Wednesday, 26 August 2020

జమ్ములో శ్రీవారి ఆలయం.. స్థల పరిశీలన చెసిన టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి...


జమ్మూలో టిటిడి నిర్మించ తలపెట్టిన దివ్యక్షేత్రం ( శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం) స్థలాన్ని టిటిడి ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి బుధవారం పరిశీలించారు. 
అక్కడ ఆలయ నిర్మాణానికి భూమి కేటాయిస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ముందుకు వచ్చింది. దివ్యక్షేత్రం నిర్మాణానికి పాలక మండలి ఆమోదం తెలిపింది.            ఈ నేపథ్యంలో టిటిడి బోర్డు ఛైర్మన్  వైవి సుబ్బారెడ్డి బుధవారం జమ్ముకు వెళ్లి ఆలయ నిర్మాణం స్థలాన్ని పరిశీలించారు. త్వరలోనే టిటిడి ఇంజనీరింగ్ అధికారుల బృందాన్ని పంపి సమగ్ర నివేదిక అందించాలనిఆదేశిస్తామని చైర్మన్ అక్కడి అధికారులకు తెలిపారు. 
జమ్మూ కలెక్టర్ శ్రీమతి సుష్మా చౌహాన్, జిల్లా అభివృద్ధిఆదనపు కమిషనర్ శ్రీ రమేష్ చందర్, అడిషనల్ డిప్యూటి కమిషనర్ శ్రీ శ్యాం సింగ్, అసిస్టెంట్ కమిషనర్ జనరల్  శ్రీ రాకేష్ దూబే, శ్రీ వైష్ణోదేవి ఆలయ బోర్డ్ సిఈఓ శ్రీ రమేష్ కుమార్, అదనపు సిఈఓ శ్రీ వివేక్ వర్మ చైర్మన్ వెంట ఉన్నారు.@ మణికుమార్, ఇంటర్నెట్ డెస్క్..

No comments:

Post a Comment