Friday, 1 December 2023

వెంటాడుతున్న మొబైల్ హంట్ పోర్టల్..... 600 మొబైల్ ఫోన్లు రికవరీ...‌‌

తిరుపతి : తిరుపతి జిల్లాలో కోటి ఎనిమిది లక్షల రుపాయుల (1,08,00,000) విలువగల 600 మొబైల్ ఫోన్లు రికవరీ అయినట్లు MOBIEL HUNT (WHATSAPP 9490617873) అప్లికేషన్, CEIR (Central Equipment Identity Register) పోర్టల్ గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని CEIR CITIZEN PORTAL ద్వారా మొబైల్ పోయిన వెంటనే పోర్టల్ నందు ఫిర్యాదు చేస్తే సెల్ ఫోన్ లో ఉన్న సమాచారం దుర్వినియోగం కాకుండా సెల్ ఫోన్ బ్లాకు అవుతుంది, అలాగే పోగొట్టుకున్న ఫోన్ ను త్వరితగతిన రికవరీ చేయడం జరుగుతూ ఉందని జిల్లా ఎస్పీ పి.పరమేశ్వర రెడ్డి పేర్కొన్నారు.మతిరుపతి జిల్లాలో సెల్ ఫోను పోగొట్టుకున్న వారి కోసం ప్రత్యేకంగా  తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ  పి.పరమేశ్వర రెడ్డి ఐపీఎస్., వారు ఏర్పాటు చేసిన MOBIEL HUNT (WHATSAPP 9490617873) అప్లికేషన్ సేవల ద్వారా సదరు వాట్సప్ కు వచ్చిన ఫిర్యాదులపై గతంలో జిల్లా వ్యాప్తంగా సెల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితులకు 6విడతలలో  రూ. 2,93,40,000/- విలువ గల 1630 సెల్ ఫోన్ లను రికవరీ చేసి సెల్ఫోన్ పోగొట్టుకున్న బాధితులకు అందజేయడం జరిగింది. ప్రసుత్తం 7వ విడతలో గత రెండు నెలల రోజుల వ్యవధిలోనే సుమారు రూ.1,08,00,000/- విలువ గల 600 మొబైల్ ఫోన్లు రికవరీ చేసి జిల్లా ఎస్పీ కార్యాలయం నందు జరిగిన పత్రికా సమావేశం నందు జిల్లా ఎస్పీ శ్రీ పి.పరమేశ్వర రెడ్డి ఐ.పి.యస్., గారు వివరాలను వెల్లడించి బాధితులకు మొబైల్ ఫోన్లను అందజేశారు. ఇప్పటి వరకు MOBILE HUNT APPLICTION ద్వారా 07 విడతలకు గాను రూ.4,01,40,000/- విలువ గల మొత్తం 2230 మొబైల్ ఫోన్లు రికవరీ చెయ్యడం జరిగిందన్నారు. తిరుపతి తిరుమల సందర్శనకు నిత్యం వేలాది మంది యాత్రికులు వచ్చి వెళుతుంటారు. తిరుపతి బస్సు స్టేషన్ మరియు రైల్వే స్టేషన్ తదితర రద్దీ ప్రాంతాలలో మొబైల్ పోగొట్టుకోవడమో లేదా దొంగలించ బడడమో జరుగుతూ ఉంటుంది. ఈ విషయంపై ప్రత్యేక ద్రుష్టి పెట్టి 2023-ఫెబ్రవరి నెలలో MOBIEL HUNT (WHATSAPP 9490617873) అప్లికేషన్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాము. అలా పోగొట్టుకున్న మొబైల్స్ ను ఒక ప్రక్క రికవరీ చేసి, బాధితులకు అందజేస్తూ, మరో ప్రక్క పిక్ పాకెటర్ల కదలికలపై సిసి కెమేరాలతో ప్రవేక్షిస్తూ, విసిబల్ పోలీసింగ్ ను పెంచి అనుమానితులపై గట్టి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి, యాత్రికులకు మెరుగైన సేవలను అందిస్తున్నామన్నారు.ప్రజల ఎవ్వరిదైనా మొబైల్ ఫోన్ పోతే పోలీస్ వారు ఏర్పాటు చేసిన MOBIEL HUNT 9490617873 నెంబర్ కు WhatsApp లో Hai లేదా HELP అని మెసేజ్ చేస్తే వచ్చే link నందు మీ యొక్క వివరాలను పూరించాలి. లేదా CEIR (Central Equipment Identity Register) పోర్టల్ నందు ఫిర్యాదు చేస్తే సెల్ ఫోన్ లో ఉన్న సమాచారం దుర్వినియోగం కాకుండా సెల్ ఫోన్ బ్లాకు అవుతుంది. అలాగే పోగొట్టుకున్న ఫోన్ ను త్వరితగతిన రికవరీ చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ అన్నారు.రాష్ట్ర  డిజిపి కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి ఐ.పి.యస్., యొక్క ఆదేశాలపై తిరుపతి జిల్లా ఎస్పీ  పి. పరమేశ్వర రెడ్డి ఐపీఎస్., గారి పర్యవేక్షణలో తిరుపతి సైబర్ క్రైమ్ సి.ఐ. ఓ.రామచంద్ర రెడ్డి అధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి పోగొట్టుకున్న  మొబైల్స్ ను రికవరీ చేసి భాదితులకు అందజేయడం జరుగుతుందన్నారు.  తిరుపతి జిల్లా పోలీసు MOBILE HUNT వాట్సాప్ సర్వీసులు, CIER పోర్టల్ గురించి పోలీసులు ఇప్పటికే ప్రజలకు అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా కల్పిస్తున్నారు. మీడియా కూడా తమవంతు సహకారం అందించాలని కోరారు.. జిల్లా ప్రజలే కాకుండా తిరుపతికు వచ్ఛే యాత్రికులు కూడా MOBILE HUNT వాట్సాప్ సర్వీసులు, CIER పోర్టల్ సేవలను సద్వినియోగం చేసుకోవడం మాకు సంతోసదాయకం అని అన్నారు.ఈ సందర్భంగా సెల్ ఫోన్ రికవరీలో ప్రతిభ కనబరిచిన సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ O.రామచంద్రారెడ్డి, సైబర్ క్రైమ్ సిబ్బందికి జిల్లా ఎస్పీ పి.పరమేశ్వర రెడ్డి ఐ.పి.యస్., ప్రశంసా పత్రాలు అందజేసి, అభినందించారు 

No comments:

Post a Comment