Sunday, 31 December 2023

సోషల్ మీడియా లేని కాలం ఒకటి ఉండేది!! ✍️✍️


... తాను తీయాలని అనుకున్న 'అల్లూరి సీతారామరాజు' సినిమా సూపర్‌స్టార్ కృష్ణ గారు తీశారని ఎన్టీ రామారావు గారికి కోపం వచ్చింది. ఇద్దరూ కలిసి నటించిన 'దేవుడు చేసిన మనుషులు' సినిమా శతదినోత్సవానికి రమ్మన్నా ఎన్టీఆర్ రాలేదు‌. కొన్నేళ్ల దాకా ఆ కోపం అలాగే మిగిలి ఆపై సమసిపోయింది. ఇద్దరూ మళ్లీ దగ్గరయ్యారు.
... తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్‌కు తరలి వచ్చే విషయంపై తనని సంప్రదించలేదని ఎన్టీఆర్ గారికి అక్కినేని గారి మీద కొంత కినుక ఉండిందని అంటారు. 1984 ప్రాంతంలో రవీంద్ర భారతిలో ఏదో సమావేశంలో అక్కినేని నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ 'కాషాయం ధరించిన వారంతా సన్యాసులు కాదు' అని అర్థం వచ్చే శ్లోకం వినిపించారు. అప్పుడు ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు. గిట్టనివారు ఆ విషయం ఆయనకు మోశారు. అది తననే అన్నారని భావించిన ఎన్టీఆర్ ఇకపై రవీంద్ర భారతిలో జరిగే అక్కినేని కార్యక్రమాల వీడియోలు తనకు కావాలని హుకుం జారీ చేశారు. అది తెలిసిన అక్కినేని త్యాగరాయ గానసభలో కార్యక్రమం పెడితేనే తాను వస్తానని అందరికీ చెప్పారు. ఈ వైరం కొన్నాళ్లు నడిచింది. ఎన్టీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా అక్కినేని గారు అభినందనలు తెలిపేందుకు వెళ్లలేదు. ఆపై కొన్నేళ్ల తర్వాత ఇద్దరూ కలిసిపోయారు.
... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గారెక్కిన హెలికాప్టర్ కనిపించకుండా పోయిన తరుణంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు వైఎస్ కుటుంబానికి ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. ఆయన కోసం ఆదుర్దా చెందారు.
‌..‌. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు జయలలిత, కరుణానిధి బద్ధశత్రువులుగా ఉండేవారు. ఎవరో ఒకసారి కరుణానిధి గారి దగ్గరికి  వచ్చి 'ఎందుకు ఆమెతో అంత కయ్యం? ఆ కేసులు వేసి ఏం సాధిస్తారు?' అని అంటే "ఆమె ఒక్క ఫోన్ చేసి ఇదంతా అవసరమా? అని అడిగితే మొత్తం వాపస్ తీసుకుంటాను. కానీ అడగదు. ఎందుకంటే ఆమె జయలలిత. నేనూ తగ్గను. ఎందుకంటే నేను కరుణానిధి" అని సమాధానం ఇచ్చారట.
... జయలలిత గారు ఆసుపత్రిలో ఉండగా కరుణానిధి కుమారుడు, ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆసుపత్రికి వెళ్లి ఆమెను చూసి, ఆమెకు అందే చికిత్స గురించి తెలుసుకున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆశించారు.
... సోషల్ మీడియా లేని కాలం ఒకటి ఉండేది. అప్పుడు మనుషులు సాటి మనుషులతో చాలా పొందిగ్గా ఉండేవారు. ఆపద వేళల శత్రుత్వాన్ని మరిచి ఒకరి మంచి మరొకరు ఎంచి చూసేవారు. తోడుగా నిలిచేవారు. తోచిన సలహా చెప్పేవారు. చూసేవారు కూడా దాన్ని అనుమానంతో ఎంచక నిండు మనసుతో చూసేవారు. 
... ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అందరికీ చదువు వచ్చు. అందరికీ రాయడం వచ్చు. అందరికీ విమర్శించడం వచ్చు. అందరికీ మరొకర్ని అనుమానించడం వచ్చు. అందరికీ ఇతరులపై తీర్పులు ఇవ్వడం వచ్చు. అందరికీ తమను తామే గొప్ప అని అనేసుకోవడం వచ్చు. ఇతరుల్ని అతి సులభంగా నవ్వులపాలు చేయడం, దాని పేరు 'భారత రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛా హక్కు' అనేసుకోవడం, అలా అనుకొని మరింత వీరలెవల్లో రెచ్చిపోవడం మహ బాగా వచ్చు.
... మాజీ ముఖ్యమంత్రి, ఒకనాడు తాను మెలిగిన పార్టీ అధ్యక్షుడు, వయసులో పెద్దవారు అయిన కేసీఆర్ ఆసుపత్రిలో ఉంటే ఆయన్ని పలకరించడం రేవంత్‌గారు చేసిన పని. అటు ముఖ్యమంత్రిగానూ, ఇటు మనిషిగానూ చేయాల్సిన కనీస బాధ్యత. అదే ఆయన చేశారు. ఇందులో వింతగా చూడాల్సింది, విమర్శ చేయాల్సింది ఏమీ లేదు. ఇదొక డ్రామాగా, సింపతీ మేకింగ్ షోగా కొట్టిపారేయాల్సింది అసలే లేదు! ఇదొక మామూలు, అతి మామూలు మానవ బాధ్యత. ఒక భరోసా! లాభనష్టాలు ఎవరివైనా, ఇదొక స్ఫూర్తిదాయకమైన చర్య! అభినందించకుండా అతి విచారణ చేస్తూ లోగుట్టు ఏదో ఉందని అనుకుంటే ఎట్లా?
‌.‌‌.. రేవంత్‌గారు, కేసిఆర్ గారు ఎదురు పడితే కత్తులు తీసి యుద్ధం చేస్తారనా జనాల ఊహ? అలా ఏమీ ఉండదు. అంతా మాములుగానే ఉంటుంది. మనం ఏవేవో ఊహించుకొని మన ఫేస్‌బుక్ వాల్స్ నింపేస్తాం! పోనిద్దూ.. రాసేందుకు మనకూ ఏదో టాపిక్ కావాలి కదా! పాజిటివ్ రాస్తే ఎవరు చదువుతారు? లోపల ఏదో గుట్టు ఉంది అని నెగెటివ్ రాస్తేనే కదా కిక్కు!

- విశీ ✍️✍️ సేకరణ: సోషల్ మీడియా 

Thursday, 28 December 2023

నటుడు డీఎండీకే పార్టీ అధినేత విజయ్ కాంత్ కన్నుమూత... ప్రముఖుల సంతాపం...

నటుడు విజయ్ కాంత్ కన్నుమూత (71) డీఎండీకే అధినేత,సినీ నటుడు విజయ్‌కాంత్‌ కన్నుమూత.. అనారోగ్య సమస్యలు, కరోనా పాజిటివ్ తో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి.. అధికారికంగా ప్రకటించిన తమిళనాడు ఆరోగ్యశాఖ కార్యదర్శి యోట్‌ ఆస్పత్రి దగ్గర భారీగా పోలిసుల మోహరింపు..


    *విజయ్ కాంత్ మృతికి ప్రముఖుల సంతాపం*.. నివాళులు అర్పించిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్
*నేడు తమిళనాడు లోని థియేటర్స్ లో షో లు రద్దు*
చెన్నై మియాట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
*1952 ఆగస్టు 25 న మదురై లో జన్మించిన విజయ్ కాంత్*
2005 సెప్టెంబర్ 14 న DMDK పార్టీనీ స్థాపించిన విజయ్ కాంత్
*2005 తొలిసారిగా ఎమ్మెల్యే గా ఎన్నిక*
2011 లో ప్రతి పక్ష నేతగా ఉన్న విజయ్ కాంత్*
*విజయ్ కాంత్ చివరి సినిమా మధుర విరన్ (2018)*
విజయ్ కాంత్ కు ఇద్దరు కుమారులు
*యాక్షన్ హీరోగా విజయ్ కాంత్ కి ప్రత్యేక గుర్తింపు*
తెలుగు లో రీమేక్ అయిన విజయ్ కాంత్ సినిమాలు..@మణికుమార్ కొమ్మమూరు..

Tuesday, 26 December 2023

ప్రజలకు చేరువ అయ్యేందుకే ప్రజాపాలన కార్యక్రమం.. మంత్రులు కోమటిరెడ్డి. తుమ్మల.. పొంగులేటి...వెల్లడి


ఖమ్మం, డిసెంబర్ 26: ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమ అమలుకు చర్యలు చేపట్టిందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి, జిల్లా ఇంచార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవిన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లు తెలిపారు. మంగళవారం నూతన కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాల అధికారులతో మంత్రులు ప్రజా పాలన సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, ఈ నెల 28 నుండి, జనవరి 6 వరకు ప్రజా పాలన కార్యక్రమం చేపట్టనున్నట్లు అన్నారు. పేద ప్రజల ఆశలు నెరవేర్చే దిశగా,  ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అందజేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలిపారు. పథకాలు అమలుజేసే బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. పేద వారినుండి వచ్చే ప్రతి దరఖాస్తుకు సానుకూలంగా స్పందించి పరిష్కార చర్యలు తీసుకోవాలని, పరిధికి మించితే మంత్రుల దృష్టికి తేవాలని అన్నారు. గత పదేండ్లలో రాష్ట్రంలో పేదవారికి ఇల్లు, రేషన్, ఆరోగ్యశ్రీ, ఉద్యోగాలు ఇవ్వలేక పోయామన్నారు. ప్రజా పాలనలో గ్రామ సభలు చేపట్టి, సమస్యలు ఒక్కొక్కటి పరిష్కరించాలన్నారు. మహిళలకు ఫ్రీ బస్ ప్రయాణం ఎంతో మంది మహిళలకు పనులకు వెళ్లడానికి, స్వంత అవసరాలకు ఎంతో ఉపయోగంగా ఉందన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి పెంచి అమలు చేస్తున్నాం అన్నారు. 100 రోజులలోపే హామీలన్ని అమలు చేస్తామన్నారు. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలో పేదలు, గిరిజనులు ఎక్కువగా ఉంటారని, బాధ్యతగా, సంయమనంతో, టీమ్ గా విధులు నిర్వర్తించాలని, అధికారులు 18 గంటలు కష్టపడాలని మంత్రి తెలిపారు.
   
     కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, 6 గ్యారంటీలు, సంక్షేమ పథకాలు అమలుచేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యమని తెలిపారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగు లేనప్పటికీ ఇచ్చిన హామీలు అమలు చేస్తామన్నారు. ప్రజా పాలన పై అధికారులు స్పష్టత రావాలని, కార్యక్రమం బాగుగా జరిగిందనే కీర్తి పొందాలని అన్నారు. గ్రామ, మండల స్థాయిలో మంచిగా పనిచేస్తే ప్రజలకు మంచి జరుగుతుందని, ప్రభుత్వానికి అధికారులు రెండు కళ్ళని, ప్రభుత్వం పాలసీలు చేస్తే, అమలు బాధ్యత అధికారులదని అన్నారు. పథకాలు అర్హులకు అందినప్పుడే అధికారులకు తమ విధుల పట్ల సంతృప్తి కలుగుతుందని మంత్రి తెలిపారు.
     కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ప్రజలకు చేరువగా పాలన అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమానికి స్వీకారం చుట్టిందని, డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు పని దినాలలో జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ, మునిసిపాలిటీ లోని ప్రతీ వార్డులలో సభ నిర్వహించి, ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించాలని అన్నారు. గ్రామ సభల షెడ్యూల్ ముందస్తుగా తెలియజేయాలని, ప్రణాళికాబద్ధంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రతి 100 మందికి ఒక కౌంటర్, నీడ కొరకు షామియానా, త్రాగునీరు తదితర మౌళిక సదుపాయాల కల్పన చేయాలన్నారు. క్షేత్ర స్థాయిలో పనిచేసే సిబ్బందికి ప్రజా పాలన సభ నిర్వహణకు సంబంధించి ప్రతి అంశంపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. అధికారులు సమిష్టిగా కృషి చేస్తేనే మంచి ఫలితం ఉంటుందని, అధికారులు బాధ్యతగా తమ వంతు పాత్ర పోషించాలని అన్నారు.కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆల మాట్లాడుతూ, ఈ నెల 28 నుండి జనవరి 6 వరకు ఉదయం 8 గంటల నుండి మ. 12 గంటల వరకు, మ. 12 గంటల నుండి సా. 6 గంటల వరకు రెండు షిఫ్టుల్లో ప్రజా పాలన సభలు నిర్వహిస్తామన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 22 మండలాల్లో 481 గ్రామ పంచాయతీలు, 4 మునిసిపాలిటీల్లో 114 వార్డులు ఉన్నట్లు తెలిపారు. జనాభాకు అనుగుణంగా టీములు ఏర్పాటు చేసి, కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ డా. వినీత్ మాట్లాడుతూ, ప్రజా పాలన సభలకు బందోబస్తు చేపట్టనున్నట్లు, సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. సభలలో క్యూ ల నిర్వహణలో వయోవృద్దులు, దివ్యాoగులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఖమ్మం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ, ఖమ్మం జిల్లాలో 21 మండలాల్లో 589 గ్రామ పంచాయతీలు, 4 మునిసిపాలిటీల్లో 125 వార్డులు ఉన్నట్లు తెలిపారు. 59 బృదాలు ఏర్పాటు చేసి, రోజుకు రెండు షిఫ్టుల్లో జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ, వార్డుల్లోని అన్ని కుటుంబాలని కవర్ చేస్తామన్నారు.  ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఖమ్మం జెడ్పి చైర్మన్ లింగాల కమలరాజ్, నగర మేయర్ పునుకొల్లు నీరజ, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, భద్రాచలం ఐటిడిఎ పిఓ ప్రతీక్ జైన్, శిక్షణ సహాయ కలెక్టర్ మయాంక్ సింగ్, భద్రాద్రి కొత్తగూడెం అదనపు కలెక్టర్లు డా. రాంబాబు, మధుసూదన్ రాజు, ఉమ్మడి జిల్లా వివిధ శాఖల అధికారులు, నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులు, తహశీల్దార్లు, ఎంపిడివోలు తదితరులు పాల్గొన్నారు

భక్తిశ్రద్ధలతో ఇంద్రకీలాద్రి ప్రదక్షిణ...


పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రి చుట్టూ ఆదిదంపతుల గిరిప్రదక్షిణ అత్యంత వైభవంగా కొనసాగింది. అమ్మవారి శిఖరం చుట్టూ పౌర్ణమి రోజున నిర్వహించే గిరి ప్రదక్షిణ చేస్తే భక్తుల కోరికలు త్వరగా తీరుతాయని ప్రతీతి. ఇంద్రకీలాద్రి చుట్టూ జరిగిన ఈ గిరి ప్రదక్షణలో అమ్మవారి నామస్మరణ మారుమ్రోగింది.శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో మంగళవారం పౌర్ణమి సందర్భంగా ఉదయం లోకకళ్యాణార్థం, భక్త జనశ్రేయస్సు, ధర్మప్రచారం నిమిత్తం వేదపండితుల మంత్రోశ్చ‌రణలు, అమ్మవారి నామ స్మరణలు, మంగళ వాయిద్యాల‌ నడుమ శ్రీ కామధేను అమ్మవారి ఆలయం (ఘాట్ రోడ్ ఎంట్రన్స్ వద్ద) వద్ద శ్రీ స్వామి, అమ్మవార్లుకు ఆలయ స్థానాచార్యులు శ్రీ విష్ణుభట్ల శివప్రసాద శర్మ ఆధ్వర్యంలో ఆలయ వైదిక సిబ్బందిచే శాస్త్రోక్తంగా పూజలు నిర్విహించారు
  ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, కార్యనిర్వాహనాధికారి కె ఎస్ రామరావుచే కొబ్బరి కాయ కొట్టి గిరిప్రదక్షిణ కార్యక్రమంను ప్రారంభించారు.


Sunday, 24 December 2023

ఘనంగా సత్య సాయి ధ్యానమండలి రజతోత్సవం...ఉర్రూతలూగించిన మాటల మరకతమణి ప్రాసమణి ప్రసంగం...



ఖమ్మం: సత్య సాయి ధ్యానమండలి తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ శాఖ రజతోత్చసవ చతుర్ధ వేడుకలు ఖమ్మం గుర్రం కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు.
ఒక వైపు గురు భక్తి, వైపు ఉత్సాహవంతమైన ఆటలు పాటలు, కూచిపూడి నృత్యాలతోపాటు.. మాటల మరకతమణి ప్రాస మణి ఉపన్యాసం ఆహ్వానితులను కట్టి పడేశాయి..
ఆదివారం ఉదయం 6 గంటలకు డాక్టర్ మురళీకృష్ణ భాస్కర్ నాయుడు ఆధ్వర్యంలో గణపతి నవగ్రహ చండీ శాంతి హోమాలు నిర్వహించారు అనంతరం.. ఖమ్మం తోపాటు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.
కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచిన గురు బిక్షమయ్యగారు మాట్లాడుతూ ధ్యాన ద్వారా మానవుడు ఎంతో సాధించగలడని పేర్కొన్నారు.ఆనందంలోనే అన్ని వుంటాయని పేర్కొన్నారు.
సత్యసాయి సేవా సమితి జిల్లా అధ్యక్షులు దమ్మాలపాటి సుధాకర్ బాబా అమృత వాక్కులు ఆధ్యాత్మిక చైతన్యం కలిగించగా.. ప్రకృతి ఉమా మహేష్, ఎల్లయ్య స్వామి తదితరులు సందేశాలు ఆధ్యాత్మికతను చాటాయి..
పెండ్లి శ్రీనివాస్ రెడ్డి వుందని సమర్పణతో ముగిసిన కార్యక్రమంలో మల్లాది శివ్వన్నారాయణ నిర్వహణలో జరిగిన కార్యక్రమం ఆధ్యాంతం అందరిని ఆకట్టుకుంది.
అనంతరం సత్యసాయి సేవా సమితి వార్షిక క్యాలెండర్ ను సభలో ఆవిష్కరించారు.

*ఔరా... అనిపించిన మాటల మరకత మణి ప్రాసమణి ప్రసంగం*
శ్రీ సత్య సాయి ధ్యాన మండలి రజతోత్సవ వేడుకల్లో అన్నదాత ప్రాసమని ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ఒక వైపు స్త్రీమూర్తులపైన ప్రశంసలు, మరోవైపు హిందూ నాగరికత, సంప్రదాయలను కాపాడుకుందాం అంటూ సాగిన ప్రాసల ప్రసంగం ఔరా అనిపించింది..గురు బిక్షమయ్యా చెప్పిన ప్రతిమాట ఆణిముత్యాలే అంటూ అందరూ శ్రద్ధగా వాటిని పాటిస్తే ఆరోగ్యం.ఆనందం నిండుగా వుంటుందని చెప్పారు..  తన మాటలలో ప్రాసను నింపుతూ  పలికిన మాటలు తూటలు సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి ..

@మణికుమార్ కొమ్మమూరు, ఖమ్మం (మొబైల్: 9032075966)

Thursday, 21 December 2023

క్రచే కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్...


ఖమ్మం, డిసెంబర్ 20: ఉద్యోగినుల సౌకర్యార్థం నూతన కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన క్రచ్చే (పిల్లల సంరక్షణ కేంద్రం) ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. బుధవారం కలెక్టర్ క్రచే కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళా ఉద్యోగుల కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్రచ్చే కేంద్రంలో చిన్న పిల్లల సంరక్షణకు అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మహిళా ఉద్యోగులు విధుల నిర్వహణకు ఇబ్బంది కలగకుండా వారి చిన్న పిల్లలను కార్యాలయమునకు రాగానే సంరక్షణ కేంద్రం క్రచ్చేలో సంరక్షకులకు అప్పగించి నిశ్చింతగా తమ విధులను సమర్ధవంతంగా ముగించుకొని, ఇంటికి వెళ్లెప్పుడు తిరిగి తీసుకొని వెళ్లవచ్చని ఆయన అన్నారు. క్రచే కేంద్రంలో పిల్లల ఆట వస్తువులు, వారి సంరక్షణకు సిబ్బందిని కేటాయించినట్లు ఆయన అన్నారు. క్రచే సిబ్బంది రాణిని రోజువారి ఎంత మంది పిల్లలు ఉంటున్నది, అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.

రెవెన్యూ సమస్యలు వెంటనే పరిష్కరించండి.. అధికారులు సమీక్షలో కలెక్టర్ ఆదేశం..


ఖమ్మం, డిసెంబర్ 21: రెవిన్యూ సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. గురువారం నూతన కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రెవిన్యూ అధికారులతో ధరణి, రిజిస్ట్రేషన్స్, భూసేకరణ, బల్క్ సమస్యలు తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెవిన్యూ సంబంధ దరఖాస్తులపై వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలన్నారు. ధరణి కి సంబంధించి, టీఎం-33 ద్వారా వచ్చిన దరఖాస్తులలో పెండింగ్ వున్న వాటిని యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలన్నారు. జిఎల్ఎం సక్సేషన్, మ్యుటేషన్ ల దరఖాస్తుల ఫైళ్లు వెంటనే సమర్పించాలన్నారు. ఫైళ్లను సంబంధిత తహసీల్దార్ కార్యాలయాల్లో భద్రపరచాలన్నారు. జిల్లాలో వివిధ ప్రాజెక్టులకు చేపడుతున్న భూ సేకరణ ప్రక్రియ వేగం చేయాలన్నారు. పోస్ట్ అవార్డ్ పనులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. స్ట్రక్చర్ లకు చెల్లింపులు పెండింగ్ లో లేకుండా చూడాలన్నారు. రిజిస్ట్రేషన్ లకు సబంధించి స్లాట్ లు పెండింగ్ లేకుండా చూడాలన్నారు. దరఖాస్తుదారులకు సమయం ఇచ్చి, దరఖాస్తులు పరిష్కరించాలన్నారు. గుర్తించిన బల్క్ సమస్యలకు సంబంధించి చర్యలు వేగం చేయాలన్నారు. సర్వే, విచారణలు త్వరితగతిన పూర్తి చేసి, అర్హులకు పట్టాల జారికి చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలకు స్థల సేకరణలు పూర్తి చేయాలన్నారు. వేర్ హౌజింగ్ గోడౌన్ల కొరకు ఒక్కో డివిజన్ లో 50 ఎకరాల చొప్పున భూ సేకరణ చేయాలన్నారు. ఎమ్మెల్యే పాయింట్ ల కొరకు ప్రతి మండలంలో 2 ఎకరాల భూమిని గుర్తించి, ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. ప్రభుత్వ భూముల ఆక్రమణల పై తీసుకున్న చర్యల నివేదిక సమర్పించాలన్నారు. జీవో 59 లో తిరస్కరణకు గురైన దరఖాస్తులకు సంబంధించి, స్థలాలను స్వాధీనం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా రక్షణ చర్యలు చేపట్టాలన్నారు.  మీ సేవ దరఖాస్తులను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలన్నారు. ప్రజావాణి దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఎప్పటికప్పుడు దరఖాస్తుల పరిష్కారం చేయాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 1209 డొంకలు ఉన్నట్లు, ఇందులో 69 డొంకలు ఆక్రమణ కు గురయినట్లు ఆయన తెలిపారు. సర్వే చేపట్టి, డొంకల్లో ఆక్రమణలు తొలగించి, ఉపాధి హామీ క్రింద రహదారుల ఏర్పాటుచేసి, రక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం చేయాలన్నారు. చెక్కులు సిద్ధం ఉన్నచోట పంపిణీకి చర్యలు చేపట్టాలన్నారు. కోర్ట్ కేసుల విషయంలో టైం బాండ్, డైరెక్షన్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్, శిక్షణ సహాయ కలెక్టర్ మయాంక్ సింగ్, ఆర్డీవో లు జి. గణేష్, అశోక్ చక్రవర్తి, ఏడి సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాసులు, కలెక్టరేట్ ఏవో అరుణ, కలెక్టరేట్ సూపరింటెండెంట్ లు, మండల తహశీల్దార్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అప్రమత్తంగా వుండాలి..కొవిడ్ నియంత్రణపై కలెక్టర్ సమీక్ష...


ఖమ్మం, డిసెంబర్ 20: కోవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. బుధవారం కలెక్టర్, నూతన కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో వైద్య శాఖ అధికారులతో కోవిడ్ ముందస్తు నియంత్రణ చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో కోవిడ్ వ్యాపి చెందకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో మే మాసం నుండి కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాలేదన్నారు. లక్షణాలున్న వారందరికీ కోవిడ్ పరీక్షలు చేయాలన్నారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో 2724 కోవిడ్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయని, అవసరమయితే మరిన్ని ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. కోవిడ్ నియంత్రణ డ్రగ్స్, ఆక్సిజన్, వెంటిలేటర్లు, పిపిఇ కిట్లు, మాస్క్ లు అందుబాటులో ఉంచాలని, జిల్లా ప్రధాన ఆసుపత్రిలో కోవిడ్ వార్డు, కోవిడ్ ఓపి, ల్యాబ్ లు క్రియాశీలం చేయాలన్నారు. ఎట్టి పరిస్థితులు ఉత్పన్నమయిన ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉండాలని కలెక్టర్ అన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా వైద్య, ఆరోగ్య అధికారిణి డా. బి. మాలతి, డిసిహెచ్ఎస్ డా. బి. వెంకటేశ్వర్లు, మెడికల్ సూపరింటెండెంట్ డా. బి. కిరణ్ కుమార్, ఉప జిల్లా వైద్యాధికారి డా. బి. సైదులు, ప్రభుత్వ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. వి. సదానందం, డా. డి. రమాదేవి, డా. సందీప్, కె. అశోక్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Tuesday, 19 December 2023

తెలంగాణకు 8.245 ఎకరాల భూమి.... ఉమ్మడి ఆస్తుల విభజన పై రేవంత్ రెడ్డి సమీక్ష..

న్యూఢిల్లీ: తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా దేశ రాజధాని న్యూ ఢిల్లీలో నూతన తెలంగాణ భవన్ నిర్మిస్తామని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అన్నారు. న్యూ ఢిల్లీలోని తెలంగాణ భవన్, ఆంధ్రప్రదేశ్ భవన్ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఉమ్మడి ఆస్తుల విభజనపై ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. న్యూ ఢిల్లీ లోని తన నివాసంలో ఈ అంశంపై తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ శ్రీ గౌరవ్ ఉప్పల్, భవన్ ఓఎస్డీ శ్రీ సంజయ్ జాజుతో ఈరోజు ఆయన సమీక్ష నిర్వహించారు. భవన్ మొత్తం విస్తీర్ణం ఎంత? అందులో ఉన్న భవనాలు, వాటి స్థితి, అందులో  తెలంగాణ వాటా వివరాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు.
ఉమ్మడిగా 19.781 ఎకరాల భూమి ఉందని అధికారులు తెలిపారు. ఇందులో ఉమ్మడి భవన్ పరిధిలోని 8.781 ఎకరాల్లో శబరి బ్లాక్, అంతర్గత రోడ్లు, గోదావరి బ్లాక్, 3.359 ఎకరాల్లో ఓల్డ్ నర్సింగ్ హాస్టల్, 7.641 ఎకరాల్లో పటౌడి హౌస్ ఉన్నాయని అధికారులు తెలిపారు. తెలంగాణ వాటా కింద ఎంత భూమి వస్తుందని సీఎం ప్రశ్నించారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం మన రాష్ట్రం తెలంగాణకు 8.245 ఎకరాల భూమి వస్తుందని, ఏపీకి 11.536 ఎకరాలు (41.68:58.32 నిష్పత్తి లో) వెళుతుందని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. ప్రస్తుత భవనాల స్థితి, అధికారులు, సిబ్బంది నివాస గృహాల స్థితిపై సీఎం ఆరా తీశారు మూడు, నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించినవి కావడంతో చాలా వరకు శిథిలావస్థకు చేరాయని, మరమ్మతులు చేయిస్తున్నామని రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా నూతన భవనం నిర్మించుకుందామని ఈ సందర్భంగా సీఎం అన్నారు. అంతకు ముందు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఆస్తుల విభజనపై దృష్టి సారించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన ప్రస్తుతం భవన్ మ్యాప్ ను పరిశీలించారు. ఆస్తుల విభజనపై అధికారులకు పలు సూచనలు ఇచ్చారు.

Monday, 18 December 2023

శ్రీ‌వారి వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం కోసం విస్తృత ఏర్పాట్లు.. టీటీడీ ఈవోఎవి.ధర్మారెడ్డి


తిరుమల : శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు వైష్ణ‌వాల‌యాల సంప్ర‌దాయాల‌ను పాటిస్తూ తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో డిసెంబ‌రు 23 నుండి జ‌న‌వ‌రి 1వ తేదీ వ‌ర‌కు వైకుంఠ ద్వారం 10 రోజుల పాటు తెర‌చి ఉంచి భ‌క్తుల‌కు ద‌ర్శ‌నభాగ్యం క‌ల్పిస్తామని, ఇందుకోసం విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నామని టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో సోమవారం వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాట్లపై వివిధ విభాగాధిపతు‌తో సమావేశం నిర్వహించారు.
అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ డిసెంబరు 23న తెల్లవారుజామున 1.45 గంటలకు వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభించి, జనవరి ఒకటో తేదీ రాత్రి 12 గంటలకు మూసివేస్తామన్నారు. అదేవిధంగా ఇతర వివరాలను ఈవో తెలియజేశారు.
- తిరుమ‌లలోని క్యూలైన్ల‌లో ఎక్కువ సేపు వేచి ఉండ‌కుండా శ్రీ‌వారి ద‌ర్శ‌నం చేసుకోవ‌డానికి వీలుగా డిసెంబ‌రు 22వ‌తేదీ మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుండి తిరుపతిలోని 9 కేంద్రాలలో 90 కౌంటర్ల ద్వారా కోటా పూర్త‌య్యేంత వ‌ర‌కు మొత్తం 4,23,500 స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్లు మంజూరు చేస్తాం.
- తిరుప‌తిలోని విష్ణునివాసం, శ్రీ‌నివాసం, గోవింద‌రాజ‌స్వామి స‌త్రాలు, భూదేవి కాంప్లెక్స్‌, రామచంద్ర పుష్క‌రిణి, ఇందిరా మైదానం, జీవ‌కోన హైస్కూల్‌, భైరాగిప‌ట్టెడ‌లోని రామానాయుడు హైస్కూల్‌, ఎంఆర్ ప‌ల్లిలోని జడ్‌పి హైస్కూల్‌లో ఉచితంగా స‌ర్వ‌ద‌ర్శ‌న టోకెన్లు పొంద‌వ‌చ్చు.
- డిసెంబ‌రు 22వ తేదీకి సంబంధించిన ఎస్ఎస్‌డి టోకెన్లు రద్దు చేయడమైనది.
- దర్శన టోకెన్లు గల భక్తులకు మాత్రమే తిరుమలలో గదులు కేటాయించడం జరుగుతుంది. తిరుమ‌ల‌లో గ‌దులు ప‌రిమితంగా ఉన్న కార‌ణంగా ఈ ప‌ర్వ‌దినాల‌లో భ‌క్తుల ర‌ద్దీ దృష్ట్యా తిరుప‌తిలో గ‌దులు పొందాల్సిందిగా భ‌క్తులకు విజ్ఞ‌ప్తి చేస్తున్నాం.
- గ‌తంలో వ‌లెనే ఈ సంవ‌త్స‌రం కూడా స్వ‌యంగా వ‌చ్చే ప్రోటోకాల్ విఐపిల‌కు, కుటుంబ సభ్యులకు ప‌రిమిత సంఖ్య‌లో మాత్ర‌మే బ్రేక్ ద‌ర్శ‌నం ఇవ్వ‌బ‌డుతుంది. 10 రోజుల పాటు సిఫార‌సు లేఖ‌లు స్వీక‌రించ‌బ‌డ‌వు.
- వైకుంఠ ద్వార ద‌ర్శ‌న ఫ‌లితం 10 రోజ‌లు పాటు ఉంటుంది. కావున విఐపిలు, ఇత‌ర భ‌క్తులు ప‌ది రోజుల్లో ఏదో ఒక‌రోజు ద‌ర్శ‌నం చేసుకోవ‌డానికి ప్ర‌ణాళిక‌లు రూపొందించుకోవాల్సిందిగా కోర‌డ‌మైన‌ది.
- టోకెన్లు, టికెట్లు పొందిన భ‌క్తుల‌ను 24 గంటలు ముందు మాత్ర‌మే తిరుమ‌లకు అనుమ‌తిస్తారు. 
- టోకెన్లు లేని భ‌క్తులు తిరుమ‌ల‌కు రావచ్చు. కానీ ద‌ర్శ‌నం ఉండ‌దు. వారు తలనీలాలు సమర్పించి ఇతర సందర్శనీయ ప్రాంతాలను దర్శించుకోవచ్చు.
- ద‌ర్శ‌న టోకెన్లు పొందిన భ‌క్తులు త‌మ టోకెన్ల‌పై సూచించిన తేదీ, స‌మ‌యానికే శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి రావాల‌ని విజ్ఞ‌ప్తి.
- దూరప్రాంతాల్లో ఉన్న భ‌క్తులు టీటీడీ వెబ్‌సైట్‌, ఎస్వీబీసీ, ఇత‌ర మాధ్య‌మాల ద్వారా టోకెన్ల ల‌భ్య‌త తెలుసుకున్న త‌రువాతే తిరుమ‌ల ప్ర‌యాణం ఖ‌రారు చేసుకోగ‌ల‌రు.

ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు
- వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 9 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు స్వర్ణరథంపై ఆలయ నాలుగుమాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారు.
- వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 4.30 నుండి 5.30 గంటల వరకు చక్రస్నానం నిర్వహిస్తాం.
- నాదనీరాజనం వేదికపై ఏకాదశి రోజున విష్ణుసహస్రనామ పారాయణం ఉంటుంది. అదేరోజు గీతాజయంతి రావడంతో భగవద్గీత అఖండపారాయణం కూడా నిర్వహిస్తాం.

పౌరాణిక వైశిష్ట్యం
- పురాణాల ప్రకారం వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం విశిష్ట‌త ఇలా ఉంది. దేవ‌లోకంలో శ్రీ‌మ‌హావిష్ణువుకు ఒక రోజు అంటే భూలోకంలో ఒక సంవ‌త్స‌రం అని అర్థం. అదేవిధంగా అక్క‌డ ప‌గ‌లు 12 గంట‌లు ఇక్క‌డ 6 నెల‌లు ఉత్త‌రాయ‌ణం, రాత్రి 12 గంట‌లు ఇక్క‌డ 6 నెల‌లు ద‌క్షిణాయణం. 
- దేవ‌లోకంలో తెల్ల‌వారుజామున 120 నిమిషాలు భూలోకంలో 30 రోజులతో సమానం. దీన్ని ధ‌నుర్మాసంగా పిలుస్తున్నాం. తెల్ల‌వారుజామున బ్ర‌హ్మ ముహూర్తంలో 40 నిమిషాలు శ్రీ‌మ‌హావిష్ణువు దేవ‌త‌ల‌కు, ఋషుల‌కు ద‌ర్శ‌న‌మిస్తారు. ఇది దేవ‌లోకంలో ఆ కాలమానం ప్రకారం ప్రతిరోజు జరిగే ప్రక్రియ. భూలోకం కాలమానం ప్రకారం సంవత్సరంలో ఒకసారి జరిగే ప్రక్రియగా కనిపిస్తుంది.- ఈ 40 నిమిషాలు భూలోకంలో 10 రోజులకు స‌మానం కాబ‌ట్టి వైష్ణ‌వాల‌యాలలో ఈ 10 రోజుల‌లో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం చేసుకుంటే శ్రీ‌మ‌హావిష్ణువును ప్ర‌త్య‌క్షంగా ద‌ర్శ‌నం చేసుకున్న భాగ్యం క‌లుగుతుంది అనేది న‌మ్మ‌కం. కాబ‌ట్టి వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఈ 10 రోజుల‌లో ఏరోజు చేసుకున్నా అన్ని రోజులూ స‌మాన‌మే. భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి ద‌ర్శ‌నానికి రావాల్సిందిగా విజ్ఞ‌ప్తి.
10 రోజుల్లో ఎప్పుడు దర్శించుకున్నా ఒకే ఫలితం : శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు శ్రీవారి ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన శ్రీ వేణుగోపాల దీక్షితులు మాట్లాడుతూ వైకుంఠ ద్వార దర్శనం విశిష్టతను తెలియజేశారు. 10 రోజుల్లో ఎప్పుడు దర్శించుకున్నా ఒకే ఫలితం ఉంటుందని వెల్లడించారు.

Extensive arrangements for Vaikuntadwara Darshanam - EO 
Vaikuntadwara Darshan significance lasts on all 10 days  Srivari temple Pradhana Archaka 
Tirumala, 18 December 2023: TTD EO  AV Dharma Reddy said that TTD is making extensive arrangements for providing Srivari Vaikuntadwara Darshan to as many devotees possible from December 23 to January 1.
Addressing the media conference after a review meeting with all heads of TTD departments at the Annamaiah Bhavan in Tirumala on Monday evening, the EO said the Vaikuntadwara Darshan commences from early hours of December 23 at 1.45 am and will conclude at the midnight of January 1. 
He briefed the media on arrangements...
* With objective to reduce waiting time of devotees in queue lines  TTD will issue 4,23,500 Sarva Darshan offline tokens from December 22 afternoon 2pm in all  92 counters at 9 locations in Tirupati.
* The token issuing locations are: Vishnu Nivasam, Srinivasam, Govindarajaswami Choultries, Bhudevi Complex, Ramachandra Pushkarani, Indira Maidan, Jeevakona High School, Raman  Naidu High school in Bairagipettada and ZP school in  MR Palli.
* Special queue lines,barricades,drinking water,coffee,tea, snacks will be provided at these counters.
* QR code boards will be displayed at all these counters for the benefit of devotees.
* With the coordination of district authorities, traffic and civil police security arrangements also made.
* Since limited rooms available in Tirumala, devotees shall book rooms in Tirupati itself during these festive days.
* Only devotees with tickets or tokens will be allotted rooms.
* As in past break Darshan facility is provided to protocol VIPs in person in limited numbers only. During these ten days no recommendation letters for break Darshan will be accepted.
* Devotees with tokens and tickets alone shall be allowed for Srivari Vaikuntadwara Darshan at Tirumala 24 hours ahead only.
* Devotees without tokens could reach Tirumala but can not get Darshan. They can visit other places in Tirumala viz. Papavinasanam, Akasa Ganga etc.
* Devotees with tokens or tickets should come for Srivari Darshan at specified date and time only.
* Devotees should plan Tirumala only after ascertaining availability of tokens through SVBC channel and TTD website.
Special programs 
* Sri Malayappa Swami and His consorts will ride Swarna ratham on Mada streets on Vaikunta Ekadasi day  between 9am and 11am.
* On Vaikunta Dwadasi day on December 24, Chakra Snanam will be organised between 4.30am and 5.30 am.
* On Vaikunta Ekadasi day Vishnu Sahasranama Parayanams will be observed at Nada Neeranjanam platform between 6am and 7am and on the same day being Gita Jayanti, Bhagavad Gita Akhanda Parayanam will also be recited between 12noon and 4pm.
Puranic significance of Vaikunta Dwara Darshan 
* As per Puranic legend  one day duration in Vaikunta of Sri Maha Vishnu is considered as one year on the Earth.Similarly the 12 hours of day time in Vaikunta is 6 months in earth also termed as Uttarayana and 12 hours of nightfall in Vaikunta is six months of Dakshinayana on the Earth.
* Likewise 120 minutes in Vaikunta is 30 days on the Earth known as Dhanur Masa. In that one day He provides darshan to all the deities for 40 minuted which is equal to 10 days of Vaikunthadwara Darshanam on the Earth.
The devotees should note that  all these ten days are equally important.
Darshan on any 10 days is Divine- Sri Venugopala Dikshitulu
Speaking on the occasion one of the Pradhana archakas of Srivari temple Sri Venugopala Dikshitulu highlighted the significance of Vaikuntadwara Darshan and said Srivari Darshan on any one of these ten days earns the same outcome of bliss to the devotees.

*ధరణి రిపేరు షురూ!* *సమస్యల శాశ్వత పరిష్కారంపై సర్కారు ఫోకస్‌..*

*ధరణి రిపేరు షురూ!* 

 *సమస్యల శాశ్వత పరిష్కారంపై సర్కారు ఫోకస్‌..*

 *సమాచార సేకరణలో రెవెన్యూ యంత్రాంగం* 

 *పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు 2.31 లక్షలు* 

 *డిజిటల్‌ సంతకం కోసం 1.8 లక్షల ఎకరాలు* 

 *130 రకాలకుపైగా రెవెన్యూ సమస్యలు* 

 *పాస్‌బుక్‌ల కోసం యాజమానుల నిరీక్షణ* 

: ధరణి పోర్టల్‌తో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ధరణి వ్యవస్థలోని లోటుపాట్లను సవరిస్తూ, భూ సమస్యలకు తక్షణ, శాశ్వత పరిష్కారం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఇందుకోసం ధరణిపై సమగ్ర నివేదిక అందజేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ మేరకు రెవెన్యూ యంత్రాంగం జిల్లాల వారీగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల వివరాలను సేకరిస్తోంది. ధరణి కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రైతులు, భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఎజెండాలో చేర్చింది. ఆ పార్టీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధరణి సమస్యలపై దృష్టి సారించారు. ఇటీవలే ఈ అంశంపై రెవెన్యూ శాఖ, ఇతర శాఖల మంత్రులు, రెవెన్యూశాఖ ఉన్నతాధికారులు, రెవెన్యూ అంశాలలో ప్రావీణ్యం ఉన్న విశ్లేషకులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ధరణి అమలవుతున్న తీరు, విధి విధానాలను ఉన్నతాధికారులు వివరించగా.. రైతులు, భూ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను రెవెన్యూ విశ్లేషకులు తెలియజేశారు. దీంతో దరణిపై సమగ్ర నివేదిక అందజేయాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. ఈ మేరకు ఏ మాడ్యూల్‌లో ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటూ రెవెన్యూ యంత్రాంగం ఆరా తీస్తోంది. కోర్టు పరిధిలో ఉన్న భూములు, పీవోబీ జాబితాలో ఉన్న భూముల వివరాలను గ్రామం, మండలాల వారీగా సేకరిస్తున్నారు. స్లాట్‌ బుక్‌ చేసుకొని ఫీజులు చెల్లించి రిజిస్ట్రేషన్‌ రద్దు చేసుకున్న వారు ఎంతమంది? వారిలో ఎంత మందికి డబ్బులు తిరిగి చెల్లించారు? ఎంత మందివి ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి? వంటి అంశాలతో జాబితాను సిద్ధం చేస్తున్నారు. ధరణికి ముందు, ధరణి తరువాత ఉన్న అసైన్డ్‌ భూమి, భూదాన్‌, ఎండోమెంట్‌, వక్ఫ్‌ భూమలు, పీవోబీ, ఎవాక్యూ ప్రాపర్టీ భూములను గుర్తిస్తున్నారు. ప్రభుత్వ భూములు, వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరాలను సేకరించే పనిలో పడ్డారు. ఇప్పటివరకు ఎన్ని దరఖాస్తులు పరిష్కరించారన్నది కూడా సేకరిస్తున్నారు.

పెండింగ్‌ దరఖాస్తులు 2.31 లక్షలు

రెవెన్యూ అధికారుల లెక్కల ప్రకారం ధరణి పోర్టల్‌లో పస్తుతం 1 నుంచి 33 వరకు టెక్నికల్‌ మాడ్యూల్స్‌ (టీఎం) ఉన్నాయి. ఈ మాడ్యూళ్లలో పరిష్కారం కోసం చేసుకున్న 2.31 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. మరో 1.8 లక్షల ఎకరాల భూములకు సంబంధించి డిజిటల్‌ సంతకాల (డీఎస్‌) కోసం భూ యాజమానులు ఎదురు చూస్తున్నారు. ధరణి పోర్టల్‌ అమల్లోకి రాకముందు 75 రకాల భూ సమస్యలు ఉంటే, ధరణి వచ్చాక ఆ సమస్యల సంఖ్య 130కి పెరిగిందని భూ సమస్యల పరిశీలకులు పేర్కొంటున్నారు. ఇవే కాకుండా సాదా బైనామా కోసం 9.5 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని పరిష్కరించేందుకు ధరణి పోర్టల్‌లో ప్రస్తుతం అవకాశం లేదు. అమల్లోకి తెచ్చిన ఆర్వోఆర్‌-2020 చట్టంలో చిన్నపాటి సవరణ చేస్తే సాదాబైనామా కోసం నిరీక్షిస్తున్న లక్షలాది మంది బాధితుల దరఖాస్తులకు విముక్తి కలుగుతుందని భూ చట్టాల విశ్లేకులు, న్యాయవాది సునీల్‌కుమార్‌ తెలిపారు. ప్రస్తుతం ధరణి ఆన్‌లైన్‌లో నమోదైన భూముల వివరాలు, యాజమానుల పేర్లు, ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలకు సంబంధించిన సమాచారానికి పూర్తి స్థాయి బాధ్యులు ఎవరు అన్న ప్రశ్న తలెత్తుతోంది. వీటికి సంబంధించిన మాన్యువల్‌ రికార్డులు లేకపోవడంతో ఎప్పుడైనా ఈ సమస్యలు రావచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఒకరి భూమి మరో వ్యక్తిపై నమోదై పట్టాదారు పాస్‌ పుస్తకం పొందితే.. ఆ పాస్‌పుస్తకాన్ని రద్దు చేసే అధికారం ఏ అధికారికీ లేదు. బాధితుడు కేవలం కోర్టుకెళ్లి తేల్చుకోవాల్సి ఉంటుంది. కాగా, పీవోబీ జాబితాలో నమోదైన పట్టా భూములను అందులో నుంచి తొలగించేందుకూ బాధితులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

చిన్న సమస్య పరిష్కారానికి సీసీఎల్‌ఏ వద్దకు..!
ప్రస్తుతం సర్వే నంబరు మిస్సింగ్‌, ఎక్స్‌టెన్షన్‌ కరెక్షన్‌ చేయాలంటే ఆ ఫైలు సీసీఎల్‌ఏ వరకు వెళ్లాల్సి వస్తోంది. డిజిటల్‌ పాస్‌బుక్‌ మొదటి పేజీలో తప్పులు సరిచేయించుకోవాలంటే కలెక్టర్‌ను ఆశ్రయించాలి. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లను సరిచేయించుకునేందుకు యజమానులు నెలల తరబడి అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. అంతేకాకుండా ప్రతి సమస్య పరిష్కారానికీ దరఖాస్తు చేసేటప్పుడు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. రెవెన్యూ రికార్డులను కంప్యూటర్‌లో అప్‌డేట్‌ చేసేటప్పుడు ప్రభుత్వం (అధికారులు) చేసిన తప్పులను వారే సరిదిద్దాలి. అలాంటిది తామెందుకు రుసుము చెల్లించాలని యజమానులు ప్రశ్నిస్తున్నారు. ఉన్న ఇబ్బందులకు తోడు ఈ ఫీజులతో తమపై ఆర్థిక భారం పడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరణి రావడానికి ముందే కొందరు రైతులు, భూ యజమానులు సమస్యలు ఎదుర్కొంటుండగా.. ధరణి అమల్లోకి వచ్చాక కొత్త వారు జత అయ్యారు. దీంతో ధరణి బాధితుల సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా రోజురోజుకూ పెరుగుతూ వచ్చింది.

Sunday, 17 December 2023

*సీఎం రేవంత్‌తో ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ భేటీ*


ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవ ర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ జూబ్లీహిల్స్ నివాసంలో ఆదివారం భేటీ అయ్యారు.కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సల హాదారుగా కూడా పని చేసిన ఆయన ముఖ్య మంత్రితో తన అనుభవాలు పంచుకున్నారు.రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరి స్థితి, ఆర్థిక అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఆర్థిక పరిస్థితిని మెరుగు పరిచేందుకు పలుసూచనలు చేశారు.
సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టివిక్ర మార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతి కుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణా రావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి పాల్గొన్నారు.కాగా, ప్రభుత్వాలు దివాలా తేసే స్థాయిలో ఉచితాలు ఇవ్వొద్దని, ఉంటే నిరుపేద లకు ఉపయోగపడే ఉచితాలు సమర్థనీ యమేనని రెండు రోజుల క్రితం రాఘు రామ్‌ రాజ్‌ అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు పోటాపోటీగా ఉచితాలు ఇస్తున్నాయని, అది సరికాదని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.. కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా కూడా పనిచేసిన రఘురామరాజన్, సీఎం రేవంత్ రెడ్డితో తన అనుభవాలను పంచుకున్నారు. 

హాట్ టాపిక్ గా మాజీ డిఎస్పీ నళిని లేఖ.. ప్రస్తుతం నాలో క్షాత్రత్వంపోయి బ్రహ్మతత్వం ప్రవేశించింది.

నా మనసులో మాట
నేను డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసి 12 ఏండ్లు పూర్తి అయిన తర్వాత కూడా, నన్ను ఇంకా జనం గుర్తుంచుకున్నారన్న విషయం  ఈ రోజు వస్తున్న మెసేజ్ ల ద్వారా అర్థం అవుతుంది.చాలా సంతోషం.వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు.కొందరు జర్నలిస్ట్ లు బైట్ కావాలి అని అడుగుతున్నారు.నేను దీనికి సుముఖంగా లేను. ఎందుకంటే నేను ప్రస్తుతం ప్రశాంత జీవితం గడుపుతున్నాను.అందుకే ఇలా ప్రకటన చేయాల్సి వచ్చింది.

 ప్రస్తుతం నేను ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ  యజ్ఞ బ్రహ్మ గా,వేద ప్రచారకురాలిగా, ఆర్ష కవయిత్రిగా  తపోమయ జీవనం గడుపుతున్నాను.పూర్తి సాత్వికంగా మారాను.
 ఉద్యమ సమయంలో నన్ను 4.12.2011 న సస్పెండ్ చేశారు. అన్ని పేపర్ల లో ఫోటో వేసి మరీ ఆ వార్తను హైలేట్ చేసి రాశారు. నాది దేశద్రోహం అన్నారు.చాలా బాధేసింది. సుష్మా స్వరాజ్ గారు ఒక్కరే దాన్ని ఖండించారు. ఢిల్లీ లో దీక్ష,తెలంగాణ యాత్ర,పరకాల ఉప ఎన్నిక లో పోటీ, బీజేపీ సభ్యత్వం తీసుకోవడం ఇవన్నీ ఉద్యమంలో భాగంగానే చేశాను.తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా  నేను ఎవరిని కలవలేదు. ఎపుడూ నా కోసం నేను ఏమీ అడగలేదు.నా రాజీనామా ను విత్ డ్రా చేసుకుంటున్నట్లు  వినతి పత్రం ఎన్నడూ ఇవ్వలేదు అలాంటప్పుడు ఇలా నేను సడెన్ గా వార్తల్లోకి ఎలా వచ్చాను?ఇంతమందికి నా కాంటాక్ట్ నంబర్ ఎలా తెలిసింది ? ఆశ్చర్యంగా ఉంది.
 ఏది ఏమైనా ఇప్పుడు కూడా నాకు యాచించడం ఇష్టం లేదు.ఆ అవసరం నాకు లేదు కూడా. ఒకవేళ ప్రజల ఒత్తిడి మేరకు, ప్రస్తుత ప్రభుత్వం అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ  జాబ్ ఇచ్చినా,  ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా నేను దానికి పూర్తి న్యాయం చేయలేను.  రుమటైడ్ ఆర్థరైటిస్ వల్ల నా ఫిజికల్ ఫిట్నెస్ పోయింది . చాలా కాలం గడిచింది కాబట్టి పోలీస్ ఆప్టిట్యూడ్ ను కూడా నేను కోల్పోయాను .
ఇక టెక్నికల్ విషయాలకు వచ్చినట్లైతే,పోలీస్ సర్వీస్ రూల్స్ నా నియామకాన్ని ఒప్పుకోవు.ఎవరైనా హై కోర్ట్ లో పిల్ వేస్తే నా నియామకం రద్దు అవచ్చు కూడా. కొరివి తో తల గోక్కున్నట్లు అవుతుంది. గతంలో ముఖ్యమంత్రి రోశయ్య గారు ఇచ్చారు కదా అని వెళితే ఏం జరిగిందో ,18 నెలలు ఎంత ఇబ్బంది పడ్డానో నాకు ఇంకా గురుతే.  అందుకే నేను ఉద్యోగం అడగను.కాని బతికి ఉన్నంత వరకు ఏదో రకంగా ప్రజా సేవా చేస్తూనే ఉంటాను.
త్యాగి నుండి యోగినీ అయ్యి  పతంజలి సంస్థ ద్వారా ఆయుర్వేదము,యోగలను ప్రచారం చేశాను. రోగిని కూడా అయ్యి కోలుకున్న.ఇప్పుడు తపస్వి నై, నిత్యాగ్నిహోత్రి ని అయ్యి సనాతన ధర్మ మూలాధారమైన వేదం, యజ్ఞమును ప్రచారం చేస్తున్నా. ఇదే మార్గంలో ముందుకు వెళ్లాలని భావిస్తున్న.ఆనాడు నాలో పొంగింది దేశ భక్తి అయితే ఇప్పుడు నాలో దైవ భక్తి నుండి ఉంది. ప్రస్తుతం నాలో క్షాత్రత్వం
పోయి బ్రహ్మతత్వం ప్రవేశించింది.
అడగందే అమ్మైనా అన్నం పెట్టదు కదా!! అలాగే ఆకలి వేయనిదే ఎవరు కూడా అన్నం కావాలి అని అడిగరు.

Saturday, 16 December 2023

*కుక్క బతుకు అని తీసేయకండి..ఆ కుక్క రేటే 20కోట్లు*


ఎవరినైనా తక్కువ చేసి మాట్లాడేవాళ్లు కుక్క బతుకు అంటారు.  కాని 20కోట్ల ఖరీదైన కుక్క ఔరా అనిపిస్తోంది. ...ఆరుదైన జాతికి చెందిన ఓ కుక్క హైదరాబాద్‌లో సందడి చేసింది. మియాపూర్‌లోని విశ్వాస్ పెట్ క్లినిక్‌కు *బెంగళూరుకు చెందిన కుక్క యజమాని సతీష్ దానిని సిటీకి తీసుకొచ్చాడు.*దీంతో శునక ప్రియులు ఆ అరుదైన కుక్కను చూసేందుకు ఎగబడ్డారు.

కుక్కతో ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. *కొకేషియన్ షెఫర్డ్ బ్రీడ్‌కు చెందిన ఈ కుక్క విలువ రూ.20 కోట్లు ఉంటుందని యజమాని ‎తెలిపారు.*అయితే ఈ అరుదైన జాతి కుక్కను రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నట్లు తెలిపాడు. *మూడేళ్ల వయస్సు కలిగిన ఈ కుక్క రోజుకు మూడు కిలోల చికెన్‌ను ఆహారంగా తీసుకుంటుందన్నారు.* ప్రపంచవ్యాప్తంగా పలు ప్రదర్శనలతో పాటు పలు సినిమాల్లో కూడా నటించినట్లు వివరించారు. ఈ *డాగ్ మెయింటెన్స్‌కు మూడు లక్షల వరకు ఖర్చు* అవుతుందని సతీష్ తెలిపారు.

చలికాలంలో వేడిగా..... వాడిగా తొలి శాసనసభ సమావేశాలు.... అసెంబ్లీలో రేవంత్ ×కెటిఆర్...


హైదరాబాద్:డిసెంబర్ 16 : తెలంగాణ అసెంబ్లీ తొలి దఫా సమావేశాలు చలికాలంలో  వేడి శగ రగిల్చాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్సెస్  కెటిఆర్ గా సాగిన సమావేశాలు ఆధ్యాంతం ఆకట్టుకున్నాయి.. ఉదయం 10 గంటలకు మొదలైన  శాసనసభ, శాసనమండలి సమా వేశాలు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లో చర్చ జరిగింది. కొత్త అసెంబ్లీ కొలువు తీరిన తర్వాత జరుగుతున్న మొదటి చర్చ సర్వత్రా ఆసక్తికరంగా సాగింది.ఈ నెల 9న సమావేశాలు ప్రారంభం కాగా. అసెంబ్లీలో ధన్యవాద తీర్మానాన్ని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ప్రతిపాదించగా..చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేకానంద బలపర్చారు. మండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తీర్మానాన్ని ప్రతిపాదించ నుండగా..టీచర్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి బలపరిచారు. సభ సమావేశాలలో గత పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వ విధానాలను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని వ్యవస్థలను దెబ్బ తీశారని గవర్నర్ విమర్శలు గుప్పించారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న మొదటి చర్చపై ఆసక్తి నెలకొంది. గట్టిగా కౌంటర్తో ముందుకు వచ్ఛిన బిఆర్ఎస్ ప్రసంగం అజ్ఞాతం కాంగ్రెస్ పాంప్లెట్ లాగా ఉందని పేర్కొంది. మహిళలు 2500 కోసం ఎదురుచూస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో భాగంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
గవర్నర్ ప్రసంగం పూర్తిగా తప్పులతడకే అని.. తాము ఎప్పటికీ ప్రజాపక్షమే తెలం గాణ పక్షమే.. కాంగ్రెస్ ఎప్ప టికీ విపక్షమే అన్న కేటీఆర్ కామెంట్స్‌పై రేవంత్ మండి పడ్డారు. కేటీఆర్‌ను ఎన్‌ఆర్‌ ఐ అంటూ సెటైర్ విసిరారు.
కొంతమంది ఎన్ఆర్ఐ‌లకు ప్రజాస్వామ్యం గురించి చెప్పినా అర్థం కాదన్నారు. పోతిరెడ్డి పాడుకు పొక్క పెట్టినరోజు మాట్లాడిన నాయకుడు పీజేఆర్ తమ నేత అని చెప్పుకొచ్చారు. చీమలు పెట్టిన పుట్టలో జోర్రినట్టు కేటీఆర్ మేనేజ్‌మెంట్ కోటాలో వచ్చారని వ్యాఖ్యలు చేశారు.కేకే మహేందర్ రెడ్డికి అన్యాయం చేశారన్నారు. గత పాలన గూర్చి మాట్లాడుదామంటే ఒక రోజంతా చర్చ పెడదామన్నారు. ఉద్యమంలో మీ వెంట నడిచిన వారికి ఉద్యమ పార్టీగా గొప్పలు చెప్పుకుంటున్న వారు ఉధ్యమ కారులకు ఏం చేశారు చెప్పాలని అసెంబ్లీ ముఖంగా రేవంత్ రెడ్డి కెటిఆర్ ను నిలదీశారు. మంత్రులకు ఎమ్మెల్యేలకు కనీసం ప్రగతి భవన్ సైతం రానివ్వకుండా బారికేడ్లను కట్టారని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ అడ్డుకట్టలను తొలగించిందని సామాన్యునికి తమ గోడు చెప్పుకునే అవకాశం కల్పించిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో పాపం ఉందంటే ఆనాటి పాలకుల్లో చాలా మంది ఇప్పుడు బీఆర్ ఎస్‌లోనే ఉన్నారని తెలిపారు.కేసీఆర్‌కు యూత్ కాంగ్రెస్ నాయకుడిగా అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ అని గుర్తుచేశారు. కేసీఆర్‌కు సింగిల్ విండో ఎన్నికలలో పోటీచేసే అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ అని తెలిపారు. పిల్లి శాపనార్థాలకు ఉట్లు తెగిపడవన్నారు. ప్రతి పక్షాలను గౌరవించే సంప్రదాయం కాంగ్రెస్ పార్టీకి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Friday, 15 December 2023

గ్రామోత్సవాలకు తరలిన దుర్గమ్మ రధం...

విజయవాడ : శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానము,ఇంద్రకీలాద్రి,విజయవాడ శ్రీ శోభకృత్ నామ సంవత్సర భవానీ దీక్షలు – 2023 మరియు హిందూ ధర్మప్రచారము నిమిత్తము శ్రీ  అమ్మవారి ధర్మప్రచార రధమును విజయవాడ నుండి శ్రీకాకుళం జిల్లా వరకు పంపించుటకు గాను ది.15.12.2023 నుండి ది.24.12.2023 (10 రోజులు) వరకు వివిధ గ్రామములలో గ్రామోత్సవము నిర్వహించుటకు గాను వైదిక కమిటీ వారి ఆధ్వర్యంలో
 ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, కార్యనిర్వహణాధికారి కె ఎస్ రామరావు.
స్వామి, అమ్మవార్లకు పూజలు నిర్వహించి ప్రచార రధాన్ని ప్రారంభించారు.
Route Map :
15-12-2023 న కోరుకొండ , గోకవరం , అడ్డతీగల ( ఏజెన్సీ ప్రాంతములు)
16-12-2023 న పాపంపేట , జె. అన్నవరం , జడ్డంగి ( ఏజెన్సీ ప్రాంతములు)
17-12-2023 న ఏ.బి కాలనీ , బుట్టావారి వీధి , పూదేడు 
18-12-2023 న కొత్తవలస , చాపల ఉప్పాడ
19-12-2023 న తాళ్ళనలస , చీపురుపల్లి , శ్రీకాకుళం ,అరసవిల్లి
20-12-2023 న నరసన్నపేట ,పోలాకి , రాజారాంపురం , కొత్తరేవు ,కొరివిపేట ,గుల్లవానిపేట ,ఉమ్మలాడ,పిన్నింటిపేట, సంతబొమ్మాళి, టెక్కలి
21-12-2023 న పలాస,మిలియాపుట్టి,పర్లాకిమిడి,పాతపట్నం,హిరమండలం,శుభలై,కొత్తూరు, సీతంపేట 
22-12-2023 న పాలకొండ , ఆముదాలవలస,వీరఘట్టం ,నాగూరు
23-12-2023 న గిజబ, పార్వతీపురం,బొబ్బిలి
24-12-2023 న గొల్లపల్లి , గజపతినగరం, విజయనగరం
సదరు గ్రామములలోని ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులు కావలసినదిగా చైర్మన్ కర్నాటి రాంబాబు, కార్యనిర్వాహణాధికారి కె ఎస్ రామ రావు కోరారు.

Thursday, 14 December 2023

1743 కోట్ల సబ్సిడీ నిధుల విడుదలకు పచ్చజెండా.... ఫైల్ పై సంతకం చేసిన బట్టి విక్రమార్క

ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది రోజుల్లోనే సబ్సిడీలపై దృష్టి సారించిన కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా సబ్సిడీ ధనాన్ని ఆయా శాఖలకు బదిలీ చేసేందుకు పూనుకుంది ఈరోజు అన్ని శాఖలతో సమీక్ష నిర్వహించిన రేవంత్ రెడ్డి 1743 కోట్ల రూపాయలను హామీల తాలూకు సబ్సిడీ ఎలా భర్తీకి విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి అయిన బట్టి విక్రమార్కను ఆదేశించారు.

సంబంధిత ఫైలు పై  బట్టి విక్రమార్క నిధుల విడుదలకు సంబంధించి సంతకం చేశారు దీంతో

*ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సబ్సిడీకి రూ.374 కోట్లు,*

*రాజీవ్‌ ఆరోగ్య శ్రీ పథకానికి రూ.298 కోట్లు,*

*విద్యుత్‌ సబ్సిడీకి రూ.996 కోట్లు,*

*సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లకు రూ.75 కోట్లు అయా శాఖలకు చేరనున్నాయి

*నవగ్రహాల పట్టాభిషేకం*... ప్రఖ్యాత ఆలయ సమాచారం.. .కర్మ సాక్షులు 18.. దక్షిణామూర్తి వైభవం...

_*నవగ్రహ పురాణం 
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
ఇంత సేపూ సభలో కూర్చున్న దేవతలంతా ఇప్పుడు రెండు వరుసలుగా బారులు తీరి నిలుచున్నారు. దేవతా పురుషులూ , దేవతా స్త్రీలూ కలిసి నిలుచున్న ఆ వరుసలు అందమైన కదంబమాలికలను గుర్తుకు తెస్తున్నాయి. అందరి చేతుల్లోనూ సువాసనలు వెదజల్లుతున్న రంగు రంగుల పువ్వులతో నిండిన సజ్జలున్నాయి. దూరం నుంచి గుర్రపు గిట్టల శబ్దం ! తలలు తిప్పి చూస్తున్న కళ్ళకు విందు చేస్తూ దూరంలో స్వర్ణ రథం ప్రత్యక్షమైంది !
ఆ రథాన్ని ఏడుగుర్రాలు లాగుతున్నాయి. విచిత్రంగా ఆ రథానికి ఒకే ఒక చక్రం ఉంది ! సప్తాశ్వాలు లాగుతున్న ఏకచక్ర రథం సమీపానికి వస్తోంది. రథం మధ్య పద్మాకారంలో ఉన్న పీఠం మీద సూర్యుడు ఆసీనుడై ఉన్నాడు. అరుణుడు రథాన్ని నడుపుతున్నాడు.

సూర్యరథం బారులుగా నిలుచున్న దేవతా బృందాలను సమీపించింది. రథం మీద ఎర్రటి గొడుగు ప్రకాశిస్తోంది. రక్తవర్ణ పతాకం రెపరెపలాడుతోంది. వరుసల ప్రారంభంలో నిలుచున్న త్రిమూర్తి దంపతులు సూర్యుడిని ఆశీర్వదిస్తున్నారు. ఎర్రటి వస్త్రాలతో , ఎర్ర తామరల మాలికలతో సూర్యుడు ధగధగలాడిపోతున్నాడు. ఆయన శరీరం నుండి వెలువడే కాంతితో బంగారు రథం మెరిసిపోతోంది. సూర్యుడి మీదికి పువ్వులు చల్లుతూ సప్తర్షులు స్తోత్ర పఠనం ప్రారంభించారు.

*"జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం ! తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్ !"*
సహస్రాధిక దేవతా కంఠాలు సూర్యస్తోత్రాన్ని అందుకున్నాయి. సూర్య రథమూ , రథికుడైన సూర్యుడూ కనులకు విందు చేస్తుంటే , వేలాది స్త్రీ పురుషులు పఠిస్తున్న స్తోత్రం వీనులకు విందు చేస్తోంది. రెండు వైపులా ఉన్న దేవతా పంక్తులను దాటి వెళ్ళిన సూర్య రథం నిర్ణీత స్థలంలో ఆగింది. ఆ ప్రాంతంలో నిశ్శబ్దం తాండవించింది.

ఆ నిశ్శబ్దాన్ని చెదరగొడుతూ రథచక్రాల శబ్దాలూ , గుర్రపు గిట్టల చప్పుళ్ళూ వినవస్తున్నాయి.

మూడు చక్రాల సువర్ణ రథం కొంచెం దూరంలో ప్రత్యక్షమైంది. పాలనురగలాంటి తెల్లటి గుర్రాలు పది రథాన్ని లాగుతున్నాయి. రథం మీద తెల్లటి గొడుగు , శ్వేత పతాకాన్ని క్షీరసాగర పవనాలు స్పందింపజేస్తున్నాయి.

పది శ్వేతాశ్వాలు లాగుతున్న మూడు చక్రాల అందాల రథం మీద శ్వేత వస్త్రాలూ , శ్వేత పుష్పమాలికలూ ధరించిన చంద్రుడు కళ్ళకు ఇంపుగా మెరిసిపోతున్నాడు. పెరుగులాగా , శంఖంలాగా , మంచులాగా తెల్లగా కనిపిస్తున్న చంద్రుడిని కీర్తిస్తూ స్తోత్ర పఠనం ప్రారంభించారు సప్తర్షులు.

*"దధి శంఖ తుషారాభం క్షీరోదార్ణవ సంభవం ! నమామి శశినం సోమం శంభోర్మకుట భూషణమ్ !"*

దేవతా సమూహాల బృందగానంతో చంద్రస్తోత్రం ప్రతిధ్వనించింది. రథానికి ఇరువైపుల నుండీ రంగు రంగుల పువ్వులు చంద్రుడి మీద వర్షిస్తున్నాయి. చంద్ర రథం కొద్ది దూరాన ఆగి ఉన్న సూర్య రథం వైపు సాగిపోయింది.మరొక బంగారు రథం అందరికీ కనువిందు చేస్తూ కదలివస్తోంది. పద్మరాగ మణులలాగా ఎర్రగా ఉన్న ఎనిమిది గుర్రాలు రెండు చక్రాల స్వర్ణ రథాన్ని లాగుతున్నాయి. గంభీరంగా కదను తొక్కుతూ , రథం మీద ఛత్రం ఎర్రగా మెరుస్తోంది. ఎర్రటి పతాకం గాలికి రెపరెపలాడుతోంది. రక్తవర్ణ వస్త్రాలు ధరించిన కుజుడు రథంలో ఉన్నాడు. కణకణలాడే నిప్పులాంటి శరీర వర్ణంతో 'అంగారకుడు' అనే సార్ధక నామధేయాన్ని పొందిన భూమి పుత్ర కుజుడు రక్తవర్ణ పుష్పమాలికలను ధరించి ఉన్నాడు. బంగారు ఆభరణంలో పొదిగిన అందమైన పద్మరాగమణిలా కనిపిస్తున్న అంగారక కుజుడి మీద పుష్ప వర్షం కురవసాగింది. ఆయన శరీరం నుంచి కాంతి పెల్లుబుకుతూ పరిసరాలను ఆక్రమిస్తోంది.

*"ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం ! కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహమ్ !"*

సప్తర్షుల స్తోత్రాన్ని దేవతా పురుషులూ , స్త్రీలు అందుకున్నారు. నవగ్రహాలలో తృతీయ గ్రహం అందరి కళ్ళకూ విందులు చేస్తూ సాగిపోయింది.
మరుక్షణం గోరోచన వర్ణంలో ఉన్న ద్విచక్ర దివ్యరథం దేవతా సమూహానికి కనిపించింది. ఎనిమిది కపిలాశ్వాలు ఆ రథాన్ని లాగుతున్నాయి. రథం మీద పసుపు పచ్చరంగు ధ్వజం గాలిలో అందంగా కదులుతోంది. పసుపుపచ్చ రంగు గొడుగు ధగధగ మెరిసిపోతోంది.పీతవర్ణ వస్త్రాలూ , పుష్పమలికలూ ధరించిన బుధుడు , చిరునవ్వులు చిందిస్తూ రథం మీద కొలువు తీరి ఉన్నాడు. చంద్రుడిని మించిన అందంతో వెలుగులు వెదజల్లుతున్న బుధుడు తన సౌందర్యంతో అందరినీ అబ్బురపరుస్తున్నాడు.

*"ప్రియంగు కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధం ! సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్ !”*

సప్తర్షులు ఆలపించిన బుధస్తుతి దేవతా బృందాల కంఠాలతో ప్రతిధ్వనిస్తోంది. స్తోత్రానికి కార్య రూపంలో అర్ధం చెప్తున్నట్టు పువ్వులు వర్షిస్తున్నాయి.

దేవతల పంక్తులను దాటిన తన రథాన్ని బుధుడు ముందుకు నడిపించాడు. కుజుడి రథ సమీపంలో నిలిపాడు.మరుక్షణం అందరికీ నేత్రపర్వం చేస్తూ గురు గ్రహ రథం చూపరులను ఆకర్షించింది. బంగారు రంగును పోలిన పాండుర వర్ణ రథం మీద స్వర్ణ వర్ణ వస్త్రాలు ధరించిన గురువు జ్ఞాన తేజస్సును విరజిమ్ముతూ కూర్చున్నాడు. హేమవర్ణ ఛత్రం , హేమవర్ణ పతాకం ఆయన రథం మీద మెరుస్తున్నాయి.
పాండుర వర్ణంలో నేత్రాలకు హాయి గొలుపుతున్న ఆ రెండు చక్రాల రథాన్ని ఎనిమిది శ్వేతాశ్వాలు లాగుతున్నాయి. స్వర్ణమయమైన పాండుర వర్ణ రథం దేవతా పంక్తుల సమీపానికి వచ్చింది. సప్తర్షులు పుష్పాక్షతలు చల్లుతూ స్తోత్ర పాఠం ప్రారంభించారు.
*"దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం ! బుద్ధి మంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమ్ !”*

తమ గురుదేవుడైన బృహస్పతిని దేవతలు నూతనోత్సాహంతో గానం చేస్తున్నారు. ప్రత్యేకాభిమానంతో ఆయన మీద పుష్ప వృష్టి కురిపిస్తున్నారు. పంక్తులను దాటి వెళ్ళిపోయిన తమ గురుదేవుల దివ్య రథాన్నే చూస్తూ ఉండిపోయిన దేవతల దృష్టిని మరొక రథ చక్ర ధ్వని మళ్ళించింది.
అగ్నిజ్వాలను తలపిస్తూ తప్తకాంచన వర్ణంలో ధగధగలాడుతున్న దివ్యరథాన్ని లాగుతూ పది శ్వేతాశ్వాలు పరుగులు తీస్తున్నాయి. శ్వేతవస్త్రాన్ని ధరించిన శుక్రుడు ఆ ద్విచక్ర రథం మీద గంభీరంగా కూర్చున్నాడు. శ్వేత పుష్పమాలికలు ఆయన శరీరం మీద మెరుస్తున్నాయి. ఆయన రథం మీద ప్రకాశిస్తున్న ఛత్రమూ తెలుపే ! ధ్వజమూ తెలుపే !

శుక్రరథం తమను సమీపించగానే , పుష్పాక్షతలు వెదజల్లుతూ , సప్తర్షులు శ్లోకపఠనం ఆరంభించారు.

*"హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం ! సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్ !”*

శుక్రుడి మీద పుష్పవృష్టి కురిపిస్తూ , దేవతలు శుక్రస్తోత్రాన్ని వేనోళ్ళతో పఠించ సాగేరు. అయితే వాళ్ళ కంఠ స్వరాలను వెక్కిరిస్తూ - భీకర కంఠధ్వనులు అక్కడ ప్రతిధ్వనించాయి ! ఆ క్షణం దాకా అదృశ్యంగా ఉన్న రాక్షసులు వేలాది మంది దేవతా పంక్తులను అనుసంధానిస్తూ బారులు తీరి నిలుచున్నారు , అందరినీ ఆశ్చర్యపరుస్తూ !తమ గురుదేవులు శుక్రాచార్యులను ఉద్దేశించి అసుర సమూహాలు చేస్తున్న జయజయ ధ్వానాలతో దశదిశలూ దద్దరిల్లిపోయాయి. రక్తవర్ణ పుష్పాలను తన మీద వర్షిస్తున్న శిష్య బృందాలను చిరునవ్వుతో వీక్షిస్తూ రథాన్ని ముందుకు పోనిచ్చి , ఆపాడు శుక్రుడు.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*హిందూ ఆలయ సమాచారం*🙏
🪷🪷🪷🪷🪷🪷🪷
                                           
*ద్వాదశ జ్యోతిర్లింగాలు*
 గుజరాత్ – సోమనాథ్,✓
 ఆంధ్రప్రదేశ్ – శ్రీశైలం,✓ మధ్యప్రదేశ్ – మహాకాలేశ్వర్,✓ మధ్యప్రదేశ్ – ఓంకారేశ్వర్✓ జార్ఖండ్ -భైద్యనాధ్√ మహారాష్ట్ర – భీమశంకర్,
తమిళనాడు – రామేశ్వరం,✓ గుజరాత్ – నాగేశ్వర్.✓ ఉత్తరప్రదేశ్ – కాశీవిశ్వనాధ్,✓
మహారాష్ట్ర – త్రయంబకేశ్వర్, 
ఉత్తరాఖండ్ – కేదారేశ్వర్✓, 
మహారాష్ట్ర – ఘృష్నేశ్వర్.          
                                                                                 *అష్టాదశ శక్తిపీఠాలు* 
 శ్రీలంక – శాంకరీదేవి, కాంచీపురం – కామాక్షి✓, ప్రద్యుమ్నం – శ్రుంఖలాదేవి, మైసూరు –చాముండి, అలంపురం – జోగులాంబ శ్రీశైలం – బ్రమరాంబిక✓, కొల్హాపూర్ – మహాలక్ష్మి, మాహూర్ – ఏకవీర, ఉజ్జయిని - మహాకాళి,✓ పిఠాపురం – పురుహూతిక ✓  
జాజిపూర్ – గిరిజాదేవి✓, ద్రాక్షారామ – మాణిక్యాంబ,✓ గౌహతి – కామాఖ్య, ప్రయాగరాజ్ – మాధవేశ్వరి✓, అరుణాచలప్రదేశ్ –వైష్ణోదేవి,✓ గయ – సర్వమంగళ✓, వారణాశి – విశాలాక్షి✓, కాశ్మీర్ – సరస్వతి                                        

*వినాయక దేవాలయాలు*

ఉత్తరాఖండ్ - ముండ్కతియా వినాయక్, కేరలాపురం - అతిశయ వినాయగర్, 
పూతోట్టం - ఆది వినాయకర్, 
బిక్కవోలు - స్వయంభూః లక్ష్మీగణపతి,✓
బెంగుళూరు - దొడ్డ గణపతి, 
అయినవిల్లి - స్వయంభూః సిద్ధి వినాయకుడు,✓ కాణిపాకం - స్వయంభూః వరసిద్ధి వినాయకుడు✓, చిక్కమగులూరు - కమండల గణపతి, 
రత్నగిరి - స్వయంభూః గణపతి           
                                                                *సప్తముక్తి క్షేత్రాలు* 
 అయోధ్య,✓ మధుర,✓ హరిద్వార్✓, వారణాశి,✓ కాంచీపురం,✓ ఉజ్జయిని,✓ ద్వారక ✓                                 

*స్వయంభూః క్షేత్రాలు*
 శ్రీరంగం - రంగనాధస్వామి,✓ తిరుమల - శ్రీ వేంకటేశ్వరస్వామి, ✓
నైమిశారణ్యం - శ్రీ చక్రనారాయణ, ✓
బద్రీనాధ్ - శ్రీ బదరీనాధుడు✓, 
పుష్కర్ - వరాహస్వామి, 
తిరునల్వేలి - వనమామలై పెరుమాళ్ లేదా శ్రీతోతాద్రినాథన్, 
కడలూరు - భూః వరాహస్వామి, 
నేపాల్ - ముక్తినాధ్,               
                                                                                    *పంచ గయా క్షేత్రాలు* 
 గయ – శిరోగయ,✓ 
జాజిపూర్ – నాభిగయ,✓ పిఠాపురం – పాదగయ, ✓
బద్రీనాధ్ – బ్రహ్మకపాలం,✓. సిద్ధాపూర్ – మాతృగయ ✓   

*చార్ ధామ్* 
 ద్వారక,✓ బద్రీనాధ్✓, పూరీ,✓ రామేశ్వరం ✓    
                                                                                *పంచ ద్వారక*
ద్వారక– ద్వారకాదీష్,✓ 
బెట్ ద్వారక –శ్రీకృష్ణ,✓ దాకోర్-శ్రీ రన్ ఛోద్రజీ మహారాజ్,✓ నాధ్ ద్వారా–శ్రీనాధ్ జీ,✓ కంక్రోలీ–ద్వారకాదీష్✓                                                                                                                                  

*పంచ భద్రి*/ 
బద్రీనాధ్ – విశాల్ బద్రి,✓ 
పండుకేశ్వర్ – యోగధాన్ బద్రి, సుభైన్–భవిష్యబద్రి, అనీమత్ – వృద్ధబద్రి, కర్ణప్రయాగ –ఆదిబద్రి ✓         
                                                                                                                                                          *పంచ భూతలింగాలు* 

కాంచీపురం – ఏకాంబరేశ్వర్✓, 
జంబుకేశ్వరం – జంబుకేశ్వర్✓, 
తిరువణ్ణామలై – అరుణాచలేశ్వర్, ✓ శ్రీకాళహస్తి – కాలహస్తీశ్వర్ ✓ చిదంబరం – నటరాజ్, ✓                                         
                                                                                                                                                                                                                                                       *నిర్దిష్ట తీర్థయాత్ర మార్గంలో పుణ్యక్షేత్రాలను పొందుపరుస్తూ తయారు చేసిన యాత్రలు*
                                                                                                                                                                                                                                                                                                                               *శ్రీశైల యాత్ర* 
శ్రీశైలం, శైలేశ్వరం,✓ 

*నవనంది క్షేత్రాలు* (మహానంది నుండి నంధ్యాల),✓, నంద్యాల – జగజ్జనని, యాగంటి – ఉమామహేశ్వర,,✓ బనగానపల్లి – బ్రహ్మంగారి మఠం, ✓
నందవరం – చౌడేశ్వరీ దేవి, 
అలంపురం – జోగులాంబ,
అహోబిలం – నవ నృసింహ క్షేత్రాలు, ✓
మంత్రాలయం - రాఘవేంద్ర స్వామి, ✓
సంగమేశ్వరం – సంగమేశ్వరుడు, 
గబ్బూరు – వేంకటేశ్వరస్వామి    
                                                                                                           *కైలాస మానస సరోవర్*
మానస సరోవర్, 
కైలాస పర్వతం           
                                                                                                                          *సోమనాధ్ యాత్ర*
 సోమనాధ్, వారెవాల్, ✓
భావనగర్ – నిష్కలంక మహదేవ్, 
పూడమ్ – గంగేశ్వర మహదేవ్, 
ద్వారక – ద్వారకాదీష్ ,✓ నాగేశ్వర్, ✓
ఉజ్జయిని – మహాకాలేశ్వర్,✓ ఓంకారేశ్వర్, ✓       
                                                    
*పశుపతినాధ్ ముక్తినాధ్ యాత్ర* / 

ఖాట్మండూ –పశుపతినాధ్, బుద్ధునికాంతా మందిరం (శయన విష్ణుమూర్తి), నేపాల్ – ముక్తినాథ్                                                         

*శ్రీ అమరనాధ్ యాత్ర*     
                                                                                                                            *ఛోటా చార్ ధామ్ యాత్ర*
 హరిద్వార్, ✓
ఋషీకేశ్, ✓
ఉత్తరకాశీ,✓
 గంగోత్రి,✓
యమునొత్రి, ✓
దేవప్రయాగ, ✓
రుద్రప్రయాగ,✓ రుద్రప్రయాగ-గౌరీకుండ్,✓ కేదార్నాధ్, కర్ణప్రయాగ,✓ నందప్రయాగ, ✓
జోషీమఠ్, ✓
విష్ణుప్రయాగ, ✓
హనుమాన్ చత్తి,✓ 
బద్రీనాధ్ ✓    
                                                                                                                             
దత్తక్షేత్రములు,
 వారణాశిలో నవదుర్గలు✓,
 ఆదిశంకరాచార్య, ✓
అరసవిల్లి సూర్యనారాయణ ✓ ఘటి సుబ్రమణ్యేశ్వర, గోకర్ణేశ్వర్ గుహాలయం, జంగారెడ్డిగూడెం 
మద్ది ఆంజనేయస్వామి, మధ్యప్రదేశ్ మందరపర్వత ఆలయం,  
సాలిగ్రామ విశేషం, 
పాండవుల స్వర్గారోహణ యాత్ర, 
వరదవెల్లి దత్తాత్రేయ, ఉజ్జయిని హరసిద్ధిమాత,✓ ఉదయపూర్ ఇందనమాత, కాంగ్రా జ్వాలాముఖి✓, 
నండూరి సప్తశ్రుంగి ఆలయం,  
ధోల్ పూర్ ఆచలేశ్వర మహదేవ్ ఆలయం,
ఆచంట ఆచంటేశ్వర్ ఆలయం, హంపి విరూపాక్ష, 
పుస్ఫగిరి హరిహరాలయం, 
పక్షి తీర్ధం,
రాయఘడ్ హరిహరేశ్వర ఆలయం, 
ఓంకారక్షేత్రం,
మహదేవ్ పూర్ కాళేశ్వర ముక్తేశ్వర మహాదేవి ఆలయం, 
తిరుభువనంలో శరభేశ్వరర్ ఆలయం, 
కులూ లోయ మణికర్ణన్ శివాలయం, 
ఓంకారక్షేత్రం,  
తిరువణ్ణామలై మల్లిఖార్జున ఆలయం, ✓
శ్రీకాకుళం శ్రీముఖ లింగేశ్వర ఆలయం,✓ 
హంగల్ తారకేశ్వర ఆలయం, 
వేములవాడ రాజరాజేశ్వర్ ఆలయం, 
యనమదుర్రు శక్తీశ్వర ఆలయం, 
బధ్రాచలం సీతారామచంద్ర మూర్తి ఆలయం,✓ ద్వారకాతిరుమల శ్రీ వెకటేశ్వర ఆలయం,✓ 
కూడుపు అనంత పద్మనాభ ఆలయం, 
శ్రీకూర్మం, ✓
చదలాడ శ్రీ శ్రుంగార వల్లభ స్వామి ఆలయం.✓
 
*నవనృసింహ క్షేత్రములు*
  అహోబిలం, ✓
సింహాచలం,✓ 
అంతర్వేది, ✓
వేదాద్రి, 
మంగళగిరి✓,
 కదిరి, 
మాల్యాద్రి, a 
ధర్మపురి, 
యాదగిరిగుట్ట.     
                 
*యాత్రలు* కేరళ యాత్ర 
కన్యాకుమారి✓, 
కేరలాపురం, 
సుచీంద్రం,✓ 
తిరువనంతపురం, గురువాయూరు, 
శబరిమల, 
కొచ్చిన్ వెంకటేశ్వర, ఎర్నాకులం వేంకటేశ్వర, కాలాడి శంకరాచార్య                                                                     

*కొల్హాపూర్ యాత్ర*
 గాణుగాపూర్, 
కడగంచి, 
అక్కల్కోట, 
పందర్ పూర్, 
కొల్హాపూర్, 
శిరిడీ, ✓
శింగనాపూర్, ✓                                     

*పంచకేదార్ యాత్ర*
 కేదార్నాధ్, ✓
మధ్య మహేశ్వర్, 
తుంగనాధ్, 
రుద్రనాధ్, 
కల్పెశ్వర్                                                   

*పంచారామ యాత్ర* అమరావతి అమరారామ,✓ భీమవరం సోమారామ,✓ పాలకొల్లు క్షీరారామ,✓ ద్రాక్షారామ, 
సామర్లకోట కుమారరామ ✓ 

*పూరీ యాత్ర*
పూరీ జగన్నాధ్, ✓
జాజిపూర్ బిరిజాదేవి, ✓
గౌహతి కామాఖ్య, 
పాండువా శ్రుంఖలాదేవి, కలకత్తా దక్షణకాళి, 
బరంపురం తారాతారిణి✓     
                                                                                                                                          *రామేశ్వరం యాత్ర*
 అరుణాచలం✓, 
వృద్ధాచలం,✓ 
చిదంబరం,✓ 
జంబుకేశ్వరం,✓ 
కుంభకోణం, ✓ 
తిరువిడై మరుదూరు,✓ మహాలింగేశ్వర ఆలయం, మధురై, ✓
తంజావూరు, 
సప్త సుబ్రహ్మణ్య క్షేత్రములు,✓ నవగ్రహ తిరుపతులు, రామేశ్వరం✓, 
శ్రీరంగం ✓  
                                                           
*శృంగేరి యాత్ర* 
గోవా, 
గోకర్ణం, 
మురుడేశ్వర్, 
ఉడుపి, 
మంగళాదేవి, 
కేసరగాడ్, 
మంజేశ్వర్,
కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర, శ్రుంగేరి, 
ధర్మస్థల, 
కేశవే కమండల గణపతి ఆలయం, 
హోర్నాడు అన్నపూర్ణేశ్వరి, కొల్లూరు మూకాంబిక,  
షిరిలీ మహాగణపతి మహామయా ఆలయం, 

*తిరుమల యాత్ర* 
 తిరుమల, ✓
తిరుపతి, ✓
తిరుచెందూర్, ✓
అర్ధగిరి, ✓
కాణిపాకం,✓ 
తిరుత్తణి, ✓
కాంచీపురం✓, 
వెల్లూరు, ✓
శ్రీకాళహస్తి, ✓
గుడిమల్లాం, 
ఒంటిమిట్ట                                                                                                               
*ఉజ్జయిని నాశిక్ యాత్ర*
 గృశ్నేశ్వర్, 
అజంతా ఎల్లోరా గుహలు, భీమశంకర్, 
త్రయంబకేశ్వర్, మహాకాలేశ్వర్,✓ 
ఓంకారేశ్వర్ మధ్యప్రదేశ్✓ పశుపతినాధ్, 
అగర్ మాల్వా బైజ్‌నాథ్ మహాదేవ్
💐💐మన కర్మలకు పద్దెనిమిది మందిసాక్షులు💐💐చుట్టూ ఎవరూ లేనప్పుడు తప్పుడు పనులకు తెగించడం మానవ బలహీనత...కానీ...
నేను ఒక్కడినే కదా ఉన్నాను, 
నన్ను ఎవరూ గమనించడం లేదు’ 
అని మనిషి అనుకోవటం చాలా పొరపాటు . 
మనిషి ఏ పని చేస్తున్నా నిశితంగా గమనించేవి మూగసాక్షులు పద్దెనిమిది ఉన్నాయి . అవి 
నాలుగు వేదాలు, పంచభూతాలు, అంతరాత్మ, ధర్మం, యముడు, ఉభయ సంధ్యలు, సూర్య చంద్రులు, పగలు, రాత్రి . 
వీటినే అష్టాదశ మహా పదార్థాలు అంటారు . ఈ మూగసాక్షులు మనిషిని అనుక్షణం నీడలా పర్యవేక్షిస్తుంటాయి . 
ఇవి మనలోకంలోని న్యాయస్థానాల్లో సాక్ష్యం చెప్పపోవచ్చును గాని, 
వీటి గమనిక నుండి మనిషి తప్పించుకోవడం సాధ్యపడదు .
దీన్ని గుర్తించలేని కారణంగానే ఇవన్నీ జడ పదార్థాలేనని, సాక్ష్యం చెప్పడానికి నోరులేనివని మానవుడు భ్రమపడుతుంటాడు . 
ఈ మహాపదార్థాలు రహస్యయంత్రాల వంటివి . 
అవి మనిషి ప్రతి చర్యనూ నమోదు చేస్తాయి . 
ఆ నివేదికల్ని విధికి చేరవేస్తాయి . అది వాటిని కర్మలుగా మలుస్తుంది . మనిషి చేసే పనులు మంచి అయితే సత్కర్మలుగా, చెడ్డవి అయితే దుష్కర్మలుగా విధి నిర్ణయిస్తుంది . సత్కర్మలకు సత్కారాలు, దుష్కర్మలకు జరిమానాలు అమలవుతాయి . 
అవి ఏవో మరుజన్మకో ఆ తరువాతో ఫలిస్తాయని అనుకోకూడదు, ఈ జన్మలోనే అమలు చేయబడవచ్చు . 
ఇది నిరంతరాయంగా సాగిపోయే సృష్టిపరిణామక్రమం .
 అంతరాత్మ అనేది ఒకటుందని ప్రతి మనిషికీ తెలుసు . 
అది మనం చేసే పని మంచిదా ? చెడ్డదా ? అనే విషయాన్ని ఎప్పటికప్పుడే చెప్పేస్తుంది .
 కానీ ఆవేశం, కోపంతో విచక్షణ కోల్పోయిన వ్యక్తి అంతరాత్మ సలహాను కాలరాస్తాడు అది అనర్థాలకు దారితీయటం మనందరికి అనుభవమే .
 ఒక్కోసారి అంతరాత్మ నిలదీస్తున్నప్పుడు పశ్చాత్తాపంతో సిగ్గుతో తలదించుకుంటాం . 
కానీ దీన్ని మనమెవరితోనూ పంచుకోము . అందువల్ల అంతరాత్మ అనుభవపూర్వకంగా నిజమైనప్పుడు మిగతా పది హేడు కూడా నిజమేనని గ్రహించగలగటం వివేకం .
 నలుగురికీ తెలిసేలా దానధర్మాలు, క్రతువులు, పూజలు నిర్వహించాలన్న కుతూహలం అవివేకం .
 అష్టాదశ సాక్షులు ఎల్లవేళలా గమనిస్తున్నాయంటే, ఎవరు చూడాలో వాళ్ళు చూస్తున్నట్లేగా అర్థం . 
ఈ ఎరుక కలిగినప్పుడు ఏ మనిషీ చెడ్డ పనులు చేయటానికి తెగించడు .
 ఎవరు చూసినా చూడకపోయినా మంచితనంతో, తోటి వారికి సాధ్యమయినంత సహాయం చేయాలనే సత్‌సంకల్పంతో జీవితాన్ని గడపడం ఉత్తమం . ఈ జ్ఞానం వల్ల మనిషి సాధ్యమైనన్ని మంచిపనులు చేయడానికి పయ్రత్నిస్తూ సుఖశాంతులకు నోచుకుంటాడు .


💐💐దక్షిణామూర్తి వైభవం💐💐

శివుడు లయ కారకుడు. అంటే సృష్టిని విలీనం చేసుకొని కొత్త సృష్టికి మార్గాన్ని కల్పిస్తాడు. జ్ఞానంపై ఆసక్తి లేనివాళ్లను మళ్లీ జన్మ ఉండేటట్లుగా లయం చేయడం, జ్ఞానం కోరేవాడికి జ్ఞానాన్ని ప్రసాదించి మళ్లీ జన్మ లేకుండా భగవంతుని స్వరూపంలో కలపడం అనే రెండు రకాలుగా శివుడు లయం చేస్తాడు. శివుని యొక్క జ్ఞానావతారమే దక్షిణామూర్తి.

దక్షిణామూర్తి పరమశివుని జ్ఞానగురువు అవతారం. ఇతర గురువులు మాటలతో శిష్యులకు బోధిస్తారు. కానీ దక్షిణామూర్తి మౌనం గానే ఉండి శిష్యులకు కలిగే సందేహాలు నివారిస్తాడు.

బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభించినప్పుడు మొదట సనక, సనందన, సనత్సుజాత మరియు సనత్కుమారులను సృష్టించాడు. వారిని తన సృష్టిని కొనసాగించమన్నాడు. కాని వారికి ఇష్టం లేక మేము బ్రహ్మజ్ఞానం పొందాలి, అందువలన మేము మీకు సాయపడలేము అని విరక్తులై బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి గురువును వెదుకుతూ బయలుదేరారు. ఇక బ్రహ్మగారు మరో ప్రత్యామ్నాయంతో తన సృష్టిని కొనసాగించాడు.

ఇక ఈ నలుగురూ గురువు కోసం వెదుకుతూ నారద మహర్షి సహాయంతో మొదట బ్రహ్మ గారినే అడుగుదామనుకొన్నారు. కాని ప్రక్కన సరస్వతీదేవిని చూసి " ఈయనే పెళ్ళి చేసుకొని సంసారంలో ఉన్నాడు. ఇక ఈయన మనకు ఏమని ఉపదేశిస్తాడు" అని అనుకొని బ్రహ్మను అడుగలేదు. అలాగే మహావిష్ణువునూ మరియు పరమశివుడినీ కూడా అడుగుదామని వెళ్ళి వారి ప్రక్కన లక్ష్మీదేవినీ మరియు పార్వతీదేవినీ చూసి వారిని కూడా అడుగలేదు.

పరమశివుడు ఈ నలుగురి అజ్ఞానాన్ని చూసి బాధపడి వారికి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాలనుకొని అనుకొన్నాడు. వారు వెళ్ళే దారిలో ఒక మర్రిచెట్టు క్రింద దక్షిణామూర్తిగా కూర్చున్నాడు. వీరు నలుగురూ ఆ మూర్తిని చూసి, అతని తేజస్సుకు ఆకర్షితులై, ఆయన చుట్టూ కూర్చున్నారు. శివుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా యోగ భంగిమ లొనే కూర్చున్నాడు. ఋషులందరికి అనుమానాలన్నీ వాటంతట అవే తొలగిపోయి జ్ఞానవంతులయ్యారు. దక్షిణామూర్తి స్వామి వారు తమ మౌనంతోనే వారందరినీ బ్రహ్మజ్ఞానం పొందునట్లు చేసారు. అలా మౌనముగా ఎందుకు బోధించారంటే బ్రహ్మము లేక పరమాత్మ మాటలకు, మనసుకూ అందనివారు కాబట్టి అలా బోధించారు.

ఇలాంటి యువకుడైన దక్షిణామూర్తి చుట్టూ వృద్ధులైన మునులు కూర్చుని ఉంటారట. గురువు చేసేది మౌనవ్యాఖ్యానం. మౌనంగా చిన్ముద్రలో కూర్చుని ఉండటమే అతడు చేసే వ్యాఖ్యానం.
దక్షిణామూర్తి పాదాలక్రింద ఉన్నది తమో గుణ రూపానికి ప్రతీక!వాటిని శివుడు తన కాలితో అదిమిపడుతాడు! దక్షిణామూర్తి కాలికింద ఉన్న రాక్షసుడు (తమో గుణం) ఆనందంగా ఉండటం! అజ్ఞానాన్ని అదుపు చేసేవాడే శ్రీ దక్షిణామూర్తి. ఈ తత్వమే ఆదిగురుతత్త్వం. దక్షిణామూర్తి ఆది గురువు, ఆది యోగి అన్న మాట. ఆయన సమస్త జ్ఞానానికి మూలం! ఈ తత్వాన్ని తెలుసుకోవటమంటే – జ్ఞానం, ఎరుక అనే అవగాహన కలిగివుండటమే! పరమశివుని ఈ రూపం సంగీత, సాహిత్యాల , యోగ, తాంత్రిక విద్యల కలయిక. సకల శాస్త్రాల సారాన్ని తెలిసి , అర్హులైన మహర్షులకు ఉపదేశం చేసినవాడే శ్రీ దక్షిణామూర్తి. సద్గురువు లభించని ఉత్తములు ఈయన్ని గురువుగా భావించి, జ్ఞానం, మోక్షాన్ని పొందవచ్చు.

💐దక్షిణామూర్తి శ్లోకం💐

గురవే సర్వలోకానాం భిషజే భవరోగినాం
నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః

అర్ధం :

సర్వలోకాలకు గురువు, భవరోగులకు ( సంసార బంధాలలో చిక్కుకుపోయిన వాళ్ళకు ) వైద్యుడు, సకల విద్యలకు నెలవు ( నివాసం ) అయిన దక్షిణామూర్తి కి నమస్కారములు.
సేకరణ: సోషల్ మీడియా 

*పదవీ భాద్యతలు స్వీకరించిన పొంగులేటి శ్రీనివాస రెడ్డి*

హైదరాబాద్రా: రాష్ట్ర సమాచార, రెవిన్యూ, గృహనిర్మాణ శాఖా మంత్రిగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి నేడు డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య భాద్యతలు స్వీకరించారు. ఈ పదవీ స్వీకార కార్యక్రమానికి మంత్రి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. 
ఈ సందర్బంగా మంత్రిని ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, వేముల వీరేశం, ఆదినారాయణ, బాలు నాయక్, ఆది శ్రీనివాస్, యశస్వినీ రెడ్డి తోపాటు పలువురు సీనియర్ నాయకులు రేణుకా చౌదరి, రామసహాయం సురేందర్ రెడ్డి, రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, ఆర్ అండ్ బీ కార్యదర్శి శ్రీనివాస రాజు, సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్ కె. అశోక్ రెడ్డి, సమాచార శాఖ డైరెక్టర్ రాజమౌళి, అడిషనల్ డైరెక్టర్ నాగయ్య, జేడీ లు జగన్, శ్రీనివాస్, వెంకట రమణ, డీడీ లు మధు సూధన్, హాష్మి, రాజా రెడ్డి, సీఐఈ  రాధా కిషన్, వివిధ శాఖల ఉన్నతాధికారులు మంత్రిని కలసి శుభాకాంక్షలు తెలిపారు. 
    *భువనగిరిలో స్పోర్ట్ కాంప్లెక్స్ కు 10  ఎకరాల భూమి*
భువనగిరి జిల్లా రాయగిరి లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి పది ఎకరాల భూమిని కేటాయిస్తూ తన మొదటి ఫెయిల్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సంతకం చేశారు. రూ. 9 .50 కోట్ల విలువ గల ఈ పదెకరాల స్థలాన్ని మల్టి పర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి చేపట్టేందుకు యువజన, క్రీడల శాఖ కు కేటాయించారు. 
  *33 జిల్లాల డీపిఆర్ఓ లకు అధునాతన  కెమెరాలు*
రాష్ట్రంలోని 33 జిల్లాల డీపిఆర్ఓ లకు అధునాతన  కెమెరాలు అందచేసే సమాచార, పౌర సంబంధాల శాఖ కు చెందిన ఫైల్ పై మంత్రి పొంగులేటి సంతకం చేశారు. గృహ నిర్మాణ శాఖ కు చెందిన పలు పరిపాలనా సంబంధిత ఫైళ్లపై సంతకం చేశారు.

Wednesday, 13 December 2023

*కావ్య హాస్పిటల్స్ ఖమ్మం కి తెలంగాణ బిజినెస్ అవార్డ్-2023*


ఖమ్మం : వైద్యరంగంలో ఎండోక్రినాలజీ , మధుమేహం , జనరల్ మెడిసిన్ , క్రిటికల్ కేర్ విభాగాల్లో అందిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అథ్యాధునిక వైద్య సేవలకు కాను తెలంగాణ బిజినెస్ అవార్డ్స్ - 2023 లో కావ్య హాస్పిటల్స్ ఖమ్మం కి 'మోస్ట్ ఇన్నోవేటివ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆఫ్ ది ఇయర్' అవార్డు లభించింది.. హైదరాబాద్ లో ఎస్ఎన్ఆర్ కన్వెన్షన్ హాల్ లో జరిగిన అవార్డ్స్ వేడుకలో కావ్య హాస్పిటల్స్ సియిఒ డా.కావ్యచంద్ యలమూడి అవార్డు ను అందుకున్నారు..ఈ కార్యక్రమం లో కావ్య హాస్పిటల్స్ చైర్మన్ రవీందర్  యలమూడి , ప్రసూన పారుపల్లి మరియు సిబ్బంధి పాల్గోని హర్షం వ్యక్తం చేశారు .

Tuesday, 12 December 2023

*లెక్కలు తేల్చాల్సిందే:సీఎం రేవంత్ రెడ్డి*... సీఎంఓ గా కాటా ఆమ్రపాలి..?


తెలంగాణ రాష్ట్రంలో పరిపా లించిన గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని,ఆర్థిక దుబా రాను,ప్రజా ధనం దుర్విని యోగాన్ని ఎత్తి చూపేందుకు స్వయం గా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో అన్ని శాఖలు,కార్పొరేషన్ల వారీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నట్టు సమాచారం. ఈ నెల 14 నుంచి ప్రారంభ మయ్యే అసెంబ్లీ సమా వేశాల్లో తొలి మూడు రోజుల షెడ్యూలు తర్వాత ఇందుకు ప్లాన్ చేసినట్టు తెలిసింది. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక వ్యవస్థ కుదేలైన తీరు, చివరకు ప్రభుత్వ ఉద్యో గులకు సైతం సకాలంలో జీతాలు చెల్లించలేని దుస్థితి ఎందుకు తలెత్తిందో? ఈ ప్రజెంటేషన్ ద్వారా వివరించాలని ముఖ్య మంత్రి భావిస్తున్నారు. కేసీఆర్ పాలనలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందంటూ గతంలో కాంగ్రెస్, బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాయి. తాజాగా ఆయా శాఖల అధికారుల నుంచి తీసుకున్న గణాంకాలను సభ్యులతో పాటు ప్రజలం దరికీ వీటిని వివరించేందుకు సర్కారు సిద్ధమైనట్టు టాక్. ఏయే శాఖలో ఏ రూపంలో ప్రజాధనం దుర్విని యోగమైందో లెక్కలతో సహా వివరించి అసెంబ్లీ రికార్డుల్లోకి ఎక్కేలా చూడాలని భావిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీతో వివిధ కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న రుణాలు నిర్దిష్టంగా ఆ అవసరాలకు వినియోగించకుండా డైవర్ట్ చేయడం, అప్పులు తీర్చ డానికి పడుతున్న తిప్పలు ఇలాంటి వివరా లన్నింటినీ ఆ ప్రజెంటేషన్‌లో ప్రభుత్వం పొందుపర్చాలని భావిస్తున్నది.
*జీతాలు ఇవ్వలేని దుస్థితి.ఎందుకొచ్చింది?*
తెలంగాణ ఏర్పడేనాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎలా ఉన్నది? బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఎలా మారింది? ఎంత అప్పు పెరిగిందనే విషయాలను సర్కారు వివరించాలనుకుంటున్నది. ఒక్కో స్కీమ్‌కు అవుతున్న ఖర్చును తేటతెల్లం చేస్తూ పదేండ్లలో వాటిక వసర మయ్యే వనరుల సమీకరణ కోసం చేసిన అప్పులు, మొత్తం ఆర్థిక వ్యవస్థనే దివాలా తీయించిన విధానాన్ని వివరించాలని ప్లాన్ చేస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం ఏయే రూపాల్లో ఎక్కడి నుంచి ఎంత అప్పు తీసుకున్నది.. వాటికి ప్రతి నెలా చెల్లిస్తున్న వడ్డీ, అసలు’ రీపేమెంట్, కార్పొరేషన్ల ద్వారా తీసు కున్న రుణాలు,వాటి ద్వారా అవి కూడా నష్టాల్లోకి, అప్పుల్లోకి కూరు కుపోవడం..ఇలాంటి అనేక అంశాలను బహిర్గతం చేయాలనుకుంటున్నది.ఏటా ఎక్కడి నుంచి అప్పు తీసుకున్నది? ఏ అవస రాలకు దానిని ఖర్చు పెట్టింది..దాని ద్వారా ఎలాంటి ఫలాలు అందు తున్నాయి? వాటిని తీర్చడానికి ఉన్న మార్గమేంటి..?ఆర్థిక దుబారా ఎక్కడెక్కడ జరిగింది?
ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి ఎందుకు తలెత్తింది? ప్రజలపై తలసరి అప్పు భారం ఏ మేరకున్నది? చివరకు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎలాంటి సంక్షో భంలోకి కూరు కుపోయింది. అనే విషయాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో స్వయంగా ముఖ్యమంత్రే వివరిస్తారని సచివాలయ వర్గాల సమాచారం.
ఇంకోవైపు ప్రభుత్వరంగ సంస్థలు కార్పొరేషన్లుఏ అవసరం కోసం ఎంత అప్పు తీసుకున్నాయి? అవి ఎటువైపు డైవర్ట్ అయ్యాయి? వాటిని ఏ తీరులో వినియోగించింది? ఎప్పటికల్లా వాటిని తీర్చాల్సి ఉంటుంది? అనే విషయాలను సీఎం ప్రస్తావించనున్నారు...
*సీఎం రేవంత్ రెడ్డికీ, సీఎంఓ గా కాటా ఆమ్రపాలి..?
ప్రస్తుతం ఢిల్లీలోని ప్రధాన మంత్రి కార్యాలయం పీఎం ఓ,లో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్న ఐఏఎస్ అధి కారి,కాటా ఆమ్రపాలి తెలం గాణ రాష్ట్రానికి వచ్చేందుకు రంగం సిద్ధమైంది?.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ముఖ్య కార్యదర్శిగా సీఎంఓ సెక్రటరీ వస్తున్నట్లు సమా చారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2010 బ్యాచ్‌కు చెందిన ఆమె రాష్ట్ర విభ జన సందర్భంగా తెలంగాణ కేడర్‌గా అలాట్ అయ్యారు.
వరంగల్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన ఆమె 2018 అసెంబ్లీ ఎన్నికల సంద ర్భంగా అదనపు చీఫ్ ఎలక్టో రల్, ఆఫీసర్‌గా కొంత కాలం పనిచేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత సెంట్రల్ డిప్యూ టేషన్‌కు వెళ్ళిన ఆమె తొలుత 2019 అక్టో బరు 29 నుంచి కేంద్ర క్యాబి నెట్‌లో డిప్యూటీ సెక్రటరీగా దాదాపు ఏడాది కాలం పనిచేశారు.ఆ తర్వాత 2020 సెప్టెం బరు 14న పీఎంఓలో డిప్యూటీ సెక్రటరీగా చేరా రు.తెలంగాణలో అధికార మార్పిడి జరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో ఆమె తిరిగి వచ్చేందుకు వీలుగా కేంద్రానికి దరఖాస్తు రీపార్టియేషన్ చేసుకు న్నారు.గతంలో ప్రధాని కార్యాల యంలో పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్ శేషాద్రి సూచనల మేరకు ఆమ్రపాలి తెలం గాణకు వస్తున్నట్లు సమాచారం. సెంట్రల్ డిప్యూటేషన్ పీఎంఓలో కాలం పూర్తి కావడంతో తెలంగాణకు వచ్చిన శేషాద్రి కొంతకాలం జీఏడీలో పనిచేశారు. ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డికి సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.ఆమ్రపాలి సైతం సీఎంఓ లోకి రావచ్చని సచివాలయ వర్గాల సమాచారం. ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డిని మర్యా దపూర్వకంగా కలిసిన ఆమ్రపాలి శుభాకాంక్షలు తెలిపారు. కానీ కొద్దిమంది ఆఫీసర్లు మాత్రం ఆమె సీఎంఓలోకి రాకపోవచ్చని, ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఓఎస్డీగా ఉండొచ్చని లేదా అక్కడ రెసిడెంట్ కమిషనర్ బాధ్యతలు చూస్తారని పేర్కొన్నారు. మరికొద్ది రోజుల్లో ఆమె నియామకంపై స్పష్టత రానున్నది..

Monday, 11 December 2023

పరమశివుడు ప్రత్యక్షమైనప్పుడు.... (శృ౦గేరి శారదా పీఠం 35వ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ అభినవ విద్యాతీర్ధ మహాస్వామి వారి జీవిత విశేషం)


నా కళ్ళల్లో నీటిధార ఉబుకుతోంది. దేహంపై ఉన్న రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఆ దేవదేవుని పెదవులు కదిలి, ఈశ్వరుని మధురమైన పలుకులు వినబడుతున్నాయి. పరమేశ్వరుడు నాతో, “వత్సా! రేపటినుండి నిరాకార పరబ్రహ్మముపైన దృష్టి నిలిపి సాధన చెయ్యి. పరతత్త్వాన్ని తెలుసుకో. అనతి కాలంలోనే పరబ్రహ్మము నందు నీవు నిలబడెదవు” అని పలికారు. నా శిరస్సుపైన స్వామివారు చెయ్యి ఉంచి నన్ను ఆశీర్వదించారు. వారు వెంటనే మాయమైపోయారు. వారు అలా మాయమైపోగానే వెంటనే చిన్నగా వర్షం మొదలైంది. నేను ధ్యానానికి కూర్చున్నప్పుడు ఆకాశంలో ఒక్క మబ్బులేదు. సూర్యాస్తమప్పుడు కూడా ఆకాశం నిర్మలంగా ఉంది. చిన్నగా వర్షం పడుతున్నా సూర్యుడు ప్రకాశవంతంగా ఉన్నాడు. ఈశ్వరుడు నాచేత దేవస్నానం కూడా చేయించి అనుగ్రహించాలనుకున్నారు. సూర్యుడు ఉండగా వర్షం పడుతున్నప్పుడు తడిస్తే అది దేవస్నానం. అది గంగాస్నానంతో సమానం. ఎట్టిపరిస్థితులలోనూ అటువంటి స్నానాన్ని చెయ్యకుండా ఉండరాదు. వెంటనే అందులో స్నానం చెయ్యాలి.1975లో నరసింహవనంలో అచార్యులవారు నడుస్తుండగా, చిన్నగా చినుకులు మొదలయ్యాయి. సూర్యుడు ఉండగా వర్షం పడితే అందులే తడవడం గంగాస్నానం చేసినట్లు అని తలచి చిన్నగా నవ్వుకున్నారు. మహాత్ములందరూ ఎల్లప్పుడూ పరబ్రహ్మముతో కలిసి ఉంటారు. ఆ యదార్థాన్ని తెలుసుకోవడానికి వారి గురువులు ప్రత్యేక పాత్ర పోషిస్తారు. వారు చూపిన మార్గంలో నడిచి బ్రహ్మానందాన్ని అనుభవిస్తుంటారు. అభినవ విద్యాతీర్థ మహాస్వామివారు చిన్నవయస్సులో పీఠానికి వచ్చారు. అమ్మవారే వారికి కుండలినీ విద్యారహస్యాలన్నిటిని తెలిపి అష్టసిద్ధులు వారి వశం చేశారు. పదేళ్ళప్పుడు పరమశివుడు ప్రత్యక్షమై అష్టాంగయోగాన్ని నేర్పి పదిహేనేళ్లకు అన్ని శక్తులు సంపాదించుకునేట్టు చేశారు. 
చంద్రశేఖర భారతీ స్వామివారు అభినవ విద్యాతీర్థ స్వామివారిని, అభినవ విద్యాతీర్థ స్వామివారు భారతీతీర్థ స్వామివారిని, భారతీతీర్థ స్వామివారు విధుశేఖర భారతీస్వామివారిని అలా గురుపరంపరలో శిష్యులకు మార్గాన్ని చూపి సనాతన ధర్మాన్ని పీఠపరంపరను కాపాడుతున్నారు.
సేకరణ:
#SringeriJagadguruVaibhavam #శృంగేరిజగద్గురువైభవం సోషల్ మీడియా ద్వారా