Thursday, 1 October 2020
భక్తుల ముంగిట నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. తిరు మాడవీధుల్లో శ్రీవారి వాహనసేవలకు నిర్ణయం...
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల కోసం జిల్లా యంత్రాంగం, పోలీసుల సమన్వయంతో టిటిడిలోని వివిధ విభాగాలు చేపట్టాల్సిన ఏర్పాట్లపై టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి సమీక్ష నిర్వహించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ శ్రీ భరత్ నారాయణ గుప్తాతో కలిసి ఈ సమీక్ష చేపట్టారు. ఇందులోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.- పరిమితంగా భక్తులతో నాలుగు మాడ వీధుల్లో స్వామివారి వాహనసేవల ఊరేగింపు ఉంటుంది. గరుడ సేవతో పాటు అన్ని వాహనసేవలకు దర్శన టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే గ్యాలరీల్లోకి అనుమతిస్తారు.- ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు ఉంటాయి.- బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన అక్టోబరు 21న సాయంత్రం పుష్పక విమానసేవ, అక్టోబరు 23న స్వర్ణరథం ఊరేగింపు ఉంటాయి.- అక్టోబరు 24న చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.- గ్యాలరీల్లో థర్మల్ స్క్రీనింగ్‌తోపాటు ఫుట్ ఆపరేటెడ్ శానిటైజర్లు ఏర్పాటు.- భక్తులందరికీ అన్నప్రసాదాలు అందించేందుకు ఏర్పాట్లు. తగినన్ని లడ్డూలు తయారీ.- పరిమిత సంఖ్యలో పోలీసులు, శ్రీవారి సేవకుల సేవలు.- హిందూ ధర్మప్రచార పరిషత్, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో పరిమిత సంఖ్యలో కళాబృందాలతో వాహనసేవల ముందు ప్రదర్శనలు.- కల్యాణవేదిక వద్ద ఫలపుష్ప ప్రదర్శన, ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు. ఈ సమీక్షలో అసిస్టెంట్ కలెక్టర్ శ్రీ విష్ణుచరణ్, టిటిడి చీఫ్ ఇంజినీర్ శ్రీ రమేష్‌రెడ్డి, అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్ ఇతర విభాగాధిపతులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment