కరోనాపై చేస్తున్న పోరాటంలో వెంకటేశ్వరస్వామివారి దయతో ప్రపంచ ప్రజలందరూ విజయం సాధించాలని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వై.వి.సుబ్బారెడ్డి ఆకాంక్షించారు. తిరుమల తిరుపతి దేవస్థానములు ముద్రించిన 2021 సంవత్సర క్యాలెండర్లను మంగళవారం ఆయన హైదరాబాద్‌లో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాల సమయంలో టిటిడి నూతన క్యాలెండర్లు, డైరీలు విడుదల చేయడం సంప్రదాయంగా వస్తోందన్నారు. ఇందులో భాగంగానే ఈ సారి కూడా ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా డైరీలు, క్యాలెండర్లు విడుదల చేసినట్లు ఆయన చెప్పారు. కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా ఘనంగా నిర్వహించామన్నారు. తెలంగాణ ప్రజల కోసం హిమాయత్ నగర్ టిటిడి కల్యాణ మండపంలో ఈ క్యాలెండర్లను అందుబాటులో ఉంచుతారని తెలిపారు. టిటిడి బోర్డు సభ్యుడు, స్థానిక సలహా మండలి అధ్యక్షులు శ్రీ గోవింద హరి, ఇతర సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎప్పటినుండి భక్తులకు అందుబాటులో ఉంటాయి online payment ద్వారా
ReplyDelete