Thursday, 22 October 2020

మహాబూబాబాద్ బాలుడి కధ దుఃఖాంతం... కాసుల కొసం కాదు.. కపట మానసిక ఉన్మాదంతోనే..


నవమాసాలు కడుపులో కాచి రక్షించిన తల్లి కంట కన్నీరు మున్నీరైంది...కొడుకు కంటే డబ్బులు ఏం నాకు ఎక్కువ కాదు నా పొలం ఇస్తా..డబ్బులు.. బంగారం ఇస్తా నా కొడుకును ఇవ్వండి అంటి భోరుమంది. అయినా ఆ కరుడుగట్టిన కసాయి మనసులు కరగలేదు..45 లక్షల రూపాయలను లెక్క బెడుతూ వీడియో పంపండి నీ బిడ్డను ఒప్ప చెబుతాం అంటూ నమ్మ బలికారు..డబ్బుల లెక్క చెబుతు ఆ తల్లి అన్న నా బిడ్డను వదలేయండి అంటూ  వేడుకుంది. అయినా ఆమెకు బిడ్డ దక్కలేదు. 
నవ వసంతం అడుగిడిన బిడ్డడిని కాసాయిలు అపహరించిన నాడే ఊపిరి తీసి..ఆ తల్లి ఉసురు పోసుకున్నారు..
 పట్టణానికి చెందిన కుసుమ దీక్షిత్‌రెడ్డి(9) కిడ్నాప్‌ కథ విషాదాంతమైంది. కేసముద్రం మండలం అన్నారం శివారులోని గుట్టపై బాలుడి మృత దేహాన్ని గురువారం ఉదయం పోలీసులు గుర్తించారు. బాలుడి మృతి వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కిడ్నాపర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. ఉదయం 11 గంటలకు  జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మీడియా సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.
అసలేం జరిగింది....
మహబూబాబాద్‌లోని కృష్ణ కాలనీలో నివాసం ఉంటున్న రంజిత్‌, వసంతల పెద్ద కుమారుడు దీక్షిత్‌రెడ్డి(9) ఇంటి ముందు ఆడుకుంటుండగా ఆదివారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి ద్విచక్ర వాహనంపై వచ్చి అపహరించుకుపోయాడు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో పరిసర ప్రాంతాలలో వెతుకగా ఓ వ్యక్తి ద్విచక్రవాహనంపై తీసుకెళ్లారని తోటి మిత్రులు తల్లిదండ్రులకు చెప్పారు. రాత్రి 9 గంటల 45 నిమిషాలకు కిడ్నాపర్లు తల్లి వసంతకు ఫోన్ చేసి రూ.45 లక్షలు ఇస్తే విడిచిపెడతామని, ఈ విషయాన్ని మీరు ఎక్కడా చెప్పవద్దు, పోలీసులకు కంప్లైంట్ చేయవద్దు, మీ ఇంటి పరిసర ప్రాంతాలలో మా వ్యక్తులు ఉన్నారంటూ బెదిరించారు.  మీరు ఏం చేసినా తమకు తెలుస్తుందని, మీ బాబుకు జ్వరం గా ఉంది మాత్రలు కూడా వేశాం అని చెప్పి ఫోన్ పెట్టేశారు.
మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో మరోసారి ఫోన్ చేసి.. డబ్బులు సిద్ధం చేయండి.. బుధవారం ఫోన్‌ చేస్తానని చెప్పినట్లుగానే అగంతకుడు బుధవారం ఉదయం 11 గంటలకు ఫోన్‌ చేశాడు. డబ్బు సిద్ధం చేసుకుని జిల్లా కేంద్రంలోని మూడు కొట్ల ప్రాంతానికి రావాలని సూచించాడు. కిడ్నాపర్‌ డిమాండ్‌ చేసిన సొమ్ములో తమకు వీలు చిక్కినంత డబ్బు అతడికి ఇచ్చేందుకు బాలుడి తల్లిదండ్రులు సిద్ధమయ్యారు. తెలిసిన వారి దగ్గరి నుంచి కొంత సొమ్ము సమీకరించారు. మధ్యాహ్నం 1 గంటకు కిడ్నాపర్‌ చెప్పినట్లుగా బాలుడి తండ్రి రంజిత్‌ ఆ డబ్బుతో కూడిన బ్యాగ్‌ను తీసుకుని మూడు కొట్ల ప్రాంతానికి వెళ్లాడు. అగంతకుడు సూచించిన నిర్దిష్ట ప్రాంతంలో అతని కోసం బుధవారం రాత్రి వరకూ వేచి చూశారు. ఆ ప్రాంతంలో మాటువేసిన పోలీసులు అర్ధరాత్రి సమయంలో కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

No comments:

Post a Comment