Wednesday, 18 March 2020

తెలంగాణ బతుకమ్మకు మంత్రి దండం దక్కేనా...

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన శ్రీమతి కల్వకుంట్ల కవిత బుధవారం నిజమాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి కి తన నామినేషన్ పత్రలు సమర్పించారు.. అంతకు ముందు కవిత ఇంటి వద్ద పండితులు వేద ఆశీస్సులు అందజేశారు. కొలహలంగా తెరాస అభిమానులు, కార్యకర్తలతో వెంటరాగా కవిత నామినేషన్ వేశారు.. ఈ సందర్భంగా పలువురు ఆమేను అభినంధనలు అందజేశారు.. ఇహ కల్వకుంట్ల కవిత ఎంఎల్.సి ఎన్నిక నామ మాత్రమే. మరీ తెలంగాణ బతుకమ్మ కు బ్రాండ్ అంబాసిడర్, కల్వకుంట్ల వారి ఆడపడుచు కవితను మంత్రి పదవీ వరించేనా..ఇప్పటికే ఇంట్లో ఇద్దరు మంత్రులు వున్నారు అయినప్పటికీ ముఖ్యమంత్రి కెసిఆర్ కవిత ను మంత్రి పీఠంపై కూర్చబెడతారా అనేది సందేహంగా మిగులుతోంది..తెలంగాణ ఆవిర్భావం అనంతరం తొలిసారి  కుమార్తె కవితను.. ముఖ్యమంత్రి కెసిఆర్ పార్లమెంట్ కు పంపారు..సమీకరణలు కలసి వస్తే కేంద్ర మంత్రి గా కుమార్తె ను చూడొచ్ఛనేది కెసిఆర్ వ్యూహం గా అప్పట్లో పలువురు పెర్కోన్నారు..అయితే అయితే 2014 ఎన్నికల్లో బజాపా కు స్వంతంగా మెజార్టీ రావడంతో  కవితకు అవకాశం రాలేదు..అప్పటికి కెసిఆర్ మోడీతో పలుమార్లు సంప్రదింపులు చేశారని మోడీ ఎటువంటి హామీలు ఇవ్వకపోవడంతో కుమార్తె ను కేంద్ర మంత్రి గా చూడాలనే ఆశను వదిలేసుకున్నట్లు అప్పట్లో తెరాస వర్గాలు చర్చల్లో మాటలుగా వుండేవని వెల్లడి..కాగా రెండో సారీ ఎంపిగా పోటీ చేసిన కవిత ఓటమి పాలవడంతో పాటు బజాపా కేంద్ర ంంలో మరింత మేరుగైన ఫలితం సాధించడంతో..ఇతర పార్టీలకు కేంద్ర క్యాబినెట్ లో పాగా వేసే వెసులుబాటు దక్కలేదు... దీంతో కవితకు రాజ్యసభ ఇచ్ఛిన మంత్రి అయ్యే ఛాన్సు లేకపోవడంతో.. గులాబీ బాస్ కుమార్తె ను ఎం.ఎల్ సిగా చేస్తున్నారని తద్వారా తెలంగాణ లో ప్రముఖ్యత కలిగిన మంత్రి పదవి ఇవ్వబోతున్నారని తెరాస వర్గాల గుసగుసలు.. కొద్ది రోజుల్లో తెలంగాణ క్యాబినెట్ విస్తరణ జరిగే అవకాశాలు వున్నట్లు ప్రగతి భవన్ వర్గాల బోగట్టా.. మరి వేచి చూద్దాం.. కల్వకుంట్ల వారి ఆడపడుచుకు మంత్రి దండం చిక్కుతుందేమో....


No comments:

Post a Comment