ఖమ్మం, డిసెంబర్ 21: రెవిన్యూ సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. గురువారం నూతన కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రెవిన్యూ అధికారులతో ధరణి, రిజిస్ట్రేషన్స్, భూసేకరణ, బల్క్ సమస్యలు తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెవిన్యూ సంబంధ దరఖాస్తులపై వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలన్నారు. ధరణి కి సంబంధించి, టీఎం-33 ద్వారా వచ్చిన దరఖాస్తులలో పెండింగ్ వున్న వాటిని యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలన్నారు. జిఎల్ఎం సక్సేషన్, మ్యుటేషన్ ల దరఖాస్తుల ఫైళ్లు వెంటనే సమర్పించాలన్నారు. ఫైళ్లను సంబంధిత తహసీల్దార్ కార్యాలయాల్లో భద్రపరచాలన్నారు. జిల్లాలో వివిధ ప్రాజెక్టులకు చేపడుతున్న భూ సేకరణ ప్రక్రియ వేగం చేయాలన్నారు. పోస్ట్ అవార్డ్ పనులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. స్ట్రక్చర్ లకు చెల్లింపులు పెండింగ్ లో లేకుండా చూడాలన్నారు. రిజిస్ట్రేషన్ లకు సబంధించి స్లాట్ లు పెండింగ్ లేకుండా చూడాలన్నారు. దరఖాస్తుదారులకు సమయం ఇచ్చి, దరఖాస్తులు పరిష్కరించాలన్నారు. గుర్తించిన బల్క్ సమస్యలకు సంబంధించి చర్యలు వేగం చేయాలన్నారు. సర్వే, విచారణలు త్వరితగతిన పూర్తి చేసి, అర్హులకు పట్టాల జారికి చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలకు స్థల సేకరణలు పూర్తి చేయాలన్నారు. వేర్ హౌజింగ్ గోడౌన్ల కొరకు ఒక్కో డివిజన్ లో 50 ఎకరాల చొప్పున భూ సేకరణ చేయాలన్నారు. ఎమ్మెల్యే పాయింట్ ల కొరకు ప్రతి మండలంలో 2 ఎకరాల భూమిని గుర్తించి, ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. ప్రభుత్వ భూముల ఆక్రమణల పై తీసుకున్న చర్యల నివేదిక సమర్పించాలన్నారు. జీవో 59 లో తిరస్కరణకు గురైన దరఖాస్తులకు సంబంధించి, స్థలాలను స్వాధీనం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. మీ సేవ దరఖాస్తులను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలన్నారు. ప్రజావాణి దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఎప్పటికప్పుడు దరఖాస్తుల పరిష్కారం చేయాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 1209 డొంకలు ఉన్నట్లు, ఇందులో 69 డొంకలు ఆక్రమణ కు గురయినట్లు ఆయన తెలిపారు. సర్వే చేపట్టి, డొంకల్లో ఆక్రమణలు తొలగించి, ఉపాధి హామీ క్రింద రహదారుల ఏర్పాటుచేసి, రక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం చేయాలన్నారు. చెక్కులు సిద్ధం ఉన్నచోట పంపిణీకి చర్యలు చేపట్టాలన్నారు. కోర్ట్ కేసుల విషయంలో టైం బాండ్, డైరెక్షన్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్, శిక్షణ సహాయ కలెక్టర్ మయాంక్ సింగ్, ఆర్డీవో లు జి. గణేష్, అశోక్ చక్రవర్తి, ఏడి సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాసులు, కలెక్టరేట్ ఏవో అరుణ, కలెక్టరేట్ సూపరింటెండెంట్ లు, మండల తహశీల్దార్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment