Thursday, 22 October 2020
నాయిని అంత్యక్రియలు పూర్తి.. నివాళులు అర్పించిన కేటీఆర్
బుధవారం అర్ధరాత్రి కన్నుమూసిన టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు ముగిశాయి... అంత్యక్రియల్లో భాగంగా నాయిని పాడెను మోశారు మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్.. తదితర ప్రజాప్రతినిధులు.. ఇక, నాయినిని కడసారి చూసేందుకు జనం, టీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.. మినిస్టర్స్ క్వార్టర్స్ నుంచి జూబ్లీహిల్స్ మహాప్రస్థానం వరకు అంతమియాత్ర కొనసాగింది.. మహాప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు.. అంత్యక్రియల్లో కేటీఆర్ సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ శ్రేణులు, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. 86 సంవత్సరాల నాయిని నర్సింహారెడ్డి బుధవారం అర్ధరాత్రి 12.25 గంటలకు మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. గత నెల 28వ తేదీన కరోనా బారినపడిన ఆయన బంజారాహిల్స్‌లోని సిటీన్యూరో సెంటర్ దవాఖానలో 16 రోజులపాటు చికిత్స పొందారు. వారంరోజుల క్రితం నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగెటివ్ వచ్చినప్పటికీ.. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ సోకడంతో కుటుంబసభ్యులు అపోలో ఆస్పత్రికి తరలించారు.. అప్పటినుంచి వెంటిలేటర్‌పై చికిత్స పొందారు. కేటీఆర్, హరీష్‌రావు ఆయనను పరామర్శించగా.. బుధవారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ కూడా అపోలో ఆస్ప్రతిలో నాయినిని పరామర్శించారు. కానీ, రాత్రి నాయిని ఆరోగ్యం క్షీణించిండంతో కన్నుమూశారు.. 1934 మే 12న నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం నేరడుగొమ్ము గ్రామంలో జన్మించిచారు.. హెచ్‌ఎస్‌సీ వరకు విద్య నభ్యసించిన నాయిని.. 1969 తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 1969లో జయప్రకాశ్‌నారాయణ శిష్యుడిగా జనతాపార్టీ నుంచి రాజకీయజీవితాన్ని ప్రారంభించారు. 1978, 1985లో జనతాపార్టీ తరఫున ముషీరాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లో టీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది.. నాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 2014 జూన్ 2న ఏర్పడిన టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర మొదటి హోంశాఖ మంత్రిగా పనిచేశారు. గవర్నర్ కోటాలో శాసనమండలికి ఎంపికైన ఆయన పదవీకాలం 2020 ఏప్రిల్‌తో ముగిసింది. నాయిని నర్సింహారెడ్డి టీఆర్‌ఎస్ పార్టీని స్థాపించిన నాటినుంచి తుదిశ్వాస విడిచేవరకు ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే నడిచారు. ఆయనకు భార్య అహల్యారెడ్డి, కుమారుడు దేవేందర్‌రెడ్డి, కూతురు సమంతరెడ్డి ఉన్నారు.99టీవీ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment