Monday, 11 December 2023

పరమశివుడు ప్రత్యక్షమైనప్పుడు.... (శృ౦గేరి శారదా పీఠం 35వ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ అభినవ విద్యాతీర్ధ మహాస్వామి వారి జీవిత విశేషం)


నా కళ్ళల్లో నీటిధార ఉబుకుతోంది. దేహంపై ఉన్న రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఆ దేవదేవుని పెదవులు కదిలి, ఈశ్వరుని మధురమైన పలుకులు వినబడుతున్నాయి. పరమేశ్వరుడు నాతో, “వత్సా! రేపటినుండి నిరాకార పరబ్రహ్మముపైన దృష్టి నిలిపి సాధన చెయ్యి. పరతత్త్వాన్ని తెలుసుకో. అనతి కాలంలోనే పరబ్రహ్మము నందు నీవు నిలబడెదవు” అని పలికారు. నా శిరస్సుపైన స్వామివారు చెయ్యి ఉంచి నన్ను ఆశీర్వదించారు. వారు వెంటనే మాయమైపోయారు. వారు అలా మాయమైపోగానే వెంటనే చిన్నగా వర్షం మొదలైంది. నేను ధ్యానానికి కూర్చున్నప్పుడు ఆకాశంలో ఒక్క మబ్బులేదు. సూర్యాస్తమప్పుడు కూడా ఆకాశం నిర్మలంగా ఉంది. చిన్నగా వర్షం పడుతున్నా సూర్యుడు ప్రకాశవంతంగా ఉన్నాడు. ఈశ్వరుడు నాచేత దేవస్నానం కూడా చేయించి అనుగ్రహించాలనుకున్నారు. సూర్యుడు ఉండగా వర్షం పడుతున్నప్పుడు తడిస్తే అది దేవస్నానం. అది గంగాస్నానంతో సమానం. ఎట్టిపరిస్థితులలోనూ అటువంటి స్నానాన్ని చెయ్యకుండా ఉండరాదు. వెంటనే అందులో స్నానం చెయ్యాలి.1975లో నరసింహవనంలో అచార్యులవారు నడుస్తుండగా, చిన్నగా చినుకులు మొదలయ్యాయి. సూర్యుడు ఉండగా వర్షం పడితే అందులే తడవడం గంగాస్నానం చేసినట్లు అని తలచి చిన్నగా నవ్వుకున్నారు. మహాత్ములందరూ ఎల్లప్పుడూ పరబ్రహ్మముతో కలిసి ఉంటారు. ఆ యదార్థాన్ని తెలుసుకోవడానికి వారి గురువులు ప్రత్యేక పాత్ర పోషిస్తారు. వారు చూపిన మార్గంలో నడిచి బ్రహ్మానందాన్ని అనుభవిస్తుంటారు. అభినవ విద్యాతీర్థ మహాస్వామివారు చిన్నవయస్సులో పీఠానికి వచ్చారు. అమ్మవారే వారికి కుండలినీ విద్యారహస్యాలన్నిటిని తెలిపి అష్టసిద్ధులు వారి వశం చేశారు. పదేళ్ళప్పుడు పరమశివుడు ప్రత్యక్షమై అష్టాంగయోగాన్ని నేర్పి పదిహేనేళ్లకు అన్ని శక్తులు సంపాదించుకునేట్టు చేశారు. 
చంద్రశేఖర భారతీ స్వామివారు అభినవ విద్యాతీర్థ స్వామివారిని, అభినవ విద్యాతీర్థ స్వామివారు భారతీతీర్థ స్వామివారిని, భారతీతీర్థ స్వామివారు విధుశేఖర భారతీస్వామివారిని అలా గురుపరంపరలో శిష్యులకు మార్గాన్ని చూపి సనాతన ధర్మాన్ని పీఠపరంపరను కాపాడుతున్నారు.
సేకరణ:
#SringeriJagadguruVaibhavam #శృంగేరిజగద్గురువైభవం సోషల్ మీడియా ద్వారా 

No comments:

Post a Comment