Sunday, 1 March 2020

ఖమ్మం నగరంలో మంత్రి కెటిఆర్ . సుడిగాలి పర్యటన..రాష్ట్రానికి ఆదర్శంగా ఖమ్మం వుండాలని ఆకాంక్ష...

ఖమ్మం నగరాన్ని రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చి దిద్దేందుకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆహర్నిశలు కృషి చేస్తున్నారని తెలంగాణ ఐ.టి., పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా వివిద జిల్లాల్లో పర్యటిస్తున్న కెటిఆర్ ఆదివారం  ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యాటనకు వచ్ఛారు.
ఖమ్మం నగరంలో వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో కెటిఆర్ మాట్లాడుతూ పట్టణాలు అభివృద్ధి చెందలాంటే ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని మన ఇంటిని శుభ్రంగా వుంచుకున్నట్లే పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని ప్రజలకు సూచించారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గోనేందుకు  ఉదయం హైదరాబాద్ బేగంపేట విమనాశ్రయం నుండి ఖమ్మం చేరుకున్న ఐటి ,మున్సిపల్  మంత్రి  ఖమ్మం నగరంలో సుడిగాలి పర్యటన చేసి . పలు  అభివృద్ధి  పనులను ప్రారంభించారు. తొలుత నగరంలోని శాంతి నగర్ జూనియర్ కాలేజీ నూతన బిల్డింగ్ లు ప్రారంభించారు.., అనంతరం ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ లో బాస్కెట్బాల్ ఇండోర్ స్టేడియం ప్రారంభించి కాసేపు బాస్కెట్బాల్  ఆడారు.. పెవిలియన్ గ్రౌండ్ నుండి స్థానిక ఎన్.ఎస్పీ  క్యాంపు లో నూతనంగా ఏర్పాటు చేసిన శాఖాహర - మంసహర కూర..గాయల  మార్కట్ ప్రారంభించి అక్కడి వ్యాపారులతో మాట్లాడారు..
అనంతరం జరిగిన సభలో కెటిఆర్ మాట్లాడారు..
పట్టణ ప్రగతిలో బాగస్వాములమవుతున్న ప్రతి ఒక్కరిని ఆయన అభినందించారు.
ఖమ్మం పర్యటనలో కెటిఆర్ వెంట ఖమ్మం ఎం.ఎల్.ఏ. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆబ్కారీ, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్,  రోడ్లు, భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఖమ్మం ఎం.పి. నామ నాగేశ్వరావు, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర రెడ్డి, సత్తుపల్లి ఎం.ఎల్.ఏ. సండ్ర వెంకట వీరయ్య..కొండబాల కోటేశ్వరరావు ,ఆర్.జే.సి. క్రిష్ణ,,   మేయర్ పాపాలాల్, ఖమ్మం జెడ్.పి. ఛైర్మన్ లింగాల కమల్ రాజు, ఖమ్మం జిల్లా ఇంచార్జ కలేక్టర్ అనురాగ్ జయంతి, అడిషనల్ కలేక్టర్: స్నేహ, ఖమ్మం సి.పి.తప్సిర్ ఇక్బాల్.. తదితరులు పాల్గొన్నారు..

No comments:

Post a Comment