Saturday, 16 December 2023

చలికాలంలో వేడిగా..... వాడిగా తొలి శాసనసభ సమావేశాలు.... అసెంబ్లీలో రేవంత్ ×కెటిఆర్...


హైదరాబాద్:డిసెంబర్ 16 : తెలంగాణ అసెంబ్లీ తొలి దఫా సమావేశాలు చలికాలంలో  వేడి శగ రగిల్చాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్సెస్  కెటిఆర్ గా సాగిన సమావేశాలు ఆధ్యాంతం ఆకట్టుకున్నాయి.. ఉదయం 10 గంటలకు మొదలైన  శాసనసభ, శాసనమండలి సమా వేశాలు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లో చర్చ జరిగింది. కొత్త అసెంబ్లీ కొలువు తీరిన తర్వాత జరుగుతున్న మొదటి చర్చ సర్వత్రా ఆసక్తికరంగా సాగింది.ఈ నెల 9న సమావేశాలు ప్రారంభం కాగా. అసెంబ్లీలో ధన్యవాద తీర్మానాన్ని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ప్రతిపాదించగా..చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేకానంద బలపర్చారు. మండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తీర్మానాన్ని ప్రతిపాదించ నుండగా..టీచర్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి బలపరిచారు. సభ సమావేశాలలో గత పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వ విధానాలను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని వ్యవస్థలను దెబ్బ తీశారని గవర్నర్ విమర్శలు గుప్పించారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న మొదటి చర్చపై ఆసక్తి నెలకొంది. గట్టిగా కౌంటర్తో ముందుకు వచ్ఛిన బిఆర్ఎస్ ప్రసంగం అజ్ఞాతం కాంగ్రెస్ పాంప్లెట్ లాగా ఉందని పేర్కొంది. మహిళలు 2500 కోసం ఎదురుచూస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో భాగంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
గవర్నర్ ప్రసంగం పూర్తిగా తప్పులతడకే అని.. తాము ఎప్పటికీ ప్రజాపక్షమే తెలం గాణ పక్షమే.. కాంగ్రెస్ ఎప్ప టికీ విపక్షమే అన్న కేటీఆర్ కామెంట్స్‌పై రేవంత్ మండి పడ్డారు. కేటీఆర్‌ను ఎన్‌ఆర్‌ ఐ అంటూ సెటైర్ విసిరారు.
కొంతమంది ఎన్ఆర్ఐ‌లకు ప్రజాస్వామ్యం గురించి చెప్పినా అర్థం కాదన్నారు. పోతిరెడ్డి పాడుకు పొక్క పెట్టినరోజు మాట్లాడిన నాయకుడు పీజేఆర్ తమ నేత అని చెప్పుకొచ్చారు. చీమలు పెట్టిన పుట్టలో జోర్రినట్టు కేటీఆర్ మేనేజ్‌మెంట్ కోటాలో వచ్చారని వ్యాఖ్యలు చేశారు.కేకే మహేందర్ రెడ్డికి అన్యాయం చేశారన్నారు. గత పాలన గూర్చి మాట్లాడుదామంటే ఒక రోజంతా చర్చ పెడదామన్నారు. ఉద్యమంలో మీ వెంట నడిచిన వారికి ఉద్యమ పార్టీగా గొప్పలు చెప్పుకుంటున్న వారు ఉధ్యమ కారులకు ఏం చేశారు చెప్పాలని అసెంబ్లీ ముఖంగా రేవంత్ రెడ్డి కెటిఆర్ ను నిలదీశారు. మంత్రులకు ఎమ్మెల్యేలకు కనీసం ప్రగతి భవన్ సైతం రానివ్వకుండా బారికేడ్లను కట్టారని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ అడ్డుకట్టలను తొలగించిందని సామాన్యునికి తమ గోడు చెప్పుకునే అవకాశం కల్పించిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో పాపం ఉందంటే ఆనాటి పాలకుల్లో చాలా మంది ఇప్పుడు బీఆర్ ఎస్‌లోనే ఉన్నారని తెలిపారు.కేసీఆర్‌కు యూత్ కాంగ్రెస్ నాయకుడిగా అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ అని గుర్తుచేశారు. కేసీఆర్‌కు సింగిల్ విండో ఎన్నికలలో పోటీచేసే అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ అని తెలిపారు. పిల్లి శాపనార్థాలకు ఉట్లు తెగిపడవన్నారు. ప్రతి పక్షాలను గౌరవించే సంప్రదాయం కాంగ్రెస్ పార్టీకి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

No comments:

Post a Comment