*ఖమ్మం:* రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. మంత్రి హోదాలో తొలిసారి ఉమ్మడి జిల్లా పర్యటనకు వస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి రానున్నారు. జిల్లా సరిహద్దు కూసుమంచి మండలం నాయకన్ గూడెం వద్ద కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ముగ్గురితో పాటు ఉభయజిల్లాల కాంగ్రెస్ ఎంఎల్ఏలు కూడా వెంట ఉండనున్నారు. ఈ సందర్భంగా ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం నియోజక వర్గాల్లో వీరి పర్యటన కొనసాగుతుంది. ఈ పర్యటనను విజయవంతం చేయాలని పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ఓ ప్రకటనలో కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను, అభిమానులను కోరారు.
No comments:
Post a Comment