సిరిసిల్ల : బాధ్యత మరిచి రాకపోకలు సాగిస్తున్న ప్రజల పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు మీ తప్పిదం వల్ల ఇతరులూ నష్టపోతారని వాహనదారులకు క్లాస్ తీసుకున్నారు. దీంతో వాహనదారులు కొందరు తప్పైందంటూ ఇంటి దారి పట్టారు.
ఆదివారం జనతా కర్ఫ్యూ సందర్భంగా సిరిసిల్ల పట్టణంలో ప్రజలు ఇంటి నుంచి బయటకు రానప్పటికీ సోమవారం రోడ్ల పై జన సంచారం ఎక్కువ కనిపించింది.
ఒకరికి మించి జనాలు బైకులు ,కార్లలో వెళ్లడం రోడ్లపై జనాలు గుమిగూడి ఉండటం ను స్వయంగా చూసిన కలెక్టర్ వెంటనే స్పందించారు.
కలెక్టరేట్ ముందు గల ప్రధాన రహదారి వెంబడి కలెక్టర్ స్వయంగా తిరుగుతూ వాహనాలను నిలుపుదల చేశారు.
కరోనా ఉధృతిని దానివల్ల కలిగే ప్రాణనష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ తెలంగాణ రాష్ట్రం మొత్తం లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ.... స్వేచ్ఛగా బాధ్యత లేకుండా ప్రజలు రోడ్లపైకి రావడం ఎంటనీ కలెక్టర్ ప్రశ్నించారు..
ప్రభుత్వం కరోనా మహమ్మారిపై సమరభేరి మోగించి ఉంటే మీరు మీ పార్టీకి ఇష్టారీతిన వ్యవహరిస్తారా ఇలాగైతే కరోనా వైరస్ కట్టడి ఎలా సాధ్యమవుతుంది అని కలెక్టర్ ప్రశ్నించారు. మీ లాంటి వ్యక్తుల వల్లే ఇటలీలో వేలాది ప్రాణాలు పోయాయని కలెక్టర్ తెలిపారు. ఇలాగే నిర్లక్ష్యం చేస్తే జిల్లా జిల్లాలో ప్రజలు ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు. అస్తవ్యస్త పరిస్థితులు తలెత్తుతాయి అన్నారు. శాంతిభద్రతలు ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు.
నిర్లక్ష్యం వల్ల మీ ప్రాణాలు పోవడమే కాకుండా జిల్లా మొత్తం ప్రమాదంలో పడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఇక నుంచైనా బాధ్యతగా వ్యవహరించి కరోనా కట్టడికి ప్రభుత్వానికి ,జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ హితోపదేశం చేశారు.
నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు మొదటి తప్పుగా భావించి ఇంతటితో వదిలేస్తున్నామని... ఇలాంటి తప్పులు మునుముందు పునరావృతమైతే అరెస్టు చేస్తామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.
కరోనా దృష్ట్యా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు .నిరంతరం గస్తీ కాస్తూ రోడ్లపై ఇష్టారీతిన వాహనాలు వెళ్లకుండా చూడాలన్నారు. ఒకే చోట సమూహంగా ఉండకుండా చూడాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అనంతరం కలెక్టర్ సిరిసిల్ల పట్టణంలోని గాంధీ కూడలి కూడలి కి వెళ్లారు . అప్పటికే అధికారులు ఇష్టారీతిన రాకపోకలు సాగిస్తు న్న వాహనాలను నిలిపివేశారు. వారి వద్దకు కలెక్టర్ స్వయంగా వెళ్లి కరోనా వైరస్ వలన కలిగే ప్రమాదం , ప్రభుత్వ ఆదేశాలను వారికి వివరించారు. ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఒక్కరి వల్ల వైరస్ అరికట్టడం సాధ్యం కాదని అందరూ చొప్పున సహకారం అందిస్తేనే కరోనా వైరస్ రాష్ట్రం నుంచి తరిమి కొట్టవచ్చునని కలెక్టర్ తెలిపారు.
ప్రైవేట్ కార్యాలయాలు, సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులు తన ఆఫీసులో కే పరిమితం కావాలని రోడ్లపైకి వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రభుత్వానికి. ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
మున్సిపల్ అధికారులు డెమాని స్ట్రేషన్ ద్వారా కరోనా వైరస్ పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
కార్యక్రమంలో కలెక్టర్ వెంట జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ అంజయ్య కలెక్టరేట్ అధికారులు సిబ్బంది ఉన్నారు.
అధికారులతో వాగ్వివాదం.. వ్యక్తి అరెస్ట్
సిరిసిల్ల పట్టణంలోని గాంధీ కూడలి ప్రధాన రోడ్డు మార్గంలో.
రోడ్లపై ఒకరికి మించి వాహనాలు కార్లో వెళుతున్న వ్యక్తులకు జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ రోడ్లపైనే కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రభుత్వం ప్రకటించినందున ప్రజలు రోడ్లపైకి రావద్దని కూడా వద్దని కోరారు.
ఈ క్రమంలో తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి గ్రామానికి చెందిన గుగ్గిళ్ళ శ్రీకాంత్ జిల్లా కలెక్టర్ పోలీస్ అధికారులతో వాగ్వాదానికి దిగారు.
ప్రజా శ్రేయస్సు కాంక్షించి ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా వైరస్ కట్టడికి జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ తెలిపారు. అయినప్పటికీ శ్రీకాంత్ జిల్లా కలెక్టర్, పోలీస్ అధికారులతో వాగ్వాదాన్ని కొనసాగించారు.
సదరు వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ తరలించారు.
News Source:- DPRO Dasharatham Mamindla , Rajanna Sirisilla District...
Lead & Edited .. Changes @ Manikumar.
No comments:
Post a Comment