Wednesday, 6 December 2023

*- రేవంత్ రెడ్డి ప్రస్థానం గర్వించదగినది**- పాలేరు అసెంబ్లీ విజేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి*

*ఇంతితై సీఎమై..!*
*- జర్నలిస్ట్ నుంచి ముఖ్యమంత్రి దాక...*
*- రేవంత్ రెడ్డి ప్రస్థానం గర్వించదగినది*
*- పాలేరు అసెంబ్లీ విజేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి*

ఖమ్మం : జర్నలిస్ట్ నుంచి ముఖ్యమంత్రి దాకా రేవంత్ రెడ్డి ఎదిగిన తీరు గర్వించదగినదని పాలేరు అసెంబ్లీ విజేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ మూడవ అసెంబ్లీకి రెండవ ముఖ్యమంత్రిగా, తెలంగాణ కాంగ్రెస్ తొలి ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేవంత్ కు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. జర్నలిస్ట్ గా ప్రస్థానం ప్రారంభించి ఆ తరువాత అనుహ్యాంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీగా రాజకీయాల్లోకి వచ్చి ప్రస్తుతం యావత్తు తెలంగాణ గర్వించే స్థాయికి ఎదిగిన తీరు అభినందనీయమని కొనియాడారు. ఆయన ఆధ్వర్యంలో తెలంగాణ అభివృద్ధి పథంలో పరుగులు పెట్టాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

No comments:

Post a Comment