Saturday, 17 October 2020

శిఖీపించంతో గోవిందుడు.. బ్రహ్మొత్సవాలలో 2వరోజు చిన్న శేషునిపై మలయప్ప...

శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు శ‌నివారం ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌రకు శ్రీ‌వారి ప్రధాన ఆల‌యంలోని క‌ల్యాణ మండ‌పంలో శ్రీ మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై నెమ‌లి పింఛం, గ‌ద‌తో దామోద‌ర కృష్ణుడి అలంకరణలో దర్శనమిచ్చారు. 
పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకి(నాగ‌లోకానికి రాజు)గా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుందని భక్తుల విశ్వాశం. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే కుటుంబ శ్రేయ‌స్సుతోపాటు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం.  రాత్రి 7 నుంచి 8 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు.

No comments:

Post a Comment