Sunday, 18 October 2020

ముత్యపు పందిరి వాహనంపై గోవిందుడు - బ్రహ్మచారిణిగా మహాలక్ష్మి @ నవరాత్రి బ్రహ్మోత్సవాలు

తెలుగు రాష్ట్రాల్లో ఓ వైపు నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. మరోవైపు శరన్నవరాత్రి దేవి పూజలు కన్నులకు కడుతున్నాయి..
* నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో..ఆదివారం ఉదయం తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం సింహ‌ వాహనంపై యోగ‌న‌ర‌సింహుడి అవతారంలో శ్రీవారు దర్శనమిచ్చారు. ఆల‌య మాడా వీధుల్లో స్వామి వారు విహరించి భక్తులను కటాక్షించారు. దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం స్వామి వారు సింహ వాహ‌నాన్ని అధిష్టించా రని పండితులు పేర్కొన్నారు. కాగా, సింహ వాహనం దర్శించిన భక్తులకు విజ‌యం వరిస్తుందని నమ్మకం. ఉదయం గోవింద మాల ధరించిన ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి దంపతులు వాహన సేవలో పాల్గొని వాహనాన్ని మోశారు. 
ముత్యపు పందిరి వాహనంపై..
రాత్రి ముత్యపు పందిరి వాహనం పై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించారు. ముక్తి సాధనకు ముత్యంలాంటి స్వచ్ఛమైన మనసు అవసరమని లోకానికి ఈ వాహనం ద్వారా స్వామి వారు చాటి చెప్పారు. కరోనా నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. ఉదయం జరిగిన సింహ వాహన సేవ లో, రాత్రి జరిగిన ముత్యపుపందిరి వాహన సేవలో పాల్గొన్న భక్తులు కర్పూర హారతులు పట్టారు. వాహన మోత సేవకునిగా మారిన చెవిరెడ్డి స్వామి వారిని సేవించారు. కంకణ దారి చెవిరెడ్డి సోదరుడు రఘునాథ్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. 
కన్నుల పండువగా ఉంజల్ సేవ..
ఆదివారం రాత్రి తుమ్మల గుంట ఆలయం వెలుపల కొలువు మండపంలో ఉంజల్ సేవ నేత్రపర్వంగా సాగింది. స్వామివారు వేణుగోపాలుని రూపంలో ఊయల ఊగుతూ భక్తులను కనువిందు చేశారు. అనంతరం జరిగిన ముత్యపు పందిరి వాహన సేవలో భక్తులు కరోనా నిబంధనలు పాటిస్తూ పాల్గొన్నారు. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో సంగీత కచేరీ అలరించింది.
ముత్యాల పందిరి కింద శ్రీదేవి భూదేవి లతో తిరుమల మలయప్ప...
మహారాష్ట్ర కొల్హపూర్ శక్తి పీఠం లో బ్రహ్మ చారిణిగా దర్శనం ఇస్తున్న మహాలక్ష్మి అమ్మ.

No comments:

Post a Comment