Tuesday, 31 March 2020

నిబంధనలాసడలించారు సరే... రాజుగారని కరోనా గౌరవించేనా....



జర్మనీలోని ఆల్పైన్ రిసార్ట్ పట్టణంలోని ఒక హోటల్‌లో 64 సంవత్సరాల థాయ్‌లాండ్‌ రాజుకు ఆయన పరివారానికి విడిదిగా మారింది.. మహా వజీరాలోంగ్‌కార్న్ తనను తాను కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా ఐసోలేషన్కి ఆ హోటల్ ను ఎంచుకున్నాడు..అంతవరకు బాగానే వున్నా ఆయన  20 మంది మహిళలతో పాటు నౌకర్లు..చాకర్లతో  అక్కడ బసచేయడం విమర్శలకు తావిస్తోంది..

లాక్డౌన్ నిబంధనలు ఉన్నప్పటికీ బవేరియాలోని మొత్తం నాలుగు నక్షత్రాల గ్రాండ్ హోటల్ సోన్నెన్‌బిచ్ల్‌ను బుక్ చేసుకోవడానికి కింగ్ రామా ఎక్స్ అని పిలువబడే మహా వజీరాలాంగ్‌కార్న్‌కు అక్కడి ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇవ్వడం గమనార్హం..

రాయల్ పార్టీని ‘కూర్పులో మార్పు లేని సజాతీయ సమూహం’ గా భావించారు, అంటే హోటల్‌ను బస చేసిన కాలానికి నివాస గృహంగా సౌత్ జర్మనీ ప్రభుత్వం భావిస్తుందని వెల్లడించగా ప్రజలకేనా నిబంధనలు.. రాజులకు ఆవసరం లేదా అంటూ నెటిజన్లు రకరకాలుగా విమర్శలు నూరుతున్నారు..

Sunday, 29 March 2020

జగనన్నే బరోశా మనకు.. ఇంట్లో వుండటమే జగనన్నాకు మనమిచ్చే బరోశా....

*మూడు విడతల్లో జగన్‌ ఉచిత రేషన్‌ - శైలజ చరణ్ రెడ్డి*
 
 కానిపాకం : కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో పేద ప్రజలు తిండికి ఇబ్బంది పడొద్దనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి ఒక్క కుటుంబానికి రేషన్‌ ఉచితంగా అందిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మరియు రీజనల్ కోఆర్డినేటర్ ,  పూతలపట్టు నియోజకవర్గ ఎలక్షన్ అబ్జర్వర్ శైలజ చరణ్ రెడ్డి అన్నారు.
 మూడు నెలలకు సరిపోయే రేషన్‌ను మూడు విడతల్లో అందిస్తామని చెప్పారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌ ఆదేశాల మేరకు ఈ రోజు మొదటి విడత రేషన్‌ను అందించామన్నారు. ఏప్రిల్‌ 15న రెండో విడత, ఏప్రిల్‌ 29న మూడో విడత రేషన్‌ను అందిస్తామన్నారు. ప్రతి వ్యక్తికి ఐదు కిలోల బియ్యం, ప్రతి కార్డుకు కేజీ కందిపప్పు చొప్పున ఉచితంగా ఇస్తున్నామని చెప్పారు. అలాగే 58 లక్షల మంది పెన్షన్‌ దారులకు ఏప్రిల్‌ 1వ తేదిన పెన్షన్‌ అందిస్తామన్నారు.
 
సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశాలతో ప్రతి పేద కుటుంబానికి ఏప్రిల్‌ నాలుగో తేదిన రూ.1000 ఇవ్వబోతున్నామని తెలిపారు. సీఎం జగన్‌కు ప్రజలపై ఉన్న ప్రేమాభిమానాలు, చిత్తశుద్దిని ఈ నిర్ణయాలు తెలియజేస్తాయన్నారు. ఇంట్లో ఉండండి అని చెప్పడమే కాదు ఇంట్లో ఉన్నవారికి అన్ని అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా చేయడమే కాకుండా పేదలకు నిత్యవసర వస్తువులను అందించడం గొప్ప విషయం అన్నారు. దీంట్లో పోలీసులు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారని ప్రశంసించారు. రాత్రింబవళ్లు పని చేస్తున్న పోలీసులకు అందరూ అండగా నిలవాలని కోరారు. పోలీసులు విసిగిపోతే కరోనా అందరికి వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. కరోనా కట్టడికి సీఎం జగన్‌ తీవ్రంగా కృషి చేస్తున్నారు కాబట్టే దేశంలోనే ఏపీలో తక్కువ కరోనా పాజిటివ్‌  కేసులు నమోదయ్యాయని తెలిపారు. కరోనాను పారదోలడంతో అందరు ఐకమత్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. లాక్‌డౌన్‌ నియమాలను పాటిస్తూ ఎవరూ బయట తిరగొద్దని శైలజ చరణ్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

 అగరంపల్లి లో బెంగళూరు, హైదరాబాద్,  శ్రీకాకుళం, విజయవాడ నుంచి   వచ్చిన వ్యక్తులకు dr హరిచందన & టీం , గ్రామ వాలంటీర్ సారధి  ఆధ్వర్యంలో 14 రోజులు గృహనిర్బంధంలో ఉండాలని  శైలజ చరణ్ రెడ్డి  తెలియజేశారు .

Saturday, 28 March 2020

బతికుంటే బలుసాకు తిని అయినా బతకవచ్చు - శైలజ చరణ్ రెడ్డి*


ముంచుకు వస్తున్న ముప్పును ప్రతి ఒక్కరూ గ్రహించాలని ఆదమరిచి నిద్రపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదు అని  కరోనా కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న సూచనలను తప్పక పాటించవలసినదిగా లేనిపక్షంలో భారతదేశంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులను   తప్పించుకొని మూడో స్టేజ్ రాకుండా  చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క వ్యక్తి పైన  ఉందని బ్రతికుంటే బలుసాకులు తిని అయినా బ్రతక వచ్చు కానీ  చేతులారా జీవితాలను నాశనం చేసుకోవద్దని 
YSRCP  రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి & రీజనల్ కోఆర్డినేటర్,  పూతలపట్టు నియోజకవర్గ ఎలక్షన్ అబ్జర్వర్ శైలజ చరణ్ రెడ్డి  సూచించారు

 *ఇప్పటి వరకు పరిశీలిస్తే* 
🔴*ప్రపంచ వ్యాప్తంగా 85,612 కేసులతో అగ్రస్థానంలో అమెరికా* 
 *8,215 మరణాలతో  ముందున్న ఇటలీ* 
🔴 *మరణాల్లో ఛైనా(3292)ను దాటిన స్పెయిన్ (4365)* 
🔴 *భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు* 
🔴 *శుక్రవారం మధ్యాహ్నం1 గంటల కు 727 పాజిటివ్ కేసులు.. 16కు చేరిన మరణాలు* 
🔴 *తెలంగాణలో 47,  ఏపీలో 12కు పెరిగిన పాజిటివ్ కేసులు* 

 ఇక ఆదమరిస్తే  పరిస్థితి చేజారి పోతుందనే  జాగ్రత్త ప్రతి ఒక్కరికి ఉండాలి అని ఆమె కోరుకున్నారు  *అభివృద్ధి చెందిన, అగ్రరాజ్యాలే కరోనా దెబ్బకి కకావికలమవుతున్నాయి*  అని ఆమె తెలియజేశారు

🔴 *ఈ వారమే అత్యంత కీలకం* 

  ఈవారం అత్యంత కీలకమని ,  సామాజిక దూరం పాటించాలని,  ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉంటూ  తోచిన విధంగా సోషల్ మీడియా ద్వారా కానీ లేదంటే ఫోన్ల ద్వారా గాని  తమకు తెలిసిన వాళ్ళందరికీ అవగాహన కల్పించాలని కరోనా  వైరస్ వ్యాప్తిని అరికట్టి  తమ వంతు భాగంగా భరతమాత రుణం తీర్చుకోవాలని ఆమె పిలుపునిచ్చారు

PM  నరేంద్ర మోడీ గారికి మరియు మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ,  #CM వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి గ్రామ వాలంటీర్ వ్యవస్థ ప్రపంచ దేశాలకు సైతం  ఆదర్శంగా  నిలిపి నందుకు  ప్రత్యేక కృతజ్ఞతలు ఆమె తెలియజేశారు

Thursday, 26 March 2020

ఆ "కవిత" ధైర్యం నూరిపోసింది..అందుకేనేమో కెసిఆర్ కూ నచ్ఛేసింది....

ఆకాశవాణి సినీయర్ అనౌన్స్ర్రర్..కవి..రచయిత్రి.. ఐనంపూడి శ్రీలక్ష్మి  కరోనా వ్యాప్తిలో ధైర్యంగా వుందాం...మన చేతలతో మహమ్మరిని పారద్రోలుదాం అంటూ ప్రజలలో ధైర్యాన్ని నింపే కవితాక్షరాలు రాశారు. కవితలు రాయండి అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే...  ఈ కవిత కేసీఆర్ మెప్పు పొందింది..
  
ఏమైందిప్పుడు..

క్షణాలు మాత్రమే కల్లోలితం

ఆత్మస్థయిర్యాలు కాదు కదా

సమూహాలు మాత్రమే సంక్షోభితం

సాయం చేసే గుండెలు కాదు కాదా..!

ఎన్ని చూడలేదు మనం

కలరా వచ్చి ఎన్ని గ్రామాలు కలత చెందలేదు

కలలో కూడా కలరా కన్పిస్తుందా ఇప్పుడు

ప్లేగును జయించిన దురహాసంతోనే కాదా

చార్మినార్‌ను నిర్మించుకున్నాం..!

గతమెప్పుడూ విజయాల్నే గుర్తుచేస్తుంది

వర్తమానమెప్పుడూ సవాళ్లేనే చూపిస్తుంది

భవిష్యతెప్పుడూ ఆశలనే ప్రోది చేస్తుంది

కుంగుబాటు తాత్కాలికమే

యుద్ధభూమిలోకి దిగాక 

వెనక్కు తిరగడం, వెన్నుచూపటం

మనకు తెలియదు

యుద్ధం ఏ రూపలో వస్తేనేం

మిస్త్సెల్ అయినా-వైరస్ అయినా

పెద్ద తేడా ఏం ఉంటుంది కనుక...!

నీకు బాగా తెలుసు-జీవన వాంఛాజనితం

మన దేహం

ఎన్నిమార్లు యుద్ధ ప్రసనాలు చూడలేదు

ప్రతి ఆంక్షను మన కాంక్షగా మార్చుకోలేదు!

కరోనా పాజిటివ్ అయితే ఏంటట

పాజిటివ్ దృక్పథం మన మందనుకున్నాక

సామాజిక దూరం మన అస్త్రమయ్యాక

జనతా కర్ఫ్యూ మన కవచమయ్యక

ఇప్పుడిక క్వారంటైనే మన వాలంటైన్..!

ఇక, కరోనా మాత్రం కరిగి కనుమరుగు కాదా?

క్యా కరోనా అని దీనంగా అర్థించొద్దు

దొంగతనంగా ప్రవేశించిన కరోనాకు కరుణ తెలియదు

క్యా కరోగే.. అంటూ ఎదురు తిరిగి ప్రశ్నించు

లెక్కపెట్టాల్సింది పోయిన ప్రాణాల్ని కాదు

నిత్య రణస్థలిలో కరోనా ఎన్ని లక్షల చేతుల్లో 

పరాజిత అయ్యిందో ఆ లెక్కలు చూద్దాం

మన కలాల్ని కరవాలాలుగా మార్చి

కవి సిపాయిలుగా మారుదాం

నిరస్త్రంగా-క్షతగాత్రులుగా మిగలకుండా

రథ, గజ, తురగ పరివారాలతో పని లేకుండా

ధైర్యం, సంకల్పం, జీవనేచ్ఛలే సైన్యంగా

ప్రతియుద్ధం ప్రకటిద్దాం

దేహ దేశంలో జరిగే అంతర్యుద్ధం ఇది..

ఆత్మస్థెర్యంతో ఎదిరిద్దాం

కవిత్వపు చికిత్సతో మానసిక సన్నద్ధతను అందిద్దాం

ఎన్నో యుద్ధాలను చూశాం.. కానీ ఇది ఎంతో 

ప్రత్యేకం

గుంపుగా గుంపుతో గుమిగూడి చేసేది కాదు

విడివిడిగా ఒక్కొక్కరిగా సామూహిక

పోరాటం చేయాలి

ఈ యుద్ధంలో ఒక్కొక్కరు ఒక్కో ఒంటరి

సైనికుడు కాదా

ఏకాకి మానవుడి చుట్టూ అక్షరాల

రక్షణ వలయం అల్లుదాం రండి

కబళించాలని చూసే కరోనాను

మట్టుబెట్టే చైతన్యాన్ని నింపుదాం

విమానాలలో దిగుమతవుతున్న మహమ్మారికి

ఐసోలేషన్ వ్యూహంతో.. సమస్తే మంత్రంతో.. 

రిటర్న్ గిప్ట్ ఇద్దాం రండి..!💐💐💐

తిరుమలలో శ్రీ శ్రీనివాస శాంత్యోత్సవ సహిత ధన్వంతరి మహాయాగం


          తిరుమ‌ల‌లోని ధ‌ర్మ‌గిరి వేదవిజ్ఞానపీఠంలో గురువారం శ్రీ శ్రీనివాస శాంత్యోత్సవ సహిత ధన్వంతరి మహాయాగం ప్రారంభమైంది.  విశ్వ‌మాన‌వ శ్రేయ‌స్సును ఆకాంక్షిస్తూ, శ్రీ‌వారి ఆశీస్సులు కోరుతూ కరోనా కోవిడ్-19 వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు మూడు రోజుల పాటు ఈ యాగం నిర్వహిస్తారు.
         ఈ సందర్భంగా టిటిడి వైఖానస ఆగమ సలహాదారు శ్రీ మోహనరంగాచార్యులు మాట్లాడుతూ ఈ యాగంలో ప్రధానంగా ఆరోగ్య ప్రదాత అయిన శ్రీ ధన్వంతరి స్వామిని ఆవాహన చేసి హోమాలు నిర్వహిస్తారని తెలిపారు. వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం శ్రీనివాసునికి నిత్యోత్సవాలు, శ్రద్ధోత్సవాలు, శాంతి ఉత్సవాలు నిర్వహిస్తారని చెప్పారు. భయంగానీ, ఉపద్రవాలు గానీ, ప్రకృతి వైపరీత్యాలు గానీ, మహావ్యాధులు గానీ ప్రబలినప్పుడు శ్రీవారికి శాంతి ఉత్సవాలు చేపడతారని వివరించారు.
          గురువారం ఉదయం అకల్మష హోమంతో యాగం ప్రారంభమైంది. రాత్రి శ్రీ శ్రీనివాసమూర్తిని, శ్రీ ధన్వంతరిమూర్తిని కుంభంలోకి ఆవాహన చేస్తారు. మార్చి 27, 28వ తేదీల్లో విశేష హోమాలు నిర్వహిస్తారు. మార్చి 28న విశేషహోమం అనంతరం మహాపూర్ణాహుతి నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కుంభ జలాన్ని జలాశయంలో కలుపుతారు. ఈ శక్తి సూర్యరశ్మి ద్వారా వాతావరణంలో కలిసి మేఘాల ద్వారా వాయు రూపంలో అనారోగ్య కారకాలను నశింపజేస్తుంది.
          ఈ యాగం కోసం శ్రీనివాసమూర్తికి 5, శ్రీ ధన్వంతరిమూర్తికి 1, ప్రాయశ్చిత్త హోమానికి 1 కలిపి మొత్తం 7 హోమ గుండాలను ఏర్పాటు చేశారు. 11 మంది రుత్వికులు పాల్గొన్నారు. ఈ యాగంలో నాలుగు వేదాల్లోని సూర్య జపానికి, అష్టదిక్పాలకులకు సంబంధించిన వేదమంత్రాలను రుత్వికులు పారాయణం చేస్తున్నారు.

కరోనా పై ఇంటర్లో పాఠ్యంశం.. మరికొన్ని పుస్తకాల్లోనూ చైనా బయో ఉన్మాదం కధలు...

ఇంటర్మీడియట్ పుస్తకంలో ఇప్పటికే కరోనా వైరస్ గురించి చెప్పబడింది.
చికిత్స కూడా ఉంది.
కొన్నిసార్లు పెద్దపుస్తకాలు పుంజుకోవడంతో వైద్యులు మరియు శాస్త్రవేత్తలు చిన్న స్థాయి పుస్తకాలపై శ్రద్ధ చూపడం లేదేమో..!?? 
(పుస్తకం:జంతు శాస్త్రం(Zoology)
(రచయిత:డాక్టర్ రమేష్ గుప్తా)
(పేజీ నంబర్:1072)
అందుకే ఈ విషయం మరుగున పడింది.
పలు ఆంగ్ల నవలల్లో కరోనా పై కధలు..
చైనా బయో వైరస్లపై హెచ్ఛరికలతో పలు కధలు..నవలలు వౄలువడ్డాయి..అప్పట్లో వాటిని కధలుగా అనుకున్నప్పటికీ ప్రస్తుత ఆందోళన కర పరిస్థితి లో ఆ పుస్తకాలపై చర్చలు సాగిస్తున్నారు.

భయం వద్దు..అప్రమత్తంగా వుందాం.. సుదర్శన్ పట్నాయక్ శైకత సందేశం....

ఒడిశా : పద్మశ్రీ సుదర్శన పట్నాయక్ కరోనా పై పోరాటంలో తన వంతు భాగస్వామ్యంగా పూరి సముద్ర తీరంలో సైకత శిల్పాలను తీర్చిదిద్ది ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు..విపత్తు సమయంలో భయబ్రాంతులకు గురిచేయడం కాదు..ప్రజలను చైతన్య పరచడం ప్రస్తుత కర్తవ్యం అంటుున్న పట్నాయక్ ప్రయత్నం అందరి మన్ననలు అందుకుంటోంది..ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం అభినంధించింది.

భారతదేశాన్ని ప్రపంచం అనుసరించేలా చేద్దాం..
భారతదేశాన్ని ప్రపంచం అనుసరించేలా చేద్దాం..

Wednesday, 25 March 2020

ఆయోధ్యలో ప్రత్యేక పూజలు నిర్వహించిన యోగీ

తెలుగు ఉగాది తో పాటు మరికొన్ని రాష్ట్రాలు నూతన వత్సరం జరుపుతున్నారు... ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యానాధ్ ఆయోధ్యలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.. విశ్వశాంతి హోమం..కూడా చేశారు.. ఈ సందర్భంగా ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.అయోధ్య మందిర నిర్మాణం కోసం 11లక్షల రూపాయల చెక్కును అందజేశారు..
సందేశం తెలుగు తర్జుమా..
కొత్త సంవత్సరం విక్రమ్ సంవత్ -2077 అందరికీ హృదయపూర్వక అభినందనలు.

ఈ రోజు మనం కరోనా వైరస్ రూపంలో ప్రపంచ మహమ్మారిని ఎదుర్కొంటున్నాము.

ఇంత సవాలుగా ఉన్న ఈ కొత్త సంవత్సరం మనకు సంఘీభావం మరియు సోదరభావం యొక్క సందేశాన్ని ఇవ్వబోతోంది.

అంందరంకలిసి ఈ సమస్యను పరిష్కరించడానికి మనం నిశ్చయించుకోవాలి.

Monday, 23 March 2020

కలేక్టర్ గారు.. సామాజిక బాధ్యత మరిచిన పౌరులకు చుక్కలు చూపిన కృష్ణ భాస్కర్, ఐ.ఏ.ఎస్.

సిరిసిల్ల :  బాధ్యత మరిచి రాకపోకలు సాగిస్తున్న ప్రజల పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు మీ తప్పిదం వల్ల ఇతరులూ నష్టపోతారని వాహనదారులకు క్లాస్ తీసుకున్నారు. దీంతో వాహనదారులు కొందరు తప్పైందంటూ ఇంటి దారి పట్టారు. 
ఆదివారం జనతా కర్ఫ్యూ సందర్భంగా సిరిసిల్ల పట్టణంలో  ప్రజలు ఇంటి నుంచి బయటకు రానప్పటికీ సోమవారం రోడ్ల పై జన సంచారం ఎక్కువ కనిపించింది. 
ఒకరికి మించి జనాలు బైకులు ,కార్లలో వెళ్లడం రోడ్లపై జనాలు గుమిగూడి ఉండటం ను స్వయంగా చూసిన  కలెక్టర్ వెంటనే స్పందించారు.
కలెక్టరేట్ ముందు గల ప్రధాన రహదారి వెంబడి కలెక్టర్ స్వయంగా తిరుగుతూ వాహనాలను నిలుపుదల చేశారు.
కరోనా ఉధృతిని దానివల్ల కలిగే ప్రాణనష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ తెలంగాణ రాష్ట్రం మొత్తం లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ.... స్వేచ్ఛగా బాధ్యత లేకుండా ప్రజలు రోడ్లపైకి రావడం ఎంటనీ కలెక్టర్ ప్రశ్నించారు..

ప్రభుత్వం కరోనా మహమ్మారిపై సమరభేరి మోగించి ఉంటే మీరు మీ పార్టీకి ఇష్టారీతిన వ్యవహరిస్తారా ఇలాగైతే కరోనా వైరస్ కట్టడి ఎలా సాధ్యమవుతుంది అని కలెక్టర్ ప్రశ్నించారు. మీ లాంటి వ్యక్తుల వల్లే ఇటలీలో వేలాది ప్రాణాలు పోయాయని కలెక్టర్ తెలిపారు. ఇలాగే నిర్లక్ష్యం చేస్తే జిల్లా జిల్లాలో ప్రజలు ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు. అస్తవ్యస్త పరిస్థితులు తలెత్తుతాయి అన్నారు. శాంతిభద్రతలు ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు.

నిర్లక్ష్యం వల్ల మీ ప్రాణాలు పోవడమే కాకుండా జిల్లా మొత్తం ప్రమాదంలో పడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఇక నుంచైనా బాధ్యతగా వ్యవహరించి కరోనా కట్టడికి ప్రభుత్వానికి ,జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ హితోపదేశం చేశారు.
నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు మొదటి తప్పుగా భావించి ఇంతటితో వదిలేస్తున్నామని... ఇలాంటి తప్పులు మునుముందు పునరావృతమైతే అరెస్టు చేస్తామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.
కరోనా దృష్ట్యా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు .నిరంతరం గస్తీ కాస్తూ రోడ్లపై ఇష్టారీతిన వాహనాలు వెళ్లకుండా చూడాలన్నారు. ఒకే చోట సమూహంగా ఉండకుండా చూడాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అనంతరం కలెక్టర్ సిరిసిల్ల పట్టణంలోని గాంధీ కూడలి కూడలి కి వెళ్లారు . అప్పటికే అధికారులు ఇష్టారీతిన రాకపోకలు సాగిస్తు న్న వాహనాలను నిలిపివేశారు. వారి వద్దకు కలెక్టర్ స్వయంగా వెళ్లి కరోనా వైరస్ వలన కలిగే ప్రమాదం , ప్రభుత్వ ఆదేశాలను వారికి వివరించారు. ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఒక్కరి వల్ల వైరస్ అరికట్టడం సాధ్యం కాదని అందరూ చొప్పున సహకారం అందిస్తేనే కరోనా వైరస్ రాష్ట్రం నుంచి తరిమి కొట్టవచ్చునని కలెక్టర్ తెలిపారు.

ప్రైవేట్ కార్యాలయాలు, సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులు తన ఆఫీసులో కే పరిమితం కావాలని రోడ్లపైకి వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ప్రభుత్వానికి. ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 

మున్సిపల్ అధికారులు డెమాని స్ట్రేషన్ ద్వారా కరోనా వైరస్ పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

కార్యక్రమంలో కలెక్టర్ వెంట జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ అంజయ్య కలెక్టరేట్ అధికారులు సిబ్బంది ఉన్నారు.

అధికారులతో వాగ్వివాదం.. వ్యక్తి అరెస్ట్
సిరిసిల్ల పట్టణంలోని గాంధీ కూడలి ప్రధాన రోడ్డు మార్గంలో.
రోడ్లపై ఒకరికి మించి వాహనాలు కార్లో వెళుతున్న వ్యక్తులకు జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ రోడ్లపైనే కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రభుత్వం ప్రకటించినందున ప్రజలు రోడ్లపైకి రావద్దని కూడా వద్దని కోరారు.
ఈ క్రమంలో తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి గ్రామానికి చెందిన గుగ్గిళ్ళ శ్రీకాంత్ జిల్లా కలెక్టర్ పోలీస్ అధికారులతో వాగ్వాదానికి దిగారు.
ప్రజా శ్రేయస్సు కాంక్షించి ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా వైరస్ కట్టడికి జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ తెలిపారు. అయినప్పటికీ శ్రీకాంత్ జిల్లా కలెక్టర్, పోలీస్ అధికారులతో వాగ్వాదాన్ని కొనసాగించారు.
సదరు వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ తరలించారు.
News Source:- DPRO Dasharatham Mamindla , Rajanna Sirisilla District...
Lead & Edited .. Changes  @ Manikumar.

Saturday, 21 March 2020

పరమాత్మునికే తప్పని.14 రోజుల గృహ బంధనం.. పూరిలో ప్రచారం లో వున్న జగన్నాధుని జ్వరం కధ..

 .  భూమిపై పుట్టిన వారికి జరామరణాలు అనివార్యం... 
పుట్టిన వారికి మరణం తప్పదు. సుఖదుఃఖాలు, వ్యాధులు అనివార్యం. తాను కూడా వాటికి అతీతుణ్ణి కానని చాటిచెబుతు 14 రోజులు వెలుతురు తక్కువగా వుండే మందిరంలో విశ్రాంతి తీసుకుంటూ సర్వాంతర్యామి పూరి జగన్నాథుడు  వైధ్యం చేయించుకున్నట్లు పూరణ కధ. దీనిని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఓడిశాలోని  పూరిలో ఓ వేడుక రూపంలో నిర్వహిస్తారు.
జ్వరం పేరిట 14 రోజులు చీకటి మందిరంలో గోప్య చికిత్స, సేవలు నిర్వహిస్తారు. తర్వాత నవయవ్వన రూపంతో భక్తులకు కనులపండువ చేసి పెంచిన తల్లి సన్నిధి(గుండిచా మందిరం)కి రథాలపై చేరుకుంటారు. ఇందులో భాగంగా నిర్వహించే  కార్యక్రమాలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గోంటారు..
దీనికి సంబంధించిన ఓ వృత్తాంతం గమనంలో వుంది
 ఇహ ఆలయంలో జరిగే వేడుక గురించి తెలుసుకుందాం.
చీకటి మందిరంలో చికిత్స వేడుకను పూరిలో జగన్నాథ ఆలయంలో
ఏటా జ్యేష్ఠ పూర్ణిమ పర్వదినాన జరుగుతుంది. ఈ వేడుకలో చతుర్థామూర్తులు జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనులు) 108 కలశాల పవిత్ర జలాలతో స్నానమాచరిస్తారు. దీన్నే దేవ స్నాన యాత్రగా పేర్కొంటారు. స్నాన పూర్ణిమ అని కూడా పిలుస్తారు. పూరి మందిరంలో స్నానమండపంలో ఈ పవిత్ర కార్యాన్ని నిర్వహించారని. జల క్రీడలాడిన పురుషోత్తముడు జ్వరానికి గురై, అదేరోజు రాత్రి చీకటి మందిరానికి చేరుకోగా అక్కడ పక్షం రోజులు స్వామి వారికి గోప్య చికిత్సలు నిర్వహిస్తారు.. గోప్య సేవల నేపధ్యంలో 14 రోజుల పాటు భక్తులకు దర్శనభాగ్యం ఉండదు. అస్వస్థతకు లోనైన చతుర్థా మూర్తులకు దైతాపతి సేవాయత్‌లు సేవలు చేస్తారు. వారికి పలియా సేవాయత్‌లు సహకరిస్తారు. ఈ గదిలోకి ఇతరులెవరికీ ప్రవేశం ఉండదు. స్వామికిక్కడ ఆయుర్వేద పద్ధతిలో చికిత్స జరుగుతుంది. కరక్కాయ, జాజి, తాడి, గుగ్గిలం, కర్పూరం, చెట్ల బెరళ్లు, ఆకు పసర్లతో తయారు చేసిన ఔషధాలను చికిత్సలో వాడతారు. నువ్వుల నూనెలో పరిమళభరిత పుష్పాలు, ఇతర సుగంధ ద్రవ్యాలు మిళితం చేసి మట్టి కుండల్లో ఏడాది పాటు మట్టిలో పాతిపెట్టి ఉంచుతారు. చీకటి గది సేవల సమయంలో ఈ కుండలు వెలుపలకు తీసి శుద్ధి చేసి స్వామికి లేపనంగా వినియోగిస్తారు. దీన్ని పుల్లెరి తెల్లో అంటారు. గోప్య సేవల్లో 11వ రోజు రాజవైద్యుని సూచనల మేరకు దశమూలికా గుళికలు పురుషోత్తమునికి అర్పిస్తారు. దీంతో స్వామి కోలుకుంటారు. పథ్యంలో భాగంగా ఈ పద్నాలుగు రోజులూ పళ్లు, ఖర్జూరం, తేనె, జున్ను, పంచామృతం నైవేద్యంగా పెడతారు.  
ఆరోగ్యవంతుడైన స్వామి ఆషాఢ శుద్ధ పాఢ్యమి నాడు భక్తులకు దర్శనమిస్తాడు. . పద్నాలుగు రోజులూ అస్వస్థతతో కళ్లు తెరవని స్వామి ఆరోగ్యవంతుడై, ఆసనాన్ని అధిరోహించి భక్తులను పెద్ద కళ్లతో వీక్షిస్తారు. అందుకే దీన్ని నేత్రోత్సవం అని పిలుస్తారు. మనవునిగా పుట్టినందుకు దైవం కాల ధర్మం ఆచారించారు..మనం అతీతులం కాదని గమనించాలి..

Friday, 20 March 2020

ప్రధాని మోదీ ఆదివారం ఘంటారావం లాంటి శభ్ధాలు ఎందుకు చేయమన్నారంటే

ఆలయాలలో గంటలు మోగిస్తే వైరస్ రాలి పోతుందనేది  సైన్సు చెప్పిన సత్యం. దీనినే పెద్దలు ఆచరింపజేశారు..
ఈ ఆదివారం అత్యవసర సేవలు చేసే ..పోలీసు, వైధ్య ఆరోగ్య, పరిశుధ్య కార్మికులు తదితరులకు కృతజ్ఞతతో ఘంటారావం లేదా పళ్లాలతో శబ్ధాలు చేద్దామంటూ భారత ప్రధానీ మోదీ పిలుపు ఇచ్చారు.. ఒక రకంగా ఈ ప్రక్రియ వైరస్ ను పారద్రోలేందుకు కూడా ఉపయోగపడుతుంది.. అందుకే ప్రధాని ఇలా సూచించారనుకోవచ్ఛు..
 @ మణికుమార్ కొమ్మమూరు.

"Finally" Justice to Nirbhaya

#Nirbhayaconvicts hanged! Justice prevails. Rest in peace #Nirbhaya. And thanks to Seema Kushwaha - the advocate of #Nirbhayacase who fought for it relentlessly!. 8 long years, 4 rapists hanged to death in Delhi's Tihar Jail. Advocate Seema Kushwaha, for her relentless efforts in finally sending the culprits to the gallows.

Wednesday, 18 March 2020

విజయ డైరీ సిబ్బందికి కరోనాపై అవగాహన...

తెలంగాణ పాల ఉత్పత్తుల సంస్థ విజయ డెయిరీ తమ సంస్థ లో కరోనా వ్యాప్తి నిర్ములనకు  తగు జాగ్రత్తలు పాటించాలని సిబ్బందిని కోరింది. ఈ మేరకు మంగళవారం  కార్మికులకు, ఉద్యోగులకు‌ కరోనా గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో కరోనా రాకుండా తీసుకోవలసిన ముందస్తు చర్యలను వివరించారు,సిబ్బందికి దర్మల్ స్ర్కీనింగ్ చేయిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యప్తంగా పలు ప్రాంతాల్లో సంస్థ యూనిట్లు పాలు - పాల పదార్థాలు ప్యాకింగ్ ఉత్పత్తి ప్రక్రియ నడుస్తోంది. ఈ అవగాహన కార్యక్రమం సిబ్బందికి ముందు జాగ్రత్తగా వుండేందుకు ఉపయోగపడుతుందని సమావేశం అభిప్రాయం పడింది.. ఈ‌సదస్సులో మేనేజింగ్ డైరెక్టర్  జి. శ్రీనివాసరావు,   డాక్టర్, వెల్ఫేర్ ఆఫీసర్, డి జియమ్ మరియు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ బతుకమ్మకు మంత్రి దండం దక్కేనా...

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన శ్రీమతి కల్వకుంట్ల కవిత బుధవారం నిజమాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి కి తన నామినేషన్ పత్రలు సమర్పించారు.. అంతకు ముందు కవిత ఇంటి వద్ద పండితులు వేద ఆశీస్సులు అందజేశారు. కొలహలంగా తెరాస అభిమానులు, కార్యకర్తలతో వెంటరాగా కవిత నామినేషన్ వేశారు.. ఈ సందర్భంగా పలువురు ఆమేను అభినంధనలు అందజేశారు.. ఇహ కల్వకుంట్ల కవిత ఎంఎల్.సి ఎన్నిక నామ మాత్రమే. మరీ తెలంగాణ బతుకమ్మ కు బ్రాండ్ అంబాసిడర్, కల్వకుంట్ల వారి ఆడపడుచు కవితను మంత్రి పదవీ వరించేనా..ఇప్పటికే ఇంట్లో ఇద్దరు మంత్రులు వున్నారు అయినప్పటికీ ముఖ్యమంత్రి కెసిఆర్ కవిత ను మంత్రి పీఠంపై కూర్చబెడతారా అనేది సందేహంగా మిగులుతోంది..తెలంగాణ ఆవిర్భావం అనంతరం తొలిసారి  కుమార్తె కవితను.. ముఖ్యమంత్రి కెసిఆర్ పార్లమెంట్ కు పంపారు..సమీకరణలు కలసి వస్తే కేంద్ర మంత్రి గా కుమార్తె ను చూడొచ్ఛనేది కెసిఆర్ వ్యూహం గా అప్పట్లో పలువురు పెర్కోన్నారు..అయితే అయితే 2014 ఎన్నికల్లో బజాపా కు స్వంతంగా మెజార్టీ రావడంతో  కవితకు అవకాశం రాలేదు..అప్పటికి కెసిఆర్ మోడీతో పలుమార్లు సంప్రదింపులు చేశారని మోడీ ఎటువంటి హామీలు ఇవ్వకపోవడంతో కుమార్తె ను కేంద్ర మంత్రి గా చూడాలనే ఆశను వదిలేసుకున్నట్లు అప్పట్లో తెరాస వర్గాలు చర్చల్లో మాటలుగా వుండేవని వెల్లడి..కాగా రెండో సారీ ఎంపిగా పోటీ చేసిన కవిత ఓటమి పాలవడంతో పాటు బజాపా కేంద్ర ంంలో మరింత మేరుగైన ఫలితం సాధించడంతో..ఇతర పార్టీలకు కేంద్ర క్యాబినెట్ లో పాగా వేసే వెసులుబాటు దక్కలేదు... దీంతో కవితకు రాజ్యసభ ఇచ్ఛిన మంత్రి అయ్యే ఛాన్సు లేకపోవడంతో.. గులాబీ బాస్ కుమార్తె ను ఎం.ఎల్ సిగా చేస్తున్నారని తద్వారా తెలంగాణ లో ప్రముఖ్యత కలిగిన మంత్రి పదవి ఇవ్వబోతున్నారని తెరాస వర్గాల గుసగుసలు.. కొద్ది రోజుల్లో తెలంగాణ క్యాబినెట్ విస్తరణ జరిగే అవకాశాలు వున్నట్లు ప్రగతి భవన్ వర్గాల బోగట్టా.. మరి వేచి చూద్దాం.. కల్వకుంట్ల వారి ఆడపడుచుకు మంత్రి దండం చిక్కుతుందేమో....


Tuesday, 17 March 2020

కొద్దీ మందితోనే భధ్రాధ్రి రాముని కళ్యాణం... ఒంటిమిట్ట లోనూ ఇదే నిర్ణయం....



భద్రాచలం: భద్రాద్రి సీతారాముల కల్యాణానికి దేశ వ్యాప్తంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతుంటారు. ముందుగానే కల్యాణం టికెట్లు బుకింగ్జరుగుతుంటుంది. రామయ్య కల్యాణాన్ని ఎన్నో ఏళ్లుగా ఆరుబయట.. ప్రతి ఒక్కరూ తిలకించేలా నిర్వహిస్తున్నారు.
కానీ ఈసారి రామయ్య కల్యాణాన్ని నేరుగా చూసే అవకాశం ఎక్కువ మందికి దక్కే అవకాశం కనిపించడం లేదు..
 కరోనా కారణంగా దేవాలయం సిబ్బంది కొద్దిమందితో కళ్యాణం జరిపించనున్నట్లు ఖమ్మం ఎం.ఎల్.ఏ , రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ స్పష్టంచేశారు. కరోనా వైరస్ వ్యాప్తి
రాష్ట్రంలో రోజు రోజుకూ ఎక్కువవుతున్న కారణంగా స్వామివారి
కల్యాణానికి ఎవరినీ అనుమతించట్లేదని.. కాబట్టి భక్తులెవరూ స్వామివారి
కల్యాణానికి రావొద్దని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భక్తులకు విజ్ఞప్తి చేశారు.
కేవలం అర్చకులు మాత్రమే శాస్తోక్తంగా కల్యాణ క్రతువును
నిర్వహించనున్నారు.
రామయ్య కల్యాణం భాధ్యతలను ఈసారి ప్రభుత్వ
సలహాదారు రమణాచారికి అప్పగించారు. సీఎం కేసీఆర్ సాంప్రదాయంగా
ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వం భద్రాద్రి రాముని కళ్యాణానికి తీసుకుని వచ్చే
పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు ఎవరు తీసుకుని వస్తారనే దానిపై
ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కల్యాణం టిక్కెట్ల అమ్మకాలను పూర్తిగా నిలిపివేశారు.  కొన్నవారికి డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించారు.
కాగ ఆంధ్రప్రదేశ్ లోని ప్రఖ్యాత శ్రీరామ క్షేత్రం కడపజిల్లా, ఒంటిమిట్ట లోనూ ఇదే తరహాలో కళ్యాణం నిర్వహించనున్నట్లు గతవారం ఎ.పి.సర్కార్ వెల్లడించింది....

Monday, 16 March 2020

వైరస్ పై 2011లో రెండు సినిమాలు.. చైనా నుండి వచ్ఛిన వైరస్సే ప్రధాన అంశం...

2011 లో విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందిన రెండు చిత్రాలు ప్రస్తుత కరోనా వైరస్ పై ఇంచుమించు కళ్లకు కట్టాయి... అందులో ఒకటి సౌత్ ఇండియన్ బాషాల్లో విడుదలైన 7th సెన్సు కాగా రెండవది హలివుడ్ లో తయారై అదే యాడాది విడుదలైన చిత్రం కాంటాజీయన్ తెలుగు లో  "అంటువ్యాధి" రెండు చిత్రాల నేపథ్యం వైరస్ కావడం యాధృఛ్ఛికమైనప్పటికి ప్రస్తుతం ఈ చిత్రాల గురించిన కధనంపై చర్చలు సాగుతున్నాయి.    కాగా రెండు చిత్రాల్లోనూ వైరస్ నేపథ్యం చైనా నుండే కావటం విశేషం. మురుగదాస్  దర్మకత్వంలో వచ్ఛిన  సెవంత్ సెన్సు తమిళ - తెలుగు భాషల్లో 2011సంవత్సరంలో  విడుదలై సంచలన విజయం సాధించింది..భారతదేశంలో వైరస్ వ్యాప్తి ద్వారా మరణహోమం సృష్టించి దేశాన్ని అతలకుతలం చేయడం..అనంతరం తమ కంపెనీ మందులతో వ్యాధి ని నయం చేసి కోట్లాది రూపాయలు దండుకోవాలన్న ఆశతో ఓ బయో మెడికల్ కంపెనీ వేసిన ఎత్తుగడ కధాంశంతో సాగే సినిమా చైనా నుండి డొంగ్లీ అనే విలన్ పాత్ర ఇండియాలో ప్రవేశించంతో రకరకాల మలుపు తిరిగి ముగుస్తుంది..ఇందులో హిరో సూర్య..హిరోయిన్ శ్రుతి హాసన్  తమ పాత్రలతో కధను రక్తి కట్టిస్తారు.
 ఇహా అమెరికన్ చిత్రం "కరోనావైరస్" పోలిన  వైరస్ గురించి మాట్లాడుతుంది, ఇది చైనా నుండి ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించడం ప్రారంభిస్తుంది! విచిత్రమైన విషయం ఏమిటంటే, సినిమా చివరలో ఇది సంక్రమణకు కారణం బ్యాట్ అని తేలుతుంది, ఇది ప్రస్తుతం వ్యాధి వ్యాప్తి చెందడానికి అదే కారణం!  చిత్రం పేరు తెలుగు లో  "అంటువ్యాధి వార్నర్ బ్రదర్స్ బ్యానర్ లో నిర్మాణం అయిన కాంటజీయన్ అంగ్ల చిత్రంలో మాట్ డామన్, జూడ్ లా, గ్వినేత్ పాల్ట్రో & కేట్ విన్స్లెట్ నటించారు.

Sunday, 15 March 2020

ఇటలీలోని భారతీయ ఎంబసీలో కోవిడ్ పరీక్షలు

ఇటలీలోని భారతీయ ఎంబసీలో విధ్యార్థులకు..వీదేశీ భారతీయులకు ఈ ఉదయం  కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో అక్కడి భారతీయ విద్యార్థులు తమ వంతు సహకారం అందజేస్తున్నారు... చైనా తరువాత ఇటలీలో నే కోవిడ్ మృతుల సంఖ్య ఎక్కువగా వున్నట్లు గణాంకాలు చెబుతున్నాయీ..1441 కరోనా తో మృతి చెందినట్లు శనివారం ఇటలీ వెల్లడించింది. ఇప్పటికే ఇటలీ ప్రభుత్వం షట్ డౌన్ ప్రకటించింది.
కాగా భారతదేశం లోనూ ఇటలీ నుండి వచ్ఛిన కొందరు కరోనా బారిన పడ్డారు..ఇటలీలో షట్ డౌన్ కొంత ఇబ్బంది కరంగా వున్నప్పటికీ సూపర్ మార్కెట్ లు కొన్ని తీసివుండటం కాస్తా ఊరట నిస్తోందని అక్కడ ఎం.ఎస్.సి..కంప్యూటర్సు చదువుకుంటున్న కేరళ -వైఖ్యం కు చెందిన అఖిల దేవసీయా వెల్లడించింది...

ఇటలీలోని భారతీయ విదేశీ వ్యవహారాల కార్యాలయం నెంబర్ :+39 06 488 4642

Saturday, 14 March 2020

కరోనా ప్రభలకుండా తగు చర్యలు : కె.సి.ఆర్.

తెలంగాణముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సీఎం  కె. చంద్రశేఖర్ రావు మీడియా సమావేశంలో వెల్లడించారు.కరోనా వైరస్ ప్రబలకుండా ఉండేందుకు ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలను ముఖ్యమంత్రి  కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో ఈ నెల 31 వరకు అన్ని రకాల విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు, సమ్మర్ క్యాంపులను మూసివేస్తున్నట్లు సీఎం తెలిపారు.బోర్డు పరీక్షలు యథాతథంగా జరుగుతాయి. పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు హాస్టల్ వసతి కొనసాగుతుంది. ఆర్టీసీ బస్సులు, మెట్రో రైలు యధాతథంగా నడుస్తాయి. వాటిని పరిశుభ్రంగా ఉంచేలా నిరంతరం చర్యలు తీసుకోవడం జరుగుతుందని సీఎం చెప్పారు.మార్చ్ 31 వరకు జనసమ్మర్థం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నియంత్రణ ఉంటుందని తెలిపిన సీఎం, ఇప్పటికే నిర్ణయమైన పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లు కుటుంబ సభ్యల మధ్యే జరుపుకోవాలని సూచించారు. మార్చి 31 వరకు తదుపరి తేదీలకై మ్యారేజ్ హాల్స్ బుకింగ్స్ ఉండవని చెప్పారు.వచ్చే వారం రోజుల పాటు బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు, సెమినార్లు, ఉత్సవాలు, ఎగ్జిబిషన్స్, సాంస్కృతిక కార్యక్రమాలు అనుమతింపబడవు. జూ పార్కులు, అమ్యూజ్మెంట్ పార్కులు, మ్యుజియమ్స్, సినిమా హాళ్లు, బార్లు, పబ్బులు, క్రీడా ప్రాంగణాలు, స్విమ్మింగ్ పూల్స్, జిమ్ లు మూసివేయబడతాయని ముఖ్యమంత్రి తెలిపారు.

పుట్టుకతోనే కరోనా సోకిన శిశువు..

లండన్ హాస్పటల్లో కరోనా లక్షణాలతో జన్మించిన శిశువు...లండన్ లోని ఓ యూనివర్సిటీ వైధ్యశాలలో పుట్టిన శిశువు కు కరోన వ్యాధి లక్షణాలు గుర్తించారు. నెలలు నిండిని ఓ గర్భిణీ సదరు ఆస్పత్రిలో కాన్పు కోసం చేరింది.. అనంతరం ఓ మగ శిశువుకు జన్మనిచ్చింది.. జలుబు లక్షణాలు వున్న తల్లి బిడ్డల నమునాలను పరీక్షలు నిర్వహించగా..కొవిడ్ - పాజిటివ్ నమోదు కావడంతో ఇరువురిని ఐసోలేషన్కి తరలించారు..ప్రస్తుుతం నమోోదైన కరోనా కేసుల్లోఅత్యంంంతత పిన్న వయసుులో కరోన.

Thursday, 12 March 2020

ట్రెండ్‌ సెట్టర్‌'@ వైయస్‌ జగన్‌ -శైలజ చరణ్ రెడ్డి*

'
ట్రెండ్ ను ఫాలో అవడం చంద్రబాబునాయుడు వంతైతే  ట్రెండ్ను  సెట్ చేయడం జగన్మోహన్ రెడ్డి  వల్లనే అవుతుందని వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి రీజనల్ కోఆర్డినేటర్, పూతలపట్టు నియోజకవర్గ ఎలక్షన్ అబ్జర్వర్ శైలజ చరణ్ రెడ్డి తెలిపారు.
ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవుతున్నారు అని ఆమె గర్వంగా తెలియజేశారు పది సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డితో ప్రయాణం చాలా ఆనందంగా ఉందని ఇలాంటి నాయకుడిని నాయకత్వంలో పని చేసినందుకు గర్వపడుతున్నానని ఆమె తెలియజేశారు
వివరాల్లోకి వెళితే
-  'ఇంగ్లిష్‌ మీడియం' ఐడియాను ఫాలో అవుతున్న కేసీఆర్‌  
- అధికార వికేంద్రీకరణను కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప
- దిశ చట్టాన్ని అమలు చేయాలని మహారాష్ట్ర సీఎం నిర్ణయం 
 ఆంధ్రప్రదేశ్‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ట్రెండ్‌ సెట్టర్‌ అయ్యారు. అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే విప్లవాత్మక నిర్ణయాలు, చారిత్రాత్మక చట్టాలు చేస్తూ దేశానికే దిక్సూచిగా మారారు. వైయస్‌ జగన్‌ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భవించి నేటితో తొమ్మిదేళ్లు పూర్తయి, పదో వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ను ఉద్దేశించి వైయస్‌ఆర్‌సీపీ  అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో పలు అంశాలను వివరించింది. ఏపీలో వైయస్‌ జగన్‌ సుపరిపాలన అందిస్తున్నారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనుసరిస్తున్నారు. దేశ రాజకీయాల్లో ఆయనో ట్రెండ్‌ సెట్టర్‌ అయ్యారు అని ఆమె తెలిపారు.
సీఎం వైయస్‌ జగన్‌ ఏపీలోని ప్రభుత్వ బడుల్లో తీసుకొచ్చిన 'ఇంగ్లిష్‌ మీడియం'ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాలో అవ్వాలనుకుంటున్నారు. అధికార వికేంద్రీకరణను కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప అనుసరించాలనుకుంటున్నారు. దిశ చట్టం గురించి తెలపమని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ కోరారు.  దిశ   చట్టాన్ని అమలు చేయాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాకరే నిర్ణయం తీసుకున్నారు. వికేంద్రీకరణ కోసం 3 రాజధానుల ఏర్పాటు కోసం ఉత్తరాఖండ్‌ సీఎం త్రివేంద్ర సింగ్‌ , జార్ఖండ్ సీఎం హేమంత్‌ సొరేన్‌ ఆలోచిస్తున్నారు  అని  ట్రెండ్‌ సెట్ చేయడం అంటే ఇలానే ఉంటుందని అని ఆమె  హర్షాన్ని వ్యక్తం చేశారు

Wednesday, 11 March 2020

"సంజయ్"కి తెలంగాణ బజాపా రధం..

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా సంజయ్‌ నియమితులైయ్యారు. ఈ మేరకు బీజేపీ జాతీయ కేంద్ర నాయకత్వం బుధవారం అధికారిక ప్రకటన చేసింది. సంజయ్‌ నియామకం తక్షణమే అమల్లోకి రానుందని పేర్కొంది. కాగా కేవలం ఒక్కసారి ఎంపీగా గెలుపొందగానే రాష్ట్ర చీఫ్‌గా అవకాశం రావడం విశేషం. తొలుత కిషన్ రెడ్డి కి తెలంగాణ పార్టీ బాధ్యతలు ఒప్పగిస్తారని పలువురు భావించారు. అయితే ఇటీవల కరీంనగర్ లో జరిగిన పరిణామాల నేపథ్యంలో బండి సంజయ్ కి  పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఆధిష్టానం బాధ్యతలు ఒప్పగించింది

Journalism Fellow Ship in US

.

The Maynard Institute, in partnership with Northwestern University Medill School of Journalism, are organizing the Maynard 200 Journalism Fellowship.
The program will offer training in three tracks: storytelling, advanced leadership and media entrepreneurship.
Participants will attend workshops June 28 to July 2 and Nov. 30 to Dec. 4 at the Northwestern Medill campus  San Francisco, followed by yearlong mentorship and supplementary courses. 
While the majority of the slots are intended for candidates from the Bay area, selected candidates from out of town will receive flights and lodging.  Both national and local participants will receive a small stipend.

The deadline is March 30.

For Details : 
E - Mail.
mreynolds@mije.org
Phone : 
+1 510-390-1779

About : Medill alumni represent the highest levels of accomplishment in journalism and marketing communications. By attending Medill, you join this network of powerful professionals working all over the world. This tight-knit group loves to help their fellow Medillians and Wildcats by serving as mentors and connections for future job opportunities. 

Tuesday, 10 March 2020

తీరాలు దాటి భారత్ కు....

కరోనా ఆందోళన దేశలను చూడుతున్న వేళ.. విదేశీ భారతీయులు స్వదేశానికి చేరుకుంటున్నారు. చైనా తో మొదలైన ప్రయాణం ఇప్పుడు వివిధ దేశాలకు కరోనా వివిధ స్తరించడంతో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సైనిక విమానాలలో స్వంత గూటికి చేరుకుంటున్నారు. 
 వైమానిక దళానికి చెందిన సి -14 విమానం 58 మంది భారతీయ పౌరులతో ఈ రోజు ఇరాన్ నుండి ఉత్తరప్రదేశ్ లోని గజియాబాద్ కంటోన్మెంట్ ఎయిర్ బేస్ హిండన్ చేరుకుంది. ప్రయాణీకుల్లో 25 మంది పురుషులు, 31 మంది మహిళలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 529 నమూనాలను కూడా పరీక్షలోకి తీసుకువచ్చారు. హిండన్లోని పౌరులందరికీ అవసరమైన వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారు.

Sunday, 8 March 2020

చరిత్ర సృష్టిస్తున్న జగన్ అన్నా. - శైలజ చరణ్ రెడ్డి


 జగనన్న తనదైన శైలిలో అభివృద్ధిని కోరుకుంటూ, సంక్షేమాన్ని కోరుకుంటూ  గొప్ప ప్రయోగాలు చేస్తూ సక్సెస్ అవుతు చరిత్ర సృష్టిస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మరియు రీజనల్ కోఆర్డినేటర్ పూతలపట్టు నియోజకవర్గ ఎలక్షన్ అబ్జర్వర్  శైలజ చరణ్ రెడ్డి హర్షాన్ని వ్యక్తం చేశారు రేపు జరిగే లోకల్ బాడీ ఎలక్షన్స్ దేశ రాజకీయాలకు పరిశోధనా కేంద్రంగా మారబోతుందాఅంటే  అవుననే అనిపిస్తుంది . దీనికి కారణం దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా అటు డబ్బు గాని  ఇటు మద్యం గాని పనిచేయవు  అని చెప్పటానికి ప్రయత్నం చేస్తున్నా ఒక ముఖ్యమంత్రి  రాష్ట్రా రాజకీయాలకి ఒక శాస్త్రవేత్తల పని చేస్తున్నాడు అనటానికిఎలాంటి సందేహం లేదు .దాదాపుగా ఈ నెలలో జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం 90% పోలింగ్ జరగాలి అనే దృఢ సంకల్పంతో ఉన్నారని ఆమె తెలియజేశారు
 దీనికితోడుఎన్నికలలో పనిచేసే గవర్నమెంట్  ఉద్యోగస్తులు తమ విధి నిర్వహణ సక్రంగా చేయాలని ఎట్టి పరిస్థితులో డబ్బు ప్రభావం కానీ మద్యం ప్రవాహం గాని లేకుండా చూడాలని ఆదేశించటం దీనిలో భాగంగా పేర్కొనవచ్చు.ప్రభుత్వం నుంచి పొందుతున్న ప్రతి ప్రతిఫలాన్ని మరొకసారి పొందాలి అంటే మీ ఓటు హక్కును వినియోగించుకోవాలి అని చెప్పబోతున్న టు తెలియవచ్చింది.అది ఏ పార్టీకైనా వేయండి మీకు నచ్చిన వ్యక్తికీ మీరు స్వతంత్రంగా వేయండి అని చెప్పుతున్న వ్యక్తిగా అందరం గౌరవించాలి. భవిష్యత్తులో నిజమైన ప్రజాస్వామ్యానికి ఇది ఒక ప్రయోగంగా భావించవచ్చు. సేవా దృక్పథంతో రాజకీయాల్లో వచ్చేవారికి ఇది ఒక చక్కటి అవకాశం. వ్యాపారస్తులు   రౌడీలు  దుర్మార్గులు రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన అవసరం వచ్చింది అనేది ఉన్నత స్థాయి వర్గాల ఆలోచన. అలాగే 2024 జనరల్ ఎలక్షన్స్ నాటికి భారతదేశంలోనే నూటికి నూరు శాతం పోలింగ్ జరిగే విధంగా అందరూ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా  పార్టీలకతీతంగా ముఖ్యమంత్రి అభ్యర్థుల యొక్క మంచితనానికి  ఓటు వేసే రోజులు  మనకి దగ్గరికి వస్తున్నాయి. మనమందరం గమనించాలిసిన విషయం రాజకీయాల్లో మార్పు అనివార్యం అని తెలిసి కూడా  సాహసం చేయకుండా కాలం గడిపే నేటి రాజకీయ నాయకులకు  మార్పు  తెస్తాను చూపిస్తాను  అది మీరు చూస్తారు  అని చెప్పటంలో పార్టీలకతీతంగా  అలాంటి వ్యక్తిని  మనమందరం గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది .
ఉన్నారని ఆమె అన్నారు.భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు మనిషిని  మనిషిగా  చూసే రాజకీయ  నాయకులు  మనిషి అవసరాలను గుర్తించిన  నాయకులు  కరువైపోయారు. ఈ రోజుల్లో ఒకే ఒక్కడు గా నాలుగు లక్షల మందికి ఉపాధి కల్పించి  తక్కువ  జీతాలతో ఎక్కువ పనులు  చేయిస్తూ ఎక్కువ జీతాలు తీసుకునే వారికి ఈ పని  మనం చేయకపోతే  మన కింద వారు అతి  సునాయసంగా చేస్తారు అని ఒక సమాచారాన్ని పైస్థాయి ఉద్యోగస్తులకు తెలియజేసే ఘనుడు గా చెప్పొచ్చు.ఆయన ఏర్పరచిన సచివాలయవ్యవస్థ నిజంగా ఒక గొప్ప విజయంగానే భావించవచ్చుని ఆమె తెలియజేశారు
 భవిష్యత్తులో అంటే 2024 జనరల్ ఎలక్షన్స్ లో ఓటు హక్కు కలిగిన ప్రతి వ్యక్తికి తన ఓటు హక్కును వినియోగించుకునే లాగా కావలసిన సహాయాన్ని అందించటానికి  ప్రభుత్వం ఒక ప్రత్యేక సైన్యాన్ని తయారు చేసుకుంది అనేది నిజము అని చెప్పక తప్పదు. భవిష్యత్తులో వికలాంగులు కావచ్చు  జబ్బు పడినవారు కావచ్చు  హాస్పిటల్ లో ఉన్నవారు కావచ్చు  జైల్లో ఉన్న వాళ్లు కావచ్చు  ఆఖరికి బస్సులో లేదా రైల్లో ప్రయాణం చేస్తున్న వాళ్ళు కావచ్చు వాళ్ళ ఓటు హక్కుని ఎన్నికల రోజున ఉపయోగించుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పావులు కదుపుతున్నది . దానికి తగిన విధంగా టెక్నాలజీని అభివృద్ధి  పరచడంలో  మన రాష్ట్ర ప్రభుత్వం వనరులు లేనప్పటికీ సరైన రాజధాని  లేనప్పటికీ  కేంద్ర సహకారం  లేనప్పటికీ  ఒక సవాలుగా  తీసుకొని ఈ ముఖ్యమంత్రి చెయ్యగలడు  అనే ఆశాభావాన్ని మేధావులకు చాలా వరకు అర్థం అవుతుంది. రాజకీయాలంటే సేవ అనే భావాన్ని  కల్పించడంలో  ఈ ప్రయోగం  నూటికి  నూరు శాతం  సక్సెస్ అవ్వాలని ఆశిద్దాo ఆమె అన్నారు
భవిష్యత్తులో అంటే 2024 జనరల్ ఎలక్షన్స్ నాటికి ఎవరైతే  ప్రస్తుత రాజకీయాలను శాసిస్తున్న రో ఒక విధంగా చెప్పాలంటే వ్యాపారస్తులు  కాంట్రాక్టర్లు పెట్టుబడిదారులు రాజకీయాల నుండి తప్పుకునే రోజులు దగ్గరలో ఉన్నాయి. డబ్బుతో రాజకీయాలు చేసేవారూ వారసత్వ రాజకీయాలు చేసేవారు రాబోయే ఐదు సంవత్సరాలలో  కనుమరుగు అవుతారు. రాజకీయాలంటే సేవ  తను నమ్మిన వాళ్ల అభివృద్ధిని ఆకాంక్షించే వారు  చట్టాన్ని గౌరవించేవారు మాత్రమే రాజకీయాల్లోమన గలుగుతారు.అంతేగాని ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు వ్యాపారస్తులు  కుల పెద్దలు వారసత్వాలు  ఇలాంటి వాటికి కాలం చెల్లి పోతాయి  అని ఆమె అభిప్రాయపడ్డారు
 ప్రజాస్వామ్యం ఎప్పుడు వర్ధిల్లుతుంది అంటే నూటికి నూరు శాతం తమ ఓటు హక్కును ఉపయోగించిన్నప్పుడు మాత్రమే.మన రాష్ట్రం చేసె ఈ ప్రయోగం దేశం మొత్తానికి ఆదర్శంగాను ఆచరణ యోగ్యంగాను ఉండాలని  కోరుకుంటున్నామని ఆమె తెలియజేశారు