Thursday, 21 December 2023

క్రచే కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్...


ఖమ్మం, డిసెంబర్ 20: ఉద్యోగినుల సౌకర్యార్థం నూతన కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన క్రచ్చే (పిల్లల సంరక్షణ కేంద్రం) ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. బుధవారం కలెక్టర్ క్రచే కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళా ఉద్యోగుల కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్రచ్చే కేంద్రంలో చిన్న పిల్లల సంరక్షణకు అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మహిళా ఉద్యోగులు విధుల నిర్వహణకు ఇబ్బంది కలగకుండా వారి చిన్న పిల్లలను కార్యాలయమునకు రాగానే సంరక్షణ కేంద్రం క్రచ్చేలో సంరక్షకులకు అప్పగించి నిశ్చింతగా తమ విధులను సమర్ధవంతంగా ముగించుకొని, ఇంటికి వెళ్లెప్పుడు తిరిగి తీసుకొని వెళ్లవచ్చని ఆయన అన్నారు. క్రచే కేంద్రంలో పిల్లల ఆట వస్తువులు, వారి సంరక్షణకు సిబ్బందిని కేటాయించినట్లు ఆయన అన్నారు. క్రచే సిబ్బంది రాణిని రోజువారి ఎంత మంది పిల్లలు ఉంటున్నది, అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.

No comments:

Post a Comment