Saturday, 14 March 2020
కరోనా ప్రభలకుండా తగు చర్యలు : కె.సి.ఆర్.
తెలంగాణముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సీఎం కె. చంద్రశేఖర్ రావు మీడియా సమావేశంలో వెల్లడించారు.కరోనా వైరస్ ప్రబలకుండా ఉండేందుకు ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో ఈ నెల 31 వరకు అన్ని రకాల విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు, సమ్మర్ క్యాంపులను మూసివేస్తున్నట్లు సీఎం తెలిపారు.బోర్డు పరీక్షలు యథాతథంగా జరుగుతాయి. పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు హాస్టల్ వసతి కొనసాగుతుంది. ఆర్టీసీ బస్సులు, మెట్రో రైలు యధాతథంగా నడుస్తాయి. వాటిని పరిశుభ్రంగా ఉంచేలా నిరంతరం చర్యలు తీసుకోవడం జరుగుతుందని సీఎం చెప్పారు.మార్చ్ 31 వరకు జనసమ్మర్థం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నియంత్రణ ఉంటుందని తెలిపిన సీఎం, ఇప్పటికే నిర్ణయమైన పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లు కుటుంబ సభ్యల మధ్యే జరుపుకోవాలని సూచించారు. మార్చి 31 వరకు తదుపరి తేదీలకై మ్యారేజ్ హాల్స్ బుకింగ్స్ ఉండవని చెప్పారు.వచ్చే వారం రోజుల పాటు బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు, సెమినార్లు, ఉత్సవాలు, ఎగ్జిబిషన్స్, సాంస్కృతిక కార్యక్రమాలు అనుమతింపబడవు. జూ పార్కులు, అమ్యూజ్మెంట్ పార్కులు, మ్యుజియమ్స్, సినిమా హాళ్లు, బార్లు, పబ్బులు, క్రీడా ప్రాంగణాలు, స్విమ్మింగ్ పూల్స్, జిమ్ లు మూసివేయబడతాయని ముఖ్యమంత్రి తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment