విజయవాడ: దుర్గగుడి అభివృద్ధికి.. *రూ.200 కోట్లతో మాస్టర్ ప్లాన్* నేడు శంకుస్థాపన చేసీన *సీఎం జగన్* .. దేవదాయశాఖలో మరో కీలక ఘట్టం సాకారం కాబోతోందివిజయవాడలోని శ్రీ *దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం(దుర్గగుడి)* అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. భక్తుల రద్దీకి అనుగుణంగా అధునాతన సౌకర్యాల కల్పనకు రూ.200 కోట్లతో రూపొందించిన మాస్టర్ ప్లాన్కు గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి శంకుస్థాపన చేశారు.
రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రిగా కొట్టు సత్యనారాయణ బాధ్యతలు చేపట్టిన తర్వాత దుర్గగుడి అభివృద్ధిపై ప్రత్యేక చొరవ తీసుకున్నారు. బాధ్యతలు చేపట్టిన తొలి రోజుల నుంచే దుర్గగుడి అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇదే అంశంపై పలుమార్లు అధికారులతో కొట్టు సత్యనారాయణ సమీక్షా సమావేశాలు నిర్వహించి స్పష్టత తీసుకున్నారు. ఈ క్రమంలోనే రూ.200 కోట్లతో మాస్టర్ ప్లాన్ రూపుదిద్దుకుంది. మాస్టర్ ప్లాన్ పనులకు శంకుస్థాపన.. ఆలయం అభివృద్ధిలో భాగంగా రూపొందిం చిన మాస్టర్ ప్లాను పనులను ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి శంకు స్థాపన చేయను *లడ్డూ ప్రసాదం పోటు నిర్మాణానికి రూ.27 కోట్లు, రూ.30 కోట్ల వ్యయంతో అన్నదాన భవన నిర్మాణం చేయనున్నారు.* * *కనకదుర్గా నగర్ నుంచి మహా మండపానికి అనుసంధా నిస్తూ నిర్మించనున్న రూ.13 కోట్లతో నిర్మించే ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ పనులు ఉన్నాయి* . శ్రీ అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు అసౌకర్యం లేని రీతిలో ప్రత్యేక పార్కింగ్ సదుపాయా లు కూడా ఏర్పాటు చేయనున్నారు. భారీగా పెరిగిన భక్తులు.. గతంతో పోల్చితే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. సాధరణ రోజుల్లో 20వేలకు పైగా భక్తులు శ్రీ అమ్మ వారిని దర్శించుకుంటున్నారు. సెలవు రోజులు, దసరా శరన్నవరాత్రి ఉత్సవాలుభవానీ దీక్షల విరమణ రోజుల్లో పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు. నవరాత్రి రోజుల్లో లక్షల్లో భక్తులు వస్తుంటారు. ఐదు లక్షల మందికి పైగా భవానీలు ప్రతి ఏటా శ్రీ అమ్మవారి దీక్ష ధరించి మాలన విరణమ చేస్తుంటారుభక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయంలో సౌకర్యాలు లేవు.దేవాదాయ శాఖ దీన్ని దృష్టిలో ఉంచుకుని మరికొన్ని అభివృద్ధి పనులను చేపట్టింది.
No comments:
Post a Comment