Wednesday, 18 March 2020
విజయ డైరీ సిబ్బందికి కరోనాపై అవగాహన...
తెలంగాణ పాల ఉత్పత్తుల సంస్థ విజయ డెయిరీ తమ సంస్థ లో కరోనా వ్యాప్తి నిర్ములనకు తగు జాగ్రత్తలు పాటించాలని సిబ్బందిని కోరింది. ఈ మేరకు మంగళవారం కార్మికులకు, ఉద్యోగులకు కరోనా గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో కరోనా రాకుండా తీసుకోవలసిన ముందస్తు చర్యలను వివరించారు,సిబ్బందికి దర్మల్ స్ర్కీనింగ్ చేయిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యప్తంగా పలు ప్రాంతాల్లో సంస్థ యూనిట్లు పాలు - పాల పదార్థాలు ప్యాకింగ్ ఉత్పత్తి ప్రక్రియ నడుస్తోంది. ఈ అవగాహన కార్యక్రమం సిబ్బందికి ముందు జాగ్రత్తగా వుండేందుకు ఉపయోగపడుతుందని సమావేశం అభిప్రాయం పడింది.. ఈసదస్సులో మేనేజింగ్ డైరెక్టర్ జి. శ్రీనివాసరావు, డాక్టర్, వెల్ఫేర్ ఆఫీసర్, డి జియమ్ మరియు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment