Monday, 11 December 2023

*ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న పొంగులేటి దంపతులు*

విజయవాడ : బెజవాడ కనకదుర్గమ్మ తల్లిని  తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాధురి దంపతులు దర్శించుకున్నారు. వీరి వెంట  మంత్రి సోదరుడు పొంగులేటి ప్రసాద రెడ్డి, శ్రీ లక్ష్మి దంపతులు కూడా ఉన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉమ్మడి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు  ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. తొలుత ఆలయ కమిటీ బాధ్యులు మంత్రి పొంగులేటికి ఘనస్వాగతం పలికారు. శాలువ, మెమొంటోను అందచేసి మంత్రి పొంగులేటిని ఆలయ మర్యాదలతో సత్కరించారు.

No comments:

Post a Comment