Monday, 2 March 2020

నాయకుని కొద్ది అభివృద్ధి... ఆ గ్రామానికి క్యూ కడుతున్న సామాజిక కార్యకర్తలు....

5 సంవత్సరాల సర్పంచ్ ప్రస్థానంలో ఎంతో అభివృద్ధి. ..ఇప్పుడు విధ్యార్ధులు,  సామాజిక కార్యకర్తలు. ఆ గ్రామానికి క్యూ కడుతున్నారు. ఓ కుగ్రామం దేశ దృష్టి ని ఆకర్షించేందుకు మూలకారణం యువ కెరటం "భక్తి శర్మ"పేరులోనే కాదు దేశం అన్నా ..తన జన్మభూమి అన్న ఈ "భక్తి" కి భక్తే.. అందుకే ఎన్నో అవార్డులు ఆమెను వెతుక్కుంటూ వచ్ఛాయి.
పేదరికం తో నా పల్లె ప్రజలు అలానే వుండిపోవాలా ? తరాలు మారుతున్నా , తలరాతలు మారవా ? నేను ఇంత చదువుకొని , నా తోటి పేద దేశవాసుల జీవితాల్లో కొంతైనా మార్పు తేకపోతే ఈ చదువుల సార్థకం ఏమిటి ? '' భక్తి శర్మ మనసు లో ఇవే ప్రశ్నలు ! ఆలోచించింది , అందుకే  2014 సంవత్సరంలోప్రపంచపు అగ్ర దేశం అమెరికా లో తాను చెస్తున్న  ఉద్యోగం,  పెద్ద జీతం, మిని స్వర్గం లాంటి  అమెరికాను వదిలి తన జన్మ స్థలం భారత్ లోని "బర్ఖేడీ" మధ్యప్రదేశ్ , భోపాల్ నుండి కేవలం 25 నిమిషాలు ప్రయాణిస్తే వచ్చే   గ్రామం  చేరుకుంది. తన చిన్ననాటి నుండి చూస్తున్నా పేదరికాన్ని గ్రామం నుండి తరిమి కొట్టే పనిలో భాగమైంది..  బర్ఖేడి పంచాయితీ లోకొస్తే అందరూ ఆమెను వింతగా చూసారు.  900 కుటుంబాలున్న ఆ పల్లెలో గట్టి పైకప్పు వుండే ఇళ్ళు కేవలం పది. పదంటే పది. రోడ్లు లేవు , ఆడవాళ్ళు టాయ్లెట్ కు వెళ్ళాలంటే అర్ధరాత్రి రెండు గంటలకే వెళ్ళాలి. వర్షాలు లేవు , త్రాగడానికే అర కొర నీరు  వుంటే ఇహ పంటల గురించి చెప్పేదేముంది.. వేల ఎకరాల బీడుభూమి. అభివృద్ధి ఆసాంతం చూసోచ్ఛిన  భక్తి శర్మ కు నిద్ర పట్టలేదు. 2014 అయిపోయింది. 2015 ఆ గ్రామ పంచాయితీ కి ఎన్నికలు వచ్చాయి. భక్తి శర్మ పోటీకి దిగింది.  ప్రతి గుడిశేకు వెళ్ళింది , చదువు , శుభ్రత ల గురించి , తన మనసులో ఏయే పథకాలున్నాయో అన్నీ వాళ్ళకు వివరించి , వాళ్ళ భవిష్యత్తు కోసం పనిచేద్దాం అని చెప్పింది , మెప్పించిది. ఫిబ్రవరి 22 , 2015 ఎన్నికల ఫలితాలు వచ్చాయి. భక్తిశర్మ పెద్ద మెజారిటీ తో గెలిచింది. ఆడవాళ్ళ చిరునవ్వుల సర్పంచ్ గా ఎన్నికైన వెంటనే ఆమె రాష్ట్ర రాజధాని భోపాల్ వెళ్ళింది అక్కడ అధికారులకు తన గ్రామ అభివృద్ధి కి ప్రభుత్వ  అధికారులుగా మీ వంతు సహకారాన్ని అందించాలని కోరింది. ఈ యువ కెరాటం మాటల తీరును చూసిన అధికారులు అఘామేఘలపై ఫైళ్లను చక్కబెట్టారు..రూ 3.92 కోట్ల  డబ్బు      "బర్ఖేడి" గ్రామ అభివృద్ధి కోసం మంజూరైయ్యాయి..ఇహ అభివృద్ధి మొదలైంది.15 సిమెంటు రోడ్లను నిర్మించింది. బడికి వేసినదే మొదటి రోడ్డు. ఇపుడు ఆ రోడ్లు మధ్యప్రదేశ్ గ్రామాల్లో బెస్ట్ రోడ్లు ! 2014 లో తాను గెలిచిన తరువాత ఆగస్టు 15 న ఎర్రకోట నుండి చేసైన తొలి ప్రసంగం లో ప్రధాని మోదీ ' స్వచ్చ భారత్ ' ను ప్రకటించారు , కాబట్టి మనం ఇపుడు బహిరంగ మల విసర్జన చేయరాదు అని చెప్పి ప్రతి ఇంటికీ ఒక టాయ్ లెట్ ను ఏర్పాటు చేయించింది. ఇపుడు బర్ఖేడి దేశంలో (ఓపెన్ డిఫేక్షన్ ఫ్రీ) పల్లెల్లో ఒకటి. ప్రధాని ప్రకటించిన ' జన్ ధన్ యోజన ' కింద ప్రతి వ్యక్తి కి ఒక బ్యాంక్ అకౌంట్ ను కల్పించింది , కేంద్ర ప్రభుత్వం అందించే  ను ప్రతిరైతు కు అందుబాటు లోకి తెచ్చింది , ఆవాస్ యోజన పథకం ద్వారా ఇపుడు అక్కడ 80 శాతం కుటుంబాలకు పక్కా ఇళ్ళున్నాయి , లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా , పొలాలకు నీళ్ళు తెప్పించింది , ఫలితంగా అపుడు  బీడు భూములుగా వుండిన 2500 ఎకరాల్లో ఇపుడు పంటలు పండిస్తున్నారు రైతులు  , ప్రతి గురువారం అక్కడికి భోపాల్ నుంచి అంబులెన్స్ వస్తుంది , ఉచిత వైద్యం , మందులు , మహిళలకు ప్రత్యేక మహిళా డాక్టర్లు వస్తారు , పంచాయితీ లో 100 శాతం రేషన్ కార్డులున్నాయి . పల్లె ను ఆమె ఎంత అద్భుతంగా మార్చిందంటే స్వయాన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ , ప్రధాని నరేంద్ర మోదీ ఆమెతో వ్యక్తిగతంగా మాట్లాడి అభినందించారు , మోదీ గారు అయితే ఎప్పటికప్పుడు ఆ గ్రామం గురించి ఆరా తీస్తుంటారట. ఇపుడు ఈ వ్యాసానికి ముగింపు ను ప్రత్యేకంగా చదవండి : బర్ఖేడీ లో ఏదైనా కుటుంబం లో ఆడపిల్ల పుడితే , భక్తి శర్మ వెళ్ళి ఆ పిల్ల తల్లికి తన రెండు నెలల జీతం ఇచ్చేస్తుంది , అంతే కాదు , ఆమెకు 10 మొక్కలను ఇచ్చి , మొదటి మొక్కను ఆమె కుటుంబం చేత నాటిస్తుంది. ఇలా 2015 ఫిబ్రవరి నుండి నాటిన చెట్ల సంఖ్య 6000 ..రౌతు కొద్ది గుర్రం అన్నారు.. నాయకుని కొద్ది అభివృద్ధి అనాలి.. ఇప్పుడు ఆ గ్రామంలో ఈ భక్తి శర్మ పట్ల వాత్సల్యం.. అభిమానం చూపేవారికి..ఈమె ఆభివృద్ధి కధలు చెప్పేవారికి కొదవలేదు...

No comments:

Post a Comment