Sunday, 30 August 2020

తిరుచానూర్ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు...

#వైభవంగా #శ్రీపద్మావతి #అమ్మవారి #ఆలయ

#పవిత్రోత్సవాలు #ప్రారంభం

#తిరుపతి : తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా మొదటిరోజు శ్రీ పద్మావతి అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉత్సవర్లను ఆలయం నుండి యాగశాలకు వేంచేపు చేశారు. అనంతరం ద్వారతోరణ ధ్వజకుంభ ఆవాహనం, చక్రాధి మండలపూజ, చతుస్థానార్చన, అగ్నిప్రతిష్ఠ, పవిత్రప్రతిష్ఠ నిర్వహించారు. ఈ ఉత్సవాలు సెప్టెంబరు 2తో ముగుస్తాయి.

Friday, 28 August 2020

ఏకాంతంగా తిరుమల బ్రహ్మోత్సవాలు : టిటిడి

తిరుమల : కరోనా..తిరుమల ఉత్సవాలను కట్టడి చేస్తోంది.. ఫిబ్రవరి నెలలో రధసప్తమి ఆశేష భక్తజనుల ఏదుట వైభవంగా నిర్వహించిన టిటిడి..మార్చి నెలలో కరోనా ప్రబలకుండా కేంద్రం లాకౌట్ ప్రకటించిన నాటి నుండి పలు ఉత్సవాలు ఏకంతంగా నిర్వహిస్తోంది.. ఉగాది. ప్రతి పౌర్ణమికి జరిగే గరుడ సేవ తదితర వేడుకలను ఏకాంతంగా నిర్వహించారు. నిత్యకళ్యాణోత్సవం సైతం ఉభయదాతలు లేకుండా ఆలయ అర్చకులు మాత్రమే నిర్వహిస్తున్నారు.. తాజాగా సెప్టెంబర్ 19 నుండి జరిగే బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా‌నే నిర్వహించాలని నిర్ణయించాలని పాలక‌మండలి‌ సమావేశం నిర్ణయించింది .దీంతో బ్రహ్మోత్సవాలు ఆలయంలోని అస్థానమండపంలోనే నిర్వహించుతారు..కాగా ఈ ఏడాది అధిక మాసం కావడంతో రెండు బ్రహ్మోత్సవాలు రావడం జరిగింది..అక్టోబర్ లో‌ జరిగే బ్రహ్మోత్సవాలు మాత్రం అప్పటి పరిస్థితుల‌ను బట్టి నిర్ణయం తీసుకుంటాారు.
శ్రీవారి కీర్తిని నలుదిక్కుల వ్యాప్తి చేసే విధంగా దేవాలయాలు నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నామని టిటిడి ఛైర్మెన్ సుబ్బారెడ్డి పేర్కొన్నారు..బాంబేలో దేవాలయం నిర్మాణం కు శ్రీకారం చుట్టుతామన్నారు..
వారణాసీలో దేవాలయ నిర్మాణంకు అక్కడి ప్రభుత్వంను స్దలం కేటాయింపు అనుమతులు కోరినట్లు ఛైర్మన్ తెలిపారు.
జమ్మూ కాశ్మీర్లలో ‌ ఆలయం నిర్మాణానికి ఇప్పటికే స్థలాన్ని పరిశీలించిన విషయం తెలిసిందే నని దేశవ్యాప్తంగా టిటిడి ఆధ్వర్యంలో వెంకటేశ్వరుని ఆలయాలను నిర్మాణం జరుపి భక్తులకు ఆనందం కలిగించే ప్రయత్నం సాగుతోందని ఎస్.వి.సుబ్బారెడ్డి తెలిపారు.. కరోనా వల్ల కొద్ది ఆలస్యం అవుతోంది..స్థానికంగానే విరాళాలు సేకరించి అక్కడ ఆలయాలు నిర్మాణం చేపట్టాలని పాలకమండలి నిర్ణయం తీసుకున్నట్లు
ప్రధానంగా టిటిడిలో ఆదాయం పెంచేందుకు సమావేశంలో  కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు ఛైర్మన్ వెల్లడించారు..
ఫిక్స్డ్ డిపాజిట్లు పై కార్పస్ ఫండ్స్ లో కొన్ని మార్పులు తీసుకురానున్నామని
బర్డ్ ఆసుపత్రి ప్రాంగణంలోనే చిన్న‌ పిల్లల ఆసుపత్రి నిర్మాణం చేపట్టబోతున్నట్లు..ఇప్పటికే
వైజాగ్ లో శ్రీవారి ఆలయం నిర్మాణం పూర్తి చేసినట్లు కరోనా ప్రభావం తగ్గిన తరువాత మహా కుంభాభిషేకం నిర్వహిస్తామని ఎస్.వి.తెలిపారు. 4.95 కొట్లతో వైజాగ్ శ్రీవారి ఆలయంకు ఘాట్ రోడ్ల నిర్మాణంకు చేపట్టబోతున్నమని..
టీటీడీ ఉద్యోగులకు వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్జప్తీ చేశామన్నారు.
కోవిడ్ సమయంలో వివిధ సేవా కార్యక్రమాలలో బుక్ చేసుకున్న భక్తులకు
ఉదయస్తమాన సేవలు బుక్ చేసుకున్న భక్తులకు విఐపి బ్రేక్ సేవ‌కల్పించాలని నిర్ణయం తీసుకున్నాం..
వేస్ట్ వెట్ మ్యానేజ్ మెంట్, డ్రైవ్ మ్యానేజ్ మెంట్ అమలుపై ప్రత్యేక దృష్టి సారించాం..

సుధానారాయణ మూర్తి కోటి రూపాయలు డినేషన్ ఇస్తాంమని ప్రకటించారు..

కంపోస్టు ఎరువును ఉచితంగా రైతులకు  ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నాం..

 గోవు సంరక్షణపై పాలక మండలిలో చర్చించాం..ప్రతి ఆలయం వద్ద ఓ గోమాత ఉంచాలని నిర్ణయించాం..

గోవదకు అరికట్టడానికి చర్యలు తీసుకోవాల‌ని ప్రభుత్వంకు నివేదిక పంపిస్తాం..

గోల్డు, క్యాష్ డిపాజిట్లు సంబంధించి అధిక వడ్డీ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకి ఆదేశాలు జారీ చేసాం..

ప్రతి నెల డిపాజిట్ పై వడ్డీ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం..

తిరుపతిలో రేపటి నుండి మూడు వేల ఉచిత దర్శన టోకెన్స్ జారీని తిరిగి‌ ప్రారంభిస్తున్నాం..

త్వరలోనే ఆన్లైన్ లో సర్వదర్శనం టోకెన్లను ప్రారంభించాలని ఆలోచిస్తున్నాం

*-వైవీ సుబ్బారెడ్డి.., టీటీడీ పాలకమండలి ఛైర్మన్*

Thursday, 27 August 2020

బాలపూర్లో బాంబు స్క్వాడ్ తనిఖీలు... గణేషునికి మొక్కిన శునకం...

హైదరాబాద్ : బాలపూర్ గణేష్ మండపాన్ని  గురువారం బాంబుల తనిఖీ బృందం సందర్శించడం జరిగింది.. విధి నిర్వహణలో బాగంగా ఆ ప్రాంతం అంత తనిఖీలు నిర్వహించారు. అనంతరం గణపతికి నమస్కరించి..విఘ్నవినాయకుని ఆశీస్సులు తీసుకున్నారు..అయితే బృందంలో వున్న శునకం సైతం స్వామికి భక్తితో నమస్సులు సమర్పించడంతో..అక్కడి వారు ఆ దృశ్యాన్ని సంభ్రమాశ్చార్యాలతో వీక్షించరు..

Wednesday, 26 August 2020

కలేక్టర్ నిలబడ్డారు..సి.ఇ.ఓ.తో చర్చించినారు...

.

తిరుమల,  తిరుపతి దేవస్థానాలలో COVID మహమ్మారి పరిస్థితిని అంచనా వేయడంతో పాటు సకాలంలో చర్యలతో టిటిడి ఉద్యోగులలో ప్రాణాంతక వైరస్ వ్యాప్తి చెందకుండాచూసేందుకు.    బుధవారం సాయంత్రం టిటిడి అడ్మినిస్ట్రేటివ్ భవనంలోని సమావేశ మందిరంలో టిటిడి  సమావేశం నిర్వహించింది. టిటిడి CEO  అనిల్ కుమార్ సింఘాల్‌తో పాటు జిల్లా కలెక్టర్ భారత్ నారాయణ్ గుప్తా మరియు ఇతర సిబ్బంది  పాల్గొన్నారు.
సమీక్షా సమావేశంలో, టిటిడి ఉద్యోగులలో మరియు తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ పరిదిలో కూడా కరోనా  కేసుల్లో గణనీయమైన తగ్గింపు గుర్తించబడిందని ఇఓ చెప్పారు.
 విశ్రాంతి గృహాలలో ఆక్యుపెన్సీ రేటు మాధవం, శ్రీనివాసం మరియు విష్ణునివాసంతో సహా కోవిడ్ కేర్ సెంటర్లు కూడా తగ్గాయి, మిగిలిన గృహాలలో చాలా గదులు ఖాళీగా ఉన్నాయి.
ఇప్పటివరకు పరీక్షించిన టిటిడి ఉద్యోగులలో 69 మంది మాత్రమే చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి కూడా స్థిరంగా ఉందని ఇఓ పేర్కొన్నారు. అయితే, తిరుమలలో పనిచేస్తున్న 2500 ఎఫ్‌ఎంఎస్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల కోసం ఇంకా పరీక్షలు చేయాల్సి ఉంది. "ప్రతిరోజూ 200 ఆర్‌టిపిసిఆర్ మరియు 300 రాపిడ్ యాంటిజెన్ టెస్ట్‌లను నిర్వహించడం ద్వారా వచ్చే ఐదు రోజుల్లో వారందరికీ పరీక్షలను పూర్తి చేయగలమని ఇఓ పేర్కొన్నారు. 
నిర్ణీత సమయం లోపు పరీక్షలను పూర్తి చేయడానికి మొబైల్ వ్యాన్ను తిరుమలకు పంపించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా పరీక్షలు కూడా పెరిగాయని, సానుకూల రేటు తగ్గిందని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా పరిపాలనకు టిటిడి అందిస్తున్న ఆర్థిక సహాయంతో COVID పరికరాలు మరియు వస్తు సామగ్రిని సేకరించే విషయాలు చర్చకు వచ్ఛాయి. సరిగ్గా ఈ చర్చ సమయంలోనే జిల్లా కలేక్టర్ భరత్ గుప్తా లేచి నిలబడి ఇ.ఓ. అశోక్ సింఘాల్ కు దగ్గరగా నిలబడి.. చర్చలు జరిపినట్లు తెలుస్తోంది..ఈ ఫోటో చూసిన వారిలో జిల్లా కలేక్టర్ అంటే తిరుమల ఆలయం విషయంలో కూడా కలేక్టరే కదా ..నిలబడటం బాలేదని కొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేయగా.. సినీయర్        ఐ ఎ.ఎస్ .తో సమావేశం సందర్భంగా మరో ఐ.ఎ.ఎస్ నిలబడటం తప్పేముంది అంటు పలువురు పేర్కొన్నారు.
కోవిడ్ హాస్పిటల్స్ ప్రాంగణంలోని పిపిఇ కిట్లు, మాస్క్, గ్లోవ్స్ మొదలైన వైద్య వ్యర్థాలను కూడా EO సమీక్షించింది మరియు విశ్రాంతి గృహాలు COVID కేంద్రాలుగా మారాయి. COVID సంరక్షణ కేంద్రాలు మరియు ఆసుపత్రుల సమీపంలో పేరుకుపోయిన వైద్య వ్యర్ధాలను ఆహార వ్యర్థాల నుండి వేరుచేసి రోజూ తొలగిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. తిరుమల వద్ద ఏదైనా మెడికల్ వ్యర్థాలకు సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవాలని టిటిడి హెల్త్ వింగ్ అధికారులను ఇఓ ఆదేశించారు.అదనపు ఇ.ఓ.శ్రీ ఎ.వి. డాక్టర్ సునీల్ కుమార్, సిఎంఓ డాక్టర్ నర్మదా, డిఇఒ జనరల్ శ్రీ రమేష్ బాబు పాల్గొన్నారు.

జమ్ములో శ్రీవారి ఆలయం.. స్థల పరిశీలన చెసిన టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి...


జమ్మూలో టిటిడి నిర్మించ తలపెట్టిన దివ్యక్షేత్రం ( శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం) స్థలాన్ని టిటిడి ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి బుధవారం పరిశీలించారు. 
అక్కడ ఆలయ నిర్మాణానికి భూమి కేటాయిస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ముందుకు వచ్చింది. దివ్యక్షేత్రం నిర్మాణానికి పాలక మండలి ఆమోదం తెలిపింది.            ఈ నేపథ్యంలో టిటిడి బోర్డు ఛైర్మన్  వైవి సుబ్బారెడ్డి బుధవారం జమ్ముకు వెళ్లి ఆలయ నిర్మాణం స్థలాన్ని పరిశీలించారు. త్వరలోనే టిటిడి ఇంజనీరింగ్ అధికారుల బృందాన్ని పంపి సమగ్ర నివేదిక అందించాలనిఆదేశిస్తామని చైర్మన్ అక్కడి అధికారులకు తెలిపారు. 
జమ్మూ కలెక్టర్ శ్రీమతి సుష్మా చౌహాన్, జిల్లా అభివృద్ధిఆదనపు కమిషనర్ శ్రీ రమేష్ చందర్, అడిషనల్ డిప్యూటి కమిషనర్ శ్రీ శ్యాం సింగ్, అసిస్టెంట్ కమిషనర్ జనరల్  శ్రీ రాకేష్ దూబే, శ్రీ వైష్ణోదేవి ఆలయ బోర్డ్ సిఈఓ శ్రీ రమేష్ కుమార్, అదనపు సిఈఓ శ్రీ వివేక్ వర్మ చైర్మన్ వెంట ఉన్నారు.@ మణికుమార్, ఇంటర్నెట్ డెస్క్..

కరోనా వేళా కొత్త దందా... సర్టిఫికెట్లు ఇస్తాం... డోనేషన్ ఇవ్వండి....

కరోనాను పలువురు క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు.. మీ సేవలకు మెచ్ఛి సర్టిఫికెట్ లు ఇస్తామంటూ ముందుకు వస్తున్నారు..అయితే ఈ సర్టిఫికెట్ల కోసం పలువురు ఏగబడుతున్నారు..ఢిల్లీ.. మధ్యాప్రదేశ్., గుజరాత్.. లలో కొన్ని స్వఛ్ఛంద సంస్థల పేరిట అందమైన డిటిపి డిజైన్ చేసి కోవిడ్ - వారియర్ పేరిట   అడిగినన్ని సర్టిఫికెట్ లు వాట్స్ఆప్లలో పోష్టు చేస్తున్నారు.. ఆ సర్టిఫికెట్ ల పై అందమైన అమ్మాయిలను ఛైర్మన్ లుగా చూపుతుండటంతో యువత వీటికోసం ఎగబడుతోంది..ఇదంత ఉచితంగా అనుకుంటే కోవిడ్లో కాలేసినట్టే.. ఇదో అద్భుతమైన.. వ్యాపారం.. మా సంస్థ కు డోనేషన్ ఇవ్వండి మీకో పంచరంగుల కోవిడ్ వారియర్ సర్టిఫికేట్ పంపుతాం అంటూ స్వచ్చంద సంస్థ నిర్వాహకులు మెస్సేజ్ చేశారు.. అలా లక్షల రూపాయలు దండుకుంటున్నాట్లు అనిపించింది...నేను జర్నలిస్ట్ నని పేర్కంటూ మీ సంస్థ మానసిక బాలురకు చేసిన సేవలు ఏంటో వివరాలు పంపమని గుజరాత్లలోని ఓ సంస్థ పేరిట వున్న వాట్స్ఆప్లలో మెస్సేజ్ చేశాను..ఆవతల నుండి వ్యక్తి డోనేషన్ ఇచ్ఛిన వారికి సర్టిఫికెట్లు ఇస్తామని మీకు చూపేందుకు మా వద్ద వీడియోలు..ఫోటోలు లాంటివి ఎవీ లేవని పేర్కొన్నారు..

Monday, 24 August 2020

Zest For Life Societyచే. విధ్యార్థినికి ఆర్థిక సాయం.. చదువులకై చేయుత నిస్తున్న సీనియర్ జర్నలిస్ట్ సీతారాం

మహబూబాబాద్ జిల్లా.
💥24--08-2020 రోజున ZEST FOR  LIVING SOCIETY వారు వారి FOUNDATION DAY సందర్బంగా ఈ సంవత్సరం INTER (MPHW) ఫలితాల్లో 925/1000 మార్కులు సాధించిన KGBV డోర్నకల్ విద్యార్థిని కుమారి K. మల్లేశ్వరి కి *Zest For Life  Society* తరుపున శ్రీమతి గండి.గీత  సీతారామ్ గారు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీ గౌతమ్ గారి చేతుల మీదుగా 10, 000/-నగదును ప్రోత్సహక బహుమతి గా అందచేశారు.
కేక్  కటింగ్ మహేశ్వరిని పలువురు ప్రశంశించారు... ఇట్టి కార్యక్రమంలో విద్యార్థిని తల్లితండ్రులు శ్రీ కంచుకట్ల  వీరన్న  వెంకటమ్మ, జిల్లా విద్యా శాఖాధికారి శ్రీ సోమశేఖర శర్మ ,  ఫైనాన్స్ అకౌంట్ ఆఫీసర్ M.జయ కృష్ణ. GCDO G. విజయ కుమారి, స్పెషల్ ఆఫీసర్ మున్ని పాల్గొన్నారు.
*మహేశ్వరికి   BSc Nursing మంచి కళాశాలలో చేయాలని Ambition. కానీ ఆమె తల్లిదండ్రులు పేదవారు కావడం ఉన్నత చదువులకు  చదివేందుకు పేదరికం అడ్డంకి అయింది...*మరింత మంది దాతలు ఆమెకు ఆర్థికంగా ఆదుకోవాలని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు...*ఈ సంస్థ   గత కొన్ని సంవత్సరాలుగా పలు సాంఘీక సేవా కార్యక్రమాలలో తన వంతు పాత్ర నిర్వహించడంతో పాటు..డోర్నకల్ అనాద బాలుర శరణాలయంలో క్రీడా సామగ్రిని అందజేసింది. కరోనా సమయంలోనూ నిరుపేదలకు పలువురు దాతల సహకారంతో నిత్యావసరాలను అందజెసింది

Friday, 21 August 2020

,శ్రీశైలం ప్రమాదం పై సిఐడి విచారణ... ఆధికారుల మరణం బాధకరం ముఖ్యమంత్రి కేసీఆర్.

శ్రీశైలం పవర్ ప్లాంటులో జరిగిన ప్రమాదంపై సిఐడి విచారణకు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలు వెలికి తీయాలని, ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులు బయటకు రావాలని సీఎం స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సిఐడి అడిషనల్ డి.జి.పి. శ్రీ గోవింద్ సింగ్ ను విచారణాధికారిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ జరిపి, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.కాగా 
శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిని అత్యంత దురదృష్టకరమైన సంఘటనగా పేర్కొన్నారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించడానికి చేసిన అన్ని ప్రయత్నాలు ఫలించకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు, బంధువులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించారు. చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని, పూర్తి ప్రభుత్వ ఖర్చుతో వైద్యం చేయించాలని ఆయన అధికారులను ఆదేశించారు. 


పొగ కారణంగా రెస్క్యూ టీం ముందుకు సాగలేకపోతోంది : మంత్రి జగదీష్ రెడ్డి

మహబూబ్ నగర్ జిల్లా : 
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలం దోమలపెంట వద్ద ఉన్న పాతాళగంగ శ్రీశైలం ప్రాజెక్ట్ ఎడమగట్టు టీఎస్ జెన్కో విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అందులో కొందరు బయట పడ్డారు.
భారీగా ఎగిసిపడుతున్న మంటలు,మంటల్లో చిక్కుకున్న 12 సిబ్బంది.
10 మందిని కాపాడిన సిబ్బంది.
ఘటనా స్థలానికి మంత్రులు  జగదీష్ రెడ్డి,నిరంజన్ రెడ్డిలతో ట్రాన్సుకో సి.ఎం.డి.ప్రభాకర్ తదితరులు చేరుకున్నారు.
పవర్ హౌస్ టన్నేల్లో దట్టంగా అలుముకున్న పొగలు,మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది...
ప్రమాదం పై..
 *మంత్రి జగదీష్ రెడ్డి కామెంట్స్*......
శ్రీశైలం ప్రాజెక్టు లెఫ్ట్ పవర్ హౌస్ లో ప్రమాదం దురదృష్టకరం
మొదటి యూనిట్లో ఫైర్ జరిగింది
నాలుగు ప్యానెల్స్ దెబ్బతిన్నాయి
పదిమంది బయటకు వచ్చారు.
లోపల తొమ్మిది మంది చిక్కు కున్నారు.
లోపల దట్టమైన పొగ ఉండటం వల్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది.
ఫైర్, పోలీస్ సిబ్బంది లోపల చిక్కుకున్న వారిని కాపాడేందుకు వెళ్లారు
పొగ తో మూడు సార్లు
లోపలికి వెళ్లి వెనక్కు వచ్చారు.
ఆక్సిజన్ పెట్టుకుని వెళ్లినా
సంఘటనా స్థలానికి వెళ్ళ
లేకపోతున్నారు
ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బంది లోపలకు
వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
సింగరేణి సిబ్బంది సహాయం కోరాం
లోపల ఉన్న వారిని కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నాం.
జెన్ కో ఆసుపత్రిలో ఆరుగురు చికిత్స పొందుతున్నారు వారు సేఫ్ గానే ఉన్నారు.

Thursday, 20 August 2020

ఎస్.పి.బి. .ఆరోగ్యానికి ప్రార్థిద్దాం : తలవై పిలుపు...

 నేటి సాయంత్రం 6 నుండి సాయంత్రం 6.05 వరకు గాయకుడు # ఎస్.పి.బాలసుబ్రమణ్యం కోసం ప్రార్థించాలని  # తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు, ప్రజలను సినీ పరిశ్రమ వర్గాలకు విజ్జప్తులు చేశారు. # రజినికాంత్ కూడా తన నివాసం వెలుపలకు బాలు ఆరోగ్యం కోసం  ప్రార్థన చేస్తారని తెలుస్తోంది.
# దక్షిణాది సినీ సంగీత దర్శకులు సైతం నేటి సాయంత్రం వీడియో మధ్యామం ద్వారా ప్రార్థనలు చేయనున్నారు..

Tuesday, 18 August 2020

దేశవిదేశాల్లో ఈ "బాలు"డి ఆరోగ్యం పై ఆరా.. గెట్ వెల్ సూన్ అంటూ ట్వీట్లు - పోష్టులు...

ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం @ బాలు..
ప్రపంచం మెచ్ఛిన గాయకుడు. ఈ నెల 5న తనకు జలుబు,కొద్ది పాటి ఛాతి నొప్పిగా వుండటంతో డాక్టర్ వద్దకు వెళ్లానని అక్కడ డాక్టర్లు పరీక్షలో కరోనా పాజిటివ్ తెలడంతో సెల్పు క్యారంటైన్కు వెళ్లుతున్నట్ల స్వయంగా వీడియో విడుదల చేశారు..ఆనంతరం ఆయన చెన్నైలో ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్సపొందుతూ ఆందోళన కర పరిస్థితి నుండి కోలుకున్నారు.. తన తండ్రి కోలుకన్నాడని కుమారుడు వీడియో సందేశం ఇవ్వగా ఎస్.పి సోదరి శైలజ ఇప్పుడు పర్వాలేదు అన్నయ్య ఆరోగ్యం మెరుగైందంటూ పేర్కొన్నారు. సంగీత దర్శకుడు ఇళయరాజా బాలుతో తన అనుబంధం వీడియోద్వారా వివరించారు.. "బాలు" శీఘ్రమా వా" వేగంగా కోలుకుని తిరిగి రావాలంటూ పేర్కొన్నారు...ఆర్.పి.పట్నాయక్ బాలు కోలుకోవాలంటూ వీడియో మధ్యామం ద్వారా పలువురు కళాకారులను కూడా గట్టి ప్రత్యేకంగా భక్తి గీతాలు ఆలపించారు. .విదేశాల్లో ప్రముఖులు బాలు గెట్ వెల్ సూన్ అంటున్నారు.
బాలు, 40 ఏళ్ళ మన స్నేహ బంధం ఇంకా ఇలాగే 60 ఏళ్ళు సాగాలి నువ్వు తొందరగా లేచి రావాలి.. నీ ప్రియ మిత్రుడు అశ్వినీదత్"
#"బాలు గారి గురించి ఎవరైనా పోస్ట్ పెడుతుంటేనే భయమేస్తోంది ఏంటో నాకు ... ఆయనకి ఏం కాదు, కాకూడదు.. కాదంతే .. నిజంగా అలా ఐన రోజు ఆయన లేని సంగీతం మాత్రం సంశయంలో పడదా.. అనాధగా జీవించగలదా ఆ సంగీతం.. మా బాలుకి నిండు నూరేళ్లు.. ఆయన గొంతుకి 1000 ఏళ్ళు"ఓ అభిమాని..సినీ నటి..ప్రార్థన"#
వివిధ దేశాల అభిమానులు సోషల్ మీడియా వేదికగా బాలు కొలువాలని పేర్కోంటూ ట్వీట్ లు..పోష్టులు పేడుతుండగా.... వివిధ బాషాల్లో మీడియా సైతం బాహుబాష గాయకుడు కోలుకోవాలని ప్రత్యేక శీర్షకలతో ప్రచురణలు వెలువరించింది .
బాలు ఆరోగ్యం కుదుటపడిందని  ఎస్‌.పి.చ‌ర‌ణ్ చెప్పగా మెగాస్టార్ చిరంజీవి చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ట్విట్టర్ ద్వారా బాలు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లుగా.. చిరు ఓ వీడియోను విడుదల చేశారు.."నేను కోలుకున్న ..బాలుగారు మీరు కోలుకోవాలి..గాయనీ సునీత విడియో సందేశం...
"AR Murugadoss has invited people on August 20th at 6 PM IST for a mass prayer for S. P. Balasubrahmanyam's speedy recovery"
బాలు అన్నయ్యా నీకా హక్కులేదు: సిరివెన్నెల..ట్వీట్...

1966లో సినీ గాయక ప్రస్థానం మొదలు పెట్టి..40వేల పైగా 11భాషాలలో పాటలు పాడి న బాలసుభ్రహ్మణ్యం .
శంకరా నాధ శారీర అని భక్తిని చాటినా...  పుణ్యభూమి నా దేశం అని గొంతేత్తిన..రవీవర్మకే అందని అందానివే అంటూ పాడిన..అణువు..అణువణువునా నిలిచిన దేవుని..స్మరించినా బాలు తనదైన
ముద్ర వేశారు.. 40 కి పైగా సినిమాలకు సంగీత దర్శకుడిగా పనిచేశారు.. పాటలకు సంబంధించిన ఎన్నో టివీ షోలకు తనదైన వ్యాఖ్యనాంతో రంజింప చెసే విధంగా బాలు మలిచారు.. దేశ..విదేశాల్లో శ్రోతలను కట్టిపడేసిన ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం.. పలు కార్యక్రమాలలో. .ఎందరో మహానుభావులున్న సంగీత కళలో తానింకా బాలుడనే అంటూ వినమ్రంగా పేర్కొన్నారు.. ప్రస్తుతం చెన్నైలో హాస్పటల్లో బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగా వుందని మిత్రులు చెబుతున్నారు... సో మనంకూడా Get Well Soon అందాం..

"

 

కలెక్టరే ఆమెకు వందనం చేశాడు.. మానవాత్వానికి, మహిళా ఎస్.ఐ.కు దక్కిన గౌరవం..


కరోనా మృతునిపట్ల మనవత్వం చూపించిన మహిళా ఎస్.ఐ.కి గౌరవ వందనం చేశారు తిరువణ్ణామలై కలెక్టర్. తమిళనాడు రాష్ట్రం, తిరువన్నమలైలో  స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అరుదైన దృశ్యం చోటుచేసుకుంది.
తిరువణ్ణామలై జిల్లా కలెక్టర్  కందస్వామి
 కోవిడ్తో మరణించిన వ్యక్తి బంధువులు.. ఇతరులు భయంతో  దగ్గరకు రావడానికి నిరాకరించడంతో మహిళ ఎస్.ఐ.అల్లిరాణి స్వయంగా శవాన్ని మోసి ఖననానికి తరలించారు. దీంతో ఆమెపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆగస్టు 15 వేడుకలో ప్రభుత్వం తరఫున జిల్లా కలెక్టర్ కందస్వామి ఆమెకు ప్రశంస పత్రం అందజేశారు. అనంతరం కలెక్టర్ ఆమెను వేదికపై తన స్థానంలో నిలబడాల్సిందిగా కోరారు. కిందకు దిగి ఆమె మానవత్వానికి దాదాపు 20 సెకన్లు  గౌరవసూచకంగా వందనం చేయడంతో అక్కడి వారితోపాటు,  ఆమె కూడా ఆశ్చర్యానందానికి లొనయారు. కాగా కలేక్టర్ కందస్వామి ప్రజల సమస్యల పట్ల సత్వరమే స్పందించే అధికారిగా పేర్కోంటున్నారు.

Monday, 17 August 2020

వేద నిలయం వ్యవస్థాపకుడు దంటు నాగార్జున శర్మ మృతి.. శర్మగారి ఆధ్వర్యంలోనే అయోధ్యకు వెండి ఇటుక.


వేద నిలయం స్పిరిట్యుయల్‍ టూర్స్ అధినేత, ఫుడ్ బ్యాంక్ ఇండియా, ఇంప్రిట్స్ దంటు నాగార్జున శర్మ సోమవారం కరోనా తో కన్నుమూశారు.
వేలాది మంది భక్తులను తీర్థ యాత్రలకు  తీసుకెళుతూ  గత కొన్నేళ్లుగా అన్నదాతల సహకారంతో అనాధలకు..ఆపన్నులకు ఆహారం అందజేసిన నాగార్జున శర్మ.  ముషీరాబాద్‍ కేంద్రంగా తన కార్యాలయంలో కళాకారులకు, జర్నలిస్ట్ మిత్రులకు మధ్యాహ్న భోజనం తనే స్వయంగా వండి పెట్టే వారు.
నాగార్జున శర్మ కరోనా తో మృతి చెందడం
పట్ల  పలువురు సంతాపం వ్యక్తం చేశారు. అఖిల భారత హిందూ మహాసభ  తెలంగాణ అధ్యక్షులుగా కూడా ఆయన గురుతర బాధ్యతలు నిర్వహించారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండే ఆయన మృతిపట్ల పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఆయోధ్య ఆలయ నిర్మాణంలో మోదీ శంకుస్థాపన చేసిన వెండి ఇటుకలు నాగార్జున శర్మగారి ఆధ్వర్యంలో తయారు చేయబడి శంకుస్థాపన లో వాడబడ్డాయి..శంకుస్థాపనకు ముందు హైదరాబాద్ నుండి  2 కిలోల బరువున్న ఓ వెండి ఇటుకను తీసుకువెళ్లి రామ మందిరంలో ఉపయోగించాలని అయోధ్య రామ మందిర కమిటీ అధ్యక్షునికి ఇవ్వగా ఆ ఇటుకను పరిశీలించిన కమిటీ.. 
ప్రధానమంత్రి మోదీ చేతులమీదుగా జరిగే శంకుస్థాపనకు మరో 4 వెండి ఇటుకలు కావాలని కోరడంతో    కమిటీ సూచన మేరకు భాగ్యనగరంలోని స్వర్ణకారులతో రూపుదిద్దుకున్న 5 ఇటుకలను మందిరం శంకుస్థాపనకు పంపాడం జరిగిందని నాగార్జున శర్మ  ఆనాడు స్వయంగా వెల్లడించారు.


వినాయక మండపాలకు, ఉత్సవాలకు అనుమతి లేదు..


ప్రజలంతా ఇండ్లలోనే వినాయక ఉత్సవాలు నిర్వహించుకోవాలని బెల్లంపల్లి ఏసీపీ రహెమాన్ విజ్ఞప్తి చేశారు.

*కరోనా కేసులు మరింత ఉదృతమవుతున్న క్రమంలో మరింత కఠినంగా నిబంధనలు చేయాల్సిన అవసరం వున్నందున బెల్లంపల్లి సబ్ డివిజన్ పరిధిలో నవరాత్రుల కోసం వీధుల్లో మండపాలు ఏర్పాటు చేయొద్దని ఏసీపీ సూచించారు. వినాయక చవితి పర్వదినోత్సవం క్రమంలో బెల్లంపల్లి సబ్ డివిజన్ లో గణేష్ నవరాత్రులు నిర్వహించడానికి మండపాల నిర్వాహకులు సన్నద్ధమవుతున్న క్రమంలో ఇప్పటికే పట్టణాల్లో విగ్రహాల తయారీ జరుగుతోంది. మరోవైపు మండపాలు ఏర్పాటు చేసేందుకు గణేష్ ఉత్సవ కమిటీలు సమాయత్తమవుతున్నాయి.  అయితే ప్రస్తుత విపత్కర పరిస్థితులు, కరోనా వ్యాప్తి నియంత్రణ విషయంలో అన్ని స్థాయిలలో ప్రజలకు అవగాహన కల్పించేలా పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటుందని ఏసీపీ రహమాన్ పేర్కొన్నారు.

కరోనా వైరస్ తో ఇప్పటికే జనజీవనం గందరగోళంలో పడినందున  వినాయక మండపాల వద్ద నైవేద్యం, ప్రసాదాల వితరణ, భజన కార్యక్రమాలు, నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తే వైరస్ మరింతగా వ్యాప్తిచెందే ప్రమాదముందని భావించి పోలీస్ శాఖ ముందుగానే ఆదేశాలు జారీ చేయడం జరిగిందని ఎట్టి పరిస్థితులలో నవరాత్రుల నిర్వహణకు పోలీస్ శాఖ నుండి అనుమతులు ఇచ్చేది లేదని ఆయన స్పష్టం చేశారు.
కరోనా వ్యాప్తి నియంత్రణకు తమతో సహకరించాలని  కరోనా కేసులు ఉధృతమవుతున్న నేపధ్యంలో మండపాల నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజలు పోలీస్ శాఖతో కరోనా వ్యాప్తి నియంత్రణకు సహకరించాలని కోరారు. వినాయక నవరాత్రులను ఈ ఏడాది ప్రజలంతా తమ తమ ఇండ్లలోనే నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. 

Sunday, 16 August 2020

పర్యావరణ సంక్షోభ నివారణకు రంగంలోకి ఇండియా


మారిషస్ : పర్యావరణ సంక్షోభంలో ఉన్న మారిషస్ను ఆదుకునేందుకు పలు దేశాలు ముందుకు వస్తున్నాయి.  భారత్ తరఫున ఐఎఎఫ్ ఎ-16 ప్రత్యేక విమానం పరికారలతో మారిషస్ చేరుకుంది.. రెండు వారల క్రితం మారిషస్ సముద్ర తీరంలో ఓడ నుండి దాదాపు 1000 టన్నుల క్రూడ్ అయిల్  లీకై తీరం అంతట వ్యాపించింది.ఆ ఓడ రెండు ముక్కలు కాగా.  చుట్టు పక్కల తీరప్రాంత సముద్రంలో పోల్యూషన్ సముద్ర జీవులకు..పర్యావరణానికి తీవ్ర హాని జరిగే అవకాశం వుందని పర్యావరణ వేత్తలు పేర్కొన్నారు.
 వేలాది టన్నుల చమురు దాని సహజమైన జలాలు, రక్షిత చిత్తడి నేలలు మరియు బీచ్లలోకి ప్రవేశించింది. ఈ చమురు చిందటం అక్కడ నివసించే వేలాది సముద్ర పక్షులు, తాబేళ్లు మరియు అంతరించిపోతున్న ఇతర జాతులకు మాత్రమే విపత్తును కలిగిస్తుంది, కానీ ఆహారం, ఆర్థిక వ్యవస్థ కోసం దాని జలాలపై ఆధారపడే ఒక ద్వీప దేశాన్ని కూడా నిర్వీర్యం చేస్తుందని. పర్యావరణాన్ని నాశనం చేసే పాత సాంకేతిక పరిజ్ఞానం మరియు శిలాజ ఇంధనాలపై పెట్టుబడులు పెట్టడం మానేయాలంటూ వారు నొక్కి చెబుతున్నారు.

Saturday, 15 August 2020

ఆత్మనిర్భర భారతం కోసం అడుగులు వేద్దాం. స్వతంత్ర వేడుకల్లో ప్రధాని మోదీ ఉధ్ఘాటన.. ఏర్రకోట సంబరంలో అత్యాధునిక డ్రోన్ల పహారా... తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా స్వతంత్ర దినోత్సవం..


ఢిల్లీ/ఎర్రకోట: ఆత్మనిర్భర భారతం ఆవిష్కరణకై అడుగులు వెద్దామని  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు నిచ్చారు.. ఢిల్లీ ఏర్రకోటపై ఉదయం 7.30కి   జాతీయ జెండాను 7వ సంవత్సరం ఆవిష్కరించిన మోదీ భారత్ మాతకు జై అంటూ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నో రంగాలపై, ఎంతో మందిపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపిందన్న ప్రధాని మోదీ... ఈ కరోనాపై పోరాటంలో మనం సంకల్ప శక్తితో విజయం సాధించగలమనే నమ్మకం ఉందన్నారు. 

ఈ విపత్కర పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు కలసికట్టుగా ముందుకు సాగుతూ... విజయం సాధించాలన్నారు.       కొత్త ఉత్సాహం, కొత్త ప్రేరణతో ముందుకువెళ్లాలన్నారు. 

వచ్చే రెండేళ్లూ సంకల్పంతో సాగుదామన్న ప్రధాని మోదీ... ఎంతో మంది త్యాగాల ద్వారా మనం ఇప్పుడు స్వాతంత్ర్యంతో ఉన్నామన్న మోదీ... సమరయోధుల త్యాగాల్ని గుర్తుచేసుకుంటూ... ముందుకు సాగుదామన్నారు. కరోనా సమయంలో ఆత్మ నిర్భర భారత్ నినాదం అందుకొని ముందుకు సాగడం అనివార్యం అన్న ప్రధాని మోదీ... తద్వారా భారత్‌లో ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.

భారత్ అభివృద్ధి చెందితే.. విశ్వ కళ్యాణానికి అది మేలు చేస్తుందన్నారు. ముడి సరుకులు ఎగుమతి చేసి... విదేశాల నుంచి ఉత్పత్తులు, వస్తువులు దిగుమతి చేసుకోవడం ఎన్నాళ్లని ప్రశ్నించిన ప్రధాని మోదీ... ఈ పరిస్థితి పూర్తిగా మారాలన్నారు. వ్యవసాయం, ఆరోగ్య రంగం, టూరిజం రంగం ఇలా చాలా రంగాల్లో భారత్ దూసుకెళ్లడం అనివార్యమన్న ప్రధాని మోదీ... భారత్‌లో తయారయ్యే వస్తువుల్ని విదేశాలకు భారీగా ఎగుమతి చెయ్యాలన్నారు.

దేశం ఏం చెయ్యాలన్నా చెయ్యగలదన్న ప్రధాని మోదీ... కరోనా సమయంలో ప్రపంచానికి కావాల్సినవి భారత్ అందిస్తోందన్నారు. వోకల్ ఫర్ లోకల్... మంత్రంతో మనం ముందుకు సాగుదామన్నారు. వన్ నేషన్ వన్ రేషన్, బ్యాంకుల విలీనం, జన్ ధన్ ఇలా ఎన్నో మార్పు్ల్ని ఎవరూ ఊహించలేదన్న ప్రధాని మోదీ... చాలా మార్పులు వచ్చాయన్నారు.

వాజ్‌పేయ్ హయాంలో స్వర్ణ చతుర్భుజి ద్వారా దేశం మొత్తం రోడ్లు ఏర్పడ్డాయన్న ప్రధాని మోదీ... ఇప్పుడు దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా... రోడ్లు, రైల్వే, విమాన ప్రయాణాలన్నీ సమృద్ధిగా సాగుతున్నాయన్నారు

ఇంటింటికీ కరెంటు, గ్యా్ర్, పేదలకు బీమా, సౌంచాలయాలు, రేషన్ దుకాణాల్లో టెక్నాలజీ... ఇలా ప్రతీదీ అందరికీ ప్రయోజనం కలిగేలా గత ఆరేళ్లుగా చేశామన్న ప్రధాని మోదీ... కరోనా కాలంలోనే పేదలకు గ్యాస్, రేషన్ వంటివి.. రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా అందించామన్నారు. గరీబ్ కళ్యాణ్ ద్వారా గ్రామాల్లో ఉపాధి అవకాశాలు కల్పించామన్న మోదీ... వోకల్ ఫర్ లోకల్ ద్వారా పేదలకు స్కిల్ డెవలప్‌మెంట్ చేస్తున్నామన్నారు.మద్య తరగతి ప్రజల మేలు కోసం చిన్న మధ్య తరహా పరిశ్రమల్ని అభివృద్ధి చేస్తున్నామన్న మోదీ... ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణం, ఆధునిక భారత నిర్మాణానికి విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చామన్నారు.

భీమ్ UPI ద్వారా ఏడాదిలో రూ.3 లక్షల కోట్ల ట్రాన్సాక్షన్లు జరిగాయన్న ప్రధాని మోదీ... ఇది దేశానికి గర్వ కారణం అన్నారు. గత ఐదేళ్లలో లక్షన్నర పంచాయతీల్లో ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ డెవలప్ చేశామన్నారు. గ్రామాలను డిజిటల్ ఇండియాగా మార్చుతున్నామన్నారు. వెయ్యి రోజుల్లో 6 లక్షల గ్రామాల్లో ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ ఏర్పాటు అవుతుందన్నారు.

మహిళల అభివృద్ధి కోసం... వారి ఉద్యోగాల కోసం కేంద్రం కట్టుబడి ఉందన్న మోదీ... వాయు, నౌకాదళంలో కూడా మహిళలకు అవకాశాలు ఇస్తున్నామన్నారు. ట్రిపుల్ తలాఖ్ నుంచి ముస్లిం మహిళలకు విముక్తి కల్పించామన్న మోదీ... జన్ ధన్ యోజన ద్వారా... కరోనా కాలంలోనూ డబ్బులు ఇచ్చామన్నారు. ముద్ర లోన్ల ద్వారా ఆదుకున్నామన్నారు. 6 వేల జన ఔషధీ షాపుల్లో ఒక్క రూపాయికే శానిటైజర్ ప్యాడ్ అందిస్తున్నామన్నారు.

కరోనాకి ముందు దేశంలో ఒక్కటే టెస్టింగ్ ల్యాబ్ ఉండేదన్న మోదీ... ఇప్పుడు దేశంలో రోజూ 7 లక్షలకు పైగా టెస్టులు జరుగుతున్నాయని అన్నారు. నేడు నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ప్రారంభిస్తున్నామన్న ప్రధాని మోదీ... దాని ద్వారా ఆరోగ్య రంగంలో టెక్నాలజీని పెంచుతామన్నారు. దేశ ప్రజలకు ప్రతీ ఒక్కరికీ ఒక్కో హెల్త్ ఐడీ కార్డ్ ఇస్తామన్న మోదీ... దాన్లోనే ఆ వ్యక్తుల ఆరోగ్య వివరాలన్నీ ఉంటాయన్నారు. దేశంలో మూడు కరోనా వ్యాక్సిన్ల ట్రయల్స్ జరుగుతున్నాయన్న మోదీ... వైద్య రంగంలో భారత్ ముందుందన్నారు. అతి త్వరలో భారతీయులకు వ్యాక్సిన్ వస్తుందన్నారు.

ఏడాది కాలంలో జమ్మూకాశ్మీర్, లఢక్ రూపురేఖలు మార్చామన్న ప్రధాని మోదీ... అభివృద్ధి దిశగా చర్యలు తీసుకున్నామన్నారు. అక్కడి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా ముందుకు సాగుతున్నామన్నారు.

అంతకు ముందు ప్రధాని మోదీ... బాపూ ఘాట్ దగ్గర... మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు

*ఎర్రకోట పరేడ్ లోఅత్యాధునిక యాంటీ డ్రోన్ వ్యవస్థ...

*స్వాతంత్ర వేడుకల సందర్భంగా ఎర్రకోట వద్ద నిఘా వ్యవస్థ ఏర్పాటు*

*డిఆర్డిఓ అభివృద్ధి చేసిన యాంటీ-డ్రోన్ వ్యవస్థను ఈ రోజు ఎర్ర కోట సమీపంలో  లో మోహరించారు. ఈ వ్యవస్థ 3 కిలోమీటర్ల వరకు మైక్రో డ్రోన్‌లను గుర్తించి జామ్ చేయగలదు. మరియు లేజర్ ఆయుధం యొక్క వాటేజ్‌ను బట్టి 1-2.5 కిలోమీటర్ల వరకు లక్ష్యాన్ని తగ్గించడానికి లేజర్‌ను ఉపయోగించవచ్చు*.

Friday, 14 August 2020

బాలు త్వరగా కోలుకోవాలి అంటూ ప్రముఖుల ట్వీట్లు... కమాన్ మామా నాకు తెలుసు.. మీరు ఈ కరోనాతో ఫైట్ చేసి విన్ అయ్యి వస్తారని అంటూ తమన్ ట్వీట్

గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయన త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు ప్రార్ధనలు చేస్తున్నారు. కరోనా వ్యాధి సోకడంతో ఆయన ఆగష్టు 5 నుంచి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే గత రాత్రి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని.. ప్రస్తుతం ఆయన కండిషన్ సీరియస్‌గా ఉందంటూ ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేయడంతో ఆయన అభిమానులతో ఇండస్ట్రీ వర్గాల్లో ఆందోళన మొదలైంది.
దీంతో ఆయన త్వరగా కోలుకోవాలని.. ట్విట్టర్‌లో గెట్ వెల్ సూన్ అంటూ హ్యాష్ ట్యాగ్‌ని ప్రారంభించారు ఆయన అభిమానులు. ఈ సందర్భంగా ప్రముఖ సంగీత దర్శకులు, గాయనీ గాయకులు గెట్ వెల్ సూన్ ఎస్పీ సార్ అంటూ ట్వీట్లు చేస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్‌తో పాటు తమన్, అనిరుధ్ తదితర స్టార్ సంగీత దర్శకులతో పాటు.. ఇతర సెలబ్రిటీలు ట్వీట్లు చేస్తున్నారు.
అందరూ గట్టిగా దేవుడ్ని ప్రార్థించండి.. గాడ్ ఆఫ్ సింగింగ్ ఎస్పీ బాలు సార్ త్వరగా కోలుకోవాలని అంటూ దేవి శ్రీ ప్రసాద్ ట్వీట్ చేశారు. కమాన్ మామా నాకు తెలుసు.. మీరు ఈ కరోనాతో ఫైట్ చేసి విన్ అయ్యి వస్తారని 
అంటూ ఎమోషల్ ట్వీట్ చేసి ఎస్పీ బాలుతో ఉన్న ఫొటోలను షేర్ చేశారు థమన్. ఇక అనిరుధ్ సైతం గెట్ వెల్ సూన్ అంటూ ట్వీట్ చేశారు. వీరితో పాటు కిచ్చా సుదీప్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బండ్ల గణేష్, విక్రమ్ ప్రభు తదితరులు ఎస్పీ బాలు కోలుకోవాలని ట్వీట్లు చేశారు.

యాభై వయస్సుపైబడిన వారికి ఎక్సరే , రక్త పరీక్షలు నిర్వహణ తప్పనిసరి...



తిరుపతి, ఆగష్టు 14: యాభై వయసు పై బడ్డ కోవిడ్ పాజిటివ్ వ్యక్తులకు తప్పనిసరి ఎక్సరే , రక్త పరీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా.ఎన్.భరత్ గుప్త వైద్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం జెసి(డి) వీరబ్రహ్మం, అసిస్టెంట్ కలెక్టర్ విష్ణు చరణ్ లతో కలిసి కేర్ సెంటర్ ఏర్పాటుకు గోవిందరాజ సత్రాలను,  శ్రీనివాసం వసతి సముదాయంలో  ఆకస్మిక పర్యటనలు నిర్వహించారు.
 జిల్లా కలెక్టర్ , జెసి (డి), కోవిడ్  కేర్ సెంటర్ ఏర్పాటుకు గోవిందరాజ సత్రాలను పరిశీలించారు. అనతరం శ్రీనివాసం లో ఆకష్మిక తనిఖీ నిర్వహించి  ఎక్స్ రే యూనిట్ పరిశీలించారు. రెండు మిషన్లు వున్నా పాత మిషన్ వాడక పోవడంపై జిల్లా కలెక్టర్  ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ గా అనుభవం వున్న కలెక్టర్  పాత మిషన్ పరిశీలించి అక్కడే ల్యాబ్ అసిస్టెంట్ తో మాట్లాడి వాడుకలో తెచ్చి స్వయంగా తన ఎక్స్ రే తీయమని కంప్యూటర్ అనుసంధానంతో పరిశీలించారు. చిన్న సమస్యలకు కూడా వైద్యపరికరాలు వాడక పోడం ఆగ్రహించారు.  రోజు 80 తీస్తుండటం కాదు కనీసం రెండు మిషన్లు ఉన్నందున 50 వయస్సు పై బడిన ప్రతి ఒక్కరికీ తీయాలని, రోజుకు 200 మందికి ఎక్సరే తీయాలని ఆదేశించారు. అందుకు అవసరమైన పరికరాలు, వస్తువులు సమకూర్చుకోవాలని,  అసిస్టెంట్ కలెక్టర్ విష్ణు చరణ్ పర్యవేక్షించాలని సూచించారు. అనంతరం ఆక్సిజన్ బెడ్లు, అడ్మిషన్ కౌంటర్ పరిశీలించి ఆలస్యం లేకుండా అడ్మిషన్లు జరగాలని సూచించారు. హోం ఇసోలేషన్ కిట్లు, అడ్మిషన్ వద్ద ఇస్తున్న వెల్ కమ్  కిట్లు పరిశీలించారు.
 కలెక్టర్ పర్యటనలో డిప్యూటీ కలెక్టర్ భాస్కర్ నాయుడు, డిటి శ్యామ్ మోహన్, వైద్య సిబ్బంది, సానిటేషన్ సిబ్బంది ఉన్నారు.

కపీలేశ్వరాలయంలో వైభవంగా లక్షకుంకుమ అర్చన

సత్యన్యూస్ : తిరుపతి - శ్రీ కపిలేశ్వరాలయంలో లక్ష కుంకుమార్చన     
టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రావణమాసంలో చివరి శుక్రవారం శ్రీ కామాక్షి అమ్మవారికి శాస్త్రోక్తంగా లక్ష కుంకుమార్చన నిర్వహించారు. 
కోవిడ్‌-19 నిబంధ‌న‌ల మేర‌కు ఆల‌యంలో ఏకాంతంగా ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు.     
ఇందులో భాగంగా ఆలయంలోని మండపంలో శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు, శ్రీ సరస్వతి అమ్మవారు, శ్రీ కామాక్షి అమ్మవార్లను కొలువుదీర్చి కుంకుమార్చన చేప‌ట్టారు.
 ముందుగా క‌ల‌శ‌స్థాప‌న‌, గ‌ణ‌ప‌తి పూజ‌, పుణ్యాహ‌వ‌చనం, క‌ల‌శారాధ‌న చేశారు. 
ఈ సందర్భంగా లక్ష సార్లు కుంకుమతో అమ్మవారికి అర్చన చేశారు.   
ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీ భూపతి త‌దిత‌రులు పాల్గొన్నారు.#మణికుమార్#

దర్శనాలు తిరిగి ప్రారంభం.

కర్నూలు జిల్లా, శ్రీశైలం.
*శ్రీశైల దేవస్థానం లో ఆగస్టు 14 నుండి 
శ్రీశైలమహాక్షేత్రంలో ని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దర్శనాలు ఉదయం 6.30 గంటల నుండి మధ్యాహ్నం 3.30 గంటల వరకు తిరిగి సాయంత్రం 5.30 గంటల నుండి7.30 గంటల వరకు భక్తులను దర్శనాలకు అనుమతిస్తామని ఈవో కె.ఎస్.రామారావు తెలిపారు.
10 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల వయసు ఉన్న వారిని మాత్రమే దర్శనానికి అనుమతించడం జరుగుతుందని పేర్కొన్నారు.
*దర్శనానికి వచ్చే భక్తులు ముందస్తుగా ఆన్ లైన్ లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుందని అలాగే భక్తులు తమ వెంట ఆధార్ కార్డు లేదా గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని తెలిపారు.*

Thursday, 13 August 2020

వైయస్సార్ చేయూత ... అక్క చెల్లెమ్మలకు ఇంట ఆనందాల పంట -శైలజ చరణ్ రెడ్డి*



రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు వైఎస్సార్ చేయూత పథకంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. 23 లక్షల మంది మహిళకు వైఎస్సార్ చేయూత ద్వారా లబ్ది చేకూరింది. పాదయాత్ర ద్వారా మహిళల కష్టాలు తెలుసుకొని ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ చేయూత కార్యక్రమాన్ని ప్రారంభించారని వైయస్సార్సీపి రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మరియు రీజనల్ కోఆర్డినేటర్, పూతలపట్టు నియోజకవర్గ ఇన్చార్జ్ శైలజ చరణ్ రెడ్డి  పేర్కొన్నారు.
మహిళలు ఆర్దికంగా స్థిరపడ్డడం కోసం సీఎం వైఎస్‌ జగన్ అనేక నిర్ణయాలు తీసుకున్నారు. మహిళకు సున్నా వడ్డీ పథకం అమలు చేశారు.డ్వాక్రా రుణాలు నాలుగు విడతల్లో చెల్లించనున్నారు. అమ్మఒడి, చేయుత ద్వారా  మహిళకు ఎంతో మేలు జరుగుతుంది. మహిళ పక్షపాతిగా సీఎం జగన్.. నామినేషన్ పదవులు పనుల్లో 50 శాతం మహిళలకు కల్పించారు. 30 లక్షల మంది మహిళలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. మహిళకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు. ఉనికి కోల్పోతామే భయంతో టీడీపీ నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.టీడీపీ మహిళకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేకపోయింది. దళితుల పై దాడి జరిగిన వెంటనే మా ప్రభుత్వం తక్షణమే స్పందించి దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంది. కానీ టీడీపీ మాత్రం కుల రాజకీయాలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటుంది' అంటూ ఆమె ధ్వజమెత్తారు

అమూల్, రిలియన్స్ వంటి సంస్థలతో ఒప్పందం చేసుకోవడం ద్వారా మహిళలు ఆర్దికంగా స్థిరపడ వచ్చు. వైఎస్సార్ చేయూత పథకంపై టీడీపీ నేతలు విమర్శలు చేయడం తగదు.మహిళను మోసం చేసిన ఘనత చంద్రబాబుది. డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పి చంద్రబాబు మహిళను మోసం చేశారు. అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో జగన్‌ మూడవ స్థానం సాధించడం రాష్ట్రానికి  గౌరవ ప్రదంగా భావిస్తున్నాము.' అతి త్వరలోనే దేశంలోనే మొదటి స్థానంలో జగన్ మోహన్ రెడ్డి గారు ఉంటారు అనే దాంట్లో సందేహం లేదని శైలజ చరణ్ రెడ్డి తెలిపారు

గోదావరిలో గోషించిన వేదం... కరోనాతో పనుల్లేక గోదావరిలో దూకిన వేదపండితుడు....

పశ్చిమగోదావరి జిల్లా/ఏలూరు : కరోనా మహామ్మరి ప్రత్యక్షంగానే కాదు పరోక్షంగా కూడా కొందరి ఊపిరి తీస్తొంది. ఆచంట మండలం భిమలాపురనికి చెందిన #బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి  యర్ర గొండ్ల #పవన్ కుమార్ శర్మ (24)మృతదేహం పాలకొల్లు దగ్గర దిండి రెసార్టు వద్ద బయల్పడింది. వేదంలో ఎం.ఎ చదివిన పవన్ కుమార్ తీవ్ర కష్టలలో వున్న తన కుటుంబాన్ని పౌరోహిత్యం ద్వారా బతికిస్తున్నాడు...కరోనా   ఆర్ధిక ఇబ్బందులు తాళ లేక గోదావరి లో దూకి #ఆత్మహత్య చేసుకున్నాడు.ఇతని తండ్రి వృద్దాప్యాంలో వుండగా.. తల్లి మానసికంగా బాగోదని..నడువలేని బాబాయ్ ,90 ,వృధ్ధరాలు నాయనమ్మను తాన వృత్తి ద్వారా పోషించుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు తోటి స్నేహితులతో కలసి ఉత్సాహంగా.. ఉల్లాసంగా గడపాల్సిన వయస్సులో  పౌరోహిత్యం చేస్తూ కుటుంబ పోషణ బాధ్యత వహించినప్పటికి.   
.. కాగా కరోనా కారణంగా గత మార్చినుండి  ఆలయాలు మూతపడటంతో పాటు పెళ్లిల్లు.. పేరాంటలు వంటివి కూడా తగ్గిపోయాయి
 గత కొంత కాలంగా ఉపాధి లేకుండా పోవడంతో ఆర్థికంగా.మానసికంగా కృంగుబాటుకు గరైన పవన్ కుమార్ కుటుంబాన్ని ఎలా పోషించాలో అర్థం కాక చించివాడ గోదావరి వంతెనపైనుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వేదమాత ఆశీస్సులేగాని ధనదేవత ఆదరణకు నోచుకోని పవన్ కుమార్ శర్మ కుటుంబాన్ని మనసున్న ధనరాజులు ఆదుకోవాలని... ఆతని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం....

మీడియా ప్లీజ్ డోంట్ కాల్ మీ... నేను నా తండ్రి ఆరోగ్య సమాచారం కోసం మాత్రమే ఫోను వాడుతున్నాను.. ప్రణబ్ కుమార్తె షర్మీష్ట ట్వీట్


తమ తండ్రి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ఆరోగ్య ప‌రిస్థితిపై సోషల్ మీడియాలో వస్తున్న పోష్టులపై కుమారుడు "అభిజిత్ ముఖర్జీ"..కుమార్తె "షర్మిష్టముఖర్జీ" లు అసంతృప్తి వ్యక్తం చేశారు. 
ఆర్మీ డాక్టర్లు ప్రణబ్ ముఖర్జీ వెంటిలేటర్ పై శ్వాస తీసుకుంటున్నారని స్పష్టం గా చెప్పారని,
ఓ మాజీ రాష్ట్రపతి విషయంలో ఇలా సోషల్ మీడియాలో పోష్టులు రావడం తమ కుటుంబానికి ఆవేదన కలుగజేసిందని 
 ప్ర‌ణ‌బ్‌ ప్రస్తుతం హీమోడౌనమికల్‌గా స్థిరంగా ఉన్నారని, తన తండ్రి ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు. మాజీ పార్లమెంటేరియన్ అయిన ప్రణబ్  కుమారుడు అభిజిత్ ట్వీట్ చేయగా..
కాంగ్రెస్ స్పోక్సు పర్సన్, మహిళా కాంగ్రెస్ ఢిల్లీ అధ్యక్షురాలు.. కధక్ నృత్య కళాకారిణి.అయిన ప్రణబ్ కుమార్తె "షర్మిష్టముఖర్జీ" దయచేసి మీడియా మిత్రులు నాకు ఫోను చేయకండి ఇప్పుడు నేను నా తండ్రి ఆరోగ్యం వివరాలు తెలుసుకునేంందుకు వైధ్యులు తెలిపే సమాచారం కోసం మాత్రమే ఫోను వాడుతున్నా అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు.
తమ తండ్రి త్వరలో కోలుకుంటారని వారు విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయన కోసం మీ ప్రార్థనలకు కొనసాగించండి అంటూ త‌మ ట్వీట్‌లలో పేర్కొన్నారు. 
వారు ట్విట్టర్ వేదికగా తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్టు ఆయ‌న చికిత్స పొందుతున్న ఆర్మీ ఆస్ప‌త్రి వ‌ర్గాలు ఇప్ప‌టికే హెల్త్ బులెటిన్ విడుద‌ల చేశాయి.
రక్త ప్రసరణ సవ్యంగానే సాగుతోంది.. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు..
ప్రణబ్‌ ఆరోగ్య పరిస్థితిని నిపుణుల బృందం నిశితంగా పర్యవేక్షిస్తోంద‌ని ప్ర‌క‌టించారు.
మెదడులో రక్తం గడ్డ కట్టడంతో ఈనెల 10న ప్రణబ్‌కు శస్త్రచికిత్స కూడా జ‌రిగిన‌ట్టు వైద్యులు తెలిపారు. 
కాగా, ప్రణబ్ ముఖర్జీ అస్వస్థతకు గురుకావ‌డంతో ఈ నెల 10న‌ ఉదయం ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ హాస్పిటల్‌లో చేర్పించారు.
అయితే.. అక్కడ పరీక్షల అనంతరం ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ కాగా
గ‌త వారం రోజులుగా తనను కలిసినవారంతా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా, హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ సూచించిన విషయం తెలిసిందే.

Wednesday, 12 August 2020

కేటీఆర్ పిలుపు..గాయత్రి రవి స్పందన... అధునాతన అంబులెన్స్లకు విరాళం అందజేత


మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఇచ్చిన " *గిఫ్ట్ ఎ స్మైల్* " పిలుపుకు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు *వద్దిరాజు  రవిచంద్ర* (గాయత్రి రవి) స్పందించారు. రోగులను ఆపద సమయంలో ఆదుకునేందుకు అధునాతన సౌకర్యాలతో కూడిన అంబులెన్స్ లు విరాళంగా ఇవ్వాలని కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు గాయత్రి గ్రానైట్ సంస్థల తరపున ఒక అంబులెన్స్ కొనుగోలుకు విరాళం అందజేశారు. ఈ మేరకు బుధవారం ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ ను కలిసి రూ. *20,50,000 ల చెక్కును* అందజేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత, ఎమ్మెల్యే ధర్మారెడ్డి పాల్గొన్నారు....

టిటిడి ఆధ్వర్యంలో గోకులాష్టమి వేడుక..

గోకులాష్ట‌మి సంద‌ర్భంగా ఎస్వీ గోశాల‌లో గోపూజ‌....
గోకులాష్టమి సందర్బంగా టీటీడీ ఎస్వీ గోశాలలో బుధవారం గోపూజ నిర్వహించారు. ఈఓ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ తొలుత శ్రీ కృష్ణ స్వామి ఆలయంలో స్వామివారికి నిర్వహించిన పూజలో పాల్గొన్నారు.
అనంతరం అర్చకులు ఈఓ సింఘాల్ కు పరివట్టం కట్టి సాంప్రదాయబద్దంగా గోపూజా మందిరానికి తీసుకుని వెళ్లారు. సాంప్రదాయబద్ధంగా అలంకరించిన గోవుకు ఈఓ పూలమాల వేసి, పసుపు, కుంకుమతో అలంకరించి అర్చకుల మంత్రోచ్చారణ మధ్య గోపూజ నిర్వహించారు. అనంతరం గోవులకు దాణా పెట్టారు. కోవిడ్ 19 నేపథ్యంలో చాలా పరిమిత సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. అంతకు ముందు శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో అభిషేకం, అర్చన జరిగాయి.
ఈ కార్యక్రమంలో గోశాల డైరెక్టర్ శ్రీ హరనాథ రెడ్డి, ఎస్ఈ శ్రీ జ‌గదీశ్వరరెడ్డి, విజిఓ శ్రీ బాలిరెడ్డి పాల్గొన్నారు.

Tuesday, 11 August 2020

మాస్క్ లేకుండా తిరిగే రోజు దగ్గరలోనే వుంది : రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆశాభావం.. వ్యాక్సిన్ తన కుమార్తెకు ఇచ్ఛి నట్లు వెల్లడి

కరోనా వ్యాక్సిన్ను మూడో దఫా పరీక్ష  ఫలవంతం అయ్యిందని..తన ఇరువురు కుమార్తె లలో ఒకరికి వ్యాక్సిన్ ఇవ్వగా ఆమే ఆరోగ్యం నిలకడగా వుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. 
కరోనావైరస్కు వ్యతిరేకంగా ప్రపంచంలో మొట్టమొదటి టీకా కొద్ది రోజుల్లో రష్యాలో నమోదు చేయబడుతుందని
రష్యన్ శాస్త్రవేత్తలు అవసరమైన పరీక్ష దశలను దాటి, ఔషధ భద్రత మరియు ప్రభావాన్ని నిరూపించారని పుతిన్ ఆనందం వ్యక్తం చేశారు. ఔషధం అంటువ్యాధిని తగినంతగా ఎదుర్కొంది  ఇప్పుడు మన దేశానికి మాత్రమే కాదు, మొత్తం ప్రపంచానికి ఆశను ఇస్తుంది. ఒకసారి సోవియట్ ఉపగ్రహం మానవాళికి అంతరిక్షంలోకి మార్గం సుగమం చేసింది, ఇప్పుడు రష్యన్ టీకా COVID-19, ముసుగులు, సామాజిక ఒంటరితనం లేకుండా భవిష్యత్తుకు మార్గం సుగమం చేస్తుందని పుతిన్ ఆశాభావం వ్యక్తం చేశారు

కరోనా పై ప్రధాని మోదీతో... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మాటా - మంతి

కరోనా నివారణ చర్యలపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ..కెసిఆర్.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి లు మాట్లాడారు...
దేశ వ్యాప్తంగా వైధ్యసదుపాయలు మరింత పెంచాల్సిన అవసరం వుందని సమవేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన అభిప్రాయం వ్యక్తం చేశారు..  కరోనా కట్టడికి పూర్తి స్తాయిలో తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని కేసీఆర్..ప్రధాని మోదీ కి వివరించారు..
 ఎ.పి.లో కరోనా పరిస్థితి ని..వివరించిన ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి... కరోనా కట్టడికి... వ్యాధి బారిన పడిన వారికి అందజేస్తున్న వైధ్య సహాయం గురించి సమగ్రంగా వివరించారు.రాష్ట్రంలో కరోనా వైరస్‌ నివారణ కోసం తీసుకుంటున్న చర్యలను ప్రధాని శ్రీ మోదీకి వివరించిన జగన్మోహన్ రెడ్డి ..వైధ్య పరికరాలను అదనంగా అందజేయాలని ప్రధానిని కోరారు... అవసరమైన అంబులెన్స్ లు..బెడ్లు అందుబాటులో వుంచామన్నారు..

Sunday, 9 August 2020

36 సంవత్సరాల విమాన చోదక అనుభవం.. అందుకే ఎక్కువమందిని రక్షించాడు : పైలట్ దీపక్ ..సాతేతో అనుబంధం గుర్తు చేసుకున్న నీలేష్ సాతే...


కాలికట్ విమాన ప్రమాద పైలట్ దీపక్ సాతే మరణం పట్ల బంధువు .స్నేహితుడు నీలేష్ సాతే స్పంధన....ఆయన మాటల్లో....
నా కజిన్ కంటే నా స్నేహితుడు దీపక్ సాతే ఇక లేడని నమ్మడం కష్టం. నిన్న రాత్రి కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్‌వేపై నుంచి దూకిన 'వందే భారత్ మిషన్'లో దుబాయ్ నుంచి ప్రయాణికులను తీసుకెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ పైలట్.
దర్యాప్తు తర్వాత ప్రమాదానికి ఖచ్చితమైన కారణం తెలిసి ఉన్నప్పటికీ, నేర్చుకున్నది ఈ క్రింది విధంగా ఉంది:
ల్యాండింగ్ గేర్లు పని చేయలేదు.
మాజీ IAF పైలట్ ఇంధనాన్ని ఖాళీ చేయడానికి గా లిలో మూడు రౌండ్ల  వేసాడు, ఇది విమానం మంటలు పడకుండా కాపాడింది. అందుకే క్రాష్ అయిన విమానం నుండి పొగ కనిపించలేదు.
క్రాష్‌కు ముందే అతను ఇంజిన్ను ఆపివేసాడు.
3 వ పునరావృతం తర్వాత అతను కొండ దిగాడు.
కుడి వింగ్ చీలిపోయింది.
పైలట్ అమరవీరుడు కాని 180 మంది సహ ప్రయాణికుల ప్రాణాలను కాపాడాడు.
దీపక్ 36 సంవత్సరాల తన పైలట్ అనుభవంతో అనుభవజ్ఞుడైన ఏరియల్ ఆపరేటర్. ఎన్‌డిఎ పాస్‌అవుట్, 58 వ కోర్సులో టాపర్ నిలిచిన 'స్వోర్డ్ ఆఫ్ ఆనర్' అవార్డు గ్రహీత దీపక్..
 2005 లో ఎయిర్ ఇండియాతో కమర్షియల్ పైలట్‌గా చేరడానికి ముందు 21 సంవత్సరాలు భారత వైమానిక దళానికి సేవలందించారు.
అతను ఒక వారం ముందు నన్ను  కలిసి ఆనందంగా గడిపాడు
. 'వందే భారత్' మిషన్ గురించి నేను ఆయనను అడిగినప్పుడు, అరబ్ దేశాల నుండి మన దేశవాసులను తిరిగి తీసుకురావడం గర్వంగా ఉంది. నేను అతనిని అడిగాను, "దీపక్, ఆ దేశాలు ప్రయాణీకుల ప్రవేశాన్ని అనుమతించనందున మీరు ఖాళీ విమానాలను తీసుకువెళతారా?" "ఓహ్, లేదు. మేము ఈ దేశాలకు పండ్లు, కూరగాయలు, మందులు మొదలైనవి తీసుకువెళుతున్నాము మరియు ఈ దేశాలకు విమానం ఎప్పుడూ ఖాళీగా ఎగరదు" అని ఆయన సమాధానం ఇచ్చారు. అది ఆయనతో నా(నీలేష్ సాతె ..దీపక్ సాతే మిత్రుడు/బంధువు)యెక్క..
 చివరి సంభాషణ.
అతను ఎయిర్‌ఫోర్స్‌లో ఉన్నప్పుడు తొంభైల ప్రారంభంలో వైమానిక ప్రమాదంలో బయటపడ్డాడు. బహుళ పుర్రె గాయాల కోసం అతను 6 నెలలు ఆసుపత్రిలో చేరాడు మరియు అతను మళ్ళీ పైలట్గగా ఎగురుతాడని ఎవరూ అనుకోలేదు. కానీ అతని బలమైన సంకల్ప శక్తి  అతన్ని పరీక్షను మళ్ళీ స్పష్టం చేసింది. ఇది ఒక అద్భుతం.
అతను తన భార్య మరియు ఇద్దరు కుమారులు, ఇటీవల ఐఐటి ముంబై నుండి బయటకు వచ్ఛారు.దీపక్ సాతే .. కల్నల్ వసంత సాథే కుమారుడు, అతను తన భార్యతో పాటు నాగ్పూర్ లో ఉంటాడు. అతని సోదరుడు, కెప్టెన్ వికాస్ కూడా జమ్మూ ప్రాంతంలో పనిచేస్తున్నప్పుడు ప్రాణాలను అర్పించిన ఆర్మీమెన్.
ఒక సైనికుడు తన దేశవాసుల ప్రాణాలను కాపాడటానికి తన ప్రాణాలను అర్పించాడు.
ఇది ఒక సైనికుడి కవితను నాకు గుర్తు చేస్తుంది:
నేను యుద్ధ ప్రాంతంలో మరణిస్తే,
నన్ను బాక్స్ అప్ చేసి ఇంటికి పంపించండి
నా పతకాలను నా ఛాతీపై ఉంచండి,
నేను ఉత్తమంగా చేశానని మా అమ్మకు చెప్పండి
నమస్కరించవద్దని నాన్నకు చెప్పండి,
అతను ఇప్పుడు నా నుండి టెన్షన్ పొందడు,
సంపూర్ణంగా అధ్యయనం చేయమని నా సోదరుడికి చెప్పండి,
నా బైక్ యొక్క కీలు అతని శాశ్వతంగా ఉంటాయి
కలత చెందవద్దని నా సిస్‌కు చెప్పండి,
  నా ప్రేమను ఏడవవద్దని చెప్పండి,
"ఎందుకంటే నేను చనిపోయిన సైనికుడిని ...."

... నీలేష్ సతే హిందీ లో చెప్పిన జ్ఞాపకాలను తెలుగు లో అనువాదం చేయడం జరిగింది..

ఆదాయం కోసం ద‌ర్శ‌నాలు చేయించ‌డం లేదు : టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్

  తిరుపతి, 09 ఆగ‌స్టు 2020 : 
టిటిడి ఆదాయం కోసం తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామివారి ద‌ర్శ‌నాలు చేయిస్తోంద‌ని, మీడియా, సోష‌ల్ మీడియా ద్వారా అనేక మంది చేస్తున్న విమ‌ర్శ‌ల్లో వాస్త‌వం లేద‌ని, తాము ఆదాయం కోసం ద‌ర్శ‌నాలు చేయించ‌డం లేద‌ని టిటిడి ఈఓ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ స్ప‌ష్టం చేశారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల నిబంధ‌న‌లకు లోబ‌డి అనేక జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ రోజుకు 12 వేల మందికి ద‌ర్శనం క‌ల్పించే ఏర్పాటు చేశామ‌న్నారు. తిరుప‌తిలో పాక్షిక లాక్‌డౌన్ కార‌ణంగా, తిరుప‌తిలో రోజుకు  కేటాయిస్తున్న 3 వేల ఉచిత ద‌ర్శ‌న టోకెన్ల‌ను కొంత‌కాలంగా నిలిపివేసిన‌ట్టు చెప్పారు. దేశ‌వ్యాప్తంగా పెరుగుతున్న క‌రోనా కేసుల వ‌ల్ల కొన్ని రోజులు తిరుమ‌ల‌లో ద‌ర్శ‌నాలు చేసుకున్న‌వారి సంఖ్య త‌గ్గింద‌న్నారు. రెండు, మూడు రోజులుగా ద‌ర్శ‌నాలు చేసుకుంటున్న‌వారి సంఖ్య బాగా పెరిగింద‌ని తెలిపారు. తిరుప‌తిలో క‌రోనా కేసులు పెర‌గ‌డానికి తిరుమ‌ల ద‌ర్శ‌నాలే కార‌ణ‌మ‌ని కొంత‌మంది చేస్తున్న విమ‌ర్శ‌ల్లో ఏమాత్రం నిజం లేద‌ని ఆయ‌న చెప్పారు. క‌రోనా స‌మ‌యంలో కూడా భ‌క్తుల‌కు మెరుగైన సేవ‌లందిస్తున్న ఉద్యోగుల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. క‌రోనా బారిన‌ప‌డిన చాలామంది ఉద్యోగులు కోలుకుని విధుల‌కు హాజ‌ర‌వుతున్నార‌ని, మ‌రికొంత మంది చికిత్స‌లో ఉన్నార‌ని చెప్పారు. 
తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల స‌మావేశ మందిరంలో ఆదివారం జ‌రిగిన డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. టిటిడి ఉద్యోగుల్లో మొత్తం 743 మందికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. వీరిలో ఇప్ప‌టికే 402 మంది కోలుకున్నారు, 338 మంది చికిత్స పొందుతున్నారు, ముగ్గురు మృతి చెందారు. క‌రోనా బారిన ప‌డిన ఉద్యోగులకు మెరుగైన వైద్య‌సేవ‌లు అందించేందుకు జెఇఓ స్థాయిలో ప్ర‌త్యేక ప‌ర్య‌వేక్ష‌ణ జ‌రుగుతోంది. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో జూలై 31న నిర్వహించిన ఆన్‌లైన్ వరల‌క్ష్మీ వ్రతంలో 3,507 మంది గృహస్తులు పాల్గొన్నారు. శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానికి రాలేని భక్తులు ఇ-హుండీ ద్వారా ఆన్‌లైన్‌లో కానుకలు సమర్పించే సదుపాయం కల్పించాం. www.tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారాగానీ, గోవింద మొబైల్‌ యాప్‌ ద్వారా గానీ భక్తులు కానుకలు చెల్లించవచ్చు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో నిర్వహించిన ఆన్‌లైన్‌ వరక్ష్మీ వ్రతం తరహాలో తిరుమల‌ శ్రీవారి ఆల‌యంలో ఆన్‌లైన్‌ కళ్యాణోత్సవాన్ని ప్రారంభించాం. ఆగస్టు 7న - 118 మంది గృహస్తులు, ఆగస్టు 8న - 597 మంది గృహస్తులు, ఆగస్టు 9న - 256 మంది గృహస్తులు టికెట్లు బుక్ చేసుకున్నారు.

శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌ను యాడ్‌ ఫ్రీ ఛానెల్‌గా మారుస్తాం.
ఎస్వీబీసీ నిర్వహణకు ఏడాదికి రూ.3 కోట్ల నుండి రూ.4 కోట్ల వరకు వ్యయం అవుతోంది. ఈ క్రమంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్వీబీసీ ట్రస్టుకు మూడు వారాల వ్యవధిలోనే రూ.2.61 కోట్ల విరాళాలు అందాయి.
ట్రస్టుకు వచ్చే ఆదరణను బట్టి టిటిడిపై అద‌న‌పు భారం ప‌డ‌కుండా ఎస్వీబీసీ హెచ్‌డి ఛాన‌ల్ ప్రారంభించాల‌ని నిర్ణ‌యించాం.
త్వరలోనే దేశవ్యాప్తంగా హిందీ, కన్నడ భాషల్లో ఎస్వీబీసీ ప్రసారాలు చేస్తాం.
త్వరలో తిరుమల‌లోని నాదనీరాజనం వేదికపై శ్రీమద్భగవద్గీత, గరుడ పురాణం పారాయణం ప్రత్యక్ష ప్రసారం చేస్తాం.
ఎస్వీబీసీలో శ్రీవారి కల్యాణోత్సవం ప్రత్యక్ష ప్రసారం కారణంగా అయోధ్య రామమందిరం భూమిపూజ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందించలేకపోయాం. ఆ త‌రువాత న్యూస్ బులెటిన్లో ప్ర‌ముఖంగా ప్ర‌సారం చేశాం. ఇందులో ఎలాంటి ఇత‌ర ఉద్దేశాలు లేవు. కొంత‌మంది దీనిపై అన‌వ‌స‌రంగా విమ‌ర్శ‌లు చేసే ప‌ని ప్రారంభించారు. 
జూలై నెల‌లో శ్రీ‌వారి ఆల‌యంలో నమోదైన వివరాలు :
శ్రీవారిని దర్శించుకున్న భక్తుల‌ సంఖ్య - 2.38 ల‌క్ష‌లు
- హుండీ ఆదాయం - రూ.16.69 కోట్లు
- తిరుమల‌ శ్రీవారి ఇ-హుండీ ఆదాయం - రూ.3.97 కోట్లు
- తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఇ-హుండీ ఆదాయం - రూ.8.16 ల‌క్ష‌లు
- విక్రయించిన శ్రీవారి ల‌డ్డూల‌ సంఖ్య - 11.35 ల‌క్ష‌లు
- అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల‌ సంఖ్య - 2.59 ల‌క్ష‌లు
- తల‌నీలాలు సమర్పించిన భక్తుల‌ సంఖ్య - 78,944
- క్షురకులు వినియోగిస్తున్న పిపిఇ కిట్లు - 350 పిపిఇ కిట్లు ఉపయోగిస్తున్నట్లు..ఇ.ఓ.తెలిపారు.



NTR ఇచ్ఛిన రాజ్యసభ నామినేషన్ ఫారాన్ని చించి ఆయన కాళ్లపై వేశా.. సినీయర్ జర్నలిస్ట్ తిప్పరాజు రమేష్ బాబు డైరీలో ఓ పేజీ

""తెలుగు దేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామా రావు గారి పెద్దల్లుడు , సినీ నిర్మాత , మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వర రావు , ""కీర్తిశేషులు "" నాటికతో రంగస్థల ప్రవేశం చేసిన ( ఈ నాటకంలో నేను కూడా రెండు సార్లు వేషం వేసా ) ప్రముఖ సినీ నటుడు , నిర్మాత తో నేను ;;
రావు గోపాల రావు గారు రాజ్య సభ సభ్యుడిగా ఉన్నప్పుడు ఢిల్లీ లో పార్లమెంట్ ఆయనకు కేటాయించిన గృహంలో నేను 6 ఏళ్ళు ఉన్నా ;;  1989 సంవత్సరంలో  ""నాకు రాజ్య సభ వద్దు ;; ఆ పదవికి నేను న్యాయం చేయలేకపోతున్నా ;; నేను రాజేనామా చేస్తా ;; ఆ పదవిని మంచి రాజకీయ , సామాజిక పరిజ్ఞానం ఉన్న తమ్ముడు తిప్పరాజు రమేష్ బాబు కే ఇవ్వండి "" అని నందమూరి తారక రామారావు గారికి  రావు గోపాల రావు గారు ;విన్నావించారు..దీంతో....
1989 లో నాకు నందమూరి తారక రామా రావు గారు గుట్టు చప్పడు కాకుండా...             B Form తో పాటు 25 వేల నగదు ఇచ్చి నామినేషన్ వెయ్యి తమ్ముడు అన్నారు ;; సీటును తమ అనునాయులకు ఇప్పించుకోవాలను కున్న కొందరు తెదేపా నాయకులు  రెండు పత్రికలకు లీక్ చెయ్యడంతో కొన్ని గందరగోళ పరిస్టితులు, కుల, ప్రాంతీయ సమీకరణాల కారణంగా , అన్నిటికంటే ముఖ్యంగా నందమూరి గారు కాంగ్రెస్ నాయకుడు  ద్రోణంరాజు సత్యనారాయణ కోర్టుల్లో వేసిన కేసుల్లో 107 అభియోగాలు నమోదు అయ్యి , ఆయన ఆందోళనలో ఉన్నరోజుల్లో ""ప్రముఖ సామాజిక వర్గం "' ఆయనపై ""తీవ్ర ఒత్తిడి ""తీసుకువచ్చినట్లు నాకు సమాచారం అందడంతో బషీర్ బాగ్ MLA క్వార్టర్స్ లో రూమ్ నంబర్ 91 లో ఉన్న నేను తెల్లవారు ఝామున 3 గంటలకు ఆబిడ్స్ గృహానికి వెళ్లి , B.Form ని ముక్కలు ముక్కలుగా చించేసి అన్నగారి పాదాలమీద వేసా ;; ఆయన ఇచ్చిన 25 వేలు నగదు తిరిగి ఇచ్చేసా ;; అంతే
""ఆయన కన్నీళ్లు నా నెత్తిమీద పడ్డాయి ""
""ఆ రోజు నేను జీవితంలో మర్చిపోలేను ""
చాలా విషయాలు ఉన్నాయి ;; అప్పుడోసారి అప్పుడోసారి రాస్తా ;..మీ తిప్పరాజు రమేష్ బాబు..సీనియర్ పాత్రీకేయులు..ఇండో - శ్రీలంక జర్నలిస్ట్ ఫోరం‌ , మాజీ సేక్రేటరీ..హైదరాబాద్.

Friday, 7 August 2020

నిన్న మేగస్టార్..నేడు పవర్ స్టార్లను కలసిన బజాపా అధ్యక్షుడు

ఎ.పి బజాపా అద్యక్షుడు పార్టిని రాష్ట్రంలో బూష్టప్ చేసే పనిలో వున్నట్లుగా కనిపిస్తోంది .   గురువారం మెగాస్టార్ చిరంజీవిని కలసిన  ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. శుక్రవారం జనసేనానిని కలిశారు.
 ఈ సందర్భంగా మేగా బ్రదర్స్ము  వీర్రాజును అభినందించి, పూలమాల, శాలువాతో   సత్కరించారు. ఈ సందర్భంగా తమ్ముడు పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రజా సమస్య పరిష్కారం కోసం కృషి
చేయాలని మెగాస్టార్  సోముకు సూచించినట్లు తెలుస్తోంది. 2024లో
బీజేపీ, జనసేన పార్టీల పొత్తుతో ఉమ్మడిగా అధికారం చేపట్టాలని చిరంజీవి ఆకాంక్షించినట్లు కూడా తెలుస్తోంది.

Wednesday, 5 August 2020

సీతారాములు జగతికి ఆదర్శం... సామరస్యంతో ముందుకు సాగుదాం : వెంకయ్యనాయుడు.

శ్రీరాముడి జన్మభూమి అయిన అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అంకురార్పణ జరిగిన వెళ్లా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన గృహంలో సీతారాముల పటాలకు పూలమాలలు వేసి శ్రీరాముని స్తోత్రాలు చదివారు.. ఈ సందర్భంగా హిందూ సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన ఉపరాష్ట్రపతి. హిందూ.. ముస్లింలు సోదరభావంతో ముందుకు సాగడం దేశ అభివృద్ధి కి ఎంతో అవసరమని పేర్కొన్నారు.ఆయోధ్య ఆలయ నిర్మాణం  పురుషోత్తముడైన శ్రీరాముడు తన జీవితంలో ఆచరించి చూపిన సత్యం, నైతికత, సౌభ్రాతత్వం వంటి ఆదర్శ విలువలకు పున:పట్టాభిషేకం చేయడమని భావిస్తున్నాన్నట్లు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.. అయోధ్యకు రాజుగా శ్రీరాముడు పాటించిన శ్రేష్ఠమైన, ఆదర్శవంతమైన జీవితం.. సమాజంలోని సామాన్యులు, ఉన్నతవర్గాలవారు అనే భేదభావాల్లేకుండా ప్రజలందరికీ అనుసరణీయంగా ఉండేవని. శ్రీరాముడి సత్ప్రవర్తనే కాదు, స్వయంగా పాటించి చూపిన విలువలు భారతీయ చేతనలోని మూలాలను ప్రతిబింబిస్తాయి. ఇవి మత, ప్రాంత విభేధాల్లేకుండా అందరికీ ఆమోదయోగ్యమైనవి. ఆ విలువలు కాలాతీతమైనవి, నేటికీ సందర్భోచితమైనవి.
రామమందిర నిర్మాణాన్ని ఒక మతపరమైన కార్యక్రమంగా కాక, ఆ ఆలోచనా పరిధుల్ని దాటి మరింత విస్తృతమైన అంశంగా చూడాలని ఆయన సూచించారు. ఈ మందిరం ఉన్నతమైన, సనాతనమైన మానవ విలువలకు ప్రతీకగా మనకు ఎల్లప్పుడూ మార్గదర్శనం చేస్తూనే ఉంటుందని  ఎలాంటి వివక్షకు తావులేకుండా మనమంతా ఒకటని తెలిపే  భారతీయ నైతిక విలువలను మనకు నిరంతరం గుర్తుచేస్తుంటుందని. 
అలాంటి అద్భుతమైన ప్రాధాన్యత గల రామమందిరానికి ఆగస్టు 5న జరిగే భూమిపూజ.. భారతీయ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖితమై శ్రీ రాముడు పాటించిన విలువల వైభవాన్ని కళ్ళకు కడుతూనే ఉంటుందని .  అభిప్రాయం .  వ్యక్తం చేశారు.. సుదీర్ఘకాలం పాటు కొనసాగిన ఈ వివాదంలో.. న్యాయ, శాంతిపూఊర్వక పరిష్కారంలో భాగస్వాములైన కక్షిదారులందరికీ పేరుపేరునా అభినందనలు తెలుపుతున్నాను. వారందరి సామూహిక కృషికారణంగానే మందిర నిర్మాణం సాధ్యమైంది. 
ఈ సందర్భంగా అయోధ్య స్థల వివాదంలో కక్షిదారుగా ఉన్నటువంటి శ్రీ ఇక్బాల్ అన్సారీ (దివంగత శ్రీ హషీమ్ అన్సారీ  కుమారుడు)ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. భారతీయ సాంస్కృతిక విలువల స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ.. ప్రతి ఒక్కరూ గతాన్ని మరచి ముందుకు సాగాలని ప్రజలందరికీ వారు గొప్పమనుసుతో చేసిన విజ్ఞప్తి అభినందనీయం. 
ఇంతటి చారిత్రకమైన ఈ రోజును.. అన్ని విశ్వాసాల పట్ల పరస్పర గౌరవం, సామరస్యపూర్వక జీవనంతో కూడిన..  కొత్త శకానికి నాందిగా భావించి ముందుకెళ్దాం. ఈ సంకల్పంతో ప్రతి పౌరుడి కలలు సాకారమయ్యే భారతావని నిర్మాణం జరగాలని కోరుకుందాం.
ఈ సందర్భంగా, జాతిపిత మహాత్మాగాంధీ ఆలోచించినట్లుగా.. ప్రజాస్వామ్య, ధర్మబద్ధమైన ఆదర్శాలతో ప్రజా శ్రేయస్సును, సమాజంలో ఆనందాన్ని ప్రతిబింబించే, సమాజంలో అందరికీ శాంతిసామరస్యాలు, సమానత్వాన్ని కల్పించే రామరాజ్య స్థాపనకు పునరంకితమవుదామని ప్రతినబూనుదామంటూ ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు..

Monday, 3 August 2020

భక్తి.. శ్రద్దలతో..శ్రావణ పూర్ణిమ గరుడ సేవ

తిరుమల :  టిటిడి సోమవారం సాయంత్రం శ్రీవారి ఆలయంలో శ్రావణ పౌర్ణమి గరుడ సేవను నిర్వహించింది.
కోవిడ్ -19 పరిమితుల దృష్ట్యా శ్రీవారీ ఆలయం లోపల ఏకాంతంలో నెలవారీ పండుగ జరిగింది.
రకరకాల పుష్పాలు, ఆభరణాలతో  అలంకరించబడిన  మలయపస్వామి ఉత్సవ విగ్రహం రంగనాయకుల మండపం వద్ద  గరుడ వాహనంపై కూర్చండబెట్టి.విశేష ఆర్చనలు చేశారు. ఈకార్యక్రమంలో
తిరుమల జీయ్యర్  శ్రీ చిన్న జీయ్యర్ర్ స్వామి, సివిఎస్ఓ గోపీనాథ్ జెట్టి, విజిఓ  మనోహర్ పాల్గొన్నారు.