విధి నిర్వహణలో హైవెలపై ప్రయాణించే సమయంలో తడిసి మోపెడవుతున్న టోల్ వసూళ్లను మినహయింపు నివాలని సమావేశం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.. వివరాల్లోకి వెళితే దేశంలో రోజురోజుకు పెరుగుతున్న మీడియా అవసరం ,ఉరుకుల పరుగుల పనిభారంతో సతమతమవుతున్న జర్నలిస్ట్ లకు నేషనల్ హైవేస్ లలో టోల్ టాక్స్ మినహాయింపు ఇవ్వాలని Feb 29,March 1 తేదీలలో లక్నోలో జరిగిన IJU నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశం డిమాండ్ చేసింది.రెండు రోజులపాటు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో లో IJU అధ్యక్షులు కె.శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన సమావేశమైన కార్యవర్గం దేశంలో జర్నలిస్ట్ లు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించింది.జర్నలిస్టుల ఐక్యతకోసం కృషిచేయాలని అందుకోసం రాష్ట్ర శాఖలు తగిన విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలని పిలుపు నిచ్చింది. జర్నలిస్టుల మీదరోజురోజుకు పెరుగుతున్న దాడులపట్ల సమావేశం ఆందోళన వ్యక్తంచేసింది.వివిధ సమస్యలపై సదస్సులు ,సెమినార్లు నిర్వహించాలని సమావేశం తీర్మానించింది.జర్నలిస్టులు పోరాడి సాదించుకున్న 1955 వర్కింగ్ జర్నలిస్ట్ ల చట్టాన్ని నీరుకార్చి జర్నలిస్టులకు తగిన గౌరవం ఇవ్వకపోవటాన్ని తప్పు పట్టింది.దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఫార్త్ ఎస్టేట్ గా పిలువ బడుతున్న మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్ట్ ల పట్ల కేంద్రం వ్యవహరిస్తున్నతీరుపై సమావేశం ఆగ్రహం ప్రకటించింది. 24 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
No comments:
Post a Comment