లీష్ మీడియంలో చదివించాలని భావిస్తుంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్ ను ప్రారంభించకుండా అడ్డుపడుతున్న రాక్షసుడు చంద్రబాబు అని ఆమె విమర్శించారు.
No comments:
Post a Comment