Monday, 16 March 2020

వైరస్ పై 2011లో రెండు సినిమాలు.. చైనా నుండి వచ్ఛిన వైరస్సే ప్రధాన అంశం...

2011 లో విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందిన రెండు చిత్రాలు ప్రస్తుత కరోనా వైరస్ పై ఇంచుమించు కళ్లకు కట్టాయి... అందులో ఒకటి సౌత్ ఇండియన్ బాషాల్లో విడుదలైన 7th సెన్సు కాగా రెండవది హలివుడ్ లో తయారై అదే యాడాది విడుదలైన చిత్రం కాంటాజీయన్ తెలుగు లో  "అంటువ్యాధి" రెండు చిత్రాల నేపథ్యం వైరస్ కావడం యాధృఛ్ఛికమైనప్పటికి ప్రస్తుతం ఈ చిత్రాల గురించిన కధనంపై చర్చలు సాగుతున్నాయి.    కాగా రెండు చిత్రాల్లోనూ వైరస్ నేపథ్యం చైనా నుండే కావటం విశేషం. మురుగదాస్  దర్మకత్వంలో వచ్ఛిన  సెవంత్ సెన్సు తమిళ - తెలుగు భాషల్లో 2011సంవత్సరంలో  విడుదలై సంచలన విజయం సాధించింది..భారతదేశంలో వైరస్ వ్యాప్తి ద్వారా మరణహోమం సృష్టించి దేశాన్ని అతలకుతలం చేయడం..అనంతరం తమ కంపెనీ మందులతో వ్యాధి ని నయం చేసి కోట్లాది రూపాయలు దండుకోవాలన్న ఆశతో ఓ బయో మెడికల్ కంపెనీ వేసిన ఎత్తుగడ కధాంశంతో సాగే సినిమా చైనా నుండి డొంగ్లీ అనే విలన్ పాత్ర ఇండియాలో ప్రవేశించంతో రకరకాల మలుపు తిరిగి ముగుస్తుంది..ఇందులో హిరో సూర్య..హిరోయిన్ శ్రుతి హాసన్  తమ పాత్రలతో కధను రక్తి కట్టిస్తారు.
 ఇహా అమెరికన్ చిత్రం "కరోనావైరస్" పోలిన  వైరస్ గురించి మాట్లాడుతుంది, ఇది చైనా నుండి ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించడం ప్రారంభిస్తుంది! విచిత్రమైన విషయం ఏమిటంటే, సినిమా చివరలో ఇది సంక్రమణకు కారణం బ్యాట్ అని తేలుతుంది, ఇది ప్రస్తుతం వ్యాధి వ్యాప్తి చెందడానికి అదే కారణం!  చిత్రం పేరు తెలుగు లో  "అంటువ్యాధి వార్నర్ బ్రదర్స్ బ్యానర్ లో నిర్మాణం అయిన కాంటజీయన్ అంగ్ల చిత్రంలో మాట్ డామన్, జూడ్ లా, గ్వినేత్ పాల్ట్రో & కేట్ విన్స్లెట్ నటించారు.

No comments:

Post a Comment