Thursday, 14 December 2023

*నవగ్రహాల పట్టాభిషేకం*... ప్రఖ్యాత ఆలయ సమాచారం.. .కర్మ సాక్షులు 18.. దక్షిణామూర్తి వైభవం...

_*నవగ్రహ పురాణం 
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
ఇంత సేపూ సభలో కూర్చున్న దేవతలంతా ఇప్పుడు రెండు వరుసలుగా బారులు తీరి నిలుచున్నారు. దేవతా పురుషులూ , దేవతా స్త్రీలూ కలిసి నిలుచున్న ఆ వరుసలు అందమైన కదంబమాలికలను గుర్తుకు తెస్తున్నాయి. అందరి చేతుల్లోనూ సువాసనలు వెదజల్లుతున్న రంగు రంగుల పువ్వులతో నిండిన సజ్జలున్నాయి. దూరం నుంచి గుర్రపు గిట్టల శబ్దం ! తలలు తిప్పి చూస్తున్న కళ్ళకు విందు చేస్తూ దూరంలో స్వర్ణ రథం ప్రత్యక్షమైంది !
ఆ రథాన్ని ఏడుగుర్రాలు లాగుతున్నాయి. విచిత్రంగా ఆ రథానికి ఒకే ఒక చక్రం ఉంది ! సప్తాశ్వాలు లాగుతున్న ఏకచక్ర రథం సమీపానికి వస్తోంది. రథం మధ్య పద్మాకారంలో ఉన్న పీఠం మీద సూర్యుడు ఆసీనుడై ఉన్నాడు. అరుణుడు రథాన్ని నడుపుతున్నాడు.

సూర్యరథం బారులుగా నిలుచున్న దేవతా బృందాలను సమీపించింది. రథం మీద ఎర్రటి గొడుగు ప్రకాశిస్తోంది. రక్తవర్ణ పతాకం రెపరెపలాడుతోంది. వరుసల ప్రారంభంలో నిలుచున్న త్రిమూర్తి దంపతులు సూర్యుడిని ఆశీర్వదిస్తున్నారు. ఎర్రటి వస్త్రాలతో , ఎర్ర తామరల మాలికలతో సూర్యుడు ధగధగలాడిపోతున్నాడు. ఆయన శరీరం నుండి వెలువడే కాంతితో బంగారు రథం మెరిసిపోతోంది. సూర్యుడి మీదికి పువ్వులు చల్లుతూ సప్తర్షులు స్తోత్ర పఠనం ప్రారంభించారు.

*"జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం ! తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్ !"*
సహస్రాధిక దేవతా కంఠాలు సూర్యస్తోత్రాన్ని అందుకున్నాయి. సూర్య రథమూ , రథికుడైన సూర్యుడూ కనులకు విందు చేస్తుంటే , వేలాది స్త్రీ పురుషులు పఠిస్తున్న స్తోత్రం వీనులకు విందు చేస్తోంది. రెండు వైపులా ఉన్న దేవతా పంక్తులను దాటి వెళ్ళిన సూర్య రథం నిర్ణీత స్థలంలో ఆగింది. ఆ ప్రాంతంలో నిశ్శబ్దం తాండవించింది.

ఆ నిశ్శబ్దాన్ని చెదరగొడుతూ రథచక్రాల శబ్దాలూ , గుర్రపు గిట్టల చప్పుళ్ళూ వినవస్తున్నాయి.

మూడు చక్రాల సువర్ణ రథం కొంచెం దూరంలో ప్రత్యక్షమైంది. పాలనురగలాంటి తెల్లటి గుర్రాలు పది రథాన్ని లాగుతున్నాయి. రథం మీద తెల్లటి గొడుగు , శ్వేత పతాకాన్ని క్షీరసాగర పవనాలు స్పందింపజేస్తున్నాయి.

పది శ్వేతాశ్వాలు లాగుతున్న మూడు చక్రాల అందాల రథం మీద శ్వేత వస్త్రాలూ , శ్వేత పుష్పమాలికలూ ధరించిన చంద్రుడు కళ్ళకు ఇంపుగా మెరిసిపోతున్నాడు. పెరుగులాగా , శంఖంలాగా , మంచులాగా తెల్లగా కనిపిస్తున్న చంద్రుడిని కీర్తిస్తూ స్తోత్ర పఠనం ప్రారంభించారు సప్తర్షులు.

*"దధి శంఖ తుషారాభం క్షీరోదార్ణవ సంభవం ! నమామి శశినం సోమం శంభోర్మకుట భూషణమ్ !"*

దేవతా సమూహాల బృందగానంతో చంద్రస్తోత్రం ప్రతిధ్వనించింది. రథానికి ఇరువైపుల నుండీ రంగు రంగుల పువ్వులు చంద్రుడి మీద వర్షిస్తున్నాయి. చంద్ర రథం కొద్ది దూరాన ఆగి ఉన్న సూర్య రథం వైపు సాగిపోయింది.మరొక బంగారు రథం అందరికీ కనువిందు చేస్తూ కదలివస్తోంది. పద్మరాగ మణులలాగా ఎర్రగా ఉన్న ఎనిమిది గుర్రాలు రెండు చక్రాల స్వర్ణ రథాన్ని లాగుతున్నాయి. గంభీరంగా కదను తొక్కుతూ , రథం మీద ఛత్రం ఎర్రగా మెరుస్తోంది. ఎర్రటి పతాకం గాలికి రెపరెపలాడుతోంది. రక్తవర్ణ వస్త్రాలు ధరించిన కుజుడు రథంలో ఉన్నాడు. కణకణలాడే నిప్పులాంటి శరీర వర్ణంతో 'అంగారకుడు' అనే సార్ధక నామధేయాన్ని పొందిన భూమి పుత్ర కుజుడు రక్తవర్ణ పుష్పమాలికలను ధరించి ఉన్నాడు. బంగారు ఆభరణంలో పొదిగిన అందమైన పద్మరాగమణిలా కనిపిస్తున్న అంగారక కుజుడి మీద పుష్ప వర్షం కురవసాగింది. ఆయన శరీరం నుంచి కాంతి పెల్లుబుకుతూ పరిసరాలను ఆక్రమిస్తోంది.

*"ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం ! కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహమ్ !"*

సప్తర్షుల స్తోత్రాన్ని దేవతా పురుషులూ , స్త్రీలు అందుకున్నారు. నవగ్రహాలలో తృతీయ గ్రహం అందరి కళ్ళకూ విందులు చేస్తూ సాగిపోయింది.
మరుక్షణం గోరోచన వర్ణంలో ఉన్న ద్విచక్ర దివ్యరథం దేవతా సమూహానికి కనిపించింది. ఎనిమిది కపిలాశ్వాలు ఆ రథాన్ని లాగుతున్నాయి. రథం మీద పసుపు పచ్చరంగు ధ్వజం గాలిలో అందంగా కదులుతోంది. పసుపుపచ్చ రంగు గొడుగు ధగధగ మెరిసిపోతోంది.పీతవర్ణ వస్త్రాలూ , పుష్పమలికలూ ధరించిన బుధుడు , చిరునవ్వులు చిందిస్తూ రథం మీద కొలువు తీరి ఉన్నాడు. చంద్రుడిని మించిన అందంతో వెలుగులు వెదజల్లుతున్న బుధుడు తన సౌందర్యంతో అందరినీ అబ్బురపరుస్తున్నాడు.

*"ప్రియంగు కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధం ! సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్ !”*

సప్తర్షులు ఆలపించిన బుధస్తుతి దేవతా బృందాల కంఠాలతో ప్రతిధ్వనిస్తోంది. స్తోత్రానికి కార్య రూపంలో అర్ధం చెప్తున్నట్టు పువ్వులు వర్షిస్తున్నాయి.

దేవతల పంక్తులను దాటిన తన రథాన్ని బుధుడు ముందుకు నడిపించాడు. కుజుడి రథ సమీపంలో నిలిపాడు.మరుక్షణం అందరికీ నేత్రపర్వం చేస్తూ గురు గ్రహ రథం చూపరులను ఆకర్షించింది. బంగారు రంగును పోలిన పాండుర వర్ణ రథం మీద స్వర్ణ వర్ణ వస్త్రాలు ధరించిన గురువు జ్ఞాన తేజస్సును విరజిమ్ముతూ కూర్చున్నాడు. హేమవర్ణ ఛత్రం , హేమవర్ణ పతాకం ఆయన రథం మీద మెరుస్తున్నాయి.
పాండుర వర్ణంలో నేత్రాలకు హాయి గొలుపుతున్న ఆ రెండు చక్రాల రథాన్ని ఎనిమిది శ్వేతాశ్వాలు లాగుతున్నాయి. స్వర్ణమయమైన పాండుర వర్ణ రథం దేవతా పంక్తుల సమీపానికి వచ్చింది. సప్తర్షులు పుష్పాక్షతలు చల్లుతూ స్తోత్ర పాఠం ప్రారంభించారు.
*"దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం ! బుద్ధి మంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమ్ !”*

తమ గురుదేవుడైన బృహస్పతిని దేవతలు నూతనోత్సాహంతో గానం చేస్తున్నారు. ప్రత్యేకాభిమానంతో ఆయన మీద పుష్ప వృష్టి కురిపిస్తున్నారు. పంక్తులను దాటి వెళ్ళిపోయిన తమ గురుదేవుల దివ్య రథాన్నే చూస్తూ ఉండిపోయిన దేవతల దృష్టిని మరొక రథ చక్ర ధ్వని మళ్ళించింది.
అగ్నిజ్వాలను తలపిస్తూ తప్తకాంచన వర్ణంలో ధగధగలాడుతున్న దివ్యరథాన్ని లాగుతూ పది శ్వేతాశ్వాలు పరుగులు తీస్తున్నాయి. శ్వేతవస్త్రాన్ని ధరించిన శుక్రుడు ఆ ద్విచక్ర రథం మీద గంభీరంగా కూర్చున్నాడు. శ్వేత పుష్పమాలికలు ఆయన శరీరం మీద మెరుస్తున్నాయి. ఆయన రథం మీద ప్రకాశిస్తున్న ఛత్రమూ తెలుపే ! ధ్వజమూ తెలుపే !

శుక్రరథం తమను సమీపించగానే , పుష్పాక్షతలు వెదజల్లుతూ , సప్తర్షులు శ్లోకపఠనం ఆరంభించారు.

*"హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం ! సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్ !”*

శుక్రుడి మీద పుష్పవృష్టి కురిపిస్తూ , దేవతలు శుక్రస్తోత్రాన్ని వేనోళ్ళతో పఠించ సాగేరు. అయితే వాళ్ళ కంఠ స్వరాలను వెక్కిరిస్తూ - భీకర కంఠధ్వనులు అక్కడ ప్రతిధ్వనించాయి ! ఆ క్షణం దాకా అదృశ్యంగా ఉన్న రాక్షసులు వేలాది మంది దేవతా పంక్తులను అనుసంధానిస్తూ బారులు తీరి నిలుచున్నారు , అందరినీ ఆశ్చర్యపరుస్తూ !తమ గురుదేవులు శుక్రాచార్యులను ఉద్దేశించి అసుర సమూహాలు చేస్తున్న జయజయ ధ్వానాలతో దశదిశలూ దద్దరిల్లిపోయాయి. రక్తవర్ణ పుష్పాలను తన మీద వర్షిస్తున్న శిష్య బృందాలను చిరునవ్వుతో వీక్షిస్తూ రథాన్ని ముందుకు పోనిచ్చి , ఆపాడు శుక్రుడు.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*హిందూ ఆలయ సమాచారం*🙏
🪷🪷🪷🪷🪷🪷🪷
                                           
*ద్వాదశ జ్యోతిర్లింగాలు*
 గుజరాత్ – సోమనాథ్,✓
 ఆంధ్రప్రదేశ్ – శ్రీశైలం,✓ మధ్యప్రదేశ్ – మహాకాలేశ్వర్,✓ మధ్యప్రదేశ్ – ఓంకారేశ్వర్✓ జార్ఖండ్ -భైద్యనాధ్√ మహారాష్ట్ర – భీమశంకర్,
తమిళనాడు – రామేశ్వరం,✓ గుజరాత్ – నాగేశ్వర్.✓ ఉత్తరప్రదేశ్ – కాశీవిశ్వనాధ్,✓
మహారాష్ట్ర – త్రయంబకేశ్వర్, 
ఉత్తరాఖండ్ – కేదారేశ్వర్✓, 
మహారాష్ట్ర – ఘృష్నేశ్వర్.          
                                                                                 *అష్టాదశ శక్తిపీఠాలు* 
 శ్రీలంక – శాంకరీదేవి, కాంచీపురం – కామాక్షి✓, ప్రద్యుమ్నం – శ్రుంఖలాదేవి, మైసూరు –చాముండి, అలంపురం – జోగులాంబ శ్రీశైలం – బ్రమరాంబిక✓, కొల్హాపూర్ – మహాలక్ష్మి, మాహూర్ – ఏకవీర, ఉజ్జయిని - మహాకాళి,✓ పిఠాపురం – పురుహూతిక ✓  
జాజిపూర్ – గిరిజాదేవి✓, ద్రాక్షారామ – మాణిక్యాంబ,✓ గౌహతి – కామాఖ్య, ప్రయాగరాజ్ – మాధవేశ్వరి✓, అరుణాచలప్రదేశ్ –వైష్ణోదేవి,✓ గయ – సర్వమంగళ✓, వారణాశి – విశాలాక్షి✓, కాశ్మీర్ – సరస్వతి                                        

*వినాయక దేవాలయాలు*

ఉత్తరాఖండ్ - ముండ్కతియా వినాయక్, కేరలాపురం - అతిశయ వినాయగర్, 
పూతోట్టం - ఆది వినాయకర్, 
బిక్కవోలు - స్వయంభూః లక్ష్మీగణపతి,✓
బెంగుళూరు - దొడ్డ గణపతి, 
అయినవిల్లి - స్వయంభూః సిద్ధి వినాయకుడు,✓ కాణిపాకం - స్వయంభూః వరసిద్ధి వినాయకుడు✓, చిక్కమగులూరు - కమండల గణపతి, 
రత్నగిరి - స్వయంభూః గణపతి           
                                                                *సప్తముక్తి క్షేత్రాలు* 
 అయోధ్య,✓ మధుర,✓ హరిద్వార్✓, వారణాశి,✓ కాంచీపురం,✓ ఉజ్జయిని,✓ ద్వారక ✓                                 

*స్వయంభూః క్షేత్రాలు*
 శ్రీరంగం - రంగనాధస్వామి,✓ తిరుమల - శ్రీ వేంకటేశ్వరస్వామి, ✓
నైమిశారణ్యం - శ్రీ చక్రనారాయణ, ✓
బద్రీనాధ్ - శ్రీ బదరీనాధుడు✓, 
పుష్కర్ - వరాహస్వామి, 
తిరునల్వేలి - వనమామలై పెరుమాళ్ లేదా శ్రీతోతాద్రినాథన్, 
కడలూరు - భూః వరాహస్వామి, 
నేపాల్ - ముక్తినాధ్,               
                                                                                    *పంచ గయా క్షేత్రాలు* 
 గయ – శిరోగయ,✓ 
జాజిపూర్ – నాభిగయ,✓ పిఠాపురం – పాదగయ, ✓
బద్రీనాధ్ – బ్రహ్మకపాలం,✓. సిద్ధాపూర్ – మాతృగయ ✓   

*చార్ ధామ్* 
 ద్వారక,✓ బద్రీనాధ్✓, పూరీ,✓ రామేశ్వరం ✓    
                                                                                *పంచ ద్వారక*
ద్వారక– ద్వారకాదీష్,✓ 
బెట్ ద్వారక –శ్రీకృష్ణ,✓ దాకోర్-శ్రీ రన్ ఛోద్రజీ మహారాజ్,✓ నాధ్ ద్వారా–శ్రీనాధ్ జీ,✓ కంక్రోలీ–ద్వారకాదీష్✓                                                                                                                                  

*పంచ భద్రి*/ 
బద్రీనాధ్ – విశాల్ బద్రి,✓ 
పండుకేశ్వర్ – యోగధాన్ బద్రి, సుభైన్–భవిష్యబద్రి, అనీమత్ – వృద్ధబద్రి, కర్ణప్రయాగ –ఆదిబద్రి ✓         
                                                                                                                                                          *పంచ భూతలింగాలు* 

కాంచీపురం – ఏకాంబరేశ్వర్✓, 
జంబుకేశ్వరం – జంబుకేశ్వర్✓, 
తిరువణ్ణామలై – అరుణాచలేశ్వర్, ✓ శ్రీకాళహస్తి – కాలహస్తీశ్వర్ ✓ చిదంబరం – నటరాజ్, ✓                                         
                                                                                                                                                                                                                                                       *నిర్దిష్ట తీర్థయాత్ర మార్గంలో పుణ్యక్షేత్రాలను పొందుపరుస్తూ తయారు చేసిన యాత్రలు*
                                                                                                                                                                                                                                                                                                                               *శ్రీశైల యాత్ర* 
శ్రీశైలం, శైలేశ్వరం,✓ 

*నవనంది క్షేత్రాలు* (మహానంది నుండి నంధ్యాల),✓, నంద్యాల – జగజ్జనని, యాగంటి – ఉమామహేశ్వర,,✓ బనగానపల్లి – బ్రహ్మంగారి మఠం, ✓
నందవరం – చౌడేశ్వరీ దేవి, 
అలంపురం – జోగులాంబ,
అహోబిలం – నవ నృసింహ క్షేత్రాలు, ✓
మంత్రాలయం - రాఘవేంద్ర స్వామి, ✓
సంగమేశ్వరం – సంగమేశ్వరుడు, 
గబ్బూరు – వేంకటేశ్వరస్వామి    
                                                                                                           *కైలాస మానస సరోవర్*
మానస సరోవర్, 
కైలాస పర్వతం           
                                                                                                                          *సోమనాధ్ యాత్ర*
 సోమనాధ్, వారెవాల్, ✓
భావనగర్ – నిష్కలంక మహదేవ్, 
పూడమ్ – గంగేశ్వర మహదేవ్, 
ద్వారక – ద్వారకాదీష్ ,✓ నాగేశ్వర్, ✓
ఉజ్జయిని – మహాకాలేశ్వర్,✓ ఓంకారేశ్వర్, ✓       
                                                    
*పశుపతినాధ్ ముక్తినాధ్ యాత్ర* / 

ఖాట్మండూ –పశుపతినాధ్, బుద్ధునికాంతా మందిరం (శయన విష్ణుమూర్తి), నేపాల్ – ముక్తినాథ్                                                         

*శ్రీ అమరనాధ్ యాత్ర*     
                                                                                                                            *ఛోటా చార్ ధామ్ యాత్ర*
 హరిద్వార్, ✓
ఋషీకేశ్, ✓
ఉత్తరకాశీ,✓
 గంగోత్రి,✓
యమునొత్రి, ✓
దేవప్రయాగ, ✓
రుద్రప్రయాగ,✓ రుద్రప్రయాగ-గౌరీకుండ్,✓ కేదార్నాధ్, కర్ణప్రయాగ,✓ నందప్రయాగ, ✓
జోషీమఠ్, ✓
విష్ణుప్రయాగ, ✓
హనుమాన్ చత్తి,✓ 
బద్రీనాధ్ ✓    
                                                                                                                             
దత్తక్షేత్రములు,
 వారణాశిలో నవదుర్గలు✓,
 ఆదిశంకరాచార్య, ✓
అరసవిల్లి సూర్యనారాయణ ✓ ఘటి సుబ్రమణ్యేశ్వర, గోకర్ణేశ్వర్ గుహాలయం, జంగారెడ్డిగూడెం 
మద్ది ఆంజనేయస్వామి, మధ్యప్రదేశ్ మందరపర్వత ఆలయం,  
సాలిగ్రామ విశేషం, 
పాండవుల స్వర్గారోహణ యాత్ర, 
వరదవెల్లి దత్తాత్రేయ, ఉజ్జయిని హరసిద్ధిమాత,✓ ఉదయపూర్ ఇందనమాత, కాంగ్రా జ్వాలాముఖి✓, 
నండూరి సప్తశ్రుంగి ఆలయం,  
ధోల్ పూర్ ఆచలేశ్వర మహదేవ్ ఆలయం,
ఆచంట ఆచంటేశ్వర్ ఆలయం, హంపి విరూపాక్ష, 
పుస్ఫగిరి హరిహరాలయం, 
పక్షి తీర్ధం,
రాయఘడ్ హరిహరేశ్వర ఆలయం, 
ఓంకారక్షేత్రం,
మహదేవ్ పూర్ కాళేశ్వర ముక్తేశ్వర మహాదేవి ఆలయం, 
తిరుభువనంలో శరభేశ్వరర్ ఆలయం, 
కులూ లోయ మణికర్ణన్ శివాలయం, 
ఓంకారక్షేత్రం,  
తిరువణ్ణామలై మల్లిఖార్జున ఆలయం, ✓
శ్రీకాకుళం శ్రీముఖ లింగేశ్వర ఆలయం,✓ 
హంగల్ తారకేశ్వర ఆలయం, 
వేములవాడ రాజరాజేశ్వర్ ఆలయం, 
యనమదుర్రు శక్తీశ్వర ఆలయం, 
బధ్రాచలం సీతారామచంద్ర మూర్తి ఆలయం,✓ ద్వారకాతిరుమల శ్రీ వెకటేశ్వర ఆలయం,✓ 
కూడుపు అనంత పద్మనాభ ఆలయం, 
శ్రీకూర్మం, ✓
చదలాడ శ్రీ శ్రుంగార వల్లభ స్వామి ఆలయం.✓
 
*నవనృసింహ క్షేత్రములు*
  అహోబిలం, ✓
సింహాచలం,✓ 
అంతర్వేది, ✓
వేదాద్రి, 
మంగళగిరి✓,
 కదిరి, 
మాల్యాద్రి, a 
ధర్మపురి, 
యాదగిరిగుట్ట.     
                 
*యాత్రలు* కేరళ యాత్ర 
కన్యాకుమారి✓, 
కేరలాపురం, 
సుచీంద్రం,✓ 
తిరువనంతపురం, గురువాయూరు, 
శబరిమల, 
కొచ్చిన్ వెంకటేశ్వర, ఎర్నాకులం వేంకటేశ్వర, కాలాడి శంకరాచార్య                                                                     

*కొల్హాపూర్ యాత్ర*
 గాణుగాపూర్, 
కడగంచి, 
అక్కల్కోట, 
పందర్ పూర్, 
కొల్హాపూర్, 
శిరిడీ, ✓
శింగనాపూర్, ✓                                     

*పంచకేదార్ యాత్ర*
 కేదార్నాధ్, ✓
మధ్య మహేశ్వర్, 
తుంగనాధ్, 
రుద్రనాధ్, 
కల్పెశ్వర్                                                   

*పంచారామ యాత్ర* అమరావతి అమరారామ,✓ భీమవరం సోమారామ,✓ పాలకొల్లు క్షీరారామ,✓ ద్రాక్షారామ, 
సామర్లకోట కుమారరామ ✓ 

*పూరీ యాత్ర*
పూరీ జగన్నాధ్, ✓
జాజిపూర్ బిరిజాదేవి, ✓
గౌహతి కామాఖ్య, 
పాండువా శ్రుంఖలాదేవి, కలకత్తా దక్షణకాళి, 
బరంపురం తారాతారిణి✓     
                                                                                                                                          *రామేశ్వరం యాత్ర*
 అరుణాచలం✓, 
వృద్ధాచలం,✓ 
చిదంబరం,✓ 
జంబుకేశ్వరం,✓ 
కుంభకోణం, ✓ 
తిరువిడై మరుదూరు,✓ మహాలింగేశ్వర ఆలయం, మధురై, ✓
తంజావూరు, 
సప్త సుబ్రహ్మణ్య క్షేత్రములు,✓ నవగ్రహ తిరుపతులు, రామేశ్వరం✓, 
శ్రీరంగం ✓  
                                                           
*శృంగేరి యాత్ర* 
గోవా, 
గోకర్ణం, 
మురుడేశ్వర్, 
ఉడుపి, 
మంగళాదేవి, 
కేసరగాడ్, 
మంజేశ్వర్,
కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర, శ్రుంగేరి, 
ధర్మస్థల, 
కేశవే కమండల గణపతి ఆలయం, 
హోర్నాడు అన్నపూర్ణేశ్వరి, కొల్లూరు మూకాంబిక,  
షిరిలీ మహాగణపతి మహామయా ఆలయం, 

*తిరుమల యాత్ర* 
 తిరుమల, ✓
తిరుపతి, ✓
తిరుచెందూర్, ✓
అర్ధగిరి, ✓
కాణిపాకం,✓ 
తిరుత్తణి, ✓
కాంచీపురం✓, 
వెల్లూరు, ✓
శ్రీకాళహస్తి, ✓
గుడిమల్లాం, 
ఒంటిమిట్ట                                                                                                               
*ఉజ్జయిని నాశిక్ యాత్ర*
 గృశ్నేశ్వర్, 
అజంతా ఎల్లోరా గుహలు, భీమశంకర్, 
త్రయంబకేశ్వర్, మహాకాలేశ్వర్,✓ 
ఓంకారేశ్వర్ మధ్యప్రదేశ్✓ పశుపతినాధ్, 
అగర్ మాల్వా బైజ్‌నాథ్ మహాదేవ్
💐💐మన కర్మలకు పద్దెనిమిది మందిసాక్షులు💐💐చుట్టూ ఎవరూ లేనప్పుడు తప్పుడు పనులకు తెగించడం మానవ బలహీనత...కానీ...
నేను ఒక్కడినే కదా ఉన్నాను, 
నన్ను ఎవరూ గమనించడం లేదు’ 
అని మనిషి అనుకోవటం చాలా పొరపాటు . 
మనిషి ఏ పని చేస్తున్నా నిశితంగా గమనించేవి మూగసాక్షులు పద్దెనిమిది ఉన్నాయి . అవి 
నాలుగు వేదాలు, పంచభూతాలు, అంతరాత్మ, ధర్మం, యముడు, ఉభయ సంధ్యలు, సూర్య చంద్రులు, పగలు, రాత్రి . 
వీటినే అష్టాదశ మహా పదార్థాలు అంటారు . ఈ మూగసాక్షులు మనిషిని అనుక్షణం నీడలా పర్యవేక్షిస్తుంటాయి . 
ఇవి మనలోకంలోని న్యాయస్థానాల్లో సాక్ష్యం చెప్పపోవచ్చును గాని, 
వీటి గమనిక నుండి మనిషి తప్పించుకోవడం సాధ్యపడదు .
దీన్ని గుర్తించలేని కారణంగానే ఇవన్నీ జడ పదార్థాలేనని, సాక్ష్యం చెప్పడానికి నోరులేనివని మానవుడు భ్రమపడుతుంటాడు . 
ఈ మహాపదార్థాలు రహస్యయంత్రాల వంటివి . 
అవి మనిషి ప్రతి చర్యనూ నమోదు చేస్తాయి . 
ఆ నివేదికల్ని విధికి చేరవేస్తాయి . అది వాటిని కర్మలుగా మలుస్తుంది . మనిషి చేసే పనులు మంచి అయితే సత్కర్మలుగా, చెడ్డవి అయితే దుష్కర్మలుగా విధి నిర్ణయిస్తుంది . సత్కర్మలకు సత్కారాలు, దుష్కర్మలకు జరిమానాలు అమలవుతాయి . 
అవి ఏవో మరుజన్మకో ఆ తరువాతో ఫలిస్తాయని అనుకోకూడదు, ఈ జన్మలోనే అమలు చేయబడవచ్చు . 
ఇది నిరంతరాయంగా సాగిపోయే సృష్టిపరిణామక్రమం .
 అంతరాత్మ అనేది ఒకటుందని ప్రతి మనిషికీ తెలుసు . 
అది మనం చేసే పని మంచిదా ? చెడ్డదా ? అనే విషయాన్ని ఎప్పటికప్పుడే చెప్పేస్తుంది .
 కానీ ఆవేశం, కోపంతో విచక్షణ కోల్పోయిన వ్యక్తి అంతరాత్మ సలహాను కాలరాస్తాడు అది అనర్థాలకు దారితీయటం మనందరికి అనుభవమే .
 ఒక్కోసారి అంతరాత్మ నిలదీస్తున్నప్పుడు పశ్చాత్తాపంతో సిగ్గుతో తలదించుకుంటాం . 
కానీ దీన్ని మనమెవరితోనూ పంచుకోము . అందువల్ల అంతరాత్మ అనుభవపూర్వకంగా నిజమైనప్పుడు మిగతా పది హేడు కూడా నిజమేనని గ్రహించగలగటం వివేకం .
 నలుగురికీ తెలిసేలా దానధర్మాలు, క్రతువులు, పూజలు నిర్వహించాలన్న కుతూహలం అవివేకం .
 అష్టాదశ సాక్షులు ఎల్లవేళలా గమనిస్తున్నాయంటే, ఎవరు చూడాలో వాళ్ళు చూస్తున్నట్లేగా అర్థం . 
ఈ ఎరుక కలిగినప్పుడు ఏ మనిషీ చెడ్డ పనులు చేయటానికి తెగించడు .
 ఎవరు చూసినా చూడకపోయినా మంచితనంతో, తోటి వారికి సాధ్యమయినంత సహాయం చేయాలనే సత్‌సంకల్పంతో జీవితాన్ని గడపడం ఉత్తమం . ఈ జ్ఞానం వల్ల మనిషి సాధ్యమైనన్ని మంచిపనులు చేయడానికి పయ్రత్నిస్తూ సుఖశాంతులకు నోచుకుంటాడు .


💐💐దక్షిణామూర్తి వైభవం💐💐

శివుడు లయ కారకుడు. అంటే సృష్టిని విలీనం చేసుకొని కొత్త సృష్టికి మార్గాన్ని కల్పిస్తాడు. జ్ఞానంపై ఆసక్తి లేనివాళ్లను మళ్లీ జన్మ ఉండేటట్లుగా లయం చేయడం, జ్ఞానం కోరేవాడికి జ్ఞానాన్ని ప్రసాదించి మళ్లీ జన్మ లేకుండా భగవంతుని స్వరూపంలో కలపడం అనే రెండు రకాలుగా శివుడు లయం చేస్తాడు. శివుని యొక్క జ్ఞానావతారమే దక్షిణామూర్తి.

దక్షిణామూర్తి పరమశివుని జ్ఞానగురువు అవతారం. ఇతర గురువులు మాటలతో శిష్యులకు బోధిస్తారు. కానీ దక్షిణామూర్తి మౌనం గానే ఉండి శిష్యులకు కలిగే సందేహాలు నివారిస్తాడు.

బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభించినప్పుడు మొదట సనక, సనందన, సనత్సుజాత మరియు సనత్కుమారులను సృష్టించాడు. వారిని తన సృష్టిని కొనసాగించమన్నాడు. కాని వారికి ఇష్టం లేక మేము బ్రహ్మజ్ఞానం పొందాలి, అందువలన మేము మీకు సాయపడలేము అని విరక్తులై బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి గురువును వెదుకుతూ బయలుదేరారు. ఇక బ్రహ్మగారు మరో ప్రత్యామ్నాయంతో తన సృష్టిని కొనసాగించాడు.

ఇక ఈ నలుగురూ గురువు కోసం వెదుకుతూ నారద మహర్షి సహాయంతో మొదట బ్రహ్మ గారినే అడుగుదామనుకొన్నారు. కాని ప్రక్కన సరస్వతీదేవిని చూసి " ఈయనే పెళ్ళి చేసుకొని సంసారంలో ఉన్నాడు. ఇక ఈయన మనకు ఏమని ఉపదేశిస్తాడు" అని అనుకొని బ్రహ్మను అడుగలేదు. అలాగే మహావిష్ణువునూ మరియు పరమశివుడినీ కూడా అడుగుదామని వెళ్ళి వారి ప్రక్కన లక్ష్మీదేవినీ మరియు పార్వతీదేవినీ చూసి వారిని కూడా అడుగలేదు.

పరమశివుడు ఈ నలుగురి అజ్ఞానాన్ని చూసి బాధపడి వారికి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాలనుకొని అనుకొన్నాడు. వారు వెళ్ళే దారిలో ఒక మర్రిచెట్టు క్రింద దక్షిణామూర్తిగా కూర్చున్నాడు. వీరు నలుగురూ ఆ మూర్తిని చూసి, అతని తేజస్సుకు ఆకర్షితులై, ఆయన చుట్టూ కూర్చున్నారు. శివుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా యోగ భంగిమ లొనే కూర్చున్నాడు. ఋషులందరికి అనుమానాలన్నీ వాటంతట అవే తొలగిపోయి జ్ఞానవంతులయ్యారు. దక్షిణామూర్తి స్వామి వారు తమ మౌనంతోనే వారందరినీ బ్రహ్మజ్ఞానం పొందునట్లు చేసారు. అలా మౌనముగా ఎందుకు బోధించారంటే బ్రహ్మము లేక పరమాత్మ మాటలకు, మనసుకూ అందనివారు కాబట్టి అలా బోధించారు.

ఇలాంటి యువకుడైన దక్షిణామూర్తి చుట్టూ వృద్ధులైన మునులు కూర్చుని ఉంటారట. గురువు చేసేది మౌనవ్యాఖ్యానం. మౌనంగా చిన్ముద్రలో కూర్చుని ఉండటమే అతడు చేసే వ్యాఖ్యానం.
దక్షిణామూర్తి పాదాలక్రింద ఉన్నది తమో గుణ రూపానికి ప్రతీక!వాటిని శివుడు తన కాలితో అదిమిపడుతాడు! దక్షిణామూర్తి కాలికింద ఉన్న రాక్షసుడు (తమో గుణం) ఆనందంగా ఉండటం! అజ్ఞానాన్ని అదుపు చేసేవాడే శ్రీ దక్షిణామూర్తి. ఈ తత్వమే ఆదిగురుతత్త్వం. దక్షిణామూర్తి ఆది గురువు, ఆది యోగి అన్న మాట. ఆయన సమస్త జ్ఞానానికి మూలం! ఈ తత్వాన్ని తెలుసుకోవటమంటే – జ్ఞానం, ఎరుక అనే అవగాహన కలిగివుండటమే! పరమశివుని ఈ రూపం సంగీత, సాహిత్యాల , యోగ, తాంత్రిక విద్యల కలయిక. సకల శాస్త్రాల సారాన్ని తెలిసి , అర్హులైన మహర్షులకు ఉపదేశం చేసినవాడే శ్రీ దక్షిణామూర్తి. సద్గురువు లభించని ఉత్తములు ఈయన్ని గురువుగా భావించి, జ్ఞానం, మోక్షాన్ని పొందవచ్చు.

💐దక్షిణామూర్తి శ్లోకం💐

గురవే సర్వలోకానాం భిషజే భవరోగినాం
నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః

అర్ధం :

సర్వలోకాలకు గురువు, భవరోగులకు ( సంసార బంధాలలో చిక్కుకుపోయిన వాళ్ళకు ) వైద్యుడు, సకల విద్యలకు నెలవు ( నివాసం ) అయిన దక్షిణామూర్తి కి నమస్కారములు.
సేకరణ: సోషల్ మీడియా 

No comments:

Post a Comment