Tuesday, 17 March 2020

కొద్దీ మందితోనే భధ్రాధ్రి రాముని కళ్యాణం... ఒంటిమిట్ట లోనూ ఇదే నిర్ణయం....



భద్రాచలం: భద్రాద్రి సీతారాముల కల్యాణానికి దేశ వ్యాప్తంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతుంటారు. ముందుగానే కల్యాణం టికెట్లు బుకింగ్జరుగుతుంటుంది. రామయ్య కల్యాణాన్ని ఎన్నో ఏళ్లుగా ఆరుబయట.. ప్రతి ఒక్కరూ తిలకించేలా నిర్వహిస్తున్నారు.
కానీ ఈసారి రామయ్య కల్యాణాన్ని నేరుగా చూసే అవకాశం ఎక్కువ మందికి దక్కే అవకాశం కనిపించడం లేదు..
 కరోనా కారణంగా దేవాలయం సిబ్బంది కొద్దిమందితో కళ్యాణం జరిపించనున్నట్లు ఖమ్మం ఎం.ఎల్.ఏ , రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ స్పష్టంచేశారు. కరోనా వైరస్ వ్యాప్తి
రాష్ట్రంలో రోజు రోజుకూ ఎక్కువవుతున్న కారణంగా స్వామివారి
కల్యాణానికి ఎవరినీ అనుమతించట్లేదని.. కాబట్టి భక్తులెవరూ స్వామివారి
కల్యాణానికి రావొద్దని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భక్తులకు విజ్ఞప్తి చేశారు.
కేవలం అర్చకులు మాత్రమే శాస్తోక్తంగా కల్యాణ క్రతువును
నిర్వహించనున్నారు.
రామయ్య కల్యాణం భాధ్యతలను ఈసారి ప్రభుత్వ
సలహాదారు రమణాచారికి అప్పగించారు. సీఎం కేసీఆర్ సాంప్రదాయంగా
ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వం భద్రాద్రి రాముని కళ్యాణానికి తీసుకుని వచ్చే
పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు ఎవరు తీసుకుని వస్తారనే దానిపై
ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కల్యాణం టిక్కెట్ల అమ్మకాలను పూర్తిగా నిలిపివేశారు.  కొన్నవారికి డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించారు.
కాగ ఆంధ్రప్రదేశ్ లోని ప్రఖ్యాత శ్రీరామ క్షేత్రం కడపజిల్లా, ఒంటిమిట్ట లోనూ ఇదే తరహాలో కళ్యాణం నిర్వహించనున్నట్లు గతవారం ఎ.పి.సర్కార్ వెల్లడించింది....

No comments:

Post a Comment