ముంచుకు వస్తున్న ముప్పును ప్రతి ఒక్కరూ గ్రహించాలని ఆదమరిచి నిద్రపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదు అని కరోనా కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న సూచనలను తప్పక పాటించవలసినదిగా లేనిపక్షంలో భారతదేశంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులను తప్పించుకొని మూడో స్టేజ్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క వ్యక్తి పైన ఉందని బ్రతికుంటే బలుసాకులు తిని అయినా బ్రతక వచ్చు కానీ చేతులారా జీవితాలను నాశనం చేసుకోవద్దని
YSRCP రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి & రీజనల్ కోఆర్డినేటర్, పూతలపట్టు నియోజకవర్గ ఎలక్షన్ అబ్జర్వర్ శైలజ చరణ్ రెడ్డి సూచించారు
*ఇప్పటి వరకు పరిశీలిస్తే*
🔴*ప్రపంచ వ్యాప్తంగా 85,612 కేసులతో అగ్రస్థానంలో అమెరికా*
*8,215 మరణాలతో ముందున్న ఇటలీ*
🔴 *మరణాల్లో ఛైనా(3292)ను దాటిన స్పెయిన్ (4365)*
🔴 *భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు*
🔴 *శుక్రవారం మధ్యాహ్నం1 గంటల కు 727 పాజిటివ్ కేసులు.. 16కు చేరిన మరణాలు*
🔴 *తెలంగాణలో 47, ఏపీలో 12కు పెరిగిన పాజిటివ్ కేసులు*
ఇక ఆదమరిస్తే పరిస్థితి చేజారి పోతుందనే జాగ్రత్త ప్రతి ఒక్కరికి ఉండాలి అని ఆమె కోరుకున్నారు *అభివృద్ధి చెందిన, అగ్రరాజ్యాలే కరోనా దెబ్బకి కకావికలమవుతున్నాయి* అని ఆమె తెలియజేశారు
🔴 *ఈ వారమే అత్యంత కీలకం*
ఈవారం అత్యంత కీలకమని , సామాజిక దూరం పాటించాలని, ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉంటూ తోచిన విధంగా సోషల్ మీడియా ద్వారా కానీ లేదంటే ఫోన్ల ద్వారా గాని తమకు తెలిసిన వాళ్ళందరికీ అవగాహన కల్పించాలని కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టి తమ వంతు భాగంగా భరతమాత రుణం తీర్చుకోవాలని ఆమె పిలుపునిచ్చారు
PM నరేంద్ర మోడీ గారికి మరియు మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, #CM వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి గ్రామ వాలంటీర్ వ్యవస్థ ప్రపంచ దేశాలకు సైతం ఆదర్శంగా నిలిపి నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు ఆమె తెలియజేశారు
No comments:
Post a Comment