జగనన్న తనదైన శైలిలో అభివృద్ధిని కోరుకుంటూ, సంక్షేమాన్ని కోరుకుంటూ గొప్ప ప్రయోగాలు చేస్తూ సక్సెస్ అవుతు చరిత్ర సృష్టిస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మరియు రీజనల్ కోఆర్డినేటర్ పూతలపట్టు నియోజకవర్గ ఎలక్షన్ అబ్జర్వర్ శైలజ చరణ్ రెడ్డి హర్షాన్ని వ్యక్తం చేశారు రేపు జరిగే లోకల్ బాడీ ఎలక్షన్స్ దేశ రాజకీయాలకు పరిశోధనా కేంద్రంగా మారబోతుందాఅంటే అవుననే అనిపిస్తుంది . దీనికి కారణం దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా అటు డబ్బు గాని ఇటు మద్యం గాని పనిచేయవు అని చెప్పటానికి ప్రయత్నం చేస్తున్నా ఒక ముఖ్యమంత్రి రాష్ట్రా రాజకీయాలకి ఒక శాస్త్రవేత్తల పని చేస్తున్నాడు అనటానికిఎలాంటి సందేహం లేదు .దాదాపుగా ఈ నెలలో జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం 90% పోలింగ్ జరగాలి అనే దృఢ సంకల్పంతో ఉన్నారని ఆమె తెలియజేశారు
దీనికితోడుఎన్నికలలో పనిచేసే గవర్నమెంట్ ఉద్యోగస్తులు తమ విధి నిర్వహణ సక్రంగా చేయాలని ఎట్టి పరిస్థితులో డబ్బు ప్రభావం కానీ మద్యం ప్రవాహం గాని లేకుండా చూడాలని ఆదేశించటం దీనిలో భాగంగా పేర్కొనవచ్చు.ప్రభుత్వం నుంచి పొందుతున్న ప్రతి ప్రతిఫలాన్ని మరొకసారి పొందాలి అంటే మీ ఓటు హక్కును వినియోగించుకోవాలి అని చెప్పబోతున్న టు తెలియవచ్చింది.అది ఏ పార్టీకైనా వేయండి మీకు నచ్చిన వ్యక్తికీ మీరు స్వతంత్రంగా వేయండి అని చెప్పుతున్న వ్యక్తిగా అందరం గౌరవించాలి. భవిష్యత్తులో నిజమైన ప్రజాస్వామ్యానికి ఇది ఒక ప్రయోగంగా భావించవచ్చు. సేవా దృక్పథంతో రాజకీయాల్లో వచ్చేవారికి ఇది ఒక చక్కటి అవకాశం. వ్యాపారస్తులు రౌడీలు దుర్మార్గులు రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన అవసరం వచ్చింది అనేది ఉన్నత స్థాయి వర్గాల ఆలోచన. అలాగే 2024 జనరల్ ఎలక్షన్స్ నాటికి భారతదేశంలోనే నూటికి నూరు శాతం పోలింగ్ జరిగే విధంగా అందరూ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా పార్టీలకతీతంగా ముఖ్యమంత్రి అభ్యర్థుల యొక్క మంచితనానికి ఓటు వేసే రోజులు మనకి దగ్గరికి వస్తున్నాయి. మనమందరం గమనించాలిసిన విషయం రాజకీయాల్లో మార్పు అనివార్యం అని తెలిసి కూడా సాహసం చేయకుండా కాలం గడిపే నేటి రాజకీయ నాయకులకు మార్పు తెస్తాను చూపిస్తాను అది మీరు చూస్తారు అని చెప్పటంలో పార్టీలకతీతంగా అలాంటి వ్యక్తిని మనమందరం గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది .
ఉన్నారని ఆమె అన్నారు.భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు మనిషిని మనిషిగా చూసే రాజకీయ నాయకులు మనిషి అవసరాలను గుర్తించిన నాయకులు కరువైపోయారు. ఈ రోజుల్లో ఒకే ఒక్కడు గా నాలుగు లక్షల మందికి ఉపాధి కల్పించి తక్కువ జీతాలతో ఎక్కువ పనులు చేయిస్తూ ఎక్కువ జీతాలు తీసుకునే వారికి ఈ పని మనం చేయకపోతే మన కింద వారు అతి సునాయసంగా చేస్తారు అని ఒక సమాచారాన్ని పైస్థాయి ఉద్యోగస్తులకు తెలియజేసే ఘనుడు గా చెప్పొచ్చు.ఆయన ఏర్పరచిన సచివాలయవ్యవస్థ నిజంగా ఒక గొప్ప విజయంగానే భావించవచ్చుని ఆమె తెలియజేశారు
భవిష్యత్తులో అంటే 2024 జనరల్ ఎలక్షన్స్ లో ఓటు హక్కు కలిగిన ప్రతి వ్యక్తికి తన ఓటు హక్కును వినియోగించుకునే లాగా కావలసిన సహాయాన్ని అందించటానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక సైన్యాన్ని తయారు చేసుకుంది అనేది నిజము అని చెప్పక తప్పదు. భవిష్యత్తులో వికలాంగులు కావచ్చు జబ్బు పడినవారు కావచ్చు హాస్పిటల్ లో ఉన్నవారు కావచ్చు జైల్లో ఉన్న వాళ్లు కావచ్చు ఆఖరికి బస్సులో లేదా రైల్లో ప్రయాణం చేస్తున్న వాళ్ళు కావచ్చు వాళ్ళ ఓటు హక్కుని ఎన్నికల రోజున ఉపయోగించుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పావులు కదుపుతున్నది . దానికి తగిన విధంగా టెక్నాలజీని అభివృద్ధి పరచడంలో మన రాష్ట్ర ప్రభుత్వం వనరులు లేనప్పటికీ సరైన రాజధాని లేనప్పటికీ కేంద్ర సహకారం లేనప్పటికీ ఒక సవాలుగా తీసుకొని ఈ ముఖ్యమంత్రి చెయ్యగలడు అనే ఆశాభావాన్ని మేధావులకు చాలా వరకు అర్థం అవుతుంది. రాజకీయాలంటే సేవ అనే భావాన్ని కల్పించడంలో ఈ ప్రయోగం నూటికి నూరు శాతం సక్సెస్ అవ్వాలని ఆశిద్దాo ఆమె అన్నారు
భవిష్యత్తులో అంటే 2024 జనరల్ ఎలక్షన్స్ నాటికి ఎవరైతే ప్రస్తుత రాజకీయాలను శాసిస్తున్న రో ఒక విధంగా చెప్పాలంటే వ్యాపారస్తులు కాంట్రాక్టర్లు పెట్టుబడిదారులు రాజకీయాల నుండి తప్పుకునే రోజులు దగ్గరలో ఉన్నాయి. డబ్బుతో రాజకీయాలు చేసేవారూ వారసత్వ రాజకీయాలు చేసేవారు రాబోయే ఐదు సంవత్సరాలలో కనుమరుగు అవుతారు. రాజకీయాలంటే సేవ తను నమ్మిన వాళ్ల అభివృద్ధిని ఆకాంక్షించే వారు చట్టాన్ని గౌరవించేవారు మాత్రమే రాజకీయాల్లోమన గలుగుతారు.అంతేగాని ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు వ్యాపారస్తులు కుల పెద్దలు వారసత్వాలు ఇలాంటి వాటికి కాలం చెల్లి పోతాయి అని ఆమె అభిప్రాయపడ్డారు
ప్రజాస్వామ్యం ఎప్పుడు వర్ధిల్లుతుంది అంటే నూటికి నూరు శాతం తమ ఓటు హక్కును ఉపయోగించిన్నప్పుడు మాత్రమే.మన రాష్ట్రం చేసె ఈ ప్రయోగం దేశం మొత్తానికి ఆదర్శంగాను ఆచరణ యోగ్యంగాను ఉండాలని కోరుకుంటున్నామని ఆమె తెలియజేశారు
No comments:
Post a Comment