Tuesday, 3 March 2020

ఆందోళన వద్దు..అన్ని చర్యలు చెపట్టాం...కరోనాపై తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటెల వివరణ..



కరోనా పై సీఎం కేసీఆర్ నివేదిక తీసుకోని చర్చలు జరిపారని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు.ముఖ్యమంత్రి ని కలసిన సమస్యని వివరించిన ఆనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.కరోనా వ్యాధి నివారణ కోసం సీఎం కేసీఆర్ 100 కోట్ల నిధులు సబ్ కమిటీ వేశారని ఈటెల తెలిపారు. కరోనా వచ్చిన యువకునితో 88 మంది కలిసినట్లు సమాచారం వుందని తెలిపారు 88 మందిలో ఇప్పటి వరకు 45 మందిని గాంధీ లో టెస్టులు జరిపామన్నారు. కరోనా రోగికి నిన్నటి నుంచి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. దుబాయ్ నుంచి వచ్చిన యువకుని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని రాజేందర్ వివరించారు.80వేల మందికి కరోనా సోకితే...2వేలకు పైగా మాత్రమే మృతి చెందరని ప్రజలు కరోనా విషయంలో ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పారు. కరోనా ఎబోలా కంటే భయంకరమైన వ్యాధి కాదని భావించాలన్నారు.
*గాలి ద్వారా కరోనా సోకె ఆస్కారం లేదు కాని మనిషి మాట్లాడినప్పుడు తుప్పిర్ల ద్వారా సోకె అవకాశం వుంటుందన్నారు. శుభ్రంగా ఉంటే ఎలాంటి వ్యాధి సోకదని గ్రహించాలన్నారు. మనిషికి తెలియకుండా మాములు 80శాతం జలుబు సోకి వచ్చి పోతుందని, 14 శాతం కరోనా వస్తే ట్రీట్మెంట్ ద్వారా నయం అవుతుందని ఈటెల స్పష్టం చేశారు. 
3 శాతం రోగులకు మాత్రమే కరోనా వ్యాధి తీవ్రత సీరియస్ గా ఉంటుందని,  కరోనా వచ్చినట్లు అనుమానం వస్తే డాక్టర్ దగ్గరకు వెళ్ళాలని సూచించారు.తెలంగాణ రాష్ట్రంలో నివసించే ప్రజలకు ఒక్కరికి కూడా కరోనా రాలేదని స్పష్టం చేశారు.గాంధీ తో చెస్ట్ హాస్పిటల్-మిలటరీ హాస్పిటల్-వికారాబాద్ అడవుల్లో ఉన్న హాస్పిటల్ ని కరోనా వ్యాధిగ్రస్తులకు‌, అనుమానితులకోసం ప్రత్యేకంగా వాడుతున్నామని మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు.ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 3వేల బెడ్స్ తో ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కేంద్రంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని, తెలంగాణ లో మాస్క్ ల కొరత ఉంది-కేంద్రాన్ని మాస్క్ లను అందించాలని కోరినట్లు చెప్పారు స్కూల్- అన్ని రకాల ప్రయాణం చేసే ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలి.ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. కరోనా హెల్ప్ లైన్ 104 ని ఏర్పాటు చేసామని, రేపటి నుంచి అందుబాటులో వుంటుందని చెప్పారు. అన్ని శాఖల సమన్వయంతో నివారణ చర్యలు తీసుకుంటున్నామన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన దేశాల టూర్లకు వెళ్లకుండా వాయిదా వేసుకోవాలని కోరారు. అంతకముందు ఈటెల కరోనా వైరస్‌ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి వర్గ ఉపసంఘం సమావేశం హాజరయ్యారు. మంత్రులు , ఈటేల రాజేందర్,  ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై పురపాలక, పంచాయతీరాజ్‌, వైద్య శాఖ అధికారులతో కలిసి మంత్రులు సమీక్షించారు. ప్రజల్లో అవగాహన పెంచడం సహా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు.
వ్యాధి లక్షణాలు ఉన్నవారి సహాయార్థం ప్రత్యేక హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేయాలని మంత్రులు నిర్ణయించారు. 24 గంటల పాటు నడిచే కాల్‌సెంటర్‌తో పాటు ఇప్పుడున్న కాల్‌ సెంటర్‌ సామర్థ్యాన్ని మరింతగా పెంచాలన్నారు. కరోనా వైరస్‌ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని మంత్రులు స్పష్టం చేశారు. ఈ వైరస్‌తో చనిపోతారన్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని తేల్చిచెప్పారు. కరోనా చికిత్సకు సంబంధించి గాంధీ ఆస్పత్రిలో అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రులు తెలిపారు.
కరోనా వైరస్‌పై పత్రికలు, టీవీలు, సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం కల్పించాలని మంత్రులు నిర్ణయించారు. ప్రజలను చైతన్యం చేసేలా సమాచార, ప్రచార శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తెలుగు, ఇంగ్లీష్‌, ఉర్దూ భాషల్లో కరోనా వైరస్‌పై అవగాహన కల్పించే సమాచారం అందుబాటులో ఉంచాలని చెప్పారు. హైదరాబాద్‌తో పాటు పట్టణాల్లో పెద్ద ఎత్తున ప్రచారం కల్పించేందుకు హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలని అధికారులకు మంత్రులు సూచించారు

No comments:

Post a Comment