*
ఆత్మగౌరవ జెండాను ఆకాశమంత ఎత్తున ఎగరేసిన కొడంగల్ గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.
కొన ఊపిరి వరకు కొడంగలే శ్వాసగా జీవిస్తా. కష్టకాలంలో భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ జెండాను మోసిన ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టుకుని చూసుకుంటా.
ఈ గడ్డ పై ప్రతి బిడ్డ బతుకులో వెలుగు నింపే బాధ్యత తీసుకుంటా. దేశానికి కొడంగల్ ను ఒక మోడల్ గా నిలబెడతా...
@అనుములరేవంత్ రెడ్డి, టిపిసిసి, చీప్..
టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి.. మహబూబ్‌నగర్ జిల్లాలో కొండారెడ్డి పల్లి, వంగూర్‌లో నవంబర్ 08, 1969న జన్మించారు. వీరిది వ్యవసాయ కుటుంబం. తండ్రి పేరు దివంగత అనుముల నర్సింహ రెడ్డి. తల్లి అనుముల రామచంద్రమ్మ. మహబూబ్‌నగర్‌కి చెందిన రేవంత్ రెడ్డి చిన్ననాటి నుంచే రాజకీయాల పట్ల ఆసక్తి కనబరిచేవారు. గ్రాడ్యూయేషన్ చదవుతున్న సమయంలో ఆయన అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకుడిగా ఉన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏ.వీ. కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు జైపాల్ రెడ్డి మేనకోడలు గీతాను వివాహమాడారు. అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరి పూర్తిస్థాయి రాజకీయ కార్యకలాపాల్లోకి దిగారు.
*
*రాజకీయంగా* ..
2014 కొడంగల్ నుంచి మరోమారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురునాథ్ రెడ్డిపై గెలిచి రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. 2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన గురునాథ్ రెడ్డిని ఓడించారు. 2008 రేవంత్ రెడ్డి టీడీపీలో మరోసారి చేరారు. 2008 శాసనమండలి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2006 జెడ్‌టీపీసీ ఎన్నికల్లో మిడ్జిల్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి నెగ్గారు. 2004 ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. 1992 విద్యార్థిగా ఉన్న సమయంలో ఆయన అఖిల భారత విద్యార్థి పరిషత్‌లో సభ్యుడయ్యారు.
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా..
రేవంత్ రెడ్డి 2017 అక్టోబర్‌లో టిడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం 2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత ఆయన 2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2019 మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. రేవంత్ రెడ్డిని తెలంగాణ పీసీసీ అధ్యక్ష్యుడిగా 26 జూన్ 2021లో జాతీయ కాంగ్రెస్ పార్టీ నియమించింది.
డైరెక్ట్ ముఖ్యమంత్రిగా..?
ఆయన 2021 జులై 7న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్ సమక్షంలో టీపీసీపీ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇక ఈసారి అసెంబ్లీ ఎన్నికలు 2023లో కొడంగల్, కామారెడ్డి నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. 2023 ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిచాడు.రేవంత్ రెడ్డి ఈసారి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మంత్రి కాకుండానే.. కేవలం ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది.
No comments:
Post a Comment